అందరి నోట ‘ఆన్‌లైన్‌’ మాట

పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే బోధన

Online Education
Online Education

మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో పిల్లల విద్యాభ్యాసం ఆయా ప్రభుత్వాల ప్రణాళికలకు అనుగుణంగా కేలండర్‌ రూపొందించి విద్య సముపార్జనకు మార్గాలు ఏర్పాటుకు సుగమం చేస్తాయి.

సరిగ్గా విద్యాసంవత్సరం ఆదిలోనే కరోనా పుణ్యమా అని అనుకున్న విధంగా ముందుకు సాగలేదు.

ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రానికి తగినట్టుగా జరగాల్సిన పరీక్షలు, సెట్స్‌ నిర్వహణకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడే అన్ని చోట్ల ఆన్‌లైన్‌కు అందరూ శ్రీకారం చుట్టారు.

మున్ముందు తుది ఫలితాలు మాటెలా ఉన్నా పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఆన్‌లైన్‌పై అవగాహన అంతంతే.

అయినా తమ పిల్లల భవిష్యత్‌ కోసం వారి అవసరాలు తీర్చాలన్న తపనతో ‘ఊ కొట్టారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలో ప్రాథమిక దశలో ఈ ఆన్‌లైన్‌ బోధన సాగిపోతోంది.

ఆన్‌లైన్‌, ఆన్‌లైన్‌ నడు స్తున్న చరిత్రలో ఎక్కడ చూసినా ఈ పదబంధమే ప్రతిధ్వని స్తోంది. విశ్వవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాలో అన్ని రంగాలతోపాటు కీలకమైన విద్యారంగం కూడా చిక్కుకుంది.

ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్‌ల్లో పరీక్షలు, ఆ పిమ్మట ప్రవేశ పరీ క్షలు, ఉన్నత చదువ్ఞలకు ప్రణాళికలతో తల్లిదండ్రులు ఆయత్త మవటం అందరికీ తెలిసిందే.

సరిగ్గా ఇదే సమయాన లాక్‌డౌన్‌ రంగ ప్రవేశం చేయడంతో పరీక్షలు, ఉన్నత చదువుల సెట్స్‌ చిన్నాభిన్నామయ్యాయి.

నెలల తరబడి వేచి ఉండి, తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్న వారి ఆశలు ఆడియాశలయ్యా యి.

దేశవ్యాప్తంగా పలు దేశాల్లోనూ విద్యాసంవత్సరాలు గీటు దాటాయి. ఇదే తరుణాన ఆన్‌లైన్‌ చదువ్ఞలు తెరపైకొచ్చాయి. అసలు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఇదేదో ప్రత్యామ్నాయం కాలిడింది.

కరోనా నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ పాఠాలు మేలు చేస్తాయంటూ రకరకాల విశ్లేషణలు వెలుగుచూశాయి.

గతా నికి భిన్నంగా ప్రస్తుతం ఏనోట విన్నా ఆన్‌లైన్‌, ఆన్‌లైన్‌ గుస గుసలు మొదలయ్యాయి. ఈ కొత్త తరహా విద్యాబోధన అనివార్య మేనంటూ కొందరు విశ్లేషిస్తుండగా మనకున్న చుట్టూ ఉన్న పరిస్థి తుల్లో అనర్థాలు ఉన్నాయి.

మనమింకా అంతదాకా ఎదగలేదని మరికొందరు ఉటంకిస్తున్నారు.మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో పిల్లల విద్యాభ్యాసం ఆయా ప్రభుత్వాల ప్రణాళికలకు అనుగుణంగా కేలండర్‌ రూపొందించి విద్య సముపార్జనకు మార్గాలు ఏర్పాటుకు సుగమం చేస్తాయి.

సరిగ్గా విద్యాసంవత్సరం ఆదిలోనే కరోనా పుణ్యమా అని అనుకున్న విధంగా ముందుకు సాగలేదు.

ఆరోగ్య మే మహా భాగ్యమనే సూత్రానికి తగినట్టుగా జరగాల్సిన పరీక్షలు, సెట్స్‌ నిర్వహణకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడే అన్ని చోట్ల ఆన్‌లైన్‌ కు అందరూ శ్రీకారం చుట్టారు.

మున్ముందు తుది ఫలితాలు మాటెలా ఉన్నా పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఆన్‌లైన్‌పై అవగాహన అంతంతే.

అయినా తమ పిల్లల భవిష్యత్‌ కోసం వారి అవసరాలు తీర్చాలన్న తపనతో ‘ఊ కొట్టారు. పాఠశాలలు, కళా శాలల స్థాయిలో ప్రాథమిక దశలో ఈ ఆన్‌లైన్‌ బోధన సాగిపోతోంది.

కష్టమైనా, నష్టమైనా ఈ క్లాసులకు మొగ్గుచూపుతున్నారు.

ఆర్థికంగా ఎదగాలని ఆశించే వారంతా ఉన్నత విద్యకోసం స్తోమత ఉన్నా లేకున్నా అప్పులు చేసి మరీ అమెరికా బాటపడతారు.

విద్యతోపాటు ఉపాధి, డబ్బు సంపాదనకు మనదేశంలో కన్నా అధికంగా అవకాశాలున్న దేశాలకు విద్యార్థులు తరలిపోవడం రివాజు.

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, జర్మనీ, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో ఉన్నత చదువులకు మన విద్యార్థులు ప్రాధాన్య మిస్తున్నారు.

ఆయా దేశాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగాల్లో ఇమిడి పోయేందుకు వీరు విదేశీ వీసాల బాటపడుతుండటం తెలిసిందే. గత 10,15ఏళ్లలో ఈ వీసాల ప్రక్రియ గ్రామీణులకు సైతం సుపరిచతమైంది.

ముఖ్యంగా అమెరికా వీసాల కోసం అభ్యర్థులు వెంపర్లాడటం మరీ ఎక్కువైంది. ఈ ఏడాది అమెరికాలో విద్యార్జ నకు మనవాళ్లు సిద్ధమవ్ఞతున్న సమయానే కరోనా విరుచుకు పడింది.

అదీ అమెరికా లాంటి అగ్రరాజ్యంపై కోరలు చాచింది. ఆర్థిక సంక్షోభం అక్కడ వెక్కిరించింది.

సహజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలుత వీసాల జారీపై ఆంక్షలకు పూనుకున్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ తదితర అంశాలపై ఈ ప్రభావం అధికంగా ఉంది.

ట్రంప్‌ విసిరిన పంజా కు మనోళ్ల డాలర్‌ డ్రీమ్స్‌ కొండెక్కాయి. కల చెదిరింది. కథ మారింది చందాన విద్యకు ఆసెగ తగిలింది.

ఎన్నికల వ్యూహమో, ఆర్థిక ఒడిదుడుకుల వల్లనోగానీ వీసాల చుట్టూ ఆంక్షల తీగ అల్లు కున్నాయి.

ఇదిలాఉండగానే పుండు మీద కారం చల్లిన చందాన మొదట ఆన్‌లైన్‌ చదువులపై అమెరికా నియంత్రణలు ప్రకటిం చింది.

ఆన్‌లైన్‌ క్లాసులు అయితే అమెరికాలో ఉండొద్దంటూ విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ హుకుం జారీచేశారు. తొలుత వలస దారుల పొట్టకొట్టిన ఆయన తాజాగా విదేశీవిద్యార్థులే లక్ష్యంగా చేసుకు న్నారు.

కరోనా దెబ్బకు కకావికలైన అమెరికా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సిద్ధం అవ్ఞతున్నాయి.

ఇదే తడవుగా కరోనా విజృంభిస్తున్నందున వెళ్తే భౌతికంగా క్లాసులకెళ్లండి లేదంటే అమెరికాను విడిచి వెళ్లాలంటూ ట్రంప్‌ హూంకరించారు.

తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ఒప్పుకున్నారు.

వచ్చే ఏడాదికి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా ఇవ్వబోమని అమెరికా యంత్రాంగం ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

తర్వాత వీసారద్దుపై సడలిం పులు చేస్తామని ప్రకటించింది. గణాంకాల పరంగా చూస్తే 2019 లో 7.5లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటు న్నారు.

ఇందులో 2.1 లక్షల మంది అమెరికాలో, 1.24 లక్షల మంది కెనడాలో, ఆస్ట్రేలియాలో 87వేల మంది,చైనాలో 18వేల మంది,బ్రిటన్‌లో 16వేల మంది మన విద్యార్థులున్నారు.

ప్రపం చంలోనే స్టూడెంట్‌ వీసాల్లో అయిదోస్థానంలో మనం హైదరాబాద్‌ కాన్సులేట్‌నుంచి మంజూర వ్ఞతున్నాయంటే ఆశ్చర్యకరమే.

అందు లోనూ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, రాయలసీమ నుంచే అత్యధికంగా విద్యార్థులుండటం గమనార్హం.

ఏటా 20వేల మంది మనవాళ్లు బయటకు వెళ్తున్నట్లు ఓ అంచనా. వివిధ కోర్సులు, ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా ఉంది.

అలాగే ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారి పరిస్థితిపై ఆన్‌లైన్‌ఆంక్షలు దెబ్బతీసే అవకాశ ముందని నిపుణులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ తరగ తుల నిర్వహణపై కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టత నిచ్చింది. కరోనా కారణంగా ఈ నెల 31 దాకా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరవరాదని పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్‌ తరగతులను ప్రోత్స హించాలని మానవవనరులశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.

మరోవైపు కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం కొనసాగింపుపై నిర్వహించిన ఓ సర్వేలో జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలు తెరవాలనే అభిప్రాయాన్ని అత్యధికులు వ్యక్తంచేశారు. పాఠశాలలు తెరవాలని 97శాతం మంది,

ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించాలని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వ హణ ఉపయోగకరమని మూడుశాతం, ఉపయోగ కరం కాదని 67 శాతం, పాక్షిక ఉపయోగమని 20 శాతం, తెలియదని 10 శాతం మంది తెలిపారు.

ఆన్‌లైన్‌ తరగతులు అర్థమవ్ఞతున్నాయని రెండు శాతంమంది, కొంత మేర అర్థమవ్ఞతున్నాయని 26 శాతం, అర్థం కావడంలేదని 72శాతం మంది పేర్కొన్నారు.

విద్యాసంవ త్సరంలో క్యాలెండర్‌కు అనుగుణంగా అడ్డంకులు తొలగిపోవాలని సకల జనులు కోరుకుంటున్నారు.

విద్యాయజ్ఞం సఫలీకృతం కావా లని సాఫీగా సాగిపోవాలన్నదే మనందరి సంకల్పం.

– చెన్నుపాటి రామారావు, సీనియర్‌ జర్నలిస్టు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/