మద్యాదాయమే మహాప్రసాదమా?

ఒక్కమాట (ప్రతిశనివారం)

మద్యపాన నిషేధం అన్నది మహాత్ముడు భారత ప్రజలకు ఇచ్చిన అమృత సందేశం. మద్యాన్ని నిషేధించేందుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం నిషేధించారు కూడా.

alcoholism
alcoholism

ఇప్పటికీ గుజరాత్‌ లాంటి రాష్ట్రంలో ఏనాటి నుంచో మద్యనిషేధం అమలవ్ఞతోంది. అంతెందుకు స్వాతంత్య్రం వచ్చిన తొలిదినాల్లో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలోని ఆంధ్రకు చెందిన 16 జిల్లాల్లో ఆనాడే మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేశారు. మద్యపానంవల్ల ఎదురయ్యే కష్టనష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అప్పుడే శ్రీకారం చుట్టారు. ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి. తాగుబోతులంటేనే ప్రజల్లో ఒక విధమైన అసహ్యభావం ఏర్పడింది. మద్యం రక్కసికి ఇక తావ్ఞలేదనే పరిస్థితులు ఆనాటి పాలకులు కల్పించారు. కానీ 1960 తర్వాత రాజకీయ జోక్యం పెరగడంతో మద్యనిషేధం అమలుకు తూట్లు పొడవడం ప్రారంభమైంది.

మ ద్యం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని లక్షల కుటుంబాలు ఈ మద్యం రక్కసి కోరల్లో చిక్కుకొని చితికిపోతున్నాయో పాలక పెద్దలకు తెలియందికాదు. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంపై మద్యంపంజా విసురుతుందనే విషయం తెలియనివారు లేకపోవచ్చు. అయినా తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఈ మద్యం వ్యాపారాన్ని వదిలి పెట్టలేకపోతుండడం అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నా అడు గులు మాత్రం త్రికరణశుద్ధిగా ఆ వైపు పడటంలేదేమోననిపిస్తు న్నది. షాపులు, బార్లసంఖ్య తగ్గించి రేట్లు పెంచినా ఆదాయం మాత్రం వేలకోట్లల్లో అధికంగా వస్తుందని అంచనా వేయడం నోటితో చెప్పి నొసలుతో వెక్కిరించినట్లుగా కన్పిస్తున్నది.

ఇక తెలంగాణ ప్రభుత్వం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటూ మద్యం సేవించి వాహనాలను నడిపినవారిపై కేసులు పెడుతూ ఏటా కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటున్నది. మరొకపక్క ఏడాదికేడాది మద్యంతో వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూపోతున్నది. మద్యం ద్వారా ఆదాయం ఎలా పెంచుకోవాలనేది నిత్యం అన్వేషణలో ఉన్నట్లే కన్పిస్తున్నది. మద్యాదాయమే మహాప్రసాదంగా భావించే దురదృష్టపు రోజులు దాపురించాయి.

మరొకపక్క మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు అన్నీఇన్నీ కావ్ఞ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు నిందితుల్లో 90శాతంపైగా మద్యంమత్తులో ఉన్నవారే. 2012 దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో నిందితులు పూర్తిగా మద్యంమత్తులో ఉన్నట్లు దర్యాప్తులోనే తేలింది. అదేకాదు ఆ తర్వాత జరిగిన అనేక అత్యాచార కేసుల్లో నిందితుల్లో అత్యధిక శాతం మద్యం మత్తులో ఉన్నవారే. అంతెందుకు మొన్న దేశవ్యాప్తంగా సంచల నం సృష్టించిన శంషాబాద్‌ సమీపంలో తొండుపల్లి టోల్‌గేట్‌వద్ద దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఉదంతంలో నిందితులు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నవారే.

పోలీసు దర్యాప్తులో నిందితులే స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. తాము ఆ మద్యంమత్తులో ఏం చేస్తున్నామో తమకే తెలియలేదని దర్యాప్తులో చెప్పినట్లు పోలీసువర్గాలే చెప్తున్నాయి. అంతేకాదు ఆ సంఘటనాస్థలంలో ఉన్న ఖాళీ మద్యం సీసాలు వారు ఎంత సేవించారో కూడా చెప్పకనే చెబుతున్నాయి. ఇక ప్రమాదాల గూర్చిచెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో అధికశాతం మద్యంమత్తులో ఉన్నవే. మద్యంమత్తులో వాహనాలు నడుపుతూ అన్నెంపున్నెం ఎరుగని అమాయకులను బలితీసుకుం టున్నారు.

లక్షలాది కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారు. మరి కొందరు యువకులు ఈ మద్యంమత్తులో ఇష్టానుసారంగా వాహ నాలను నడిపి ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదననింపుతున్నారు. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏటా వేలాదిమంది అసువ్ఞలు బాస్తు న్నారు. లక్షల సంఖ్యలో ఆస్పత్రిపాలవ్ఞతున్నారు. ఇలా క్షతగాత్రు లైనవారిలో కొందరు శాశ్వత వికలాంగులుగా మారి కుటుంబానికి భారమై మంచానికే పరిమితమై కృంగికృశించి మరణిస్తున్నారు. ఆ కుటుంబాలు దుఃఖ సాగరం నుంచి కోలుకోలేకపోతున్నాయి.

గత పదేళ్లల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇలా లక్షమందికిపైగా అసువ్ఞలు బాసి ఉంటారని అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి.ఇక చిన్న చిన్న అభి ప్రాయభేదాలతో మద్యమత్తులో మానవత్వం మరచి కుటుంబ సభ్యులనే అత్యంత కిరాతంగా హత్యలు చేస్తున్నారు. ఇలా తల్లి దండ్రులను చంపిన కొడుకులు,భార్యలను చంపిన భర్తలు సంఘ టనలు తరుచుగా జరుగుతున్నాయి.ఆ మత్తు దిగిపోయిన తర్వాత తాము చేసిన ఘోరాన్ని తెలుసుకొని కుంగిపోతున్నారు. కానీ అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోతున్నది.

ఇలా తాగిన మైకంలో భార్యను హత్య చేసిన భర్త జైలుపాలైతే వారి పిల్లలు అనాధలుగా మారి దుర్భరజీవనం సాగిస్తున్నారు.ఒకరిద్దరు కాదు తెలుగు రాష్ట్రాల్లోనే వందల సంఖ్యల్లో ఉన్నారు. ఇక మద్యం వల్ల ఎన్ని కోట్లమంది ఆరోగ్యం మసకబారిపోతుందో చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రకరకాల జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా మద్యంతో కిడ్నీవ్యాధులు పెరిగిపోతున్నట్లు డాక్టర్లే చెప్తున్నారు.ఒకటి రెండు కాదు దాదాపు నలభైరకాల జబ్బులు ఈ మద్యంవల్లనే దాపురి స్తున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

మద్యం రక్కసి ఇంతటి వికృత రూపందాల్చి మానవాళిని కబళిస్తుందని ఎంతో ముందుగా గ్రహించిన జాతిపిత మహాత్ముడు మద్యం మహమ్మా రిని దేశంనుండి పారద్రోలాలని ఆనాడే పిలుపునిచ్చారు. మద్య పాన నిషేధం అన్నది మహాత్ముడు భారత ప్రజలకు ఇచ్చిన అమృత సందేశం. మద్యాన్ని నిషేధించేందుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం నిషేధించారు కూడా ఇప్పటికీ గుజరాత్‌ లాంటి రాష్ట్రంలో ఏనాటి నుంచో మద్యనిషేధం అమలవ్ఞతోంది. అంతెందుకు స్వాతంత్య్రం వచ్చిన తొలిదినాల్లో ఉమ్మడిమద్రాస్‌ రాష్ట్రంలోని ఆంధ్రకు చెందిన 16 జిల్లాల్లో ఆనాడే మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేశారు. మద్యపానంవల్ల ఎదురయ్యే కష్టనష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అప్పుడే శ్రీకారం చుట్టారు.

ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి.తాగుబోతులంటేనే ప్రజల్లో ఒక విధమైన అసహ్యభావం ఏర్పడింది. మద్యం రక్కసికి ఇక తావ్ఞలేదనే పరిస్థితులు ఆనాటి పాలకులు కల్పించారు. కానీ 1960 తర్వాత రాజకీయ జోక్యం పెరగడంతో మద్యనిషేధం అమలుకు తూట్లు పొడవడం ప్రారం భమైంది. 1969 ప్రాంతంలో పూర్తిగా నిషేధానికి స్వస్తిపలికారు.ఒక్కసారిగా మద్యంరక్కసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజృంభించింది. ఆ తర్వాత పాక్షిక నిషేధం, మళ్లీ సంపూర్ణ నిషేధం అంటూ నినాదాలు వచ్చినా కొంతమేరకు ఆదేశాలు ఇచ్చినా అవి తాత్కాలికమే అయిపోయాయి. ఎన్నికల నినాదంగా మారిపోయింది. ఒక దశలో రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకుంది. అన్నింటికంటే మించి సులభంగా డబ్బు సంపాదించే మార్గమైంది.

సారా రాజుల సామ్రాజ్యాలు వెలిశాయి. ఆయా ప్రాంతాల్లో వారి అనుమతి లేకుండా ప్రవేశించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సారా సైన్యాలతో వారే స్వయంగా దాడులు చేస్తూ సమాంతర ప్రభుత్వంగా కొన్నిప్రాంతాల్లో వ్యవహరించారు. చివరకు రాష్ట్ర రాజకీయాలు కూడా వారి ముందు దాసోహం అనే పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో నెల్లూరు జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున లేచి రాష్ట్రమంతా విస్తరించింది. మద్యంవల్ల చితికిపోతున్న కుటుంబాలను చూసి ఆవేదన చెందిన కొందరు అధికారులు మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులు తమవంతు సహకారం అందించారు. ఉద్యమ తీవ్రతను గ్రహించిన ఆనాటి ముఖ్యమంత్రి విజయ భాస్కరరెడ్డి 1994ఏప్రిల్‌ ఒకటిన సారాను నిషేధించి పాక్షికంగా మద్యనిషేధాన్ని విధించారు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం నేత ఎన్టీరామారావ్ఞ పాక్షిక రద్దునిషేధంతో ఫలితాలురావని సంపూర్ణ మద్యనిషేధమే సరైన పరిష్కారమని పిలుపునిచ్చారు. అప్పటికే ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సంస్థలతో గొంతుకలిపారు. ఆ ఎన్నికల్లో ఈ నినాదం తెలుగుదేశానికి ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా మహిళలు నమ్మి అఖండ మెజార్టీతో తెలుగుదేశాన్ని గట్టెక్కించారు. వేలాది ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంపూర్ణమద్యనిషేధాన్ని ప్రకటిస్తూ ఫైలుపై మొదటిసంతకం చేశారు.

ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మద్యం అమ్మకానికి తెరలేపింది. మళ్లీ మద్యపాన నిషేధాన్ని కాంగ్రెస్‌నేతలు అందుకొని చంద్రబాబును గద్దెదించడానికి ఉపయోగించుకున్నారు. ఇలా ఎవరికివారు ఎక్కడ ఎలా ఉపయోగపడితే అవసరాన్ని బట్టి మద్యనిషేధాన్ని వాడు కుంటూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణాలో సంపూర్ణ మద్య నిషేధంవైపు అటు కమ్యూనిస్టులు, ఇటు బిజెపి వర్గాలతోపాటు మరికొన్ని మహిళా సంఘాలు ఉద్యమ బాటపడుతున్నారు.

గురువారం బిజెపి నాయకులు మద్యనిషేధం నినాదంతో మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం ఆరంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సారా నిషేధించినా అమ్మకాలను నియంత్రించలేకపోతు న్నారు. చీప్‌ లిక్కర్‌ పేరుతో సారా నిరుపేదల ఆరోగ్యాన్ని కబళించివేస్తున్నది. గ్రామాలకే కాదు శివారుపల్లెలకు కూడా బెల్టుషాపుల పేరుతో చీప్‌ లిక్కర్‌ను చేర్చి ప్రజారోగ్యంతో పాలకులు ఆటలాడుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఆదాయాన్ని కోల్పోయే స్తోమత ప్రభుత్వానికి లేదని పెద్దలు చెప్తున్నారు. ఈ ఒక్క కారణంగానే బార్లు,షాపులు పెంచి మద్యా దాయాన్ని పెంచుకునేందుకు అన్నిదారులు వెతుకుతున్నారు.

ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మద్యంపై ఆందోళనలు వ్యక్తమవ్ఞ తున్నాయి. ప్రతి పది సెకన్లకు ఒకరు వంతున కబ ళిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి దాదాపు 35 లక్షలమంది కిపైగా మృత్యు కూపంలోకి తోస్తున్నదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు మద్యంతో చితికిపోతున్న కుటుంబాల ఆవేదనను అర్థంచేసుకోవాలి.

అటు నేరాలకు, ఇటుప్రమాదాలకు ఆరోగ్యానికి అన్నింటికీ మూల కారణమైన మద్యాన్ని నిషేధించకుండా ఇంకేదో చర్యలు చేపడితే రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్లు అవ్ఞతుంది. దేశభవిష్య త్తును కర్కషంగా బలిపీఠం మీదకు ఈడ్చుతున్న ఈ మద్యం రక్కసిని పారద్రోలకుండా ఏ చర్యలు తీసుకున్నా నిష్ప్రయోజనమే.

-దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/