మాదకద్రవ్యాల పోరుపై ఆరాటమే కానీ పోరాటమేది?

ఒక్కమాట
(ప్రతి శనివారం)

Drugs
Drugs

కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న మార్పులు, అవసరాలు ఎదుర్కొని పరిష్కారం వైపు ఎలా అడుగులు వేయాలని రాజనీతిజ్ఞులు ఆలోచిస్తుంటే పరిష్కారం వైపు చూస్తూనే రాజకీయపరంగా ప్రయోజనం ఎలా పొందాలని రాజకీయనాయకులు తపన పడుతుంటారు. అందుకు అనుగుణంగానే వారు చర్యలు చేపడుతుంటారు. ఇదేదో ఇప్పటికిప్పుడు ప్రారంభమైందని చెప్పడం లేదు. ఏనాటి నుంచో ఉన్నా, తమ వ్యూహాలు, అభిప్రాయాలను అప్పటి రాజకీయనాయకులు తమ అంతరంగంలోనే దాచుకొని విశాలహృదయంతో సమాజంలోని సమస్యల పరిష్కారంవైపు అడుగులిడుతున్నట్లు కన్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మారిపోతున్నాయి. ఎప్పుడూ అధికారపక్షంలో ఉన్నవారిని ఇరుకునపెట్టేందుకు, ఇబ్బంది కలిగించేందుకు ప్రతిపక్షనేతలు ప్రయత్నిస్తుంటే అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్ని జారవిడవడం లేదు. తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అంతకంతకు పెరిగి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తుపదార్థాల వాడకం, వినియోగం ఆందోళన కలిగిస్తున్నది.

రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల గూర్చి ఆలోచిస్తే రాజనీతిజ్ఞులు భావితరాల గురించి మదనపడుతున్నారని పెద్దలు అంటారు. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న మార్పులు, అవసరాలు ఎదుర్కొని పరిష్కారం వైపు ఎలా అడుగులు వేయాలని రాజనీతిజ్ఞులు ఆలోచిస్తుంటే పరిష్కారం వైపు చూస్తూనే రాజకీయపరంగా ప్రయోజనం ఎలా పొందాలని రాజకీయ నాయకులు తపన పడుతుంటారు. అందుకు అనుగుణంగానే వారు చర్యలు చేపడుతుంటారు. ఇదేదో ఇప్పటికిప్పుడు ప్రారంభమైందని చెప్పడం లేదు. ఏనాటి నుంచో ఉన్నా, తమ వ్యూహాలు, అభిప్రాయాలను అప్పటి రాజకీయ నాయకులు తమ అంతరంగంలోనే దాచుకొని విశాలహృదయంతో సమాజంలో సమస్యల పరిష్కారంవైపు అడుగులిడుతున్నట్లు కన్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మారిపోతున్నాయి. ఎప్పుడూ అధికారపక్షంలో ఉన్నవారినే ఇరుకునపెట్టేందుకు, ఇబ్బంది కలిగించేందుకు ప్రతిపక్షనేతలు ప్రయత్నిస్తుంటే అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్ని జారవిడవడం లేదు. తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అంతకంతకు పెరిగి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తుపదార్థాల వాడకం, వినియోగం ఆందోళన కలిగిస్తున్నది. ఇదేదో తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమో, అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభంకాలేదు. ఈ మహ్మమారి దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చాపకిందనీరులా తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూపోతున్నది. ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపుతున్నారు. అయినా ఇదేమీ ఆగడం లేదు. విస్తరిస్తూనే ఉన్నది. మెక్సికో కేంద్రంగా రకరకాల మార్గాల్లో అన్నిదేశాల్లోకి ప్రవేశిస్తున్నది. ఏటా కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ లాంటి మాదకద్రవ్యాలు ఏడెనిమిది వందలటన్నుల వరకు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవ్ఞతున్నట్లు అనధికార అంచనాలను బట్టి తెలుస్తున్నది. లక్షలాది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. గత పదేళ్లుగా ఎన్నోసార్లు కోట్లాది రూపాయల విలువైన ఈ మాదకద్రవ్యాలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఇందులో కొందరి పెద్దల పేర్లు కూడా బయటకువచ్చాయి. గతంలో ఒకసారి పోలీసు కమిషనర్‌ ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి కొందరిని అరెస్టు చేశామని, మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేశామని ప్రకటించారు. దర్యాప్తు జరుగుతుంది కనుక పేర్లు వెల్లడించలేమని, ఆధారాలు లభిస్తే అన్ని వివరాలు ప్రకటిస్తామని, ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. అప్పట్లో చాలా మంది రాజకీయనాయకుల పుత్రరత్నాల పేర్లు ప్రచారం జరిగాయి. ఇక అప్పుడప్పుడు నైజీరియన్లు పట్టుబడుతున్నారు. గతవారంలో కూడా లక్షలాది విలువైన కొకైన్‌తో పాటు సరఫరా చేస్తున్న నైజీరియన్లు పట్టుబడ్డారు. జైళ్ల నుంచి తిరిగి వచ్చినా అదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. పోలీసులు, చట్టాలు, జైళ్లన్నా ఈ వ్యాపారులకు భయభక్తులు లేవనే విషయం మళ్లీమళ్లీ పట్టు బడుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చిన డ్రగ్స్‌కుంభకోణంలో పలువ్ఞరు సినీప్రముఖుల పేర్లు వెలుగుచూశాయి. వారిని ఏకంగా విచారణకు కూడా పిలిపించారు. విచారణకు పిలిపించేటప్పుడు కూడా పెద్దఎత్తున ప్రచారం చేశారు. కొందరినైతే దోషులన్నట్లుగా సమాజానికి చూపించారు. ఈ వ్యాపారంలో ఊహించని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఏడాది కూడా అటు విశాఖపట్నం లోనూ, గుంటూరు, తిరుపతి,అనంతపురం జిల్లా కేంద్రంగా భారీ ఎత్తున రవాణా అవ్ఞతున్నట్లు సమాచారం. మొత్తంమీద ఈ మాదకద్రవ్యాల విషవలయంలో బలైపోతున్నది యువతీ యువకులే. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువ్ఞతున్న బాలబాలి కలను కూడా ఒక వ్యూహం ప్రకారం ఎరవేసి ఈ మత్తులోకి దించుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించుకో వచ్చు. ఈ మత్తుకు అలవాటుపడిన పిల్లలను మాన్పించేందుకు ఆ తల్లిదండ్రులు పడుతున్న వ్యయప్రయాసాలు అన్నీఇన్నీ కావ్ఞ. బయటకు చెప్పుకోలేరు. అలాని మాన్పించే ప్రయత్నం కోసం డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్లకుండా ఉండలేరు. ఎంతటి మానసిక వేదనకు గురవ్ఞతున్నారో మాటల్లో చెప్పలేం. వాస్తవంగా చూస్తే ఈ పరిస్థితి ఇంత తీవ్రం కావడానికి పొగమంచులా విస్తరించ డానికి కారకులు ఎవరు? కారణాలు ఏమిటి?ముందుగా ఇందులో తప్పుపట్టాల్సింది, నిందించాల్సింది పాలకులనే. రెండు,మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మాదకద్రవ్యాల వ్యాపారం విస్తరిస్తుంటే నిఘా విభాగం అధికారులు ఏం చేసినట్టు? ఇటీవల ఈ భారమంతా తమదే అన్నట్లు నెత్తిన వేసుకున్న ఎక్సైజ్‌ శాఖ ఇంతకాలం ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలే. ఎక్సైజ్‌శాఖను ప్రక్షాళన చేసేందుకు బదిలీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. కానీ ఆ తర్వాత ఏమైందోఏమోకానీ ఆ చర్యలకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు కన్పిస్తుంది. ఫలితంగా ఈ మాదకద్రవ్యాల వ్యాపారం ఊహకందకుండా పెరిగిపోతున్నది. ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర పట్టుబడుతూనే ఉన్నాయి. రవాణా అవ్ఞతున్న దాంట్లో పదోవంతు కూడా పట్టుబడటం లేదనేది కాదనలేని వాస్తవం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెప్పించుకోగలిగితే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నాటుసారా కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతుంది. అసలు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న వాటిలో మత్తుపదార్థాలు ఒక ఎత్తు అయితే మద్యపానం, దానికి మించినస్థాయిలో ఉంది. మద్యపానాన్ని ఆదాయం కోసం పాలకులే పెంచిపోషించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మాదకద్రవ్యాలు మద్యపానం వల్ల కలుగుతున్న అనర్థాలు, అరిష్టం అంతా ఇంతాకాదు. లక్షలాది కుటుంబాలు చితికిపోతున్నాయి. అనేక నేరాలకు, ప్రమాదాలకు ఈ రెండే కారణాలవ్ఞతున్నాయనేది అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. నాటి నిర్భయ కేసు నుంచి నిన్నమొన్న నలుగురి అమాయక యువతులను దారుణంగా హత్యచేసిన బొమ్మలరామారం కేసులో నిందితుడు ఇటు మద్యం, మాదకద్రవ్యాల మత్తులోనే ఈ సంఘ టనలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఇవే కాదు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జరుగుతున్న రోడ్డు ప్రమా దాల్లో 80 శాతానికిపైగా వాహనచోదకులు మద్యం, మాదకద్రవ్యా ల మత్తులో ఉన్నారనేది పోలీసుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒకపక్క మద్యం తాగమని ప్రోత్సహిస్తూ మరొకపక్క మద్యం తాగి వాహనాన్ని నడిపిస్తే శిక్షిస్తామంటూ పాలకుల ద్వంద్వ వైఖరి పట్ల కూడా విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడినప్పుడు అవినీతి, అక్రమాలు జరగకుండా మాదకద్రవ్యాల వ్యాపారం, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ ఆ దిశగా త్రికరణ శుద్ధిగా పోరాటం చేయడం లేదనేది విస్తరిస్తున్న ఈ వ్యాపారాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పొచ్చు. ఇక యువతరాన్ని పట్టిపీడిస్తున్న మరొక రక్కసి ధూమపానం. ధూమపానాన్ని నిషేధించేందుకు చట్టాలు చేశారు. కానీ అమలును మరిచిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 కోట్ల మందికిపైగా ధూమపానంతో మునిగితేలుతున్నారు. బీడీలు, చుట్టలు, సిగరెట్లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతున్నది. పదిహేనేళ్ల వయస్సు నుంచే ఇది ఆరంభమవ్ఞతుండటం ఆందోళన కలిగించే అంశం. ఈ ధూమపానంలో వాడే సిగరెట్లలో మాదకద్రవ్యాలు నింపుతున్నారు. ఎన్నోసార్లు పట్టుబడ్డారు. సిగరెట్‌ పొగలో నాలుగువేల ఎనిమిదివందలకుపైగా ప్రమాదకర విషవాయువ్ఞలున్నట్లు గతంలో న్యూ ఇండియన్‌ మెడిసిన్‌ జనరల్‌ అధ్యయనంలో వెల్లడయింది. ధూమపానం నిషేధ చట్టం ఒక అపహాస్యంగా మారిపోయింది. పొగాకు సాగు, బీడీ ఆకుల సేకరణలో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి ప్రత్యామ్నాయం చూపెట్టకుండా నిషేధించడంతో ఈ చట్టం నీరుగారిపోయిందనే చెప్పొచ్చు. మానవ జీవనంతో ఆటలాడుకుంటున్న ఈ మాదకద్రవ్యాలను నిరోధించే విషయంలో మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాల్సిన తరుణమిది. ఇందులో ఏమాత్రం జాప్యం చేసినా ఈ జాడ్యం యువతపై తీవ్ర ప్రభావం చూపి, నేర ప్రవృత్తి పెరిగి, అరాచకం ప్రబలే ప్రమాదముందన్న విషయం పాలకులు ఎంత తొందరగా గ్రహిస్తే సమాజానికి అంత మేలు. అంతేకాదు వీటిని నిరోధించే విషయంలో బాధ్యతంతా పాలకులపై పెట్టకుండా స్వచ్ఛందసంస్థలు, ప్రజలు, రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయమిది.

  • దామెర్ల సాయిబాబ