అధ్వాన్న స్థితిలో హాస్టళ్లు

Hostels in worse condition

ఎప్పుడైతే దేశంలోకి విశృంఖల ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందో! పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ప్రజల ఆర్థికస్థాయినిబట్టి వర్గీకరణ చెందిన విద్యాలయాల ఏర్పాటు జరిగిందో! అప్పటి నుండి ప్రభుత్వ విద్య కూనారిల్లడం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆర్థికస్థాయిని బట్టి అనేక ప్రైవేట్‌ హాస్టల్స్‌, భోజన వసతులను అందించే మెనూ తయారయ్యాయి. ఈ విధానం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్వహించే హాస్టల్స్‌ క్రమేపీ తగ్గిపోయాయి. ఈ క్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు సైతం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అరకొర నిధులతో నిర్వహించే ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు నాణ్య ెుౖన ఆహారం అందించలేకపోతున్నది. అలాగే ఆహార విషయంలో నాణ్యత కావాలంటే ఆయా పిల్లలే నెలవారీగా మరికొంత అదనపు మొత్తాన్ని సొంతంగా చెల్లించుకుని వసతి గృహాలను నిర్వహించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒ కప్పుడు రాజుల పాలనా వ్యవస్థ, జమిందారీ వ్యవస్థలు దిగ్విజయంగా పరిఢవిల్లే కాలంలో ఆయా రాజస్థానాలు, దివానులు తమ దాతృత్వ కార్యక్రమాలలో భాగంగా ప్రజలకు కొన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందించే క్రమంలో వారు స్థాపించిన విద్యాలయాల్లో పేద విద్యార్థులు విద్యను నేర్చుకునే పరిస్థితుల్లో సత్రాలను నెలకొల్పి, వాటి ద్వారా మూడుపూటలా భోజన వసతిని కల్పించేవారు. అలాగే ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో వివిధ పట్టణాలలో నిర్వహించే చౌట్రీల ద్వారా పేద విద్యార్థులకు భోజన వసతి కల్పించడం ఆనాటి రోజుల్లో జరిగేది. ఇంకా తర్వాత కాలంలో గ్రామాలలో ఉండే భూస్వాములు కూడా చిన్నచిన్న పట్టణాలలో విద్యార్థుల కోసం సత్రాలు ఏర్పాటు చేసి, భోజన వసతిని పెద్ద ఎత్తున కల్పించడం జరిగేది.

స్వాతంత్య్రానంతర కాలంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత, అందరికీ ఉచి తంగా విద్యను అందించే లక్ష్యంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వసతిగృహాల ద్వారా నివాస, భోజన వసతులు కల్పించడం అనాదిగా వస్తున్నది. అయితే ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పే నేటి ప్రజాప్రభుత్వాలు ఈ హాస్టల్‌ వ్యవస్థను ఎలా నీరుగార్చాయో! పరిశీలించవచ్చు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వసతిగృహాల్లో పరిస్థితులు చూసినట్లయితే పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు వివిధపత్రికల ద్వారా కథనాలను చూస్తున్నాం.

వాటిలో ప్రధానంగా ఎప్పుడో కట్టిన పాత వసతిగృహాలు, శిథిలావస్థలో ఉండటం, ఎండలకు వానలకు ఆయా భవనాలు నివసించేందుకు వీలుగాలేకపోవడం, భోజనంలో నాణ్యత లోపించడం, ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలు పిల్లలకు అందకపోవడం, అనగా ఉచిత పుస్తకాలు, యూనిఫారమ్స్‌, దోమతెరలు, దుప్పట్లను పిల్లలకు విస్తృతంగా ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోవడం జరుగు తున్నది. ఇలా వసతుల లేమితో హాస్టల్‌ విద్యార్థులు తరచూ ఇబ్బందిపడడం మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. భారతగడ్డపై నివసించే ప్రజాసమూహంలో చాలా వరకు పేద, బడుగు, బలహీ నవర్గాల వారే ఎక్కువ శాతం మంది ఉంటారు.

వ్యవసాయం, కులవృత్తులు, ఇతర సాంప్రదాయ వృత్తులతో తమ జీవనాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో కొంత మంది మాత్రమే విద్యకు ప్రాధాన్యతనిస్తూ తమ పిల్లలను వివిధ విద్యాలయాల్లో చదివిస్తూ తమ ఆర్థికస్థాయికి మించి సదుపాయాలను, సౌకర్యా లను కల్పించే పరిస్థితుల్లో నేడు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికోసం అహర్నిశలు కష్టపడి పైసా,పైసా కూడబెట్టి తమ పిల్లలు చదివేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో విద్య ద్వారానే ఉపాధి అవకాశాలను సంపాదించగలమనే దృఢసంకల్పంతో తమకంటే ఉన్నత స్థాయిలో తమ పిల్లలను చూసేందుకు గాను నిత్యం పరితపిస్తూ, తమ జీవన విధానాన్ని తగినవిధంగా మార్పుచేసుకుంటూ ఆయా తల్లిదండ్రులు ముందుకు పోతున్నారు.

ఈ తరుణంలో ప్రభుత్వాలు విద్యను సేవలరంగంగా భావించి పెద్దపీట వేసి ఎక్కువ శాతం నిధులు సమకూరుస్తూ పేద, వెనుకబడిన, నిమ్నవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణా లతో కూడిన విద్యను అందించే ప్రణాళికలు రచించాలి. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన పేద, అణగారిన, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యను కేవలం ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే గడిపేందుకు వీలుగా అన్నిరకాలుగా ఉచిత విద్యను అందించాల్సిన అవసరం నేటి ప్రభుత్వాలపై తప్పకుండా ఉంది. ఈ క్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠశాల స్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు చదివే పిల్లలకుగానూ, నివాస వసతి, భోజన వసతి కల్పించాల్సిన అవసరం ప్రస్తుత ప్రభు త్వాలపై ఉంది. ఈ రకంగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే అందరికి విద్య. అందరికి సమాన అవకాశాలు అని రాజ్యాంగపు విలువలకు ఆయా ప్రభుత్వాలు కట్టుబడినట్లవ్ఞతుంది.

ఈ నేపథ్యంలో గతంలో దేశంలో వ్యవస్థాపన చేయబడిన అనేక ప్రభుత్వాలు ఈ పేద, బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా చదువ్ఞతోపాటు నివాస వసతి, భోజనవసతి కల్పించే హాస్టల్స్‌ వ్యవస్థను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలి.పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యను పొందే విద్యార్థులు బిసి వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ లాంటి ప్రభుత్వ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లలో ప్రవేశం పొందేవారు. ఆయా వసతిగృహాలను ప్రభుత్వం ఎక్కువగా నెలకొల్పడం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు తమ విద్యను నేర్చుకునేందుకుగాను ఆనాటి ప్రభు త్వాలు తీవ్రంగా కృషి చేశాయి.

దీనిలో భాగంగానే గతంలో ఎస్సీ,బిసి, జనరల్‌ హాస్టల్స్‌ అనే పేర్లతో వివిధ రకాలస్థాయిలలో గల విద్యార్థులకు తమ సేవలను ఎంతగానో అందించాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు జనరల్‌ హాస్టల్స్‌లోనూ, రిజర్వు కేటగిరి వర్గాల పిల్లలకు బిసి,ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్‌ హాస్టల్స్‌లోనూ, చక్కగా చదువ్ఞకునేటట్లు ఆనాటి ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. ఆనాడు ఇంచుమించుగా ఆయా పిల్లలకు అన్నిరకాలగానూ అయ్యే ఖర్చులను ప్రభుత్వాలే పూర్తిస్థాయిలో భరించేవి. భిన్నత్వంలో ఏకత్వమనే విశేషమైన భారతీయ జీవనశైలికి అద్దంపడుతూ జాతీయ సమైక్యతాభావంతో పిల్లలు సోదరభావంతో తమతమ చదువ్ఞలను కొనసాగించడం విశేషం.

కానీ నేడు అలా ఉందా వాతావరణం అని పరిశీలించాల్సిన అవసరం మనపై ఉంది. నేడు ఎప్పుడైతే దేశంలోకి విశృంఖల ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందో! పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ప్రజల ఆర్థికస్థాయినిబట్టి వర్గీకరణ చెందిన విద్యాల యాల ఏర్పాటు జరిగిందో! అప్పటి నుండి ప్రభుత్వ విద్య కూనా రిల్లడం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆర్థికస్థాయిని బట్టి అనేక ప్రైవేట్‌ హాస్టల్స్‌, భోజన వసతులను అందించే మెనూ తయారయ్యాయి. ఈ విధానం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్వ హించే హాస్టల్స్‌ క్రమేపీ తగ్గిపోయాయి.

ఈ క్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు సైతం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అరకొర నిధులతో నిర్వహించే ప్రభుత్వ హాస్టల్స్‌లోఉండే పిల్లలకు నాణ్య మైన ఆహారం అందకపోవడం జరుగుతున్నది. అలాగే ఆహార విషయంలో నాణ్యత కావాలంటే ఆయా పిల్లలే నెలవారీగా మరి కొంత అదనపు మొత్తాన్ని సొంతంగా చెల్లించుకుని వసతి గృహా లను నిర్వహించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా వసతి గృహాలలో పేదవర్గాల పిల్లలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌.ఐ.టి, ఐ.ఐ.టి, కేంద్ర విశ్వ విద్యాలయాల్లో సైతం విద్యార్థులు చదివేందుకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండడం విడ్డూరమే మరి. అసలీ విధంగా కేంద్రప్రభు త్వం అఖిల భారతస్థాయి సంస్థలలో చదివే ప్రతిభగల విద్యార్థుల కు ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం లాంటి పనుల వల్ల ఎలాంటి సందేశం ప్రజలకు ఇస్తుందో! అర్థంకావడం లేదు.

ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న అన్నివర్గాల విద్యార్థులకు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో ఆ మాత్రం ఉచితంగా విద్యను అందించలేదా?అదేవిధంగా ఉచితంగా హాస్టల్‌,భోజన వసతులు కల్పించలేదా! ఈవిషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ఆంతర్యమేమిటో! అర్థంకావడం లేదు. దీనివలన సాధారణ పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు సరైనరీతిలో హాస్టల్‌ వసతిని పొంద లేకపోతున్నారు.

ఈ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరి చేయాల్సిన అవసరం నేడు ఏర్పడింది. ముఖ్యంగా పేద,మధ్యతర గతి, అణగారిన వర్గాల పిల్లలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విద్యాల యాల్లో చదివేందుకుగాను సంబంధిత ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. అంతేగాని రాజ్యాంగ విలువలకు కట్టుబడకుండా పక్కకు తప్పుకునే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు చేయకూడ దని మేధావ్ఞలు పెద్దఎత్తున అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమం లోనే ప్రభుత్వ విద్యాలయాల్లో నివాస, భోజనవసతులతోపాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకుగాను, దీర్ఘకాలికంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

-పిల్లా తిరుపతిరావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/