ఇ-సిగరెట్లపై నిషేధం తప్పనిసరి

e cigarette

మానవ ఆరోగ్యంపై ముఖ్యంగా యువతపై చాలా హానిక రమైన ప్రభావాలు చూపుతున్న కారణంగా ఇ-సిగరెట్ల ను నిషేధించినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. ఇ-సిగరెట్లు ప్రమాదకరం కాదనే అపోహ నేడు చాలా మంది యువతలో ఉందని, కానీ అది నిజం కాదని ఆయన వెల్లడించారు.అలాగే పొగాకు వ్యసనం మానవ ఆరోగ్యానికి చాలా హానికరమని అందరికీ తెలుసు. కానీ ఈ వ్యసనం నుంచి బయటపడటం మాత్రం చాలాకష్టం. కానీ పోగాకు ప్రాణాంతకం ఏ రూపంలో నైనా పొగాకు తీసుకునేవారు కేన్సర్‌, డయాబెటిస్‌, రక్తపోటు వంటిరోగాల బారినపడుతున్నారు. పొగాకు కారణంగాయువత నికోటిన్‌ను తీసుకుంటుందని నికోటిన్‌చాలా హానికరం,మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్లయువత పొగాకుకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే పొగాకు, ఇ-సిగరెట్లతో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని ఇ-సిగరెట్ల అమ్మకం, వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఇ-సిగరెట్లలో దాదాపు 400 బ్రాండ్లు ఉన్నా యని, ఇవేవీ భారత్‌లో తయారు కావడం లేదని, ఇవి 150 ఫ్లేవర్లలో లభ్యమవ్ఞతున్నాయని, మనదేశంలో ప్రతి ఏడాది దాదాపు తొమ్మిది లక్షల మంది పొగాకు సంబంధిత అనా రోగ్యాల కారణంగా మరణిస్తున్నారని తెలుస్తోంది. భారత్‌లో 10.6 కోట్ల మంది యువతకు పొగ తాగే అలవాటు ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత రెండోస్థానంలో భారత్‌ ఉంది. జూల్‌, ఫలిప్‌, మోరీస్‌ వంటి కంపెనీలకు భారత్‌ అవకాశాల గనిగా కనిపిస్తోంది. కాగా న్యూయార్క్‌, మిచిగాన్‌, వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇ-సిగరెట్లపై నిషేధం విధించారు. ఇప్పుడు మనదేశం కూడా వీటిపై నిషేధం తీసుకురావడం గమనార్హం. వేపర్స్‌గా పిలిచే ఇ-సిగరెట్లవల్ల గుండెజబ్బులు వస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక పరిశోధనల్లో తేలింది. అమెరికా హార్ట్‌ అసోసియేషన్‌ జరిపిన పరిశోధనలో వేపర్స్‌ పీల్చేవారిలో 60శాతం మందికి హార్ట్‌ ఎటాక్స్‌ వస్తున్నట్లు తేలింది. రెండు ఇ-సిగరెట్ల స్మోకింగ్‌ ఒక సంప్రదాయ సిగరెట్‌ స్మోకింగ్‌కి సమానమైన నష్టాలు తెస్తోందని తెలుస్తోంది. ఎక్కువగా యువత వాడుతూ గుప్పుగుప్పున పొగ వదులుతూ దాన్ని ఫ్యాషన్‌లా భావిస్తున్నారు. ఇ స్మోకింగ్‌ వల్ల కార్డియో వస్క్యురర్‌ డిసీజ్‌ వస్తోందని వైద్యులు తెలుపుతున్నారు. చూడటానికి స్టయిలీష్‌గా ఉండి, తాగితే మంచి అనుభూతినివ్వడం ద్వారా సాధారణ సిగరెట్‌ కంటే ఇ-సిగరెట్‌ ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అందువల్లనే ఇ-సిగరెట్‌కు ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీయువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవ్ఞతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవ్ఞతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడం అంత సులువ్ఞ కాదు. విచిత్రమేమిటంటే దశాబ్దకాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఇ-సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తున్నాయి. దానివల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టయిల్‌ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో అంతకుమించి ఇ-సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివే దికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందచేశాయి. ప్రపంచంలో ఇ-సిగరెట్లను 36దేశాలు నిషేధించాయి. మనదేశంలో పంజా బ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్‌ రాష్ట్రాలు నిషేధించాయి. ఇ-సిగరెట్లు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్‌ మందును ఎలా విద్యుత్‌తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ చేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇ-సిగరెట్లకు అనేక పేర్లున్నాయి.ఇ-సిగ్స్‌, ఇ- హుక్కాస్‌, వేప్‌పెన్స్‌, ఎలక్ట్రానిక్‌ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్స్‌అని కూడా అంటారు. చూడటానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఇ-సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ.మూడువేలనుంచి రూ.30వేల వరకు మనదేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రిఫీల్‌ మార్చినట్లుగా అనేకసార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ.30వేలు పెట్టికొంటే దాంట్లో ద్రవపదార్థం అయి పోయినప్పుడుల్లా రూ.700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రిఫీల్‌ చేసుకోవచ్చు.అలా వంద నుంచి రెండొందల సార్లవరకు మార్చుకునే వెసులుబాటుంది. ఇండియాలో దీనికి ఎంతమంది బానిసలయ్యారన్న దానిపై స్పష్టమైన డేటా లేదు. సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్‌ మో నాక్సైడ్‌ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఇ-సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్‌, ఇథైలిన్‌ ఆక్సైడ్‌,ఎక్రిలమైడ్‌ వంటి రసాయనాలు వెలు వడతాయి. వాటిని పీల్చుతారు.అంతేగాక టాక్సిన్‌ మెటల్స్‌ను కూడా పీల్చుతారు. ఇ-సిగరెట్లలో ఉండే కాయిల్స్‌ ద్వారా ఇవి ఉత్పత్తిఅవ్ఞతాయి.వీటిని పీల్చడంద్వారా కేన్సర్‌, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి.అలాగే అస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తా యి. హైబిపి తలెత్తడం,ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్‌ ఇ-సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పితదితరాలు సంభవిస్తాయని వైద్యనిపుణులు అంటు న్నారు.ఇ-సిగరెట్లలో నికోటిన్‌ అనే పదార్థం ఉంటుంది. మెద డుపై అదిప్రభావం చూపుతుంది.గర్భిణీలు తాగితేమరింత ప్రమాదం.సాధారణ సిగరెట్లను మానేయడానికి ఇ-సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తు న్నాయి.కానీఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసల వ్ఞతున్నారు.ఇ-సిగరెట్లలోఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇ-సిగ రెట్లు తయారుచేసే ప్రధాన బ్రాండ్లుఅన్నీ కూడా పొగాకు కంపె నీలే కావడంగమనార్హం.టినేజీ పిల్లలను ఇ-సిగరెట్లు ఆకర్షించ డానికి ప్రధాన కారణం వివిధరకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉండటం,ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం,పైగా దీనివల్ల సాధారణ సిగరెట్లకంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. కావ్ఞన నేడు వీటిని నిషేధించి వాటి బారినుంచి యువతను,వారిఆరోగ్యాలను కాపాడుకోవాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇ-సిగరెట్లపై నిషేధాన్ని అమలు చేయాలి.

-ఆత్మకూరు భారతి

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/