ఉద్యోగులకు కరోనా నియంత్రణ చేసేదెలా?

గ్రామాల్లో కరోనా విస్తారంగా వ్యాప్తి

How to control corona for employees
How to control corona for employees

ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్‌ విస్త రిస్తోంది.

ఇప్పటివరకు సచివాల యం, శాఖల విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రుల పేషీల్లోని సిబ్బందికి కరోనా సోకగా, తాజాగా ఇది జిల్లా కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల కూ వ్యాపిస్తోంది.

అంతేగాక గ్రామాలలో సచివాలయం సిబ్బందికి, వలెంటీర్లకి, పి.హెచ్‌.సి ఆరోగ్య సిబ్బందికి, రాష్ట్రంలో నాడు,నేడు పనుల నిర్వహణకు, బ్రిడ్జ్‌ కోర్సు నిర్వహణకు స్కూళ్లకు హాజరవుతుున్న ఉపాధ్యాయులకి కరోనా సోకడం జరుగుతోంది.

తద్వారా గ్రామాల్లో కూడా కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో విధు లకు హాజరుకావాలంటే అధికారులు, ఉద్యోగులు సిబ్బంది భయ పడుతున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్‌ ఏదో ఒక రూపంలో విస్తరిస్తుండటంతో ఉద్యోగ సిబ్బంది తమ విధులకు హాజరుకావడానికి భయపడుతున్నారు.

కొన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది.

అదేవిధంగా కొన్నిచోట్ల పోలీసు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

కొందరు ఉద్యోగులు అనారోగ్యానికి గురికావడంతో వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ కావడంలో అధికారులు, తోటి ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.

అన్ని విభాగాల్లో శానిటైజేషన్‌ చేయడంతోపాటు మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తున్నప్పటికీ ఏదో ఒక రూపంలో కరోనా విజృంభిస్తూనే ఉంది.

ముఖ్యంగా జిల్లాల్లో పాలనా వ్యవహారాలు పర్యవేక్షించే కలెక్టర్‌ కార్యాలయాల్లోనూ నిత్యం అనేక సమీక్షలు, సమావేశాలు జరగడం సహజం.

ఈ సమావేశాలకు జిల్లాలోని ప్రధాన అధికారులతోపాటు, ఇతర అధికార యంత్రాంగం కూడా హాజరవుతుండటం, వీరంతా వివిధ ప్రాంతాల నుంచి సమావేశా లకు హాజరుకావడం

మరోవైపు వినతులు, సమస్యలు తెలుపు కొనేందుకు జిల్లావ్యాప్తంగా ఎన్నో చోట్ల నుంచి ప్రజలు వస్తుం డటంతో కరోనా కట్టడి కష్టసాధ్యంగా మారుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చే వారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తున్నప్పటికీ ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

కొవిడ్‌ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో సందర్శకుల నుంచి వినతులు, ఇతర కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములవుతూ కరోనా బారినపడుతున్నారు.

కొన్ని ముఖ్య విభాగాల్లోని అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రత్యక్షంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.

ఇంకోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాల యాలకు పెద్దఎత్తున వస్తున్నారు.

ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది కూడా కరోనాబారిన పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో, జైళ్లల్లో సిబ్బంది కూడా వైరస్‌బారిన పడుతుం డటంతో తోటి సిబ్బంది ఉద్యోగ బాధ్యతలకు హాజరు కావాలంటే భయపడుతున్నారు.

మాస్కులు వాడటం,శానిటైజర్‌ ఉపయోగించ డం, సామాజికదూరం పాటించడం ప్రభుత్వకార్యాలయాల్లో తప్ప నిసరి చేసినప్పటికీ చాలాచోట్ల అమలు కావడం లేదు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ సేవలకోసంవచ్చే ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలి.

అంతేగాక తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వీటిపై ప్రజలకు, ప్రభుత్వ సిబ్బందికి తగిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

మాస్కులు వాడటం, శానిటైజర్‌ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కరోనాని కట్టడి చేయడానికి వీలవుతుందన్న విషయం నేడు అందరికీ తెలిసిందే.

అయినప్పటికీ అందరూ ఆచరించేలా చేసినప్పుడే కరోనాను కట్టడి చేయగలం.

కరోనాను అరికట్టడానికి తప్పనిసరిగా మాస్క్‌ ధరిస్తే చాలా లాభముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్‌ కట్టడిలో మాస్కులే కీలక పాత్ర పోషి స్తాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడయింది

.ప్రధానంగా ఓ వ్యక్తి తుమ్మినా, దగ్గినా బయటకు వచ్చే కణాలు ఇతరుల మీదకు ప్రవే శిస్తాయని, మాస్కులు ధరించడం వల్ల వాటిని నిరోధించవచ్చు.

మాస్క్‌ ధరించని వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే ప్రమా దం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేటి సమాజంలో మాస్క్‌ ధరించనివారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి వైరస్‌ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తుంది.

కొంత మంది బిగ్గరగా మాట్లాడటం వల్ల అధిక సంఖ్యలో కణాలు బయ టకు వస్తున్నాయి.అందువల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలి.

– వాసిలి సురేష్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/