పెరుగుతున్న మానసిక రోగులు

increasing The mentally ill

ఇటీవలికాలంలో మహారాష్ట్రలో మానసిక రోగుల సంఖ్య భారీ సంఖ్యలో పెరుగుతోందని, గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 5.44 లక్షలమంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కేంద్రప్రభుత్వం నేతృత్వంలోని ఆరోగ్యనిర్వహణ సమాచార వ్యవస్థ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. రోజుకు దాదాపు 100 నుంచి 150 మంది సైక్రియాట్రిక్‌ ఔట్‌ పేషెంట్‌ విభాగానికి వస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు.

వీరంతా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మానసిక రోగాలతో బాధపడుతు న్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం త్వరలోనే మానసిక రోగాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మానసిక రోగుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు దోహదపడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జీవన శైలిలో వచ్చిన మార్పులు, ప్రత్యేకించి గంటల తరబడి మొబైల్‌ ఫోన్లకి అతుక్కుపోవడం, ఒంటరితనంతో బాధపడుతుండడం తదితర కారణాల వల్ల మానసిక రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగు తోంది. దేశంలో కూడా మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది.

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు, ఇప్పుడు పల్లె ల్లోనూ కనిపిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణా లతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నా అందుకు తగిన వైద్యం మాత్రం అందడం లేదు. తగిన సంఖ్యలో మానసిక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది బాధితులు ఆర్‌ఎంపి వైద్యుల వద్దకు వెళుతుండడం వారు మోతాదుకు మించిన మందులు ఇస్తుండడంతో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. అంతేగాక నిరక్షరాస్యత వల్ల మాంత్రికులను, దొంగబాబాలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాస్పత్రిల్లోనూ సైకియాట్రీ నిపుణులు ఉండటం లేదు. అటు ప్రైవేట్‌ రంగంలోనూ మానసిక వైద్యనిపుణులు తక్కువగానే ఉన్నారు. దీర్ఘకాలిక మానసిక సమస్యలకు సరైన వైద్యం లేకపోవడం, కౌన్సిలింగ్‌ ఇచ్చేవారు లేకపోవడంతో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.

మానసిక రోగుల సంఖ్య ఇంతలా పెరగడం విస్మయానికి గురిచేస్తోంది. రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. డిప్రెషన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే విధంగా చదువ్ఞల ఒత్తిడికి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరికి మానసిక కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి సైకాలజిస్టులు, మానసిక ఆరోగ్యనిపుణులే కరవవ్ఞతున్నారు.

లక్షమంది జనాభాకు ఆరు గురు మానసిక నిపుణులు ఉండాల్సిఉండగా మనదేశంలో ఒక్కరు కూడా లేరు.పదిలక్షల మంది జనాభాకు కేవలంముగ్గురు సైక్రియాట్రిస్టులు, కోటి మంది జనాభాకు నలుగురు సైకాల జిస్టులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి మారకుంటే విద్యా ర్థులు, యువత, రైతుల ఆత్మహత్యలు భవిష్యత్తులో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. మానసిక వైద్యులను అందుబాటులోకి తేవాలి. 2017లో కేంద్రప్రభుత్వం మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ చట్టాన్ని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని చెప్పింది. ఇప్పటికేపలు రాష్ట్రాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో మానసిక వైద్యుడు, మనస్తత్వ నిపుణులతోపాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి పేషెంట్ల రిజిస్ట్రర్‌ని నమోదు చేయాలని సూచించింది. మానసిక రోగులకు గుర్తింపు లేని వైద్యులు ఎవరైనా వైద్యం చేసినట్టు ఫిర్యాదులొస్తే వారిపైకఠిన చర్యలు తీసుకోవాలి.

-ఆత్మకూరు భారతి

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/