అద్దె గర్భాలలో అక్రమాలను నియంత్రించాలి

Pregnancy

మాతృత్వం మహిళలకు ఒక అపూర్వ వరమని, ప్రసవం అనేది పునర్జన్మని మన పూర్వీకులు అభివర్ణించారు. గర్భస్థపిండం కడుపులో పడిన నాటి నుండి నవమాసాలు మోసి శిశువ్ఞకు జన్మనివ్వడం అనేది ఒక సంక్లిష్టమైన,అపూర్వమైన ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. సంతానోత్పత్తిలో ఉన్న ప్రక్రియను నేటి ఆధునిక మేధావ్ఞలు కొంతవరకు విశ్లేషించగలి గినా ఇంకా అంతు తెలియని ఎన్నో రహస్యాలు దాగివ్ఞన్నాయన్న విషయం నిర్వివాదాంశం.

అయితేఆధునిక జీవన విధానం కార ణంగా మాతృత్వం, సంతానోత్పత్తి నేడు ఎన్నో సమస్యలకు గుర వ్ఞతోంది.అన్నిరకాలుగా ఆరోగ్యంగాఉన్నా వైద్యులకుసైతం అంతు పట్టని కారణాల వలన సంతానం కలగని పరిస్థితులు ఎదురవ్ఞ తున్నాయి. జాతీయ కుటుంబ సంక్షేమ మండలి నివేదిక ప్రకారం 2011నాటి జనగణనపరంగా 2000-10 మధ్యకాలంలో, అంత కు పూర్వపు సమయంతో పోలిస్తే సంతానం కలగని జంటల సంఖ్య 19శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో పాశ్చాత్యదేశాలలో ఉన్న అద్దెగర్భం విధానం మనదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది.

2002-2016 మధ్యకాలంలో సర్రోగస్సీ విధానం వలన సుమారుగా పదిహేను లక్షల జంటలు సంతానం పొందినట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. దేశీయంగానే కాక విదేశీయులకు కూడా ఈ అద్దెగర్భాల విధానం ఒక వరప్రదాయినీగా మారింది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశాలలో ఫెర్టిలిటీ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలిసాయి.

వీటితోపాటు ఇందులో వ్యాపార ధోరణులు కూడా ప్రవేశించాయి. రష్యా, యుగోస్లోవియా, జర్మనీ, అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలలో అద్దె గర్భాల విధానం ప్రాచుర్యంలోఉన్నా అక్కడ పటిష్టమైన విధా నాలు, అద్దెగర్భాల చట్టాలు కఠినతరం కావడాన్ని వాణిజ్యపోక డలు అసలు లేవ్ఞ. కాన్నిఅన్ని రంగాలలో వలె వైద్యరంగంలో ప్రవేశించిన అవినీతి, ప్రైవేటీకరణ, వ్యాపార పోకడలు మనదేశం లో అద్దెగర్భాన్ని పెద్దఎత్తున వ్యాపారంలా మార్చేశాయి. 2012- 215 మధ్యకాలంలో సగటున ఏటా యాభైకోట్లడాలర్ల లావా దేవీలు అద్దెగర్భం వ్యాపారం జరిగిందన్న సదరునివేదిక, కృత్రిమ గర్భం, సర్రోగస్సీరానున్నకాలంలో ఎంతటి వైపరీత్యాలకు దారి తీయనున్నదో సోదాహరణంగా వివరించింది. దేశంలో దాదాపుగా అయిదు లక్షల మంది మధ్యతరగతి మహిళలు తమ గర్భాన్ని అద్దె ఇవ్వడాన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నారు.

  • సి.హెచ్‌. ప్రతాప్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/