నిధుల కొరత..కరవైన నిబద్ధత

హబుల్‌: గతవారం రోజులపై టెలీస్కోప్‌

Road Repairs in GHMC
Road Repairs in GHMC

అడుగు ముందుకేస్తేనే అభివృద్ధి సాధ్యమ వుతుంది.సామర్థ్యం నిరూపించుకొంటేనే సత్కీర్తి సొంతమవుతుంది. పౌరుడికైనా,పురపాలక సంఘానికైనా ఇవి వర్తిస్తాయి. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసే స్థానిక సంస్థలు,ఆశించినంతగా ఫలితాల్ని సాధించలేకపోతున్నాయన్నది అక్షర సత్యం. మున్సిపాలిటీల్లోని ‘పాలిటిక్స్‌ ప్రజల పాలిటి ప్రగతి నిరోధకాలవు తున్నాయి.పాలక సంఘాల్లోని అవినీతి కింది నుంచి పై వరకూ చలవలు పలవలు వేసుకుపోతోంది.పైన పర్సనాలిటీలోని మున్సిపాలిటీ పరిహాసాలకు పురపాలక సంఘాలు లోనవుతున్నాయి.
స్వాత్రంత్యం రాకముందు నుంచి జాతిపిత మహాత్మగాంధీ ‘గ్రామస్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అంటుండేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే-పటిష్టమైన స్థానిక సంస్థలు సాగించే స్వపరిపాలనే నిజమైన ప్రజాస్వామ్యానికి దర్పణం. పై స్థాయిలో చట్టాలు రూపొందించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘అలా చేస్తే ఇలా జరుగుతుంది,ఈ ఫలితం వస్తుంది అని ఊహించి కాగితాల్లో రాస్తూ విధానాలకు రూపకల్పన చేస్తాయి. కానీ స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు,సభ్యులంతా సామాన్య ప్రజానీకంతో మమేకమై ఉంటారు.
సమాజంలో ఏంజరుగుతోంది. ప్రజానీకానికి ఏమేమి అవసరం అన్న విషయాలపై ప్రత్యక్ష అవ గాహనను మొదటగా గ్రహించేది స్థానిక సంస్థల పాలకవర్గాలే. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో గ్రామీణ భారతా వనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం వంటి ప్రధాన రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

మనిషి పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జనన ధ్రువీకరణ పత్రంతో మొదలుకుని,శాశ్వత నిద్రలోకి వెళ్లాక అతని కుటుంబానికి కావల్సిన మరణ ధ్రువీకరణ పత్రం దాకా-ప్రతి రోజూ మున్సిపాలిటీతో ప్రతి ఒక్కరికీ అవసరముంటుంది.
సమాజంలో వచ్చే మార్పులు, చట్టాలు, విధానాలకు అనుగుణంగా పౌరులు ఏదో ఒక సమయంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించక తప్పదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత దేశంలో స్థానిక సంస్థలకున్న ప్రాధాన్యం అనన్య సామాన్యం. నిజానికి దేశాన్ని పాలించే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని పాలించే రాష్ట్ర ప్రభుత్వాలకన్నా మున్సి పాలిటీలే సగటు పౌరుల జీవన విధానంతో పెనవేసుకుపోయాయి. కళ్లముందు కనిపించే కనీస సౌకర్యాల దగ్గర నుంచి పెద్ద ఆకాశ హార్మ్యాల నిర్మాణం వరకూ ప్రతి ఒక్కపనికీ మున్సిపాలిటీల అనుమతి అవసరం. చట్టాలు, విధానాలు రూపొందించేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే అయినా దిగువస్థాయిలో వాటిని అమలు చేయాల్సింది, ఫలితాలను మొదట రాబట్టాల్సిందీ మున్సిపాలి టీలే. స్వాత్రంత్యం రాకముందు నుంచి జాతిపిత మహాత్మగాంధీ ‘గ్రామస్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అంటుండేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే-పటిష్టమైన స్థానిక సంస్థలు సాగించే స్వపరిపాలనే నిజమైన ప్రజాస్వామ్యానికి దర్పణం. పై స్థాయిలో చట్టాలు రూపొందించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘అలా చేస్తే ఇలా జరుగుతుంది,ఈ ఫలితం వస్తుంది అని ఊహించి కాగితాల్లో రాస్తూ విధానాలకు రూపకల్పన చేస్తాయి. కానీ స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు,సభ్యులంతా సామాన్య ప్రజానీకంతో మమేకమై ఉంటారు.
సమాజంలో ఏంజరుగుతోంది. ప్రజానీకానికి ఏమేమి అవసరం అన్న విషయాలపై ప్రత్యక్ష అవ గాహనను మొదటగా గ్రహించేది స్థానిక సంస్థల పాలకవర్గాలే.
తదనుగుణంగా స్పందించి చర్యలు తీసుకుంటేనే సమాజం పురో గమిస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో గ్రామీణ భారతా వనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం వంటి ప్రధాన రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. క్రమేణా ఏళ్లు గడిచే కొద్దీ అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా గ్రామీణ భారతావని పట్టణ సొబగులు దిద్దుకుంటోంది. మరో చెంప వ్యవసాయంలో వస్తున్న నష్టాలు, ఇతర చేతివృత్తులకు నిరాదరణ వంటి కారణాల వల్ల పల్లె ప్రాంతీయులు పట్టణాలకు వలసపోవడం ప్రారంభమైంది. మరో కోణంలో పెద్ద పెద్ద గ్రామాలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాతో చిన్న చిన్న పట్టణాలుగా, అప్పటి వరకూ చిన్న చిన్న పట్టణాలుగా ఉన్నవి కాస్తా మెగాసిటీలుగా రూపాంతరం చెందాయి. చెందుతున్నాయి.గత అర్థశతాబ్దపు భారతదేశ చరిత్రను పరిశీలిస్తే మున్సిపాలిటీల సంఖ్యతో పాటు వాటి పరిధి అనూహ్యంగా పెరుగుతున్న దృశ్యాలు కళ్ళ ముందుంటాయి.
ఆధునిక జీవనం వైపు మనిషి చూపుతున్న మొగ్గు కూడా పట్టణ ప్రాంతాల విస్తరణకు మరో కారణం. క్రమేణా పచ్చని చెట్లతో అలరారుతున్న ప్రాంతాలన్నీ ‘కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారుతున్న ఈ ఆధునిక యుగంలో వీటిని పాలించే మున్సిపాలిటీలు,వాటి పాలక వర్గాలకున్న ప్రాధాన్యం అపారమైంది. 1992 ముందు ఆ తర్వాత…ఇలా మున్సిపాలిటీల పనితీరును,నిర్మాణాన్ని మన దేశంలో రెండు రకాలుగా విభజించారు. పి.వి.నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో 1991 లో పార్లమెంటు ఆమోదించిన 74వ రాజ్యాంగ సవరణతో పురపాలక సంఘాల పాలనలో కొత్త శకం ఆరంభమైందని చెప్పవచ్చు.’నగర పాలికా యాక్ట్‌గా పేరొందిన ఈ చట్టంతో మున్సిపల్‌ కౌన్సిళ్ల నిర్మాణం, ఎన్నికల్లో పెను మార్పులు జరిగాయి. యాక్ట్‌లో పేర్కొన్న అధికా రాలను మున్సిపాలిటీలకు ఇవ్వాలా,వద్దా అన్న విచక్షణాధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం కొత్త సమస్యలకు దారితీసింది. ఈ అధికారాన్ని అటు రాష్ట్రప్రభుత్వాలు,ఇటు మున్సిపాలిటీల పాలకవర్గాలు కొత్త రాజకీయ సంగ్రామాలకు ఆసరాగా చేసుకున్నాయి.
సాధరణంగా రాష్ట్రాన్ని పాలించేది ఒక రాజకీయ పార్టీ అయితే ఆ రాష్ట్రంలోగల మున్సిపాలిటీలు ఒక్కోసారి సగం,అంతకన్నా ఎక్కువగా ప్రతిపక్షాల చేతిలో ఉండటం మాములైంది. ఆంధ్రరాష్ట్రం విభజించక ముందు మొత్తం 1985లో వీటిలో 94 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీ34 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్‌ పార్టీ 42 స్థానాలతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక అక్కడితో మొదలైంది రాజకీయ పోరాటం. మున్సిపల్‌ విధిగా మూడు నెలలకోమారు సమావేశమై పట్టణ ప్రజల సమస్యలపై పరిష్కారాలకు నిధులు కేటాయిస్తూ తీర్మా నాలు చేయాలి. ఈ సమావేశాలు మొక్కుబడి తంతుగా సాగుతు న్నాయనే అభిప్రాయం ఉంది. కౌన్సిలర్లు వ్యక్తిగత కక్షలు,రాజకీయ విభేదాలతో,వాగ్వివాదాలకు,ఘర్షణలకు దిగుతున్నారు.
స్వచ్ఛందంగా అభివృద్ధికి పాటుపడాల్సిన చాలా మంది కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఆదాయ వనరుల పట్ల నిర్లక్ష్యం చూపడంతోపాటు అభివృద్ధి పనులు దుర్వినియోగం మాములైంది. వివిధ సంక్షేమ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధుల వినియోగానికి మున్సిపాలిటీలు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు కాంట్రాక్టుల కోసం కౌన్సిలర్ల మధ్య పోటీ సాధారణమైం ది. పరస్పరావగాహనతో ఒడంబడిక కుదరనప్పుడు ఆయా పనుల్లో ఎంతెంత అవినీతి జరిగింది? ఎవరెవరికి ఎన్ని ముడుపులందాయోనన్న విషయాలు మున్సిపల్‌ సమావేశాల్లో బయటపడుతున్నాయి.
1965 మున్సిపాలిటీల చట్టం ఎన్నో విధులు, బాధ్యతలను పురపాలక సంఘాలకు కల్పించింది. చట్ట ప్రకారం మున్సిపాలిటీలు నిర్వర్తించాల్సిన విధులు పదిహేనుకు పైగా ఉన్నాయి. వాటిని తుతూ మంత్రంగానే చేపడుతున్నారు. అవి మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, పారి శుద్ధ్యం,అంటువ్యాధుల నివారణ, అనాధ శవాలకు అంత్యక్రియలు, ఆహారపదార్థాల్లో కల్తీ నివారణ, రోడ్ల నిర్వహణ విద్యుచ్ఛక్తి సౌకర్యం, ముఖ్య గణాంకాల సేకరణ, మార్కెట్ల నిర్వహణ, నిర్మాణ వ్యవహారాలు, పన్నుల వసూళ్లు.
వీటన్నింటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించి ప్రజాభివృద్ధికి మున్సిపాలిటీలు దోహదప డాలి. మున్సిపల్‌ కౌన్సిల్లో సర్వసభ్య సమావేశాల మినిట్స్‌ పుస్తకాలను, పన్నుకట్టే ప్రతి పౌరుడూ ఎపుడైనా వెళ్లి పరిశీలించవచ్చు. ఆ సమావేశాల ఎజెండా తీర్మానాల ప్రకారమే ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని చట్టం నిర్దేశిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమల్లో కనిపిస్తున్నంత చురుకుదనం, పట్టణ ప్రాంతాల్లో కానరావడం లేదు. జన్మభూమి, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వంటి పథకాల అమలు తీరును ఇందుకు నిదర్శనాలుగా చెప్పాలి.
గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణజయంతి షహరిరోజ్‌గార్‌ యోజన అమలు తీరు మరో ప్రబల నిదర్శనం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం నిధులు ఇస్తాయి. ఈ పథకం కింద గతంలో అమలైన కొన్ని పథకాల్ని, కొత్తగా మరికొన్నింటిని ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఈ పథకానికి విడుదలైన నిధుల్నీ, వినియోగం తీరును ఒక్కసారి పరిశీలిస్తే మున్సిపాలిటీల పనితీరు ద్యోతక మవుతుంది.1997 మేనెలో కేంద్రం ఈ పథ కాన్ని ప్రారంభించింది. అప్పుడు మున్సిపాలిటీ లు,కార్పోరేషన్‌లకు కలిపి కోట్లు విడుదలచేస్తే కేవలం యాభైశాతం కోట్లనే ఖర్చుచేసేవారు.
స్వర్ణజయంతి కింద కేంద్రం వాటా నిధులు లక్షలాది రూపాయల చొప్పున విడుదలైనా ఒక్కపైసా కూడా ఖర్చు చేయని మున్సిపాలి టీలూ కొన్ని ఉండటం గమనార్హం. నిరుద్యోగం పట్టిపీడిస్తున్న ఈ ఆధునిక యుగంలో పట్టణ స్వయం ఉపాధిపథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీ లకిచ్చిన లక్షలాది రూపాయలు వృధాగా మూలుగుతున్నాయి.నిధుల వినియోగం చురుగ్గా లేకపోవడానికి పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం,బ్యాంకర్ల సహకారాలు అందకపోవడమేనని మున్సిపల్‌ పాలకవర్గాలు వాదిస్తున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలూ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి కారణం. స్వయంకృతాపరాధం కొంత ప్రభుత్వాల అశ్రద్ద మరికొంత ప్రధాన ఆదాయ వనరులపై పాలకవర్గాలు చిన్న చూపు చూస్తున్నాయి. తమకు కావాల్సిన నిధులన్నీ రాష్ట్రప్రభుత్వమే ఇవ్వాలన్న ధోరణితో చాలా మంది స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు.
దేశంలో పట్టణాభివృద్ధికి ఫైనాన్స్‌కమిషన్‌ ఇచ్చే కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తమకివ్వకుండా తమకిష్టమైన అభివృద్ధి పనులకు వెచ్చిస్తోందని పాలకవర్గాలు వాదిస్తున్నాయి. ‘ఎవరు చేసినా అభివృద్ధే కదా అని రాష్ట్ర ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకుంటోంది.

ఎం. నారాయణస్వామి