విద్యకు 6% పైగా నిధులు కేటాయించాలి

School Education
School Education

దేనికైనా ఒక పరిమితి ఉండాలి అంటారు పెద్దలు. ఆ పరిమితికి మించిపోతే ఏ వ్యవస్థ అయినా తప్పకుండా కుప్పకూలుతుంది. నేడు అలాంటి కుప్పకూలే స్థితిలో మన విద్యావ్యవస్థ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిని చక్కదిద్దాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. 1964లో వచ్చిన డి.ఎస్‌ కొఠారి కమిషన్‌ సూచనను నేటి ప్రభుత్వాలు పాటిస్తే అనగా స్థూలజాతీయ ఆదాయం (జిడిపి)లో ఆరుశాతంపైబడి నిధులను విద్యకు కేటాయిస్తే దానంతటదే ఈ దేశంలో విద్యావ్యవస్థ బలోపేతం కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడటంలో అర్థముంది.

ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఎన్నికల మేనిఫెస్టో ను రూపొందిస్తున్నప్పుడు పలువ్ఞరు ఆర్థిక, రాజకీయరంగ నిపుణులతో కమిటీ వేసి తయారు చేస్తారు. ప్రపంచీకరణలో భాగంగా నయా ఉదారవాద విధానాలు ఈ దేశంలోకి తలుపులు బార్లా తెరిచి వచ్చిన కార ణంగా ఆ ప్రపంచీకరణ ఫలితాల పట్ల సానుకూలంగా ఉన్నవర్గాలకు చెందిన నిపుణులను తప్పని సరిగా రాజకీయపార్టీల మేనిఫెస్టోల రూపకల్పనలో పాలుపంచు కునేటట్టు చేస్తాయి. అంటే నయా సానుభూతిపరులు చేతిలో తయారైన మేనిఫెస్టోలలో వివిధ పథకాల రూపకల్పన నిర్మాణం జరుగుతుందన్నమాట. ప్రజలకు ఉపయోగపడే కన్నా ప్రైవేట్‌, కార్పొరేట్‌ వర్గాలకే ఎక్కువ శాతం ఉపయోగపడేందుకు ఆయా పథకాలు తయారు కాబడతాయి. దీనిని బట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా త్వరలో ప్రవేశపెట్టబోయే ‘అమ్మఒడి పథకం కూడా కార్పొరేట్‌ వర్గాలకే ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. నేడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోయే అమ్మ ఒడి పథకం విధివిధానాల రూపకల్పన ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ప్రభుత్వం విద్యాహక్కుచట్టం 2009లో అధ్యాయం-4లో 12(సి) సెక్షన్‌ (2) ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల చదువ్ఞకు కేటాయించాల్సిందిగా ప్రకటించడమైంది. అయితే ఈ సీట్లను కేటాయించే పరిస్థితుల్లో కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లేవ్ఞ. ఎందు కంటే వారు వసూలు చేస్తున్న ఫీజులు భారీగా ఉండటంతో, ప్రభు త్వం ఇచ్చే డబ్బులకు వారికి చెల్లించే ఫీజుకు భారీ వ్యత్యాసం ఉన్న కారణంగా 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించలేక పోయాయి. అయితే ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఈ విషయమై ఈ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉన్నత న్యాయ స్థానానికి వెళ్లాయి. కానీ న్యాయస్థానం విద్యాహక్కు చట్టాన్ని ఏ సంస్థ అయినా ఈ దేశంలో తప్పకుండా పాటించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దానిలో భాగంగానే ఈ రోజు ఆయా సంస్థలు పేదవర్గాల పిల్లలను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. కాకపోతే తరగతుల నిర్వహణలో అంతరాలను ఏర్పరచి ఎ.బి.సి.డి అనే పేర్లు పెట్టి వివిధ తరగతులుగా విడగొట్టి ఈ 25 శాతం సీట్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించే లక్ష్యంతో బెస్ట్‌ ఎవైల్డ్‌ స్కూల్స్‌ పేరిట దిగువశ్రేణి తరగతుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా చదివించడం జరిగేది. దీనిలో భాగంగానే అమ్మఒడి పథకం ద్వారా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో నాణ్యతలేని విద్యను మూడవశ్రేణి, నాలుగశ్రేణి తరగతులను ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తూ, కార్పొ రేట్‌ విద్యను అందిస్తున్నామనే భ్రమలను పిల్లల తల్లిదండ్రులలో కల్పిస్తారు. ఆ భ్రమలకు లోనయి తల్లిదండ్రులు అమ్మఒడి పథకం కింద తప్పకుండా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 25 శాతం సీట్లను ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పిల్లలతో తమిళనాడు ప్రభుత్వం నింపడం వల్ల ఆ రాష్ట్రంలో పాఠశాల విద్య కుప్పకూలిందని తెలియచేయవచ్చు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం చేపట్టే పలు విద్యా సంస్కరణలు ఫలితంగా అచట ప్రభుత్వ విద్య బలోపేతం అయిందని గ్రహించాలి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా అందరం గమనించాల్సిందే. పేద, బలహీన, అణగారిన వర్గాలకు 25 శాతం సీట్లను కేటాయిస్తూ విద్యాహక్కు చట్టం పొందుపరిచిన దానిని అమలుపరిచే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు, మేధావి వర్గాలు ప్రభుత్వంపై ఉద్యమాలను తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల రాజధాని ప్రాంతంలో ఒక సంస్థ భారీ ర్యాలీ నిర్వహించింది. ఇదే మేధావివర్గం, పేద, అణ గారినవర్గాలకు నాణ్యమైన కార్పొరేట్‌ విద్యను ప్రభుత్వం అంది స్తుంటే ఉపాధ్యాయ సంఘాలు, సంబంధిత వర్గాలు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
అంటే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించవచ్చుకానీ పేద పిల్లలను చదివించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే తప్పనేటట్లు వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విద్య బలోపే తానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి? ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో ఏర్పడే అంతరాలను ఏవిధంగా రూపుమాపు తారు? అనే ప్రశ్నలు సాధారణంగా ఉపాధ్యాయవర్గాలలో ఉదయించడం మామూలే. ఇంకా గత ప్రభుత్వాలు రేషనలైజేషన్‌ పేరిట అనేక పాఠశాలలను ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరనే నెపంతో మూసివేశాయి. అలాి మూసివేయబడిన పాఠశాలను తెరుస్తామని ప్రస్తుత నూతన ప్రభుత్వం చెబుతున్నది.

ఇంకా పాఠశాలల్లో కనీస వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తామని కూడా ప్రభుత్వం చెబుతు న్నది. ఇలాంటి సమయాన ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలలో చదు వ్ఞతున్న పిల్లలకు నూతనంగా ప్రవేశపెట్టబోయే అమ్మఒడిపథకాన్ని వర్తింపచేస్తూపోతే ప్రభుత్వపాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారు? అసలే తగినంత మంది పిల్లలు లేక కునారిల్లిపో తున్న ప్రభుత్వపాఠశాలల్లో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టకపోతే ఉన్న కొద్దిమంది విద్యార్థులు ఖాళీ చేసి ప్రైవేట్‌ పాఠశాలలో విపరీతంగా చేరే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వపాఠ శాలల బలోపేతానికి ఏరకంగా ప్రభుత్వం ముందుకు వెళ్లుతుంది? ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు. జనవరి 26నుండి ప్రవేశ పెట్టబోయే ఈ అమ్మఒడి పథకానికి విధి విధానాల రూపకల్పన జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల ప్రతి విషయాన్ని మేధావివర్గం, ఉపాధ్యాయవర్గాలతో కూలంకుషంగా చర్చించి ప్రభుత్వం పథకరచన చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆలోచనతో జగన్‌ ప్రవేశపెట్టబోయే అమ్మఒడి పథకం సత్ఫలితాల ను ఇస్తుంది అనటంలో అతిశయోక్తిలేదు.

దేనికైనా ఒక పరిమితి ఉండాలి అంటారు పెద్దలు. ఆ పరిమితికి మించిపోతే ఏ వ్యవస్థ అయినా తప్పకుండా కుప్పకూలుతుంది. నేడు అలాంటి కుప్పకూలే స్థితిలో మన విద్యావ్యవస్థ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిని చక్కదిద్దాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిం చాలి. 1964లో వచ్చిన డి.ఎస్‌ కొఠారి కమిషన్‌ సూచనను నేటి ప్రభుత్వాలు పాటిస్తే అనగా స్థూలజాతీయ ఆదాయం (జిడిపి)లో ఆరుశాతంపైబడి నిధులను విద్యకు కేటాయిస్తే దానంతటదే ఈ దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతం కాగలదని విశ్లేషకులు అభిప్రాయడటంలో అర్థ ముంది. కామన్‌స్కూల్‌ విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెడితే తప్ప కుండా విద్యావ్యవస్థ బలోపేతం అవ్ఞతుందని చెప్పవచ్చు. నేడు విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అనేకసవాళ్లకు కామన్‌స్కూల్‌ విధాన మే పరిష్కారాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం సంశయం లేదు.

  • పిల్లా తిరుపతిరావు