మోసాల మార్కెట్లో వినియోగదారుడు

Consumer
Consumer

  • జాతిపిత చెప్పినట్లు కొనుగోలుదారుడే అందరికీ మూలం. అతన్ని గౌర వించి, అతని హక్కులను కాపాడటం మన బాధ్యత. ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది

అ వనిపై పుట్టిన ప్రతి వ్యక్తి వినియోగదారుడే. జగ మంతా విస్తరించి ఉన్న విని యోగదారులు ఉచిత, ఆర్థిక వస్తువులను, సేవలను వినియోగిస్తూ దేశాల ఆర్థిక వ్యవస్థలు నడవడానికి ఇంధనమవ్ఞతున్నారు. జాతిపిత చెప్పినట్లు కొనుగోలుదారుడే అందరికీ మూలం. అతన్ని గౌర వించి, అతని హక్కులను కాపాడటం మన బాధ్యత. ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కులకై ఉద్యమిస్తున్న ‘కన్జ్యూమర్‌ ఇంటర్నెషనల్‌ అనే సంస్థ 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1962లో అమెరికా అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌ కెన్నడి, తొలిసారి వినియోగదారుల హక్కులపై ఒక బిల్లును కాంగ్రెస్‌లో సమర్పించిన రోజు మార్చి15. ఏప్రిల్‌ 9,1985 ఐక్యరాజ్యసమితి, వినియోగదారుల హక్కులపై సాధారణ నియమావళిని రూపొందించింది. వస్తుసేవలను ధర చెల్లించి కొనుగోలు చేసే వినియోగదారులకు భద్రత, సమాచారం,

ఎంపిక, ప్రాతినిధ్యం, కనీస అవసరాలు తీర్చుకోవడం, నష్టపరిహారం, చైతన్యం, వినియోగవిద్య, ఆరోగ్యకర వాతావరణం తదితర హక్కులున్నాయని, ఈ నియమావళి పేర్కొంటోంది. 120 దేశాలలో 250 సంస్థలలో కలిసి పనిచేస్తున్న కన్జ్యూమర్‌ ఇంటర్నేషనల్‌ ఈ సంవత్సరం 2019 మార్చి 15న నమ్మకమైన స్మార్ట్‌ ఉత్పత్తులు అనే ఇతివృత్తం ఆధారంగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంటే స్మార్ట్‌ టీవీలు, వాయిస్‌ ఆధారిత సేవా పరికరాలు ఫిట్‌నెస్‌ పరికరాలు తదితర స్మార్ట్‌ ఉత్పత్తులను ప్రజలకు చేరవ చేసేలా చైతన్యం తీసుకురావడం ప్రధానోద్దేశ్యం. మనదేశంలో ఏటా డిసెంబర్‌ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం పాటిస్తున్నారు. 1986 నాటి వినియోగదారుల పరి రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులపై మాగ్నాకార్టాగా పేరుగాంచిన ఈ చట్టం కొనుగోలు దారుల ప్రయోజనాలను కాపాడటం, వివిధ రకాల దోపిడీలు, అక్రమ వ్యాపారాల నుండి రక్షించడం, హక్కుల పరిరక్షణ, సమస్యలను విని పరిష్కరించే యంత్రాంగం ఏర్పాటు వంటి నిబంధనలు ఏర్పరిచింది.

వినియోగదారునికి ఆరు రకాల హక్కులను ప్రసాదిస్తున్న ఈ చట్టం ప్రభుత్వ, ప్రైవేట్‌, సహకార రంగాలలో జరిగే వస్తు, సేవల విక్రయాలకు వర్తిస్తుంది. వినియోగదారులకు నష్టపరిహారంతోపాటు, అక్రమ వ్యాపార నిరోధక, నివారక చర్యలు తీసుకుంటుంది. చట్టం ప్రకారం జిల్లాస్థాయి ఫోరం (20లII వరకు నష్టపరిహారం) రాష్ట్ర కమిషన్‌ (1 కోటి వరకు నష్టపరిహారం) జాతీయ కమిషన్‌ (1 కోటి పైన నష్టపరిహారం)లు ఏర్పడి వినియోగదారుల సమస్యలను పరిష్క రిస్తున్నాయి. ఫిర్యాదు రుసుం లేకపోవడమేకాక, అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. మండలస్థాయిలలో వినియోగదారుల పరిరక్షణ మండళ్లు, హక్కుల పరిరక్షణ, సలహాలు ఇస్తున్నాయి. 2018 డిసెంబరు 24న వినియోగదారుల ఫిర్యాదులకు సత్వర పరిష్కా రం అన్న ధీంతో నిర్వహించారు. జాతీయ హెల్ప్‌లైన్‌ 1800- 11-4000 లేదా 14404ల ద్వారా సత్వరమే వివాదాల పరిష్కార సలహాలు, సూచనలిస్తున్నారు. జాగో గ్రాహక్‌ జాగో (మేలుకో వినియోగదారుడా మేలుకో) వంటి ఉద్యమ ప్రచారం ద్వారా చైతన్యం కల్పిస్తున్నారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌, వినియోగదారుల చైతన్య పరిశోధక కేంద్రం (అహ్మదాబాద్‌) ముంబాయి గ్రాహాక్‌ పంచాయతీ, లీగల్‌ఎయిడ్‌ సొసైటీ (కోల్‌కతా) అఖిల భారతీయ గ్రహక్‌ పంచాయత్‌ వంటి సంస్థల ద్వారా వినియోగదారుల హక్కుల పరిరక్షణకై కృషి జరుగుతోంది.

వస్తు మార్పిడి పద్ధతి నుండి ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వరకు వివిధ రూపాల్లో క్రయవిక్రయాలు జరిగే మనదేశంలో సహజంగానే వినియోగదారు లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వస్తు,సేవల సమాచా రం అందించకపోవడం, సరఫరాదారుల మోసాలు, తప్పుడు తూకాలు, కొలతలు,విక్రయ అనంతర సేవా లోపాలు, నకిలీ వస్తు వ్ఞల బెడద,స్వచ్ఛత, నాణ్యత, సరైన పరిమాణం, లేని వస్తువ్ఞల సరఫరా డెలివరీలో లోపం, తప్పుడు ప్రచారం, డబ్బుకు తగిన ప్రతిఫలం లేని వస్తువ్ఞలను అంటగట్టడం, ఆరోగ్యభద్రతా సమస్య లు,అధిక ధరలు, ఆన్‌లైన్‌ మోసాలు, సకాలంలో రిటర్న్‌, రీఫండ్‌ చేయకపోవడం, సేవకు మించిన బిల్లులు, తప్పుడు బిల్లులు వేయ డం, విపిపి ద్వారా మోసాలు, పన్నులు చెల్లించని అన్‌ బ్రాండెడ్‌ వస్తువ్ఞలను అమ్మటం, నిషేధిత ఆహార రంగుల పదార్థాలు అమ్మ టం, సేవాలోపాలు, తదితర అనేక సమస్యలు వినియోగదారుల ను కష్టాల పాల్జేస్తున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు బాగా పెరిగిపో వడంతో మోసాలు కూడా పెరిగాయి.

ఇంటర్నెట్‌ కొత్త వాణిజ్య మోసాలకు తెరతీసింది. ఈ మోసాల నుండి వినియోగదారులను రక్షించడం నేడు సరికొత్త సవాలు. నిరక్షరాస్యులు అధికంగా ఉన్న మనదేశంలో ఆర్థిక అక్షరాస్యత, వినియోగ విద్యగలవారు పెరిగి తేనే మోసాలకు అడ్డుకట్ట వేయగలం. జాతీయ, అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాలు నిర్వహించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్టవేయడం, వినియోగ పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం, బులిటెన్‌లు, పీరియాడికల్స్‌, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచా రం, నైతిక వ్యాపారాన్ని ప్రోత్సహించడం, వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తుసేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గూర్చి వారిలో చైతన్యం పెంచడం, సామాజిక అవినీతిని అరికట్టడం, ప్రభుత్వాలను వ్యాపార వరాలను చైతన్యం చేయడం, వినియోగదారులకు న్యాయవేదికల గూర్చి తెలపడం, వినియోగమోసాల గురించి ముద్రించి ప్రచారం చేయడం నష్టపరిహారం చెల్లించిన కేసుల గూర్చి ప్రచారం చేయడం, మార్కెటింగ్‌ వ్యవస్థకు ఊతం ఇవ్వడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. వినియోగదారుల్లో స్పృహ పెరగనిదే వారిని మార్కెట్‌ మోసాల బారి నుండి ఎవరూ రక్షించలేరు.

ఏదీ అసలు, ఏది నకిలీ, ఏవి స్వచ్ఛమైనవి, ఏవి బ్రాండెడ్‌, ఇలా వినియోగ విద్యపై పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చడం, పత్రికలు, ప్రసారమాధ్యమాలు, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వినియోగదారుల ఫోరాలను పటిష్టం చేయడం, శిక్షలు కఠినతరం చేయడం, సైబర్‌ క్రైం, విభాగాలను పటిష్టం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నకిలీ, చౌకరకపు వస్తుమోసాలను అరికట్టడం ప్రభుత్వ నిఘా యంత్రాన్ని పటిష్టం చేయడం వంటి చర్యల ద్వారా వినియోగదారున్ని మనం రక్షించవచ్చు.

  • తండప్రభాకర్‌ గౌడ్‌