అటకెక్కిన పోలీసు సంస్కరణలు!

నేడు అమర పోలీసుల సంస్మరణ దినోత్సవం

Commemoration Day of the immortal police

చట్టపరిధిలో పోలీసులు విధులు నిర్వహిస్తే చాలా సమస్యలు సమిసిపోతాయి. కానీ అటు కొందరు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులు పరిధిని పట్టించుకోరు. గీత దాటితేనే సమస్యలు వస్తాయి! మధ్యలో ప్రజలు నష్టపోవడం విధాయకమయింది. పోలీసుల పనితీరును తప్పుపట్తున్నారు. కానీ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నారో ప్రభుత్వాలే పట్టించుకోని పరిస్థితుల్లో ప్రజలుమాత్రం ఏం చేయగలరు?రోజూ 24 గంటలు డ్యూటీ చేయాలి! వీక్లీ ఆఫ్‌ అనేది చాలావరకు పేపరు మీదనే! పండుగలూ, పబ్బాలు మరిచిపోవాలి! ప్రజలకు సేవచేయాలని కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఆసక్తి కనుమరుగవ్ఞతుంది. పోలీసూ మనిషేగా! జీతాలు పనికితగ్గట్టు ఉండకపోవడం అందరికీ తెలిసిన విషయమే! ప్రభుత్వాలు వేసిన కమిటీలు, తలపెట్టదల్చుకున్న సంస్కరణలు అన్నీ అటకెక్కాయి. వాటిని గురించి ఎప్పుడోఒకప్పుడు సమస్యవచ్చినప్పుడు పట్టించుకోటమే!

పి ల్లలు ఏడుస్తుంటే పోలీ సును పిలవనా? అని తల్లి భయపెట్టటమన్నది ఒకప్పటి మాట! పోలీసు ఏం చేస్తాడు? మన దెబ్బకు ఎక్కడో లొంగక తప్పదు అన్న మాట ఇప్పుడు చెలామణిలో ఉండటంలో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఆడపిల్లలే పోలీసులను ఇబ్బంది పెట్తున్న వార్తలు ఛానెళ్లు ఎడతెరిపి లేకుండా టెలికాస్ట్‌ చేయడం కూడా సాధారణమైన విషయంగా మారిపోయింది. పోలీసులకు ప్రజల సానుభూతి ఉన్న అనుభవాలు చాలా తక్కువ. అక్టోబరు 21 వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం అమర పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించట మనేది ఆనవాయితీగా మారిపోయింది. అదీ ప్రజల చొరవతో కాదు, పోలీసులే మా వాళ్లు ఇంత మంది ఈ సంవత్సరం చనిపోయారని లెక్కలు పత్రికల్లో ఇచ్చి సంతాపం తెలపండి అని జ్ఞాపకం చేసినప్పుడు పత్రికల్లో రెండుమూడు వ్యాసాలు,పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నవారు మన పోలీసులు ఈ విధంగా సమాజం కోసం ప్రాణాలు అర్పించారు సుమా అని గంభీరంగా ప్రకటించి నప్పుడు అయ్యోపాపం అని ఒక్కక్షణం అనుకోవటం జరుగు తున్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసులు ప్రజలకు ఎందుకు దగ్గరకాలేకపోతున్నారు. ఎక్కడ, ఎవరిలో లోపం ఉంది? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టం! పోలీసులను ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రజలు కలు స్తారు. సాధారణంగా పోలీసు స్టేషన్లలోనే ఇబ్బందిపడుతూ కలుస్తారు. స్టేషన్‌లో కస్టడీలో ఉన్న నిందితులనో, మరెవర్నో పోలీసు యూనిఫాంలోనో, లేకుండానో, దెబ్బలు కొడ్తుండటం కనపడగానే వచ్చిన వాడి ప్రాణం సగం చచ్చిపోతుంది. ఫిర్యాదు చేయడానికి పంచప్రాణాలు కూడగట్టుకొని చేసే పరిస్థితి ఉంటుం దని పోలీసు స్టేషన్లలో కలిగిన అనుభవాలను గురించి స్వతంత్ర సంస్థ సర్వే చేసినప్పుడు తేలింది. సర్వే చేసిన వాళ్లు పౌర రక్షణకు సంబంధించిన వాళ్లుకావచ్చు. వారి సర్వే నమ్మాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు.

కానీ పోలీసు స్టేషన్లు దేవాల యల్లా ఉండాలని ఎవరనుకున్నా పొరపాటే! స్టేషన్లు దేవాల యాల్లా ఉండటానికి కాదు. దుష్టశిక్షణ- శిష్టరక్షణ కోసం ఏర్పడ్డ శిబిరాలు అని కూడా భావించడానికి వీలులేదు. మరి ఏవిధంగా ఉండాలి? కొంచెం చాదస్తంగా చెబుతున్న మాటగా అనిపించ వచ్చు. కానీ పోలీసు స్టేషన్లు చట్టపరిధిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లా ఉండాలి! అది ఎలా సాధ్యం? పాతకాలం నాటి పోలీసు అనుభవజ్ఞులు ఒక మాట చెప్పారు. ఒక పోలీసు స్టేషన్‌ యిలాకాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారి సంఖ్య ఆ యిలాకా జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే! మిగతా వారంతా పోలీసులతో పనిలేనివారే! ఎప్పుడో ఒకప్పుడు చుట్టపు చూపుగా పోలీసుస్టేషనుకు వచ్చేవారే! చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ఆ రెండు శాతం మంది కోసమే పోలీసులు! పోలీసు స్టేషన్లో కస్టడీ గదిలో ఉండేది. పోలీసులు ఇచ్చిన బెయిల్‌లో విచారణకాగానే విడుదల చేయబడేవారు,

లేకపోతే స్టేషనుకు తీసుకొని వచ్చిన 24 గంటల్లో కోర్టుకు పోయేవారే! అలాంటి స్పష్టమైన అవగాహనతో పోలీసులు పనిచేస్తే చిన్నచిన్న ఫిర్యాదు లతో వచ్చేవారికి లాఠీలతో బాదుతున్న దృశ్యాలు కనపర్చాల్సిన అవసరం లేదు. పోలీసుల మీద అభిమానం ఉండాలని అడగా ల్సిన అవసరం లేదు. నిజానికి ఏ అభిప్రాయం పోలీసులు కలిగించాల్సిన అవసరం లేదు.కానీ పోలీసులంటే భయపడాల్సిన పనిలేదన్న వాతావరణం స్టేషన్లలో కల్పిస్తే చాలు. రాజకీయాలు చేసేవారిని, రౌడీయిజం ప్రదర్శించేవారిని కుర్చీల్లో కూర్చోబెట్టి పోలీసులు మర్యాదచేస్తారని, కంప్లయింట్స్‌తో వచ్చే వారిని నిర్లక్ష్యం చేయడమేకాకుండా దురుసుగా ప్రవర్తిస్తారనే మాట నిజమో- అబద్దమో కానీ చాలా మందిలో నాటుకొనిపోయింది.

దానిని పోలీసులే తొలగించుకునే విధంగా ప్రవర్తించే అవకాశం తీసుకోవాలి!ప్రతి ఫిర్యాదుకు రసీదుయిస్తేపని అయిపోయినంత ఊరట కలుగుతుంది! అది చేయడంలో లోపాలుఉండటం దుర దృష్టకరం. పై అధికారులుపైన ఉన్న అధికారంలోని రాజకీయ నాయకుల మీద దృష్టిసారించడం తగ్గించి ఇలాంటి విషయాలు ను పట్టించుకుంటే బాగుంటుందని చాలామంది అనుకోవటం కొంచెం బాధకలిగించినా, అలాంటి విషయాలు ప్రజలకు దగ్గర కావటం కోసం,ఆలోచించాల్సిన అవసరం పోలీసుశాఖకు ఉందే మో!ఎంతోమంది పోలీసువారు చేస్తున్న మంచి పనులు చెపు తుంటే ముచ్చటేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రజలకు ఆ విషయాలు తెలియవ్ఞ.చాలా సంవత్సరాల క్రిందటమతకల్లోలాతో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు కర్ఫ్యూ విధించడం వల్ల ప్రజలు బయటకురాలేని పరిస్థితి! అయినా సరే శాంతిభద్రతల కోసం రాత్రిళ్లు పోలీసులు గస్తీ తిరుగుతుంటే తలుపుసందు ల్లోంచి ‘సర్‌ కాఫీ వేడిగా ఉంది, తలుపుతీసి బయటపెట్టాం. వెచ్చగా తాగి డ్యూటీ చేసుకోండి కొందరు అని ఆ సరఫరా చేసేవారట! పోలీసులు క్షణకోసమే కష్టపడుతున్నారని నిజమైన సానుభూతితో ప్రవర్తించిన తీరు అది.

అలాంటి గుర్తింపు పోలీ సులు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు చట్టా నికి బాధ్యులు.ఆ సంగతి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పరిగణనలోకి తీసుకోవాలి. పాతకాలం పెత్తనం చెలాయించా లంటే కుదరదు. చట్టపరిధిలో పోలీసులు విధులు నిర్వహిస్తే చాలా సమస్యలు సమిసిపోతాయి.కానీ అటు కొందరు పోలీ సులు, ఇటు రాజకీయ నాయకులు పరిధిని పట్టించుకోరు. గీత దాటితేనే సమస్యలు వస్తాయి! మధ్యలో ప్రజలు నష్టపోవడం విధాయకమయింది. పోలీసుల పనితీరును తప్పుపట్తున్నారు. కానీ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నారో ప్రభుత్వాలే పట్టించుకోని పరిస్థితుల్లో ప్రజలుమాత్రం ఏం చేయ గలరు?రోజూ 24 గంటలు డ్యూటీ చేయాలి! వీక్లీ ఆఫ్‌ అనేది చాలావరకు పేపరు మీదనే! పండుగలూ, పబ్బాలు మరిచిపో వాలి!

ప్రజలకు సేవచేయాలని కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఆసక్తి కనుమరుగవ్ఞతుంది. పోలీసూ మనిషేగా! జీతాలు పనికితగ్గట్టు ఉండకపోవడం అంద రికీ తెలిసిన విషయమే! ప్రభుత్వాలువేసిన కమిటీలు, తలపెట్ట దల్చుకున్న సంస్కరణలు అన్నీ అటకెక్కాయి. వాటిని గురించి ఎప్పుడో ఒకప్పుడుసమస్య వచ్చినప్పుడు పట్టించుకోటమే! విద్యా ధికులు పోలీసుఉద్యోగాల్లో చేరుతున్నారు. విద్యవల్ల భావ్ఞకత్వం అబ్బే అవకాశాలు చాలా ఎక్కువ! అందుచేతనేమో ఒత్తిళ్లు ఈ మధ్యచేరిన యువకులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు.ఈ సమస్యను త్రుటిలోనే తుంచేయాలి.

దీనివిషయంలో పోలీసు పెద్దలు మనసుపెట్టి ఆలోచించి, ప్రణాళికలను సమస్య ను పరిష్కరించటానికి అమలుచేసే అవసరం ఉంది. ట్రయినిం గుతోపాటు ఆధునిక హంగులు, నేరపరిశోధనల్లో మరింతగా పెంచాలి. ఈ మధ్యన శాస్త్రీయ పరిశోధనలు మంచి ఫలితాలు యిస్తున్నాయి. అందుకే పెద్దపెద్ద కేసులు కూడా త్వరత్వరగా పరిష్కరించబడుతున్నాయి.వృత్తి నైపుణ్యం పోలీసులను ప్రీతి పాత్రులను చేస్తుంది. కనీస సౌకర్యాలు, వృత్తిమీద గౌరవాన్ని పెంచే ప్రణాళికలతోపాటు పోలీసులు మనలోనుంచే మనకోసం వచ్చారనే భావన ప్రజల్లో ప్రభుత్వాలు కల్పించడానికి చర్యలు తీసుకున్ననాడు పోలీసులు దగ్గరవ్ఞతారు.అమరులైన పోలీసులకు నిజమైన శ్రద్ధాంజలిఘటిస్తారు. ఈసారి తెలంగాణాలో పోలీసులు డ్యూటీలో ప్రాణాలు కోల్పో కపోవడం, ఎపిలో తక్కువ సంఖ్యలోఅమరులవటం అదృష్టంగా భావించకతప్పదు. డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక కన్నీటి చుక్క మనం రాల్చక తప్పదు!

  • రావులపాటి సీతారాంరావు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/