మాదకద్రవ్యాల మత్తులో యువత చిత్తుచిత్తు

DRUGS
DRUGS

మాదకద్రవ్యాల మత్తులో యువత చిత్తుచిత్తు

మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలి గించడమేకాక, నైతిక విలు వలను దిగజారుస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూన్‌ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహి స్తుంటారు. డిసెంబర్‌7, 1987 లో తీర్మానం 42/112 నాటికి జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 26ను డ్రగ్స్‌ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించాల ని నిర్ణయించుకుంది. హెరాయిన్‌, స్పీడ్‌, ఎక్‌స్టసీ, కొకైన్‌, మారిజువానా, కెట్టమైన్‌, గామా హైడ్రాక్సీబుటెరోటో తదితర మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవి.

ప్రపంచంలో 15ఏళ్ల వయస్సునుండి 70 ఏళ్ల వయస్సుగల వారిలో 30 కోట్ల మంది గత నాలుగు సంవత్సరాల నుండి ఒక్కసారైనా ఏదో ఒక మాదకద్రవ్యాన్ని ఉపయోగించినవారేనన్నది ఐక్య రాజ్యసమితి అంచనాలో వ్యక్తమైన అంశాలు. ప్రపంచజనాభాలో సుమారు పది శాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారు. ప్రతి యేటా 200 నుండి 300 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నదని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. మాదకద్రవ్యాల వ్యాపారం వల్ల సంపాదిస్తున్న డబ్బు ఆసియా, ఆఫ్రికా దేశాలలో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడుతున్నదని అంతర్జాతీయ మాదక దవ్య్రాల నియంత్రణ సంస్థ వెల్లడించింది. అప్ఘనిస్థాన్‌ లో ‘పాపి నల్లమందు బాగా పండిస్తారు. దీనివల్ల వచ్చే డబ్బుతో తాలిబన్‌ మొదలైన ఉగ్రవాదులు బలపడుతున్నారు.

పాక్‌ గుడాఛార సంస్థ పాకిస్థానీ సైన్యం, మాఫియా ఏకమై మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చే డబ్బును జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో టెర్రరిజాన్ని పెంచి పోషించ డానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. మనదేశంలో సుమారు 15 కోట్ల మంది మాదకద్రవ్యాలకు బానిసలైనారు. కొకైన్‌ వ్యాపారం భారత్‌లోనూ బాగా సాగుతున్నది. కొకైన్‌ ఒక్క గ్రాము సుమారు ఇరవై వేల రూపాయల ధర ఉంటుందట. మనదేశంలో సంవత్సరానికి 200 కిలోల కొకైన్‌ వినియోగించ బడుతుందని తెలుస్తుంది. మనరాష్ట్రంలో గత సంవత్సరం డ్రగ్స్‌ వినియోగం పెరిగినట్లు, నగరాలలో పట్టణాలలో ముఠాలుగా ఏర్పడి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తూ అనేక మంది పట్టుబడిన ఉదంతాలు న్నాయి. ఈ డ్రగ్స్‌ రాకెట్టులో పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మత్తులో ముంచెత్తే డ్రగ్స్‌ టీనేజీ కుర్రకారును ఆగమాగం చేస్తున్నాయి. వీటి బారిన పడినవారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతూ మృత్యువ్ఞకు చేరువవు తారు

డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతుంటారని, సన్నిహితులకు దూరంగా గడుపుతా రని, కోపం సీరియస్‌గా ఉంటూ తరచూ ఉద్రేకానికి గురవ్ఞతూ వారిలో వారే మాట్లాడుకుంటారని వైద్యుల అభిప్రాయం. డ్రగ్స్‌ లో కూడా అనేక రకాలుంటాయి. ముక్క ద్వారా పీల్చేవి, నోటి తో తీసుకునేవి, ఇంజెక్షన్‌ల రూపంలో తీసుకునేవి. పొగపీల్చేవి. గతంలో మన రాష్ట్రంలో ప్రజలు గంజాయిని పండించి ఆర్థికం గా ఎదిగారు.

ఏజెన్సీ ప్రాంతాలు, గుట్టల ప్రదేశాలలో గంజా యిని అంతరపంటగా వేసేవారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోప డంతో గంజాయి పంట రాష్ట్రం నుండి తుడిచిపెట్టుకపోయింది. అనేక మంది సిగరెట్టులో గంజాయిని పెట్టుకుని దమ్ముపీలుస్తు న్నారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్‌ వినియోగం పెరుగుతూనే ఉంది. బాలివ్ఞడ్‌, టాలీవ్ఞడ్‌ నటులు ఈ డ్రగ్స్‌ దందాలో భాగస్వాములవ్ఞతున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముంబై పేలుళ్ల తర్వాత మనం దేశం విడిచి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న ముంబాయి డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో చాపకింద నీరులా డ్రగ్స్‌ వ్యాపారం విస్తరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కాలేజీలలో, పాఠశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలి.

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి నా సిగరెట్లు, బీడీలు తాగేవారి సంఖ్య అధికంగా ఉంది. వీటి అమ్మకాల మాటున డ్రగ్స్‌ మత్తు పదార్థాల విక్రయాలు పెరుగు తున్నాయి. 1985లో మన భారత ప్రభుత్వం నార్కోటిక్‌ డ్రగ్‌ అండ్‌ సైకోట్రిపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టాన్ని చేసింది. దీని ప్రకారం మాదకద్రవ్యాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు కనీసం పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. నార్కో టిక్‌ కంట్రోల్‌ బ్యూరో (న్యూఢిల్లీ)ను 17.3.1986న ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.

– కామిడి సతీష్‌రెడ్డి