‘బిల్డ్‌ అమెరికా వీసా!

దేశం :అమెరికా

Build America Visa
Build America Visa

హెచ్‌వన్‌బి వీసాల ద్వారా కొత్త సంస్కరణలకు నాందిపలికిన అమెరికా అధ్యక్షుడు తన అమెరికా ఫస్ట్‌ నినాదంతో మరో కొత్తప్రయోగం చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్‌కార్డుల జారీ విధానాన్ని మార్చి కొత్తగా బిల్డ్‌ అమెరికా వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అందులోనూ ప్రతిభావంతులకు మాత్రమే గ్రీన్‌కార్డులు లభించే అవకాశం ఉంది. అందులోనూ అమెరికన్‌ వలస విభాగం అధికారులు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అమెరికా చరిత్ర, సంస్కృతిని ఆకళింపు చేసుకుని ఉండాలి. వీటన్నింటికి తోడు వారు అత్యంత ప్రతిభావంతులై ఉండాలి. ఇన్ని నిబంధనలను పూరించగలిగితే వారికి బిల్డ్‌ అమెరికా వీసాలు జారీ అవుతాయి. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ కొత్త వలసవిధానం అమలవుతుందని పౌరసత్వ విభాగం వెల్లడించింది. అమెరికాలో గ్రీన్‌కార్డు అంటే శాశ్వత పౌరసత్వంగా భావిస్తారు. ప్రతిఏటా అమెరికా సుమారు 1.1 మిలియన్‌ గ్రీన్‌కార్డులు జారీచేస్తోంది. వీటివల్ల విదేశీయులకు జీవితకాలంపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీవించే అవకాశం కలుగుతుంది. ఐదేళ్లలోనే అమెరికా పౌరసత్వం లభించే వీలుంటుంది. ప్రస్తుతం ఎక్కువ కార్డులు కుటుంబ సభ్యుల అనుబంధాలను అనుస రించి జారీచేస్తున్నారు. అత్యంత నిపుణులైనవారు, ప్రతిభావంతులకు మాత్రం అతి తక్కువ గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ అవుతున్నాయి. భవిష్యత్తుకోసం అమెరికాకు వచ్చే విదేశీయులకు తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అయితే అత్యంత ప్రతిభావంతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా ఈసారి కొత్త విధానం అమలు చేస్తామన్నారు. ఇకపై కొత్త విధానంతో అమెరికాకు ప్రయోజనంకలిగేవిధంగా అత్యంత ప్రతిభావంతులు, నిపుణులకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.ప్రతిఏటా జారీచేసే గ్రీన్‌ కార్డుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని వెల్ల డించారు. ఎవరు ఎక్కడ జన్మించినా, వారి బంధువులు ఎక్కడ ఉన్నా అమెరికా పౌరునిగా మారా లనుకుంటే ప్రస్తుతం నిర్దేశించిన ప్రమాణాలను విధిగా అమలు చేయాల్సి ఉంటుందని ట్రంప్‌ స్పష్టంచేసారు. ప్రస్తుత కొత్త విధానంవల్ల విభిన్నదేశాల నుంచి అమెరికాకు వచ్చే నిపుణుల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల తమ దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ప్రస్తుత గ్రీన్‌కార్డులస్థానంలో కొత్త వీసాబిల్డ్‌ అమెరికా వీసాను జారీచేస్తామని వెల్లడించారు. నిపు ణులైతే వారికి కొన్ని పాయింట్లు, సామాజిక భద్రత పరంగా మరికొన్ని పా యింట్లు కలుస్తాయి. ఉన్న త విద్య, ఉద్యోగం లేదా ఉపాధి సృష్టికి ప్రణాళికలు ఉన్నవారికి మరిన్ని పాయిం ట్లు కలుస్తాయన్నారు.ప్రస్తు తం అమెరికా కంపెనీలు ఏర్పాటుచేయాలనుకుంటు న్న ఔత్సాహికులను చేజా ర్చుకుంటున్నదని, అనేక సందర్భాల్లో వారంతా దేశం వీడి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని ఇకపై వారంతా అమెరికాలోనే కొత్తకంపెనీలు ప్రారంభిం చవచ్చని, తద్వారా అమెరికాను నంబర్‌వన్‌స్థానంలో నిలిపేందుకు వారికి అవకాశం కల్పిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఎక్కువ వేతనం పొందుతున్నవారికి బిల్డ్‌ అమెరికా వీసాల్లో ప్రాధాన్యత నిస్తామన్నారు. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వలసవాదులు ఆర్థికంగా స్వయంపరిపుష్టి కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో అమెరికా కు వచ్చేవారు ఖచ్చితంగా ఇంగ్లీషు నేర్చుకుని ఉండా లని,ఇంగ్లీషు,పౌరశాస్త్ర విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాల న్నారు. ప్రారంభదశ ఉద్యోగాల్లోనే ఇప్పుడు అమెరికన్ల స్థానంలో విదేశీయులకు అవకాశం లభిస్తోందని, విదేశీ ఉద్యోగులు వచ్చి అమెరికన్ల ఉద్యోగాలను తన్నుకుని పోతున్నారన్న భావనను చూస్తే అమెరికాలో ఇకపై ప్రతిభావంతులు, నిపుణులు, అత్యంత ఎక్కువ వేత నం పొందుతున్నవారు, అత్యున్నత విద్యావంతులకు మాత్రమే బిల్డ్‌వీసాలు లభిస్తాయని తెలుస్తోంది. అమెరికన్లలో అల్పాదాయ వర్గాలకు సంబంధించిన ఉపాధిని దెబ్బతీసే ఏచర్యనైనా అమెరికా కట్టడి చేస్తుందన్న భావన ట్రంప్‌ విదేశీయులకు కల్పించారు. ఇప్పటివరకు కేవలం 12శాతం మాత్రమే ప్రతిభ ఆధా రంగా ఎంపిక అవుతున్నారని, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో 60 నుంచి 70 లేదా 75శాతం కూడా ఉందని అమెరికా చెపుతోంది, ఇకపై అత్యున్న త ప్రతిభావంతులకు ఇస్తున్న 12శాతం గ్రీన్‌కార్డులు ఇకపై 57శాతానికిపెరుగుతాయి. దీనితో అమెరికా కూడా ఇతరదేశాలతో సమానంగా విద్యావంతులకు పెద్దపీట వేసినట్లవుతుంది. కాగా ఇపుడున్న కొత్త అమెరికన్లు, వారి భార్య పిల్లలకు సైతం ప్రాధాన్యత ఉంటుందని ట్రంప ్‌ప్రకటించారు. మొత్తంమీద అమెరికా ప్రకటించిన కొత్త బిల్డ్‌ అమెరికా వీసా వల్ల ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం ఉండేవారికి కొత్త నిబంధనలు ఎదురవుతున్నాయి. అయితే ఎక్కువ శాతం భారతీయులకు మేలుజరుగుతుందని ప్రవాస భారతీయ సంఘాలు పేర్కొంటున్నాయి. హెచ్‌వన్‌బి వీసాల్లో కోత విధించినట్రంప్‌ ఇకపై అమెరికాలోఉండే బహుళజాతి సంస్థలు నియమించుకునే విదేశీయులకు జారీచేసే వీసాలను కట్టడిచేయడంతో కొంత కలవరం ఏర్పడింది. అక్కడితో ఆగకుండా కొన్ని దేశాలను ప్రత్యేకించి ముస్లిం జనాభా దేశాలపై వేటు సైతం వేసారు. కొన్నేళ్లపాటు నిషేధం విధించారు. ఇప్పుడు తాజాగా గ్రీన్‌కార్డుల జారీ వ్యవహారం కూడా కొంత వలసలను కట్టడిచేసేందుకేనని తెలుస్తోంది. ఏదేశంలో అయినా విదేశీయులకు ఆ భాషను విధిగా నేర్చుకోవాలన్న నిబంధన సహజంగానే ఉంటుంది. అదేవిధంగా అమెరికా తమ దేశ చరిత్ర, సంస్కృతి అవగాహనతోపాటు ఇంగ్లీషుభాషకు తప్పనిసరి ప్రాధాన్యతను పెంచి ప్రపంచ దేశాల్లో పోటీతత్వాన్ని పెంచిందనడంలో ఎలాంటి సందేహంలేదు.

  • గన్ని మోహన్‌