నేతలకు చుక్కలు చూపిస్తున్న ఇడి

Enforcement Directorate
Enforcement Directorate

ఎన్నికల ప్రకటన వెలు వడగానే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, నాయకులు ఆర్భాటం చేయడం సహజం. కానీ దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) ఈసారి ఎన్నికల్లో కేంద్ర బిందువ్ఞగా మారింది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపైదాడులకు పాల్పడుతూ వారికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా కేంద్రంలోని బిజెపి కుట్రగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే అవినీతిపరులను వదిలేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. వెరసి దేశంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార, విపక్ష విమర్శలు, ఆరోపణలకు ఈడి ప్రధాన కేంద్రంగా మారింది.

దీంతో తమపై రాజకీయ కక్షసాధింపు కోసమే కేంద్రం ఈడి అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోందని విపక్ష పార్టీల సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం చేతిలో ఈడి కీలుబొమ్మగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. యూపిఏ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల మీదికి ఉసిగొల్పి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్న దని నాటి ప్రధానపక్షం బిజెపి ప్రతిరోజూ గగ్గోలు పెడుతుండేది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తమ అధిష్టానాన్ని ధిక్కరిం చిన నాయకుల మీద సిబిఐ కేసులు పెట్టించి వేధించిందన డంలో సందేహం లేదు. వారిలో ప్రధాన బాధితుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. జగన్‌కు బెయిల్‌ కూడా రాకుండా 16 నెలలు అడ్డుకున్నది సిబిఐ. అయితే నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన సురేష్‌ కల్మాడీ, కనిమొళి లాంటి తమ పార్టీ, భాగస్వామ్యం పార్టీల నేతలను కూడా యూపిఏ జైలుకు పంపించింది.

అలాగే యూపిఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం రాజకీయ ప్రత్యర్థుల మీద దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వేధించారు. నేటి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా కూడా చిదంబరం బాధితులే. అందుకే పలుమార్లు సిబిఐ కేంద్రం పంజరంలోని చిలుక అని అభివర్ణిం చింది సుప్రీంకోర్టు. అనేకమార్లు సిబిఐ పనితీరు మీద ఆక్షిపణలు వ్యక్తం చేసినా, దాని పనితనంలో ఏ మాత్రం మార్పులేదు. యూపిఏ ప్రభుత్వం అధికారం కోల్పోయాక అధికారంలోకి వచ్చిన బిజెపి అయినా సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను దారిలో పెడుతుందేమో అని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. సిబిఐ ఆధిపత్య ధోరణులు ప్రబలి ఉన్నతస్థాయిలో అధికారులే ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకొని అభాసుపాలయ్యారు.

చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఈడి ధాటికి బాధితుడిగా మారిన మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి శరద్‌పవార్‌. ఈయన మీద కేసులు ఉన్నట్లు, కుంభకోణాలున్నట్లు మొన్నటి దాకా కూడా చాలా మందికి తెలియదు. మహారాష్ట్రలో రాబోయే నెలలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ శరద్‌పవార్‌ ఎన్సీపి, కాంగ్రెస్‌ జతకడితే విజయావకాశాలున్నా యి. బిజెపి తిరిగి గెలిచే పరిస్థితి లేదు. ఈసారి మహారాష్ట్రలో బిజెపి గెలవాలంటే పుల్వామా దాడి తరహా ఘటన జరగాలని ప్రకటించారు శరద్‌పవార్‌. 24 గంటలు కూడా గడవకముండే శరద్‌పవార్‌ అన్న కుమారుడు అజిత్‌పవార్‌ మీద ఈడి కేసు నమోదైంది. అదేదో చాలా పాత కుంభకోణం అట. అప్పుడేమైం దో తెలియదు.

ఎన్నికలు రాబోతుండగా ఆ కేసును తెరిచారు. మోడీ ఎత్తుగడను పసిగట్టిన శరద్‌పవార్‌ నేను అరెస్ట్‌ కావడానికి సిద్ధమని ప్రకటించారు. ఈడిని ఉసిగొల్పి తనను వేధిస్తున్నారని శరద్‌పవార్‌ బహిరంగంగా చెప్పడంతో మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.అయితే ఈ కేసు కొనసాగుతుందా లేక శరద్‌ పవార్‌ రాజీకొస్తే వెనక్కిపోతుందా అనేది కొన్నాళ్లు వేచిచూస్తే కానీ తెలియదు.రానురాను ప్రభుత్వాల రాజకీయస్వార్థం కారణం గా ప్రతీకార రాజకీయాల కారణంగా అత్యున్నత దర్యాప్తు సంస్థలపట్ల ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుండటం మాత్రం ఆందో ళన కలిగించే పరిణామం అని చెప్పక తప్పదు.

ఈడి దాడులతో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, కర్ణాటక ట్రిబుల్‌ షూటర్‌ డికె శివకుమార్‌లు జైలులో ఉండగా తాజాగా మహారాష్ట్ర మాజీ సిఎం, ఎన్సీపి నేత శరద్‌పవార్‌పై ఈడి ఉచ్చు బిగుసుకుంది. ఎన్నికలనుదృష్టిలో ఉంచుకుని పవార్‌పై ఇలాంటితప్పుడు కేసు లు పెడుతూ వేధిస్తున్నారని విపక్ష పార్టీలు కేంద్రంపై మండి పడుతున్నాయి.మరోవైపు కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉపఎన్నికలు బిజెపి,కాంగ్రెస్‌,జెడిఎస్‌కు కఠిన పరీక్ష గామారాయి.ఈ ఎన్నికల్లో నెగ్గడం బిజెపికి ఎంతోఅవసరం.

  • ప్రభు పులవర్తి

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/