ప్రశ్నార్థకంగా మారిన పాలనా పెత్తనం

Administration
Administration

ప్ర జాస్వామ్య విధానంలో ప్రజలే ప్రభువులు. ప్రజల తర పున ఎన్నికైన ప్రజాప్రినిధులతో చట్టసభలేర్పడి, ఆ చట్ట సభల్లో వారి తరపున పనిచేస్తారు. ప్రజల మద్దతు పొందిన పక్షాలు ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఏర్పరిచి పాలన సాగిస్తాయి ఆ చట్టసభల పర్యవేక్షణలోనే. ఆ పాలన అమలు చేయడానికి అధికార యంత్రాంగం ఉంటుంది. ఈ మౌలిక సూత్రం గుర్తుం చుకుంటే ఎలాంటి తగాదా లేదు. నేను గొప్ప, నువ్ఞ్వ తప్పు తరహా నిరర్థక చర్చలుండవ్ఞ. అయితే గుర్తున్నా ఎదుటివాళ్లని చికాకు పెట్టాలన్న ఉద్దేశ్యమో, లేదా పాలకుల కన్నా మేము మెరుగన్న భావనో ఉంటే నిత్య వివాదం- పాలనకు ఆటం కమే మిగులుతుంది.పుదుచ్చేరి పాలనావిషయాల్లో ప్రజా ప్రభు త్వానిదే అంతిమ నిర్ణయమని, అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రోజువారీ పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడం తప్పంటూ మద్రాసు హైకోర్టు విస్పష్టంగా చెప్పడం మంచి పరిణామం. రాజ్యాంగ విధులపై స్పష్టమైన అవగాహన ఉన్న అక్కడి గవ ర్నర్‌కు ఈ విషయం తెలియదని అనుకోం. కేంద్ర ప్రభుత్వ నామినీగా,రాష్ట్రపతి ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు, అక్కడ ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రిపై, అదీ విపక్షానికి చెంది న ప్రభుత్వం తీరుపై అసంతృప్తి. కాబట్టి అవసరం లేకపోయి నా రోజువారీ పాలనపై తన ప్రభావం చూపించాలన్న రాజ్యాంగ వ్యతిరేక సంకల్పం. ఇలాంటి విషయాలు కూడా న్యాయపాలిక చెప్పాల్సి రావడమే బాధాకరం. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో నడుస్తున్న వివాదాలు, ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడాల్సిన రోజుల్లో మంత్రుల పాలనా సమీక్షల అధికారా లపై, తమతమ రాజకీయ ఆలోచనల మేరకు రెండు విభిన్న వాదనలు జరుగుతున్నాయి తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తికోణం లో చర్చలేమీ లేవ్ఞ. మంత్రిగారు సమీక్షకు పిలిస్తే అధికారులు రారు. ముఖ్యమంత్రికి సమీక్ష చేసే అధికారంలేదంటారు. తదు పరి శాసనసభ ఏర్పడే వరకూ ఇప్పుడున్న అధికార పక్షపు ప్రభుత్వం నడుస్తున్నట్టే కదా.అమాత్య పదవ్ఞలురద్దు అయిపో లేదుకదా. ఆ ప్రభుత్వం తరపున పాలనా వ్యవహారాలు చూసే బాధ్యత, హక్కు వారికుంది కదా. విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం లాంటివి తదుపరి రాబోయే ప్రభుత్వానికి వదిలేయాల్సిందే. కానీ అత్యవసరమైన కార్యక్రమాలు,రోజువారీ పాలనకు సంబంధించిన సమీక్షలు చేయడంలో తప్పేమిటి? ఒకవేళ ఎన్నికల నిబంధనావళిలో అలాంటి షరతులుంటే వాటిని మార్చాలి. ఎందుకంటే ఎన్ని కల ప్రక్రియ నెలల తరబడి సాగుతున్నప్పుడు ఇలాంటి నిబం ధనలు వ్యతిరేక ఫలితాలనిస్తాయి. ప్రతివిషయాన్ని రాజకీయ కోణంలోనే చూడకుండా ప్రజల అవసరాల కోణంలో చూస్తే మటుకు ఇలాంటి విషయాలు అసలు వివాదాలే కావ్ఞ.

– డా.డి.వి.జి శంకరరావ్ఞ