లౌక్‌డౌన్‌తో కరోనా కట్టడి సాధ్యమా?

ఏప్రిల్‌ 14 వరకు తెలుగు రాష్ట్రాలలో అమలు

Corona effect

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలు అంతరాష్ట్ర సరిహద్దు లను మూసివేయగా, తెలుగు రాష్ట్రాలు కూడా అంతరాష్ట్ర సరిహ ద్దులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఏప్రిల్‌ 14 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమై తేనే ప్రజలు బయటకు రావాలని ప్రజలకు సూచించారు.

అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమై తేనే ప్రజలు బయటకు రావాలని ప్రజలకు సూచించారు.

రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు అందిస్తామని రేషన్‌ సరకులు అందిస్తామని, రేషన్‌కార్డు ఉన్నవారికి కిలోపప్పు ఉచితంగా ఇస్తామని
పేర్కొన్నారు

నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడా లని, నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మితే పోలీసు కేసులు నమోదు చేయాలని, నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందు బాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది.

నెలరోజులకు సరిపడే 87.59 లక్షల మందికి (తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి) పన్నెండు కేజీల బియ్యం ప్రతి వ్యక్తికి ఉచితంగా ఇస్తామని, ప్రతి రేషన్‌ కార్డు దారునికి రూ.1500 ఇతర సరుకులు కొనుక్కోవడానికి ఇస్తామని, ప్రకటించారు.

ప్రైవేటు వాహనాలు, ఆటోలు, క్యాబ్లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని, విదేశాలనుండి వచ్చివారు వెంటనే స్థానిక అధికారులకు రిపోర్ట్‌ చేయాలని, హోమ్‌ క్వారంటైన్లో ఉన్నవారు తొందరపడొద్దని, బయటకు రావద్దని తెలిపింది.

ప్రైవేటు ఉద్యోగు లకు కంపెనీలు తగిన జీతాలు చెల్లించాలి. నిత్యావసర సరకుల కొనుగోలుకు ఇంటికొక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.

అంగన్‌వాడీిలను మూసివేస్తున్నామని, బ్యాంకులు, ఎటి యంలు వంటి అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

లాక్‌డౌన్‌ సందర్భం లో తెలుగు రాష్ట్రాలలో ఏ పరిస్థితులు రాబోతున్నాయి, వాటిని సమర్థంగా ఎదుర్కొవాలంటే ప్రభుత్వాలు, ప్రజలు ఏమి చేయాలి అనే అంశాలు నేడు పరిశీలించాలి.

ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుం దని, అన్ని రంగాలపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపు తుందని,ఉత్పత్తి తగ్గుదల, ఉద్యోగ,ఉపాధిపై ప్రభావం చూపు తుందని, పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గు తుందని అంటున్నారు.

ఈ ఆరోగ్య అత్యవసర సమయాల్లో, సంక్షో భ సమయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుం దని పేర్కొంటున్నారు.

ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ విధానాలను నిర్ణయాలకు ప్రజలందరూ మద్దతు పలకాలి. ప్రజలు అసత్యాలను,అవాస్తవాలను ప్రచారం చేయకుండా ఉండా లి.

అనుమానిత కరోనా కేసుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలి. మనదేశంలో దేశప్రధాని మోడీ మార్చి 22నుండి ఏప్రిల్‌ 14 వరకు దేశ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇవ్వటం జరిగింది.

దీంతో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ విధించాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లాక్డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయం వ్యక్తం చేసింది.

చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించాయని ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

  • ఆత్మకూరు భారతి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/