అనాధ బాలల జీవితాల్లో వెలుగు నింపుదాం

child (file)
child (file)

నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మన పెద్దలు. నిజమే మరి నేటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులుగా వెలుగొం దుతూ దేశానికి వన్నె తెచ్చే చిన్నా రులు ఎంతోమంది మన సమాజం లో ఉన్నారు. వీరిలో కాబోయే ప్రధాన మంత్రులు ఉండవచ్చు. పైలెట్లు, రాష్ట్రపతులు, సైంటిస్టులు, మంచి మంచి క్రికెటర్లు ఉండవచ్చు. ఇటువంటి చిన్నారులు మన ఇంట్లో కూడా ఉండ వచ్చు. ఇటువంటి వాళ్లని పెద్దవాళ్లు గుర్తించి వారికి మంచి మంచి సలహాలిస్తూ ఫ్రెండ్లీ రిలేషన్‌ షిప్‌ మెయిన్‌టెన్‌ చేస్తుం డాలి. వాళ్లని ఒక్క చదువ్ఞకే అంకితం చేయకుండా చదువ్ఞని బాగా కొనసాగిస్తూనే ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేటట్లు మనవంతు సహాయసహకారాన్ని అందించాలి. ఇందుకు తల్లిదండ్రులు, గురువ్ఞలు, సమాజం వాళ్లలోని ప్రతిభా పాటవాల్ని గుర్తించి తమవంతు సేవలందించాలి. కాని నేటి మన సమాజంలో ఎంత మంది చిన్నారులు వికలాంగులు వారిలోని ప్రతిభాపాటవాలకి సరైన గుర్తింపులేక వీధిబాలలుగా తయార వ్ఞతున్నారు. ఇంకొ కొంతమంది తల్లిదండ్రులు వారికి అంగవై కల్యంతో ఉన్న పిల్లలు పుడితే వాళ్లని పెంచే ఓర్పు, నేర్పు,జాలి, దయ కరుణ ఏమాత్రం చూపకుండా నిర్దాక్షిణ్యంగా ఎక్కడెక్కడో సుదూర ప్రదేశాలలో, ఇంకా వికలాంగుల సేవాసదన్‌లో వదిలేసి వస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు మానవతా విలువల్ని పూర్తిగా మరిచిపోయి తమ పిల్లల్ని తామే అనాధులుగా చేస్తు న్నారు. ఇటువంటి చిన్నారుల్ని చూస్తే మనవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకమానరు.రేపటి పౌరులుగా వెలుగొందా ల్సిన ఈ చిన్నారులు ఇలా అనాధలుగా, వీధిబాలలుగా మారడా నికి ముఖ్యంగా పేదరికం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ చిన్నారులు ముఖ్యంగా రైల్వేస్టేషన్లలో, బస్‌స్టాండ్లలో తిరుగా డుతూ వాళ్లు తొడుకున్న చొక్కాతోనే కార్లను తూడుస్తూ మనం ఇచ్చే రూపాయి కోసం ప్రాధేయపడుతుంటారు. కొంత మంది చిన్నారులు రోడ్డుపక్కన ఉన్న చిత్తుకాగితాల్ని ఏరుకొని కొద్ది మొత్తంలో డబ్బు సంపాదించుకుంటూ అతి చిన్నవయస్సులోనే తమని తాము పోషించుకుంటారు. ఇంకా కొంత మంది వీధి బాలులుంటారు. ఏపని చేయడం చేతకాక కళ్యాణ మండపాల పక్కన, చెత్తకుండీల దగ్గర పడవేసిన విస్తరాకుల్లో మిగిలిపోయిన పదార్థాలని తింటూ పొట్టనింపుకుంటుంటారు. వీరిలో కొంత మంది దొంగతనాలు చేస్తూ బతుకుతుంటారు. ఈ చిన్నారులు మనకి తరచూ ఎక్కడో అక్కడ కనబడుతుంటారు. ఈ చిన్నారు లను చూస్తుంటే ఎంతటి కఠినాత్ములైనా కన్నీళ్లపర్యంతం కాక తప్పదు. పేదరికంవల్ల వీరికి ఇంట్లో సరైన తిండి, బట్ట, చదువ్ఞ లభించవ్ఞ.ఇంకా ఈ అనాధ బాలల్ని తోటి పిల్లలు హేళన కూడా చేస్తుంటారు. పిల్లల్ని తిడుతూ సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో పిల్లలు కూడా చదువ్ఞ మీద శ్రద్ధకనబరచక, తల్లిదండ్రులంటే మంచి అభిప్రాయం లేక వాళ్లకి తల్లిదండ్రులకి మధ్య కమ్యూ నికేషన్‌ గ్యాప్‌ పెరుగుతుంది. దీంతో వీళ్లు ఇంట్లో నుండి పారి పోయి చిన్న చిన్న దొంగతనాలకి పాల్పడుతూ తరచు పోలీసు లకి పట్టుబడుతుంటారు. ఇటువంటి అనాధ బాలల్ని ఆదుకో వడానికి ప్రభుత్వం 50వేలు జనాభా దాటిన ప్రతి ఊరికి అనాధ బాలల శరణాలయాల్ని తప్పనిసరిగా స్థాపించి స్వచ్ఛంద సంస్థల సహకారంతో రైల్వే స్టేషన్లలో, బస్‌స్టేషన్లలో రోడ్డుపక్కన చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉండే ఈ చిన్నారుల్ని గుర్తించి వాళ్లని తీసుకువచ్చి ఈ అనాధ శరణాలయాల్లో చేర్పించాలి. వారికి కనీస సౌకర్యాలు కల్పించి జీతానికి మంచి వాలంటీర్లని నియమించి ఈ చిన్నారులకి కౌన్సిలింగ్‌ ఇప్పించి వారి మనసు మార్చాలి. వాళ్లు అనాధలు, వికలాంగులు అనే భావన లేకుండా జీవితమంటే ఏమిటో వారికి తెలియచెప్పాలి. జీవితం మీద వారికి ఆశ కల్పించి శుచి, శుభ్రత నేర్పించాలి. అంతేకాకుండా ‘బడికి పోదాంఅనే పథకం ద్వారా ఈ అనాధపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ఇలా చేస్తే వాళ్లకి కూడా కొత్త ఆశలు చిగురించి, చెడు మార్గంలో నుంచి సన్మార్గంలోకి పయనిస్తారు. అలాగే మహిళా మండలి వాళ్లు, సేవా సంస్థలు తమవంతు సేవలో భాగంగా ఇటువంటి చిన్నారుల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి తమవంతు సహాయాన్ని సేవల్ని అందించాలి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఖర్చుపెట్టే దాంట్లో కొంత మొత్తాన్ని పుట్టిన రోజు సందర్భంగా లేదా సందర్భం ఏదైనా అనాధ పిల్లలకు ఉపయోగపడే వస్తువ్ఞలు, లేదా మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేస్తే పిల్లలు సంతోషిస్తారు. మనం చేసే సేవాకార్యక్రమాలు చూసి పిల్లలు కూడా అలవర్చుకుంటారు.

  • పింగళి భాగ్యలక్ష్మీ