పర్యావరణాన్ని పరిరక్షించుకోలేమా?

protect the environment

మానవ మనుగడకు అత్యంత ప్రధానమైనది పర్యావర ణం.సకల ప్రాణి కోటితో, ఇతర భౌతిక,రసాయనిక పదార్థాలతో మనచుట్టూ ఆవహించిన సహజ సిద్ధమైన ఏర్పాటేపర్యావరణం. పంచభూతాలతో, పశుపక్ష్యాదు లతో, క్రిమికీటకాలతో ఇతర జీవనిర్జీవ పదార్థాలతో నిక్షిప్తమై ఉన్న మనచుట్టూ ఉండే ప్రకృతి సిద్ధమైన ఏర్పాటుకు హాని జరగడం మన మనుగడకే శరాఘాతం. మనలోని స్వార్థ చింతన,అత్యాశ, చివరికి మనల్ని అధోగతిపాలు చేయక తప్పదు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్న నేటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కోకొల్లలు. మనిషి వినా శనానికి మనిషే ఏర్పర్చుకుంటున్న చితిమంటే నేటి అస్తవ్యస్థ వాతావరణ పరిస్థితులు. పర్యావరణ విధ్వంస దుష్పరిణామా లను చవిచూస్తున్నాం.నిత్యనరకాన్ని అనుభవిస్తున్నాం. వాయు కాలుష్యం, జలకాలుష్యం వలన ఏర్పడుతున్న భీతావహ పరి స్థితుల నుండి మనల్నిమనం కాపాడుకునే మార్గాలను అన్వే షించలేకపోతున్నాం. శతకోటి దరిద్య్రాలకు అనంతకోటి ఉపా యాలున్నా మనం పరిష్కార మార్గాలపై దృష్టిసారించలేకపోతు న్నాం. హడావ్ఞడి యాంత్రిక జీవితాలతో మరింత అయోమయ పరిస్థితులలోకి నెట్టబడుతున్నాం. నగరాలే కాదు చివరికి పచ్చ దనపు సోయగాలతో పరిశుభ్రమైన వాతావరణంలో హాయిగా సేదతీర్చే పల్లెసీమలు కూడా మురికికూపాలుగా మారిపోయా యి. జల,వాయు, కాలుష్యాల కారణంగా మానవ జీవితాలన్నీ హోరుగాలిలో దీపాల్లా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

జనాభా పెరుగుదలతో పాటు, అవసరాలు కూడా పెరిగాయి. పెరిగిన జనాభాకు సరిపడా ఉపాధి అవకాశాల కోసం నివాసప్రదేశాల కోసం పచ్చని వ్యవసాయ భూములను, అటవీ సంపదను ధ్వంసం చేస్తున్నాం. పరిశ్రమల పేరుతోనో, ఆర్థిక మండళ్ల పేరుతోనో,సాంకేతిక సేవా విప్లవ విస్తరణ నెపంతోనో భూతలాన్ని ఎడారిలా మార్చేస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, కరవ్ఞ వంటి విపత్తులకు మానవ తప్పిదాలే కారణమవ్ఞతు న్నాయి. కాలుష్యకారకాల మధ్యనిరంతరం చస్తూ బతికే దుస్థి తికి మనమే కారకులమయ్యాం.ఒక తప్పిదం మరో తప్పిదానికి నిచ్చెన వేస్తున్నది. పచ్చదనం నశించిపోతున్నది. ఫలితంగా వాతావరణంలో సహజంగా ఉండవలసిన వాయువ్ఞల నిష్పత్తి లో సమతూకం పోయింది. జల కాలుష్యం వలన అనారోగ్యం పాలవ డమేకాకుండా పం డించే పంటల్లో కూడా అనారోగ్య కారకాలు చేరుతు న్నాయి.

అధిక దిగుబడుల కోసం వాడే ఎరువ్ఞలు,క్రిమిసంహారక రసాయనాల వల్ల తినే ఆహారం విషతుల్యమైపోయింది. పంట పొలాలలో నుండి,పండ్ల తోటల నుండి బయటకొచ్చే ప్రతిఉత్పత్తి వ్యాపా రాత్మక దృక్పథంతో మరింత హానికరంగా మారిపోవడం గమ నార్హం.హానికారక రసాయనాలతో ఆరగించే ప్రతిపదార్థం కాల కూటవిషంలా మారిపోయింది. పాలు,పండ్లు, బియ్యం, కూర గాయలు ఒకటేమిటి అన్నీ కల్తీమయమైపోయాయి. రోగుల సంఖ్య పెరిగిపోయింది. రోగాలను అరికట్టేందుకు క్రొంగొత్త ఫార్మాకంపెనీలు వస్తున్నాయి. ఫార్మాకంపెనీలు కూడా మాన వాళిపై మరింత విషం చిమ్ముతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే పారిశ్రామిక విప్లవం, సాంకేతిక విప్లవం మాన వాళికి మరింత చేటుతెస్తున్నాయి.సాంప్రదాయ ఇంధనవనరుల వలన కర్బన ఉద్గారాల విడుదల అధికమైనది. కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే పర్యావరణం మరింత ప్రమాదంలో పడి, వాతావరణంలో అవాంఛనీయ మార్పులు వచ్చి, భూతా పం మరింత పెరిగిపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య దర్శిఇటీవల న్యూయార్క్‌ సదస్సులో హెచ్చరించడం జరిగింది.

2020 నాటికి వాతావరణంలో గ్రీన్హౌస్‌ వాయువ్ఞల శాతాన్ని దాదాపు సగానికిపైగా తగ్గించాలని, 2050 నాటికి వీటిని జీరోస్థాయికి తీసుకురావాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసారు. ఇది ఆచరణ సాధ్యమా? కాదా? అనేది వివిధ దేశాల విచక్ష ణపై ఆధారపడి ఉంది. శిలాజ ఇంధనాల వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా సౌరశక్తి, వాయుశక్తి వంటి పున రుత్పాదక శక్తివనరులను వినియోగించడమే పర్యావరణానికి ఉత్తమం. పునరుత్పాదక శక్తి వనరులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం. గ్రేటాథన్‌బర్గ్‌ లాంటి పోరాట పఠిమగల పర్యావరణ పరిరక్షకులు విద్యార్థుల నుంచే ఉద్భవించాలి. ప్రజల్లో మార్పు తీసుకురావాలి.

మనదేశంలో కూడా ఎంతో మంది పర్యావరణ ప్రేమికులున్నారు. పర్యావరణవేత్తలు కర్బన ఉద్గారాలపై పోరాటం చేయాలి. ధ్వంసమతువ్ఞన్న ధరిత్రి పరి రక్షణకు పర్యావరణ పరిరక్షణే ఏకైకమార్గం. ఒకప్పుడు మలే రియా లాంటి రోగాలను నివారించడానికి డి.డి.టిని విస్తృతం గా వినియోగించేవారు. దీనివలన లాభంకంటే నష్టమే ఎక్కువ జరిగింది. దీనిపై సుదీర్ఘపోరాటం సల్పి రాచెల్‌ కార్బన్‌ డి.డి.టి నిషేధానికి ఎనలేని కృషి చేయడం జరిగింది.ఇలాంటి పర్యావరణ పరిరక్షకులు మనకు ఎంతో అవసరం. పోరాటాలు చేసేవారికి, సామాజిక పర్యావరణ వేత్తలకు నేటి సమాజంలో అడుగడుగునా అడ్డంకుల ఎదురవ్ఞతుండడం గర్హనీయం. ఇలాంటి దుస్థితి నుండి సమాజం బయటపడాలి. అన్ని రంగాలు పురోభివృద్ధి చెందాలి.

– సుంకవల్లి సత్తిరాజు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/