రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Agriculture
Agriculture farmer

గత ఐదేళ్లలో రైతుల నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. వ్యవసాయ రంగంలో ఉన్న ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారో బిజెపి, కాంగ్రెస్‌ రాజకీయ పక్షాలు చెప్పలేకపోయాయి. దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందో గత ఐదేళ్లలో జరిగిన రైతు ఉద్య మాలే చెబుతున్నాయి. రైతు ఆత్మహత్యలు జరగని రోజులేదు. సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చినా, ప్రమాద ఘంటికలు మోగించినా పాలకులు మాత్రం సరైన ప్రత్యామ్నాయంతో ప్రజల ముందుకు రావడం లేదు. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం కొన్ని నగదు పథకాలను ప్రకటించడం సరికాదన్నది విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోంది. నిజామాబాద్‌కు చెందిన పసుపు రైతులు వారణాసి వెళ్లటం, అక్కడ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడే ప్రయత్నం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పసుపు బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పించాలన్న తమ డిమాండ్‌ను దేశమంతా వినపడేటట్టు చేశారు. అయితే ఎన్నికల ముంగిట ప్రధాని మోడీకి ఇది ప్రతికూలంగా మారుతుందన్న ఆందోళనతో రైతుల నామినేషన్‌ ప్రక్రియను తెరవెనుక శక్తులు అడ్డుకున్నాయి. దీంతో వారణాసిలో ఎన్ని కల అధికారులు రైతుల నామినేషన్‌లను తిరస్కరించారు. రైతు సమస్యలు ఎన్నికల్లో ప్రధానాంశాలైతే ఫలితాలు తారు మారు అవ్ఞతాయన్న భయాన్ని పాలకులకు తెలిసేలా ఈ ఘటన నిరూపించింది. విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి అన్నింటి ధరలూ పెరగడం రైతు పెట్టుబడి వ్యయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట చేతికొచ్చాక అమ్మబోతే గిట్టుబాటు ధర దక్కటం లేదు. దిక్కుతోచని స్థితిలో తన కష్టనష్టాల్ని తీర్చే పాలకులే లేరా? అన్న నిరాశనిస్పృహలో రైతాంగం ఉంది. ఆహార పదార్థాల ఎగుమతి దిగుమతి విధానాలు, నోట్లరద్దు నిర్ణయాల వల్ల రైతులు మరిన్ని సమస్యల్లోకి నెట్టబడ్డారు. దేశ రైతాంగమంతా ఇంత తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంటే, ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పిఎం-కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని ప్రకటించి చేతులు దులుపుకుందన్న అభిప్రాయం ఉన్నది. మోడీ సర్కార్‌ తెచ్చిన మరో పథకం పిఎం ఫసల్‌ బీమా యోజన. దీని అమలు తీరు చూశాక రైతులకు ఉపయోగపడింది తక్కువ. కార్పొరేట్‌ బీమా కంపెనీలకు ఉపయోగపడింది ఎక్కువ అన్నది ప్రచారంలో ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బిజెపి ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రైతాంగ సంక్షోభం. దీనిని గ్రహించిన బిజెపి, కాంగ్రెస్‌ వంటి పార్టీలు సార్వత్రిక ఎన్నికల ముంగిట తమ మేనిఫెస్టోలో వ్యవసాయరంగంపై ఎన్నో వాగ్దానాలు, పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీ న్యా§్‌ు, బిజెపి పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఓటర్లను ఆకర్షించాలన్న ప్రయత్నం తప్ప సంక్షోభాన్ని నివారించాలన్న ఆలోచన లేదని పలువ్ఞరు మేధావ్ఞలు అభిప్రాయపడ్డారు. వంటనూనె, పప్పుదినుసుల్ని మోడీ సర్కార్‌ పెద్దఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీనివల్ల దేశీయంగా ధరలు పడిపోయి రైతులకు అన్యాయం జరిగింది. నోట్లరద్దు నిర్ణయం రైతు ఆదాయంపై దెబ్బకొట్టిందని స్వయంగా నీతి ఆయోగ్‌ సభ్యుడు ఒక నివేదిక ఇచ్చారు. వ్యవసాయ మార్కె ట్లో వ్యాపారుల నగదు లావాదేవీల్ని నోట్లరద్దు దెబ్బతీసింది. దీంతో వారు పంట కొనుగోలుకు దూరమయ్యారు. మార్కెట్లో పంట ఉత్పత్తులు పేరుకుపోయి, ధరలు పడిపోవడానికి దారి తీసింది. కొత్తగా ఏర్పడిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అయినా రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతు సమస్యల పరిష్కా రానికి, రైతుల అభివృద్ధికి కృషిచేయాల్సిన అవసరం ఉంది.

  • ఆత్మకూరు భారతి