సెల్‌ఫోన్‌ మోజులో విహరిస్తున్న యువతరం

youth
youth

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని మార్చే శక్తిసామర్థ్యాలు యువతలోనే ఉన్నాయి. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న స్వామి వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం. అయితే టెక్నాలజీ తమ చదువ్ఞ కేరీర్‌ కోసం కాకుండా కేవలం కాలక్షేపానికి వినియోగిస్తూ ఎందరో విద్యార్థులు తమ భవిష్య త్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్లపై విపరీతమైన వ్యామోహమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఫేస్‌బుక్‌,వాట్సాప్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌, వివిధ యాప్‌లు సోషల్‌ మీడియాలో అనునిత్యం విహరిస్తూ చాలామంది యువతీయువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పెడదారి పడుతున్నారు. ఉన్నత చదువ్ఞలకు మంచి ఉద్యోగాలకు గతంలోకంటే ఇప్పు డు అవకాశాలు దండిగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలనే తేడా లేకుండా చాలా చోట్ల విద్యార్థులలోవింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరు అవ్ఞతూ సినిమాలు, షికార్లు, బైక్‌ రైడింగ్‌లు, పార్టీల పేరుతో చదువ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నారు. విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు. కాలేజీ అధ్యాపకులు ఇదేమని ప్రశ్నిస్తే వారిపైకి ఎదురుతిరగడం, తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం సర్వ సాధారణమైంది. నేటి యువత వక్రమార్గం పట్టడానికి ప్రధాన కారణం సెల్‌ఫోన్‌లు. కాలేజీ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి వివిధ రకాల ఆండ్రా యిడ్‌ ఫోన్‌లను కొనడం, వానిలో డేటా కార్డులు వేసి నిత్యం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌లను వాడడం పరిపాటిగా మారింది. మరికొందరైతే నీలి చిత్రాలు చూడడం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, ఛాటింగ్‌ల పేరుతో రాత్రి వేళ కాలక్షేపం చేస్తూ తగినంత నిద్రకుదూరమవ్ఞతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో వివిధ సమాచారాలను, ఫొటోలను, తమ సెల్ఫీలను పోస్టుచేసి తమకు ఎన్నిలైకులు,షేర్‌లు,కామెం ట్‌లు వచ్చాయో చూసుకోవడం అలవాటుగా మారింది. కొంద రైతే కాలేజీలకు వెళ్లినా ఎప్పుడూ నెట్‌ఆన్‌లోనే పెడుతూ అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా పెడచెవిన పెట్టి సెల్‌ఫోన్‌ తోనే ఆడుకుంటున్నారు. వివిధ గేమ్స్‌, వీడియోలు, పాటలు, యాప్స్‌, డౌన్‌లోడ్‌ చేస్తూ జీవితం అంటే సెల్‌ఫోన్‌ అని భావి స్తున్నారు. ఇయర్‌ఫోన్‌లు పెట్టుకొని బైక్‌లపై ర§్‌ుర§్‌ుమని దూసుకుపోతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. బైక్‌ ప్రమాదాలతో ఇతరులకు హాని చేస్తున్నారు. – కామిడి సతీష్‌రెడ్డి


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/