కృత్రిమపక్వ ఫలాలు..ఆరోగ్యానికి హాని

Fruits

పం డ్లలో రసాయనాలు కలిపి కృత్రిమపద్ధతులలో పండించి అమ్మే పండ్ల వ్యాపారస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాద కారులని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానిం చింది. హైకోర్టు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం పండ్లను విక్రయించే మార్కెట్లలో విస్తృతంగా తని ఖీలు చేపట్టింది. ముఖ్యంగా మామిడి పండ్లని కాల్షియం కార్బైడ్‌ అనే హానికర రసాయనంతో పక్వానికి వచ్చేటట్లు చేస్తు న్నారని తనిఖీల్లో వెల్లడైంది. ఈ రసాయనం నీటితో చర్య జరిపితే ఎసిటిలిన్‌ ఉత్పత్తి అవ్ఞతుంది. ఈ హానికర రసాయ నంతో పండిన పండ్లను తింటే ప్రజలు తీవ్ర అనార్యోగం పాలవ్ఞతారు. వాంతులు, విరోచనాలతో బాధపడతారు. కడుపులో మంటగా అనిపిస్తుంది. కంటిచూపు కూడా మంద గిస్తుంది. క్యాన్సర్‌ కూడా రావచ్చు. చర్మం పొడిబారిపోతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. నాడీ వ్యవస్థ దెబ్బతిని క్రమంగా కాళ్లు, చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు అసౌకర్యానికి గురవ్ఞతారు. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం కాల్షియం కార్బైడ్‌ వినియోగాన్ని నిషేధించింది. ఈ రసాయనాన్నే కాకుండా ఇథిలిన్‌, ఇథిఫాన్‌ వంటి వాటినికూడా కాయలు పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంటారు. వీటిని కొద్ది మొత్తంలో ఉపయోగించడం వలన పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవ్ఞ. అయితే కొంతమంది వ్యాపారస్తుల మితి మీరిన స్వార్థం వలన, పండించే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వలన ఈ రసాయనాలను ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తుంటారు. ఫలితంగా పండ్లు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. మామిడిపంట్లలోనే కాకుండా బొప్పాయి, అరటి,ఆపిల్‌,సపోట, బత్తాయి వంటి కాయలు త్వరగా పక్వా నికి రావడానికి రసాయనాలను వాడుతున్నారు. కృత్రిమపద్ధతి లో పండించిన పండ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని ప్రాం తాల్లో పండ్లను పక్వానికి తీసుకురావడానికి ఆక్సిటోసిన్‌, చైనా పౌడర్‌ వంటివి కూడా వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నా యి. సీజన్‌ముందు కానీ, సీజన్‌ తర్వాత కానీ లభించేపండ్లను కొనకుండా ఉంటే మంచిది. దురదృష్టవశాత్తు రైతులు తాము పండించిన కూరగా యాలను కానీ, కాయలను కానీ భద్రపరు చుకొని అమ్మేందుకు వీలుగా తగినన్ని గిడ్డంగులులేవ్ఞ. ప్రభు త్వాలు పెద్దసంఖ్యలో గిడ్డంగులు నిర్మించి రైతులకుఅందు బాటులో ఉంచాలి. దళారుల ప్రమేయాన్ని నియంత్రించాలి. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు, ఆదరణ లభిస్తుంది. అయితే వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవ్ఞ. ప్రభుత్వమే సేంద్రియ వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయతను పరిశీలించి రైతులను ప్రోత్సహించాలి.

  • యం.రాంప్రదీప్‌