కరోనా పట్ల కంగారు పడితే కృంగిపోతారు!

మనం చేయగలిగింది జాగ్రత్తగా ఉండటమే

coronavirus-All we could do was be careful
coronavirus-All we could do was be careful

మూడు నెలల క్రితం నాటితో పోల్చితే ఇప్పుడు పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం మాత్రం వాస్తవం.

ఇది ఇంకా రెండు, మూడు నెలల పాటు ప్రజలను ముప్పుతిప్పలు పెట్టక మానదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఆ లోపు మనం చేయగలిగింది జాగ్రత్తగా ఉండటమే.

పూర్తి సన్నద్ధతతో ముప్పును ఎదుర్కొనటమే చేయాల్సింది. అయితే పరిస్థితులు చేతులు దాటిపోయాయని, ఇక చేసేదేమీ లేదని కుంగిపోతే ఎలా?

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేయాల్సిన పనులు చేస్తూ ముందుకు సాగిపోవటమే. ఇప్పటివరకు ఉన్న అనుభవాల ప్రకారం సామాజికదూరం పాటించడం ద్వారా ఎంతోమేలు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

కరోనా వచ్చిన మనిషిని కలవకుండా ఉంటే దాదాపు ఈ ముప్పు నుంచి తప్పించుకున్నట్లే.

ఈ శతాబ్దంలో ఎదురైన అతిపెద్ద ముప్పు కరోనా మహమ్మారి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో స్పాని ష్‌ ఫ్లూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్లమంది ప్రాణా లు బలిగొన్న ఉదంతం తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్దముప్పు ఇదే.

ఆరు నెలల క్రితం చైనాలోని ఊహాన్‌లోకరోనా వైరస్‌ వెలుగుచూసి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారనే సంగతి విన్నప్పుడు అదేదో చైనాసమస్యలే అని అందరూ అనుకున్నారు.

కానీ అక్కడినుంచి శరవేగంగా పొరుగున ఉన్న కొరియా,జపాన్‌, అక్కడి నుంచి ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌, అమెరికా, ఆసియా దేశాలకు విస్తరించింది.

ప్రారంభంలో మనకు పెద్దఇబ్బంది ఉండ దని మనదేశంలోని కొన్నివర్గాలు విశ్వసించాయి. దానికి చాలా కారణాలు చెప్పాయి.

మనకు ఇమ్యూనిటీ ఎక్కువని, ఎంఎంర్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదని, మలేరియా జబ్బుసర్వసాధారణం కాబట్టి అందుకు వినియోగిస్తున్న హైడ్రో క్సిక్లోరోక్విన్‌ వాడి ఉండటంవల్ల కరోనా భారతీయుల జోలికి రాదని ఏవేవో వక్రభాష్యాలు చెప్పారు.

ఒక వేళ మనదేశానికి ఈ జబ్బు వచ్చినా మూడు నాలుగునెలలో తగ్గిపోతుందని అనుకున్నారు. అటువంటి వారి అంచనాలన్నింటిని తలకిందులు చేస్తూ అనూహ్యంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను చూసి విస్తు పోవటం సగటు భారతీయుడు వంతుఅవుతోంది.

నిన్నమొన్నటి వరకు అక్కడెవరికి వచ్చిందంట పంజాబ్‌లో ఒక విదేశీ జంట కరోనా బారినపడి కోలుకుందంట, చెన్నైలో ఎవరో చనిపోయా రంట అనేది విన్నాం.ఇప్పుడు కరోనా మన ఊరికి,మన కాల నికి, మన అపార్టుమెంట్లోకి వచ్చేసింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఆస్పత్రిలో ఎక్కడా బెడ్లు దొరకటం లేదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డు ఉన్నా ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ కార్డుల ను అంగీకరించడం లేదు. లక్షనో, రెండు లక్షలో క్యాష్‌ కడితేనే చూస్తాం.అదికూడా బెడ్‌ ఖాళీ అయితే ఫోన్‌ చేస్తాం అని చెబు తున్నాయి.

మొదట్లో హడావుడి చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు పూర్తిగా కాడి మీదపడేశారు. బతికేవాడు బతుకుతాడు. పోయేవాడు పోతాడు. అనే మందాన వ్యవహరిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో మనం ఎం చేయాలి. ఎలాంటిజాగ్రత్తలు తీసుకో వాలి. ఏ విధంగా ఈ ముప్పు నుంచి బయటపడాలి.అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న సందేహాలు.

ఒక్కటి మాత్రం సుస్పష్టం.భయపడి సాధించేదిలేదు. ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనటమే, జాగ్రత్తగా ఉండటం, అయినా వస్తే ఏం చేయా లనే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, శాయశక్తులా శ్రమించి దాని నుంచి బయటపడటం,ఇది ఇప్పుడు ప్రతిఒక్కరూ చేయాల్సిన పని.

మనపై విదేశీ దండయాత్ర జరగబోతోందని తెలిసినప్పుడు ఏవిధంగా మనం సన్నాహాలు చేసుకుంటామో అదేవిధంగా తగిన ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండటమే చేయ గలిగింది. అంతేకాని కంగారుపడుతూ, వాళ్లని వీళ్లని నిందించి ప్రయోజనం లేదు.

ఇది జరగాలంటే కరోనా మహమ్మారిపై మీకు పూర్తి స్థాయిలో అవగామన ఉండాలి. కరోనా వైరస్‌ శాస్త్రవేత్త లకు తెలియనిది కాదు. పిల్లిలో వైరస్‌ నివాసం ఉంటుంది. ఈ వైరస్‌ చూడటానికి కిరీటం మాదిరిగా ఉంటుంది.అందుకే కరోనా పేరువచ్చింది.

ఈ వైరస్‌ జంతువుల నుంచి కానీ, మరేవిధంగా కాని మనిషికి సోకదు.కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే. అది కూడా గాలిద్వారా,శ్వాస స్పర్శ ద్వారా అంటుకుంటుంది. మరో ప్రత్యే కత ఏమిటంటే ఎంతో వేగంగా విస్తరించే గుణంగా ఈ వైరస్‌ఉండటం.

దాదాపు 80 శాతం మందికి తమకు కరోనా వైరస్‌ సోకిందనే విషయమే తెలియదు. అందులో వారు అందరి లో తిరుగుతూ ఉంటారు.

తద్వారా ఇతరులకు ఈ వైరస్‌ను అం టించే ప్రమాదంఉంటుంది. ఇక దాదాపు 15శాతం మందికి తీవ్రమైన జ్వరం,న్యూమోనియా, కడుపులో నొప్పి, విరోచనాలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, రుచి,వాసన గ్రహించేశక్తి కోల్పోవడంవంటి లక్షణాలలో కరోనా బయటపడుతుంది.

తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి వారు ఈ వైరస్‌ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఇక మిగిలిన ఐదు శాతం మందికి ఈ వ్యాధి వల్ల ప్రాణపాయం కనిపిస్తోంది.

ఇప్పటికే ఏదైనా దీర్ఘకాలిక జబ్బు ఉన్నవారు, వయస్సుమీదపడిన వారు అయితే కరోనా వైరస్‌ సోకితే ప్రాణాలతో బయటపడటం కష్టమనేది ఇప్పటి వరకు మనకు కన్పిస్తుంది.మరి చిన్న పిల్లలకు కొంచెం ముప్పే. ఈవ్యాధి వస్తే తీవ్రమైన ఇబ్బందులు పడవలసివస్తుంది.

ప్రాణా పాయం కూడా ఉండవచ్చు. పెద్దపిల్లల్లో ఆనవాళ్లు కనిపించవ్ఞ. వారికి వచ్చినట్లు కూడా తెలియకపోవచ్చు.

ప్రాణాపాయం కూడా ఉండదు.ఒకవేళ జ్వరం, ఇతర ఇబ్బందులు వచ్చినా కొన్ని జాగ్ర త్తలతో కోలుకోవచ్చు. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

చేతులతో ముఖాన్ని తాకకూడదు. కనీసం రెండు మీటర్ల దూరం నుంచి ఇతరులతో మాట్లాడాలి.టీకా కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.

దాదాపు 150 టీకా ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు, క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించాయి. అయితే ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి కొన్ని నెలలుపడు తుంది. ఇక ఇవికాక కరోనా సోకిన వారి చికిత్సకు అనువైన ఔషధాల కోసం అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు.

ఒకపక్క కొత్త ఔషధాల ఆవిష్కరణపై దృష్టి సారిస్తూనే, మరొకపక్క ఇప్పటికే ఉన్న పాత ఔషధాలను కొంత మార్చి కరోనాపై ప్రభావం చూపగలవేమోననే ప్రయోగాలు అధి కంగా చేస్తున్నారు.

ఈ క్రమంలోవచ్చిన యాంటీవైరల్‌ ఔషధాలే కాకుండా కరోనా వైరస్‌ నివారణ కోసం హోమియోపతి, ఆయు ర్వేదంలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

కరోనా సోకిన వారికి అది ఇది అనేది లేదు. ఏది పనిచేస్తుందంటే ఆ మందు ఇస్తున్నారు.

వైద్యులు కరోనా రోగులకు ఇప్పటివరకు సింప్టమా టిక్‌ ట్రీట్‌మెంట్‌(అంటే జబ్బులక్షణాలకు చికిత్సచేయడం) తప్పిం చి కరోనా వైరస్‌ను అదుపు చేసే మందు ఏదీ లేదు కాబట్టి ఈ పరిస్థితిలో జ్వరం వస్తే పారాసిటమాల్‌, గొంతు నొప్పి దగ్గుకు అజిత్రోమైసిన్‌, కడుపులో వికారానికిపెంటాప్రజోల్‌ ఇలా మందు లు ఇస్తున్నారు.

ఇవేకాకుండా ఇంకా పరిస్థితిని బట్టి వాడుతున్న మందులు ఎన్ని ఉన్నాయి. ఒకటా రెండా వందలాది కంపెనీలు వివిధ దేశాల్లో ప్రయోగాలు చేస్తున్నాయి.

యూనివర్శిటీలు కూడా తమ ల్యాబ్‌లలో శక్తి మేరకు కరోనా మందు కోసం అన్వేషణ చేపట్టాయి. వీటిలో ఏదో ఒకటి సక్సెస్‌ అయినా చాలు కరోనా కథ ముగిసినట్లే. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికీ 1.5 కోట్లకు చేరిపోయింది.

చనిపోయిన వారి సంఖ్య ఆరు లక్షల వరకూ ఉంది. ఇవి గణాంకాల్లోకి ఎక్కిన కేసుల వివరాలు.బయటకు రాకుండా చనిపోయినవారు లేదా బాధితుల సంఖ్య ఇంకెంత ఉంటుందో? ఇంకెన్నాళ్లు ఈజబ్బు విస్తరిస్తుంది.

ఎప్పటికీ దీనికి వ్యాక్సిన్‌లేదా మందు కనుగొంటారు?అనే ప్రశ్న లకి ఇప్పుడు జవాబులేదు.కానీ మూడు నెలల క్రితం నాటితో పోల్చితే ఇప్పుడు పాజిటివ్‌కేసులు,మరణాలసంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం మాత్రం వాస్తవం.

ఇది ఇంకా రెండు, మూడు నెలల పాటు ప్రజలు ముప్పుతిప్పలు పెట్టక మానదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

ఆ లోపు మనం చేయ గలిగింది జాగ్రత్తగా ఉండటమే. పూర్తి సన్నద్ధతతో ముప్పును ఎదుర్కొనటమే చేయాల్సింది.

అయితే పరిస్థితులు చేతులు దాటిపోయాయని, ఇక చేసేదేమీ లేదని కుంగిపోతే ఎలా? తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేయాల్సిన పనులు చేస్తూ ముందుకు సాగిపోవటమే.

ఇప్పటివరకు ఉన్న అనుభవాల ప్రకారం సామాజిక దూరం పాటించడం ద్వారా ఎంతో మేలు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

కరోనా వచ్చిన మనిషిని కలవకుండా ఉంటే దాదాపు ఈ ముప్పు నుంచి తప్పించుకున్నట్లే.

  • ఎల్‌.మారుతి శంకర్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/