తెలుగును చిన్నచూపు చూడొద్దు

ఒక్కమాట (ప్రతి శనివారం)

భారతదేశంలో పనిచేసే ఆంగ్ల సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగులు విధిగా రెండు భారతీయ భాషలను మూడేండ్ల కాలవ్యవధిలో నేర్చుకోవాలనే నిబంధన విధించారు. 1816 ఆగస్టు 4న ఛార్లెస్‌ ఫిలిప్స్‌ బ్రౌన్‌ మొదటిసారిగా మద్రాసులో అడుగుపెట్టేనాటికి తెలుగంటూ ఒక భాష ఉందనే విషయం తెలియదు. ఆ నిబంధనల మేరకే తెలుగు నేర్చుకోవడమేకాదు.. నిఘంటువ్ఞను తయారుచేసి తెలుగు ప్రజలకు మరిచిపోలేని సేవలందించారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి తెలుగు భాషకు నిరుపమాన సేవలందిస్తే.. తెలుగుగడ్డపై పుట్టి పెరిగినవారు తెలుగును చిన్నచూపు చూడడం ఏ కోణంలో చూసినా సమంజసం కాదు.

Telugu language
Telugu language

మాతృభాషను సంరక్షించుకోవాల్సిన అవసరం గూర్చి అందరు పెద్దలూ పదేపదే చెబుతుంటారు. వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. అమ్మ భాషలో ఉన్న ఆత్మీ యత, ఆనందం మరెందులోనూ లభించదనే విషయం తెలియంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలకు లిపి లేకపోవడం, వి ద్యా రూపంలో అందించే ప్రయత్నాలు చేయకపోవడంతో కాల గర్భంలో కలిసిపోతున్నాయి.

భారతదేశంలో అత్యధికమంది మా ట్లాడే భాషలో ఇప్పటివరకూ మూడోస్థానంలో ఉన్న తెలుగు నేడు నాలుగోస్థానానికి పడిపోయిందని చెబుతున్నారు. ఒకనాడు సం స్కృతం, ప్రాకృతం, అరబిక్‌, పార్శీ, ఉర్దూ, పోర్చుగీస్‌, అన్నింటి కంటే మించి ఇంగ్లీష్‌తోసహా అనేక భాషల ప్రాభావాన్ని, ప్రభా వాన్ని తట్టుకుని నిలబడగలిగిన తెలుగు ప్రస్తుతం నిరాదరణకు లోనవ్ఞతున్నదేమోననిపిస్తున్నది. మాతృభాష తెలుగుపై పాలకు లకు అభిమానం లేదనుకోలేం. ప్రేమావాత్సల్యం ఉండదనుకోం. తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రపంచవ్యాప్తం గా సభలు, సమావేశాలు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిం చి ఎంతోఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు.

భాషకోసం ఒక మహా సభను ఏర్పాటుచేయడం దేశంలోనే మొదటిసారిగా 1975లో తెలుగు కోసమే ప్రారంభమైంది. ఆ తర్వాతనే పొరుగునున్న తమిళులు తమ భాషకోసం ఏర్పాటుచేయడం ఆరంభించారు. 2017లో తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగనిరీతిలో పెద్దఎత్తున నిర్వహించింది. ఇదంతా తెలుగుభాష పై ఉన్న మక్కువను చాటేందుకు తెలుగువెలుగును నలు దిశలా వ్యాప్తిచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలే. కానీ మరొకపక్క తెలుగు రాష్ట్రాల్లోనే క్షేత్రస్థాయిలో ఇంగ్లీషు మోజులోపడి తెలుగుకు తీరని అన్యాయం చేస్తున్నారనే వాదనను కొట్టిపారేయలేం.

తెలుగుభాష కు జరుగుతున్న ద్రోహం, అందువల్ల సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందులుగూర్చి పరిశీలిస్తే ఆవేదన కలగకతప్పదు. ఇదంతా పరాయి ప్రభువ్ఞలు ఎవరో చేస్తున్నది కాదు. తెలుగు ప్రజాప్రతి నిధులమని చెప్పుకుంటున్న నేతలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టారు. తెలు గు, ఉర్దూ సబ్జెక్టులుగానే ఉంటాయని చెపుతున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే. అందులో మరో వాదనకు తావ్ఞలేదు. ప్రపం చమే గ్లోబల్‌ విలేజ్‌గా మారినమాట వాస్తవం కావచ్చు. సాంకేతి కంగా ఎంతో అభివృద్ధిచెందుతూ ఉంటే, తెలుగు, తెలుగంటూ పరిమితులు గీసుకుంటే.. ఎలా అని ప్రశ్నించేవారున్నారు.

అభివృద్ధివైపు పరుగులీడాల్సిందే. అందుకు అనుకూలమైన అవసర మైన భాష నేర్చుకోవాల్సిందే. అన్య భాషలను ద్వేషించమని చెప్ప డం లేదు. కానీ మాతృ భాషపై అభిమానం పెంచుకోవడం తప్పు కాదు. మాతృ భాషగా విశేషస్థానం కలిగిన తెలుగును బలిపెట్టి మరోభాషకు అగ్రతాంబూలం ఇవ్వడం ఎంతవరకు సమంజసమో పెద్దలు మనసుపెట్టి ఆలోచించాలి.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో అధికశాతం దేశాలు ఉన్నత విద్యతోసహా సాంకే తిక వైద్యవిద్యతోపాటు అన్ని తమ తమ భాషల్లోనే బోధన చేస్తు న్నారు. సాంకేతికశాస్త్రం, వైద్యవిద్యకు సంబంధించి పుస్తకాలన్నీ తమ భాషల్లోనే తయారుచేసుకున్నారు. కానీ భారత్‌లో ప్రధానం గా తెలుగు రాష్ట్రాల్లో మమ్మీ, డాడీ చదువ్ఞలు ఆరంభమైన తర్వా త తెలుగులో బోధన క్రమేపీ తగ్గిపోతున్నది. ఇంగ్లీషు చదివించ డం స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశా లల్లోతప్ప తెలుగు బోధించే ప్రైవేట్‌ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. అంతేకాదు తెలుగు మాట్లాడేవారిని ప్రభుత్వ కార్యాలయాల్లోసైతం చిన్నచూపు చూడటం పరిపాటైపోయింది.

తెలుగులో తమ భావా లను స్పష్టంగా చెప్పగలిగినా.. ఆంగ్లంలో వ్యక్తంచేసే పరిజ్ఞానం లేకపోయినా వచ్చీరాని మాటలతో ప్రయత్నిస్తారేతప్ప తెలుగులో మాట్లాడటం నామోషీగా భావించే దురదృష్టపు రోజులు దాపురిం చాయి. తెలుగు భాష అమలుకు ఎన్నో చట్టాలు చేశారు. ఎన్నో నిబంధనలు విధించారు. దశాబ్దాలు దాటిపోయినా నేటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. పేరుకు అధికార భాషాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏవో నామమాత్రపు అధికారాలుతప్ప కనీసం కార్యాలయాల్లో తెలుగును అమలుచేయలేని అధికారులపై చర్యలు తీసుకునే అధికారాలను కట్టబెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోనూ రెండు అధికార భాషా సంఘాలున్నాయి.

గతంలో పనిచేసిన అధికార భాషా సంఘం అధ్యక్షులు జిల్లాల్లో పర్యటించి తెలుగును ఏమేరకు అమలు చేస్తున్నారో? చేయకపోతే ఎందుకు చేయలేదంటూ? సమీక్షలు, సమావేశాలుపెట్టి సంబంధిత అధికా రులకు నోటీసులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితికూడా లేదు. వాస్తవంగా చూస్తే తెలుగు భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీ.పూ కూడా తెలుగుజాతి ఉన్నట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇం తటి సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగును 1966 మే 14న ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషగా గుర్తించారు. పరిపాలనకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండాలని నిర్దే శించారు. ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు బోధనకు అత్యంత ప్రాధాన్యాత ఇవ్వాలని ఎన్నో ఉపన్యాసా లిచ్చారు. కానీ అవన్నీ పక్కనపెట్టి ఇంగ్లీషుకు అగ్రపీఠం వేస్తున్నారు.

విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. మంచిదే. కాలానుగుణంగా జీవన యానానికి అవసరమైన విద్యాబోధన జరగాల్సిందే. కానీ జీవిత సారాంశాన్ని ఒడబోసి రచించిన సుమతీ, వేమనలాంటి శతకాలు మరుగున పడిపోతున్నాయి. రానురానూ తెలుగు కనుమరుగైపోతున్నదనే తెలుగు భాషాభిమానుల ఆవేదన. ఇదంతా ఒక ఎత్తయితే.. తెలుగు భాష అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ సామాన్యులనుసైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. శాంతిభద్రతలపై కూడా ఈ ప్రభావం పడుతున్నది. గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ చేసిన సర్వేలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరస్తులు కేసుల నుంచి తప్పించుకోవడానికి, కేసులు వీగిపోవడానికి ఉపయోగ పడుతున్నాయనే వాదన కొట్టివేయలేం.

అభియోగపత్రాలు (ఛార్జిషీట్‌) పకడ్బందీగా తయారుచేసి న్యాయస్థానాల ముందు ఉంచడంలో పోలీసులు విఫలమవ్ఞతున్నారు. చార్జిషీట్‌లలో అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ ఇందుకు కారణాలపై సమగ్ర అధ్యయనం చేసింది. దాదాపు ఐదారు వేల మంది క్షేత్రస్థాయి పోలీసు ఉద్యోగులను కలుసుకుని సమాచారాన్ని సేకరించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యేటా లక్షా అరవై వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలవ్ఞతుండేవి. ఆంగ్లభాష అంతగా రాని టైపిస్టులతో అభియోగపత్రాలు చేయించిన విషయం ఈ అధ్యయనంలో వెలుగుచూసింది.

తాము చెప్పదలచుకున్నది పూర్తిగా, స్పష్టంగా, వివరంగా, న్యాయస్థానానికి వివరించలేకపోతున్నారు. బాధితులు తెలుగులో చెపుతున్న విషయాలను ఆంగ్లంలో తర్జుమా చేయడంలో ముఖ్యాంశాలను ప్రస్తావించలేకపోతున్నారు. బాధితుల్లోకూడా చాలావరకు ఆంగ్లభాషా పరిజ్ఞానం లేకపోవడం ఛార్జిషీట్‌లో ఏమి రాశారో వారికి తెలియకుండాపోతున్నది. ఇది పోలీసుశాఖకు సంబంధించిన ఉదాహరణ మాత్రమే. మిగిలిన అన్నిశాఖలూ తెలుగును త్రికరణశుద్ధిగా అమలుచేస్తే.. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిత్యం ప్రజలలో కలిసిమెలిసి ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారించాల్సిన జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిలాంటి పోస్టులను కూడా తెలుగు రానివారితో నింపుతున్నా రు. వారికి తెలుగు రాదు, ఫిర్యాదుదారుడికి ఆంగ్లం రాదు.

వారు తమ బాధను ఎలా వ్యక్తంచేస్తారు?వీరికి ఎలా అర్థం అవ్ఞతుంది? ఎలాపరిష్కరిస్తారు?అందుకే స్థానిక సమస్యలు తెలుసుకుని ఆ ప్రజలతో మమేకం కావాలంటే వారు భాష నేర్చుకోవడం తప్పని సరని ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం గుర్తించింది. భారతదేశంలో పని చేసే ఆంగ్ల సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగులు విధిగా రెండు భారతీయ భాషలను మూడేండ్ల కాలవ్యవధిలో నేర్చుకోవాలనే నిబంధన విధించారు.1816 ఆగస్టు 4న ఛార్లెస్‌ ఫిలిప్స్‌ బ్రౌన్‌ మొదటిసారిగా మద్రాసులో అడుగుపెట్టేనాటికి తెలుగంటూ ఒక భాష ఉందనే విషయం తెలియదు. ఆ నిబంధనల మేరకే తెలుగు నేర్చుకోవడమే కాదు నిఘంటువ్ఞను తయారుచేసి తెలుగు ప్రజల కు మరిచిపోలేని సేవలందించారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి తెలుగు భాషకు నిరుపమాన సేవలం దిస్తే తెలుగుగడ్డపై పుట్టి పెరిగిన వారు తెలుగును చిన్నచూపు చూడడం ఏ కోణంలో చూసినా సమంజసం కాదు.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/