పేదరికాన్ని నిర్మూలించలేమా?

నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

Can’t eradicate poverty?

మన దేశ పరిస్థితులు పరిశీలిస్తే పంట చేతికందినా, నోటికి అందక గ్రామాలలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెట్టుబడిదారీ సమాజంలో బడాకార్పొరేట్‌ వ్యవస్థ ప్రభుత్వాలను శాసి స్తోంది. సమసమాజం సాధించే లక్ష్యంతో దేశాధినేతలు ఎంతగా ఆర్థిక సంపన్నత సాధిస్తున్నా, పంపిణీ వైఫల్యం కొట్టొచ్చినట్టు స్పష్టమవ్ఞతుంది. సంపన్నత, బడాకార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థల గుప్పెట్లో చిక్కుకోవడంతో పేదరికం నిర్మూలన అంతంతమాత్రంగానే సాధ్యమవ్ఞతోంది.మనదేశంలో వ్యవసాయరంగం అత్యంత దయనీయంగా కృంగికృశిస్తుండటం కారణంగా కోట్లాది నిరుపేద వ్యవసాయ కూలీలు బతుకుతెరువ్ఞకోసం నగరాలవైపు వలసలు కొనసాగుతున్నాయి. నగరాలు జనజీవనంతో కిక్కిరిసి పేద ప్రజానీకం మరింత పేదరికంతో సతమతమయ్యే దుర్భరపరిస్థితులు తలెత్తుతున్నాయి.

ప్ర పంచ జనాభాకు ప్రాథమి కంగా ఆకలిదప్పులు లేకుండా తిండి గింజలు, గృహవసతి వంటి కనీస అవసరాల సమకూర్చటానికి పేదరికం నిర్మూ లన లక్ష్యంతో ప్రపంచదేశాల ప్రభు త్వాలు కృషి కొంత సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం మనదేశానికి సంబంధించి 40 కోట్ల జనాభా ఉన్న ఆ రోజులలో తిండిగింజల కొరత కారణంగా కరవ్ఞ కాటకాల సంక్షోభ దుస్థితి ఎదుర్కొవటానికి నాటి జాతి నేతలు పంచవర్షప్రణాళికల ద్వారా అధిక ఆహారోత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వ టంతో ప్రస్తుతం జనాభా 130 కోట్ల పెరిగినా సమృద్ధిగా తిండి గింజలు పండించే ప్రగతిపథంలో పయనిస్తున్నాం. ప్రజాస్వామ్య సోషలిజం లక్ష్యంగా ఆకలిదప్పులు లేని సమాజ నిర్మాణం కోసం ప్రపంచ దేశాల మేధావ్ఞలు, శతాబ్దాల శాస్త్రీయ సాంకేతిక ప్రగతిని వినియోగించుకొంటూ ముందుకుసాగుతున్నారు. కాని పేదరికం సంపన్న దేశాలలో ఒక విధంగా వ్ఞంటే నిరుపేద జనావళిని వేదనాయుతంగా పీడిస్తోంది. ప్రతి కంటికన్నీరు తుడిచే మానవతా విలువలు, సౌభాగ్యం జనజీవన శ్రేయస్సు లక్ష్యంగా దేశాలు పురో గమిస్తున్నా పేదరికం ఇంకా పీడిస్తూనే ఉంది. రోదసీ అంతరిక్ష అన్వేషణల సాంకేతిక ప్రగతి ఒకవైపు జలాంతర్గాములలో సముద్ర అంతర్భాగ అగాధాలను అన్వేషించే నాగరిక సమాజంలోని మానవాళి భూగోళంపై సామాన్య నిరుపేదల జీవన సౌభాగ్యం సాధించే దిశలో ముందుకు సాగుతున్నా అసంఖ్యాక జనావళి పలు దేశాలలో పేదరికం కోరలలో నలిగి సతమతమవ్ఞతున్నారు. అధునాతన ప్రపంచం ప్రసాదిస్తున్న సాంకేతిక జీవన శైలి, ప్రకృతి వనరులను శృతిమించి కొల్లగొట్టే పర్యావరణ విధ్వంసంకారణంగా, గ్లోబల్‌వార్మింగ్‌ సృష్టించే ప్రకృతి వైపరీత్యాలు పలుదేశాలలో జీవన విధ్వంసనం సృష్టిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పర్యావరణ విధ్వంసం సృష్టించే వరదలు, తుఫాన్‌లు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి, వాతావరణ సమతూకం దెబ్బతిని కరవ్ఞ కాటకాలు ప్రపంచంలో పలుదేశాలను పీడిస్తున్నాయి.

సంపన్నత ఒకవైపు ఊరిస్తున్నా, పేదరికం మరొకవైపు తాగేనీరు, పీల్చేగాలి, పండించే పంట కాలుష్యం కారణంగా సరైన బలవర్ధకమైన ఆహారం కొన్ని దేశాలలో లభ్యంకావటం లేదు. దానికితోడు అగ్రదేశాల ఆధిపత్యం కారణంగా యుద్ధభయం కొన్ని చిన్నచిన్న దేశాలలోమృత్యు సంక్షో భం సృష్టిస్తోంది. పేదరికం నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టిన సత్కృషి నిర్వీర్యం అవ్ఞతోంది. అసంఖ్యాక నిరుపేదల కుటుంబా లలో సరైన పోషకాహారం లేనందున పిల్లలు అకాలమృత్యువ్ఞ పాలవ్ఞతున్నారు. వృద్ధులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. మన దేశపరిస్థితులు పరిశీలిస్తే పంట చేతికందినా, నోటికి అందక గ్రామాలలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

పెట్టు బడిదారీ సమాజంలో బడాకార్పొరేట్‌ వ్యవస్థ ప్రభుత్వాలను శాసి స్తోంది. సమసమాజం సాధించే లక్ష్యంతో దేశాధినేతలు ఎంతగా ఆర్థిక సంపన్నత సాధిస్తున్నా, పంపిణీ వైఫల్యం కొట్టొచ్చినట్టు స్పష్టమవ్ఞతుంది. సంపన్నత, బడా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థల గుప్పెట్లో చిక్కుకోవడంతో, పేదరికం నిర్మూలన అంతంత మాత్రంగానే సాధ్యమవ్ఞతోంది. మనదేశంలో వ్యవసాయరంగం అత్యంత దయనీయంగా కృంగికృశిస్తుండటం కారణంగా కోట్లాది నిరుపేద వ్యవసాయ కూలీలు బతుకుతెరువ్ఞకోసం నగరాలవైపు వలసలు కొనసాగుతున్నాయి. నగరాలు జనజీవనంతో కిక్కిరిసి, పేద ప్రజానీకం మరింత పేదరికంతో సతమతమయ్యే దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

పేదరికంలో కొట్టుమిట్టాడే సమాజంలో అన్యాయ, అసమానతలు, దోపిడీ, అణచివేత, అక్రమాలు ఎన్నో సామాజిక సంఘర్షణలకు కారణమవ్ఞతుంటాయి. నేరప్రవృత్తి స్వేచ్ఛగా చెలామణి అవ్ఞతుంటుంది. భారత ప్రజాస్వామ్యంలో పేదరికం నిర్మూలనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలతో పేదల సంక్షేమం కోసం అంకితమవ్ఞతున్నాయి. నిస్సహాయులు, నిర్భాగ్యులు పేదల జీవితాలలో వెలుగు నింపటానికి సమాజం తనవంతు చేయూతనిస్తూనే ఉంది. మృత్యుముఖంలో ఉన్న అభాగ్యుల కంటికన్నీరు తుడిచే మానవతా మహనీయమూర్తి మదర్‌థెరిసా దివ్య ఆశయస్మృతికి ప్రపంచంలోని ప్రభుత్వాలు సంపన్న సమాజం అంకితమయి నట్లయితే పేదరికం సమూల నిర్మూలన సాధ్యమవుతుంది.

  • జయసూర్య , సీనియర్‌ జర్నలిస్టు

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/