పెనుముప్పుగా పరిణమిస్తున్న కల్తీ పెనుభూతం

Duplicate Oil tiins
Duplicate Oil tiins

పెనుముప్పుగా పరిణమిస్తున్న కల్తీ పెనుభూతం

దేశంలో విపరీతంగా ప్రబలుతున్న పాశ్చాత్య సం స్కృతి ప్రభావం వలన ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. వీటితోపాటు ఆహారపదార్థాల కల్తీ కూడా అంతే వేగంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సాధి కార సంస్థ చేసిన ఒక తాజా సర్వేలో ఎన్నో విభ్రాంతకర అంశా లు వెలుగులోకి వచ్చాయి. 2009-10లో 13 శాతంగా ఉన్న ఆహార కల్తీ 2017-18 నాటికి 26 శాతానికి పెరిగింది. విశృం ఖలంగా జరుగుతున్న ఆహార కల్తీ కారణంగా ఏటా మూడు లక్షల మంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతుండగా నాలు గువేల కోట్ల ఆదాయాన్ని కల్తీదారులు సమకూర్చుకుం టున్నారు.

అత్యధికంగా పాలలో 68.4 శాతం, వంటనూనె 64 శాతం, ఆహారదినుసులు అంటే ఉప్పు, పప్పు, బియ్యం, వెన్నె, కారం, పసుపు, మసాలా దినుసులు మొదలైనవి 51.3 శాతం, కల్తీ అవ్ఞతున్నట్లుగా సదరు నివేదిక తేల్చి చెప్పింది. దేశంలో చెలా మణి అవ్ఞతున్న మందులలో 41 శాతం, మినరల్‌ వాటర్‌లో 37 శాతం ప్రమాణాలకు తక్కువగా కల్తీకి గురవ్ఞతున్నందున ఉన్న రోగాలు తగ్గకపోగా కల్తీ ఆహారం, పానీయాలు సేవిం చడం వలన కొత్త వ్యాధులు పుట్టుకువస్తున్నాయి. పేగు, జీర్ణా శయం, నోటిక్యాన్సర్లు, మూత్రపిండాల వ్యాధులు, పక్షవాతం, లివర్‌ వ్యాధులు వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని సదరు నివేదిక హెచ్చరికపట్ల ప్రభుత్వం అప్రమత్తం కావాలి.

ప్రజలకు అవగొహన లేకపోవడం, తప్పని పరిస్థితులలో కల్తీ చేసిన విషాహారం తీసుకుంటున్నారని, నామమాత్రపు తనిఖీలు, అధికారులు, తనిఖీ వ్యవస్థల నిర్లిప్త వైఖరి కారణంగా ప్రజారోగ్యం గాలిలో దీపం చందాన అయిం దని 2016లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కల్తీని నిరోధించేందుకు భారతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ పనితీరు, నియంత్రణా చర్యలు దారుణంగా ఉన్నాయని కాగ్‌ 2017 జులై నెల రిపోర్టులో అభిశంసించినా ప్రభుత్వా లు, నియంత్రణా సంస్థ వైఖరిలో మార్పురాలేదు.

గత మేలో కల్తీ పాలు తాగి ఉత్తరప్రదేశ్‌లో 30 మంది విద్యార్థులు, సైనైడ్‌ తో మగ్గించిన మామిడిపళ్లు తిని బీహార్‌లో 70 మంది ఆస్పత్రి పాలయ్యాక ఇదే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధిత రాష్ట్రాలను నిల దీసినా ఫలితం శూన్యం. రక్తాన్ని సైతం కల్తీ చేసి ఆస్పత్రులకు విక్రయిస్తున్న దుర్మార్గులను ఉపే క్షించకుండా కఠిన శిక్షలు విధించాలని, రాష్ట్రాలలో ఉన్న ఆహార ప్రయోగశాలల సంఖ్య పెంచి సమగ్ర ఆహార తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, అన్ని షాపులు, హోటళ్లకు తిండి పదార్థాల నాణ్యత ఆధారంగా రేటింగులు ఇవ్వాలి.

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలను ముమ్మరం చేసి అక్రమార్కులకు కఠిన శిక్షలు విధిం చేలా ఆహార కల్తీ నిరో ధక చట్టానికి సవరణలు చేయాలని కాగ్‌ సూచించినా ఇంత వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజారోగ్యం పై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తేటతేల్లం చేస్తోంది. అయితే గత మార్చిలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులోవాడి వేడిగా చర్చ జరిగి పొలం నుండి పళ్లెంలోకి వచ్చే క్రమంలో ఆహార పదార్థాల నాణ్యతను కాపాడేందుకుఏడు అంశాల కార్యా చరణను ఆమోదించడం శుభపరిణామం.

అయితే ఈ విధివి ధా నాలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడే పాలకుల చిత్తశుద్ధి బయటపడుతుంది. ఇటీవల హైదరా బాద్‌లో జరిగిన విజిలెన్స్‌ దాడులలో గత 15 సంవత్సరా లుగా మలేసియా ఇండోనేషియా దేశాల నుండి వేరుశనగ నూనెను దిగుమతి చేసి హానికర రసాయనాలతో కల్తీ చేసి ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల పేరిట మార్కెటింగ్‌ చేస్తూ వందల కోట్లను ఆర్జించిన ఘరానా మోసగాడిని కఠినంగా శిక్షించడంలో ప్రస్తుత చట్టాలలోని లొసుగుల కారణంగా న్యాయవ్యవస్థ చేతులు ఎత్తేయడం ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపిస్తోంది.

అధికారు అండదండలు, అక్రమార్కుల చేయూత లేకుండా ఇంతపెద్ద నెట్‌వర్క్‌ నిర్వహించడం ఎలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానం లేదు. పరిస్థితి శృతి మించకముందే కల్తీ నుండి భారత్‌ను విముక్తి కలిగించాలి.

– సి.ప్రతాప్‌