భారత్‌,పాక్‌ సంబంధాలపై ‘370’ రద్దు ప్రభావం

జమ్మూకాశ్మీరు సమస్యకు ముగింపు

Article 370 issue

జమ్మూకాశ్మీరు ప్రత్యేకహోదా ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఐక్యభారత్‌లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కానీ జమ్మూకాశ్మీర్‌ల రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అయితే జమ్మూకాశ్మీరు ప్రాంతంలో సైనిక చొరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గాని తగ్గలేదు. కాని భారత్‌ ప్రతి కాశ్మీరు ప్రజల రక్షణకు సరిహద్దుల్లో సైనికులను నియమించింది. భారత సైన్యం 1971 తర్వాత మేజర్‌ యుద్ధంలో పాల్గొనలేదు. కానీ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో మైనర్‌ యుద్ధం, ఘర్షణలకు పాల్పడటం, 2000, 2014లో భారత సైనిక దళాల యుద్ధం, సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయడం జరిగింది. జరుగుతుంది. 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న జమ్మూకాశ్మీరు సమస్యకు ముగింపు పలికినట్లు అయింది.

అయితే పాకిస్థాన్‌ ఆక్రమిత ప్రాంతంలో పాక్‌ సైన్యం ప్రవేశించి భారత సరిహద్దుల్లో కాల్పులు జరపడమేకాక సైనిక చొరబాట్లతో భారత్‌ మీద కక్షకు పాల్పడుతుందని భారత విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు. కాశ్మీరుకు ప్రత్యేకహోదా తొలగించగానే వారికి ఎంతో నష్టం జరిగినట్లు అమెరికా, రష్యా దేశాలు ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు చేశాయి.అంతేకాకుండా పాకిస్థాన్‌ ఆర్థిక స్థితిగికి భంగం కలిగించినట్లుగా భావించాయి.

ఎందుకంటే పాకిస్థాన్‌ 1950 నుండి 2019 వరకు భారత్‌ను పెద్దదేశంగా, న్యూక్లియర్‌ దేశంగా చూపించి అమెరికా నుండి సైనిక సహాయాన్ని పొందుతూ వచ్చింది. చైనా కూడా 1962 నుండి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు ఆర్థికంగా, సైనికంగా సహాయపడు తూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ను రెచ్చగొడుతూ వస్తుంది. అందుకే ఇండో-పాక్‌ సరిహద్దు ఎన్‌డబ్ల్యుఎఫ్‌ఎలోను పంజాబ్‌ సెక్టార్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత ప్రాంతంలో శాంతి అంటూ లేదు. ఒకవిధంగా చెప్పాలంటే అమెరికా, పాకిస్థాన్‌ను ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రెచ్చకొట్టింది.

భారత్‌కు సోవియెట్‌ రష్యా మద్దతు ఇచ్చుకొంటువచ్చింది. పాకిస్థాన్‌ కాశ్మీరును గూర్చి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తినప్పుడల్లా సోవియెట్‌ రష్యా 17 సార్లు వీటో చేసింది. ఇప్పుడు భారత్‌ భద్రతామండలిలో సభ్యత్వాన్ని చైనా, పాకిస్థాన్‌లు వ్యతిరేకి స్తున్నాయి. 1990 భారత సంస్కరణల అమలు అనంతరం బలమైన దేశంగా ఎదిగింది. చైనాకు భారత్‌పోటీ ఇస్తుందని అన్ని విషయాల్లో వ్యతిరేకిస్తుంది. భారత్‌పై పాకిస్థాన్‌ను చైనా ఉసిగొల్పుతుంది. పాకిస్థాన్‌ ఎక్కువ కావలం సైనిక పాలనలో ఉంది.

కనుక చాందసవాదంతో భారత్‌ను అన్ని విషయాల్లో పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తుంది. ఇండోనేషియా తర్వాత భారత్‌లోనే అత్యధిక మంది ముస్లిం జనాభా ఉన్నారు. మతం పేరుతో భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు జయిషే-ఇ-మహ్మద్‌బిన్‌ హాజీఫ్‌ను పాక్‌ వాడుకుంటుంది. 70 సంవత్సరాలుగా సాగుతున్న సమస్యకు భారత్‌ ముగింపు పలకడంతో పాకిస్థాన్‌ సిమ్లా ఒప్పందం కానీ, ఢిల్లీ డిక్లరేషన్‌ను కాని ఖాతరు చేయకుండా భారత్‌పై అసత్యప్రచారం చేస్తుంది. భారత్‌పై పాకిస్థాన్‌ను చైనా ఉసికొల్పడమేకాక టిబెట్‌,నేపాల్‌లో ప్రవేశించి భారత్‌రక్షణకు భంగం కలిగిస్తుంది.

జమ్మూకాశ్మీర్‌లో ఒకేసారి శాంతి, మామూలు పరిస్థితులు ఏర్పడేందుకు కొంత కాలం పడుతుంది. ఇప్పటికీ కొంత మందిమంత్రులు హౌస్‌ అరెస్టులోనే ఉన్నారు. పాకిస్థాన్‌ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా కాశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయంగా మీటింగ్‌లలో లేవనెత్తి భారత్‌కు చికాకు తెప్పిస్తుంది. భారత్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తుంది. భారత్‌, పాకిస్థాన్‌లు న్యూక్లియర్‌ ఆయుధాలు కలిగిన దేశాలు కనుక యుద్ధానికి తలపడితే అనేక విధాలుగా రెండు దేశాలు నష్టపోతాయి.

  • డాక్టర్‌ కె. ఆసయ్య,ఐఐఎస్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/