బిసిలకు ప్రాధాన్యత లభిస్తుందా?

తెలుగుదేశం పార్టీలో తీరుతెన్ను

BC People-File
BC People-File

మహానాడులో బిసిల హృదయాలను మళ్లీ గెలుచుకుటాం, బిసిలకు బాసటగా నిలుస్తా మంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. దీన్ని బట్టి బిసిలు తెలుగుదేశం పార్టీలకు దూరమయ్యారన్న సత్యాన్ని గుర్తించడం మంచి పరిణామం.

కాపులను బిసిలలో చేర్పించే అంశంపై వేసిన బిసికమిషన్‌ నివేదిక పూర్తిగా సమర్పిం చకుండానే కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో హడావ్ఞడి తీర్మానం చేశారు.తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది బిసిల అభ్యున్నతికి పదివేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించింది.

ఫెడరేషన్‌లకు రూపా యి కూడా లేకపోవడంతో ఆయా ఫెడరేషన్‌ ఛైర్మన్‌లకు ఎటు వంటి అధికారాలు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఇదే సమ యంలో తమ కోర్కెల సాధనకోసం విశాఖపట్నంలో ధర్నా చేసిన మత్స్యకారులపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఆలయాలలో పనిచేసే కేశఖండన కార్మికులు తమను ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసంగా నెలకి 18 వేల రూపాయ లు జీతం చెల్లించాలంటూ ఆందోళనలలో భాగంగా సచివాలయా నికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు మరో మూడు నెలలో జరుగుతాయనగా జరిగిన ఈ సంఘటనలు ఆయా సామాజిక వర్గాలకే కాకుండా మొత్తం బిసిలలో ఆందోళన కలిగించాయి. సంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీఅంటే అభిమానం వ్ఞండే బిసిలు తెలుగుదేశంపార్టీపై నమ్మకం కోల్పోయారు.

ఇదే సమయంలో జగన్మోహన్‌ రెడ్డి కాపులను బిసిలలో చేర్చడం సాధ్యం కాదంటూ స్పష్టం చేయడంతోపాటు నామినేటెడ్‌ పదవ్ఞలలో బిసిలకు 50 శాతం పదవ్ఞలు కేటాయి స్తానని చెప్పడంతో బిసిల చూపు వైఎస్సార్‌సిపి వైపు మళ్లింది.

రాజకీయచైతన్యం గురించి మాట్లాడాలంటే ఎన్‌టిఆర్‌ ముందు, ఎన్‌టిఆర్‌ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్‌టిరామారావ్ఞ అధికారంలోకి రాగానే రాజకీయాలను ప్రజల గుమ్మం ముందుకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా ప్రభావం విస్తృతం కావడంతో రాజకీయాలు సామాన్యులకు కూడా అర్థం కావడం ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీ తమిది బిసిల పార్టీ అని నోటితో చెప్పడం మినహా ఆచరణలో ఎక్కడ కనిపిం చదు. మొత్తం దేశ జనాభాలో 52శాతం బిసిలు ఉన్నారంటూ రాజకీయ పార్టీల నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తుంటారు.

కాని పార్టీ టిక్కెట్లు, అధికారం పంచుకొనే విషయానికి వచ్చేసరికి 30 సీట్లు లభించడం కూడా కష్టంగా వ్ఞంటోంది. బిసి జనాభా నిష్పత్తి ప్రకా రం చూస్తే అసెంబ్లీలో ఉన్న 175స్థానాలకుగాను కనీసం 85 స్థానాలు బిసిలకు చెందాలి.

కాని ఆయా పరిస్థితులు, పార్టీ అవస రాలను బట్టి 30నుంచి 40 స్థానాలను మాత్రమే బిసిలకు కేటా యిస్తున్నారు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న సామాజికవర్గాలకు చెందిన నాయకులకు సీట్లు ఇస్తే చాలు, మిగిలిన బిసి కులాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదనే భావనలో రాజకీయపార్టీలు ఉన్నాయి.

నిజానికి సంఖ్యాపరంగా మూడు నాలుగు బిసి కులాలు ఆధిక్యత కలిగి ఉన్నప్పటికీ మిగిలిన కులాల సంఖ్యను కలిపితే 52 శాతం బిసి జనాభాలో 30 నుంచి 35 శాతం ఉంటారు. కాని విడివిడిగా ఆయా కులాల సంఖ్యాబలం తక్కువగా ఉండటం వల్ల వారిని పట్టించుకొనే స్థితికనిపించడం లేదు.

గెలుపే పరమా వధిగా భావించే రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపు సమయంలో బిసిల కోటా కింద ఆ అయిదారు కులాలవారికి సీట్లు ఇస్తే సరిపో తుందనే భావనలో ఉంటున్నాయి. ఈ భావన ఇతర పార్టీలకు సరిపోతుందేమోకానీ తెలుగుదేశం పార్టీకి సరిపోదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిసిల పార్టీ అని ప్రకటించుకొంటుంది కాబట్టి. ఇతర పార్టీల సంగతి ఎలావ్ఞన్నప్పటికీ ఇక నిర్దిష్ట విధానంతో తెలుగుపార్టీలో బిసి కులాల జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించడం ప్రారంభిస్తే ఎంతో బాగుండేది.

అన్ని పార్టీల మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కూడా వ్యవహరిస్తున్నప్పుడు బిసిల విషయంలో తెలుగుదేశం పార్టీ భిన్నమైనదనే భావన ఎలా కలుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వరకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బిసిల సంక్షే మానికి చెందిన ఊసే ఉండేదికాదు.

బిసిలను కర్వేపాకులుగా ఉప యోగించుకొంటున్నారని వారంతా నిరుత్సాహంతో ఉన్నప్పుడు రాజకీయాలలో ప్రవేశించిన ఎన్‌టిరామారావ్ఞ బిసిలను అక్కున చేర్చుకొన్నారు. ఎంతోమంది బిసి నేతలకు సీట్లు ఇచ్చి నూతన రాజకీయాలకు శ్రీకారంచుట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం 292 మంది సభ్యులున్న నాటి ఉమ్మడి అసెంబ్లీలో బిసి శాసనసభ్యులు సంఖ్య ఏనాడూ25కు మించేదికాదు.

తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారి ఆ సభ్యులసంఖ్య 40కి చేరింది. అంతేకాకుండా స్థానిక సంస్థలలో బిసిల రిజర్వేషన్‌ పెంచడం వంటి అనే పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా బిసిలను రాజకీయంగా మేలుకొల్పారు.నేడు తెలుగుదేశం పార్టీలో బిసి నేతలుగా చెలామణి అవుతున్నవారిలో 90శాతం మంది ఆనాడు ఎన్‌టిరామారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవారే. ఎన్‌టిఆర్‌ అనంతరం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు కొత్తగా బిసివర్గాల నుంచి కొత్తగా నాయకత్వ స్థానాలకు ఎదగలేదు. ఈ స్థితిలో బిసిలకు మనసు విప్పి పార్టీనేతలకు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం వస్తుందన్న నమ్మకం ఏమాత్రం కనిపించడం లేదు. నిజంగా చిత్తశుద్ధివ్ఞంటే బిసిలలో జనాభా ఎక్కువగా ఉన్న మూడు, నాలుగు కులాలవారి గురించేకాకుండా చేతివృత్తి కులాల సమస్యలపై అధ్యయనం చేయాలి.

వారిని రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకువెళ్లడానికి వినూ త్న పథకాలు అమలు రూపొందించాలి.ఎప్పటికప్పుడు కులాల కూడికలు, పార్టీ అవసరాలంటూ ఉన్నత సామాజికవర్గాలకు చెందిన పదవ్ఞలు కట్టపెట్టడం కాకుండా ఇప్పటివరకు చట్టసభలలో ప్రవేశించని బిసి కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ అంటే బిసిల పార్టీ అనే పదం పెదవులకే పరిమితంకాకుండా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మరలా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుంది.

-అన్నవరపు బ్రహ్మయ్య, సీనియర్‌ పాత్రికేయులు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/