కాలుష్యంతో పెరుగుతున్న కేన్సర్‌

Pollution
Pollution

ఈ భూమ్మీద ఉన్న నీటి వనరుల్లో అనగా నదులు, బావులు, చెరువులో వాడేసిన ప్లాస్టిక్‌పదార్థాలు, ఇతర పదార్థాలను పడేయడం వల్ల నీరు బాగా కలుషితం అవ్ఞతున్నది. అనగా నీటిలో ఉండే జంతుజీవాలు, బయట పరిసరాల్లో జీవించే పశుపక్ష్యాదులు పెద్దఎత్తున అంతరించిపోతున్నాయి. ఇంకా ఇ-వేస్ట్‌ పదార్థాలు, ఆస్పత్రుల వ్యర్థాలతో గాలి, నీరు తీవ్రంగా కలుషితమవ్ఞ తున్నది. ఆహారం నిల్వ ఉంచేందుకు ప్లాస్టిక్‌ను విరివిగా వాడటం వల్ల అనేక విధాలుగా ఆహారం కలుషితమయ్యే పరిస్థితి కానవస్తున్నది. అనేక రకాల పండ్లకు విరివిగా రసాయనాలు వాడి మగ్గబెట్టడం వల్ల ఆ పండ్లు విషతుల్యం అవ్ఞతున్నాయి. అలాంటి పండ్లను నిత్యం మనం తీసుకుంటున్నాం. వీటన్నింటి మూలాన మానవ్ఞలు అనేకరోగాలకు గురవ్ఞతున్నారు.

ప్రా థమికంగా మానవ్ఞనికి అవసరమైన గాలి,నీరు, ఆహారం తీవ్రకాలుష్యానికి గురవ్ఞతున్నాయి. ఇవి కలుషితం కావడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడినవారు ఈ దేశంలో ఎక్కువ అయ్యారని అన డంలో ఏమాత్రం సందేహంలేదు. ముఖ్యంగా వాడవాడలా, వీధి వీధినా ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో ప్లాస్టిక్‌ పదార్థాలతో నిండుగా బయటపరిసరాలు కనబడుతున్నాయి. అంటే చెత్తచెదారం, ప్లాస్టిక్‌ పదార్థాల వల్ల వెలువడే విషవాయువ్ఞల బారినపడి మానవ పరిణామం క్రమేపీ అంతరించిపోతున్నదని అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అలాగే అనేక ఫ్యాక్టరీల నుండి వచ్చే కర్బన ఉద్గారాలు, కర్బన రసాయన వాయువ్ఞలు గాలిలో, నీటిలో కలసి తీవ్ర కాలుష్యానికి గురవ్ఞతున్నాయి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్‌ పదార్థాల నుండి వెలువడే విషవాయువ్ఞలు గాలి, నీరు, ఆహారం కాలుష్యం కావడానికి కారణం కావా? ఈ భూమ్మీద ఉన్న నీటి వనరుల్లో అనగా నదులు, బావ్ఞలు, చెరువ్ఞలలో వాడేసిన ప్లాస్టిక్‌పదార్థాలు, ఇతర పదార్థాలను పడేయడం వల్ల నీరు బాగా కలుషితం అవ్ఞతున్నది.

అనగా నీటిలో ఉండే జంతుజీవాలు, బయట పరిసరాల్లో జీవించే పశుపక్ష్యాదులు పెద్దఎత్తున అంతరించిపోతున్నాయి. ఇంకా ఇ-వేస్ట్‌ పదార్థాలు, ఆస్పత్రుల వ్యర్థాలతో గాలి, నీరు తీవ్రంగా కలుషితమవ్ఞ తున్నది. ఆహారం నిల్వ ఉంచేందుకు ప్లాస్టిక్‌ను విరివిగా వాడటం వల్ల అనేక విధాలుగా ఆహారం కలుషితమయ్యే పరిస్థితి కానవస్తున్నది. అనేక రకాల పండ్లకు విరివిగా రసాయనాలు వాడి మగ్గబెట్టడం వల్ల ఆ పండ్లు విషతుల్యం అవ్ఞతున్నాయి. అలాంటి పండ్లను నిత్యం మనం తీసుకుంటున్నాం. వీటన్నింటి మూలాన మానవ్ఞలు అనేకరోగాలకు గురవ్ఞతున్నారు. రోడ్లపై వివిధ మోటార్‌ వాహనాలను విరివిగా వాడటం వల్ల, కాలం చెల్లిన వాహనాల నుండి వెలువడే కార్బన్‌ మోనాక్సైడ్‌ లాంటి విషవాయువ్ఞల వలన వాతావరణం పూర్తిగా కలుషితం అవ్ఞతున్నది. ఈ కారణంగా ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్‌ వ్యాధికి ఎక్కువ శాతం మంది గురవ్ఞ తున్నారు. గత దశాబ్దకాలంగా చూసుకుంటే భారతదేశంలో క్యాన్సర్‌ జబ్బుతో బాధపడేవారు ఎక్కువయ్యారు. అయితే ఈ క్యాన్సర్‌ వ్యాధి ప్రబలడానికి ముఖ్య కారణాలుగా పైన పేర్కొన్న గాలి, నీరు, ఆహారాన్ని మనమే కలుషితం చేస్తున్నాం. ఈ కలుషితానికి పూర్తి బాధ్యత మానవ్ఞలే వహించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జాగరూకతతో వ్యవహరించి రానున్న భావితరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవ్ఞని ప్రాథమిక అవసరాలైన గాలి, నీరు, ఆహారం కలుషితం కాకుండా సరైన విధానాలను అవలంబించాల్సిన అవసరం నేటి ప్రజలపై తప్ప కుండా ఉంది. దీనికోసం మన ముందుతరాల సంప్రదాయ పద్ధ తులను ఉపయోగించి తీవ్ర కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. అంటే మానవ్ఞని జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో ముందు తరాలు చూపించిన మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్న దన్నమాట. వాతావరణంలో మనం పీల్చేగాలిలో కర్బన ఉద్గా రాలు ప్లాస్టిక్‌ నుండి వెలువడే విషవాయువ్ఞలు ఎక్కువగా ఉండడం వల్ల మానవ్ఞలకు క్యాన్సర్‌ రోగాలు ఇట్టే సంక్రమిస్తు న్నాయని డాక్టర్లు తెలియచేస్తున్నారు. అలాగే మనుషులు తరచూ ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీరును, ప్యాకెట్‌లలో నీరు తాగడం వల్ల క్యాన్సర్‌ పెరగడానికి ఒక కారణంగా పేర్కొంటున్నారు.

ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహారాన్ని ప్లాస్టిక్‌ పాత్ర లలో ప్రజలు అధికంగా తీసుకోవడం వల్ల, అలాగే వివిధ రకాల ఆహారపదార్థాలను తయారు చేసేటప్పుడు మరల, మరల మరగ బెట్టే నూనెల వాడకం వల్ల క్యాన్సర్‌ వ్యాధి తీవ్రంగా ప్రబలు తుందని వైద్యనిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ రోజులలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ మద్యం దేశం మొత్తం మీద ఏరులై పారుతున్నది. నిత్యం మద్యానికి అల వాటుపడే మానవ్ఞల శరీరంలో వివిధ రకాల క్యాన్సర్‌ వ్యాధులు సోకేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నది. నిల్వ ఉంచినమాంసం తినడం వల్ల ఈ క్యాన్సర్‌ వ్యాధి ప్రబలుతోందని ఆరోగ్యనిపు ణులు తెలియచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టణాలలో దొరికే ఫ్రైడ్‌ చికెన్‌, బర్గర్లు, పిజ్జాలు లాంటి నిల్వ పదార్థాలు తిన డానికి నేటి ప్రజానీకం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివలన అనేకరకాలైన జీర్ణకోశ క్యాన్సర్‌ వ్యాధులు బయటపడుతున్నాయి. స్వయంకృ తాపరాధం వల్ల యువత మద్యంతో పాటు ధూమ పానం చేయడం, గుట్కా, ఖైనీలు నమలడం, మత్తుపదార్థాల వాడకం వల్ల క్యాన్సర్‌ తీవ్రంగా మానవ్ఞలలో ప్రబలడానికి ప్రత్యేకమైన కారణాలుగా చెప్పవచ్చు. ఈ చెడు అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌ మొదలగు రకరకాలైన క్యాన్సర్ల బారినపడిన ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఈ దేశంలో క్యాన్సర్‌ వ్యాధి వచ్చిన కుటుంబాలు అనేకం ఉన్నా యి.

చాలా పేదకుటుంబాలలో, మధ్యతరగతి కుటుంబాలలో ఈ క్యాన్సర్‌ వ్యాధి ఉన్న రోగుల కోసం వారి వద్ద ఉన్న మొత్తం ఆస్తులను అమ్ముకొనే పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎలాంటి ఆస్తులు లేనివారి సంగతి ఏమిటి? దారిద్య్రరేఖకు దిగువనున్న రోగులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఉచితంగా చికిత్స చేయించి, మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి వారికోసం చికిత్స సమయంలో సరైన పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. ఇంకా క్యాన్సర్‌ పేషెంట్లకు, ఎయిడ్స్‌ రోగులవలే సామాజిక పింఛన్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయాలి. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడకుండా ప్రజలను తమ చైతన్యకార్యక్రమాల ద్వారా అప్రమత్తం చేయాలి. అందుకోసం ఏటా ప్రవేశపెట్టే కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌లలో భారీగా నిధులను కేటాయించాలి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు జరిపి సరైన కార్యాచరణ ప్రకటించాలి. ఆ కార్యాచరణ క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు అయ్యేటట్లు చూడాలి. దానికి తగినంత మంది సిబ్బందిని ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు జరిపి సరైన కార్యాచరణ ప్రకటించాలి. క్యాన్సర్‌ పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు.

అతిఖరీదైన చికిత్సగల వ్యాధి క్యాన్సర్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వల్ల ఏటా లక్షల మంది మరణిస్తున్నారు.ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనుచిన్నాభిన్నం చేస్తున్నదని చెప్పవచ్చు. ఎక్కువభాగం క్యాన్సర్లను ముందుగా గుర్తించి చికిత్స ద్వారా నమయం చేయవచ్చునని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడిస్తున్నది. క్యాన్సర్‌కు దారితీసే కొన్ని అంశాలను మాత్రం వైద్యనిపుణులు తెలియచేస్తున్నారు. పొగాకు నమలడం, మద్యపానం సేవించడం, వాతావరణంలో ఉండే గామాకిరణాలు, అల్ట్రా వైలెట్‌ కిరణాలు శరీరానికి తాకడం, ఇంకా దైనందిన జీవితంలో మనం తాగే పానీయాలు, ఆహారపదార్థాల్లో రసాయనాలు కలపడం, అలాగే దీర్ఘకాలికంగా మందులు వాడటం వలన క్యాన్సర్‌ వ్యాధి సోకే ప్రమాదమున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • పిల్లా తిరుపతిరావు