పెరుగుతున్న బహిరంగ మద్యపానం

open drinking

మద్యం నిరుపేద కుటుంబాలలో చిచ్చుపెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని, మద్యాన్ని ఫైప్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని అధికారపక్షం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. మద్యపానం దురవస్థకు దారితీసి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నందున ఈ ప్రతికూల ప్రభావాన్ని గుర్తిస్తూ దశలవారీ మద్యనిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, తప్పనిసరిగా మధ్యనిషేధం అమలు చేసి లక్షలాది కుటుంబాలలో వెలకట్టలేని సంతోషం తీసుకొస్తామని ప్రభుత్వం తెలుపుతోంది.

తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురావడం ఇందులో భాగంగా మద్యం అమ్మ కాలు తగ్గించడం కోసం మద్యం దుకాణాలు తగ్గించడం, మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అదే విధంగా మద్యం సేవించడానికి ఇంతరకు ముందు ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడం జరిగింది. ఇందువల్ల బహిరంగ ప్రదేశా ల్లోనూ,రహదారుల మీద మద్యం సేవిస్తున్న వ్యక్తులు నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిచోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నారు.

అంతేగాక ప్రభుత్వ మద్యం దుకాణాల పక్కనే అనధికార పర్మిట్‌ రూమ్‌ల మాదిరిగా నీళ్ల ప్యాకెట్స్‌ అమ్మే దుకా ణాలు వెలుస్తున్నాయి. ఇక్కడే మద్యం సేవిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మద్యం తాగే వారు బహిరంగంగా మద్యం దుకాణాల పరిసర ప్రాంతాల్లో తాగు తూ సామాన్య ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావ్ఞన ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న వీరిపై పబ్లిక్‌ నూసెన్స్‌కింద రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవచ్చు.

ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసు వ్యవస్థ గాని, ఇతర అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటువంటి సమస్యలను, కంప్లైంట్‌లను అధికా రుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు తాత్కాలికంగా ఆయా ప్రదేశాలు సందర్శించి చర్యలు తీసుకుంటున్నారు. కానీ రెండుమూడు రోజు ల్లో మళ్లీ పరిస్థితి మరలా మొదటికే వస్తున్నది. కావ్ఞన దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.

అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నబార్లలో 50శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా మద్యం షాపులను 20 శాతం తగ్గిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే మద్యం షాపులు తగ్గించిబార్ల ద్వారా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నా యన్న విమర్శలు వెల్లువెత్తడంతో బార్ల కుదింపుపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 840 వరకు బార్లున్నాయి.వీటిలో సగం(420) వరకు బార్లు రద్దుకాను న్నాయి. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2020 జనవరి 1 నుంచి నూతన బార్‌ పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బార్ల నిర్వహణ సమయాలను కూడా కుదించేందుకు ప్రభుత్వం సిద్ధమ వ్ఞతోంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బార్లలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు గంటలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేసేలా కొత్త సమయాలను అమల్లోకి తీసుకురానుంది. దీంతోపాటు ప్రస్తుతం బార్లకు లైసెన్సు మొత్తంరద్దు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం బార్ల లైసెన్సు రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్‌ ద్వారా లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న బార్లకు 2022 వరకు లైసెన్సుల గడువ్ఞ ఉంది. అయితే నూతన నిబం ధనలను అమల్లోకి తీసుకొచ్చి, ఈ మేరకు కొత్త లైసెన్సులకు అవకాశం ఇవ్వనుంది. అయితే నూతన బార్ల పాలసీ ద్వారా అయినా బహిరంగ మద్యపానం తగ్గుతుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మద్యపానాన్ని బార్లకు మాత్రమే పరిమితం చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల పరి సరాల్లో రహదారుల మీద జరుగుతున్న బహిరంగ మద్యపానాన్ని నిరోధించాలి.

బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసేదిశగా పోలీసు, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వం తీసుకున్న దశలవారీ మద్యనిషేధం పాలసీ విజయవంతం అవుతుంది.

-ఆత్మకూరు భారతి

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/