దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్

ఏ దేశ రాజకీయ పార్టీకైనా ఆటుపోట్లు, గెలుపు ఓటములు, జయాపజయాలు సహజం. పరిస్థితులను బట్టి ఎదుగుదల అధికారం పొందడం అనేవి ఉంటాయి. తప్ప ఓడిపోయిన పార్టీని తుడిచిపెట్టుకుపోయిందనడం సబబుకాదు. అధికారానికి పార్టీ చేరకుంటే నాయకులు ప్రజల మద్దతుకు దూరం అవ్ఞతారు. అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరుతారు. వారి అవసరాల కోసం ఉన్నవి కాపాడుకోవడం కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం చేరుతారు. అధికారం అనేది బెల్లం లాంటిది. అధికారం ఉన్న రాజకీయ పార్టీల చుట్టూ చెక్కర్లు కొడుతుంటారు. ఇది లోకం తీరు. మానవ నైజం.
ఇదే స్థితిలో 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ క్షీణదశకు చేరుకుంది. కానీ 2019 ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, హర్యానాలలో తనకుతాను పుంజుకుంది. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రచారం చేయకుండానే గౌరవప్రదంగా సీట్లను మహారాష్ట్రలో 44/290, హర్యానాలో 31/90 సీట్లను గెలుచుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలందరూ తమతమ లాభకరమైన స్థితిని పెంచుకోవచ్చు.
కాని కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్పార్టీకి శుభపరిణామం. రెండు రాష్ట్రాలు అటు హర్యానా గోధుమ పంటకు ప్రసిద్ధి. ఇటు మహారాష్ట్ర చెరకు పంటకు వాణిజ్య పంటలకు, అపరాలకు ప్రసిద్ధి. అంటే రెండు రాష్ట్రాలు కూడా వ్యవసాయిక రాష్ట్రాలే. అందుకే బిజెపి పాలక ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు ఓటువేసినట్లుగా ఎన్నికలనంతర సర్వేలు తెలుపుతున్నాయి.మహారాష్ట్రలో హాంగ్ అసెంబ్లీ అయినా సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పర్చవచ్చు. అలాగే హర్యానా రాష్ట్రం చాలా సంపన్న రాష్ట్రం. వ్యవసాయధా రితమైనది.
జాట్ రాజకీయాలకు ప్రతీక. అంతేకాక అయారామ్, గాయారామ్ రాజకీయాలకు ప్రసిద్ధి. అధికారం ఎక్కడ ఉంటే ఎమ్మెల్యేలు అక్కడకు చేరడం అలవాటుగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శ్రద్ధ తీసుకొని ప్రచారం చేయకపోయినా సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొన్నారని చెప్పవచ్చు.
అంతేకాగా 58 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతో మంది ఎదిగారు. మర్రిచెట్టు లాంటి పార్టీ అయిన కాంగ్రెస్పార్టీ తన లౌకికవాద రాజకీయాలతో అలౌకికశక్తులను ఎదగనిచ్చింది. కాంగ్రెస్ మద్దతుదారులకు, అధినాయకత్వం మధ్య దూరం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం. కాంగ్రెస్ పార్టీ పాలించని భూభాగం లేదంటే అతిశయోక్తికాదు. ఏదిఏమైనా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని తుదిముట్టించలేవ్ఞ. దేశంలో నిర్ణయకశక్తిగా ఎదగకుండా ఆపలేవు.
- డాక్టర్ కె. ఆసయ్య,ఐఐఎస్
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/