సామాజిక విప్లవకారుడు మహాత్మాజ్యోతిరావు ఫూలే

Jyoti Rao phule
ఆధునికభారతీయ సమాజనిర్మాతల్లో మహాత్మా జ్యోతి రావుఫూలే అగ్రగణ్యులు. ఫూలే ఆధునిక భారతీయ జాతిపిత.సామాజిక విప్లవకారుడు. ఆధునిక పారిశ్రా మిక, భారతీయ సామాజిక సమాజంలో తొలి కార్మికవర్గ ఉద్యమ నేత. మెకంజీ నారాయణ లోఖాండేతో కలిసి ‘సత్యశోధక సమాజ్‌ స్థాపించి బొంబాయి బట్టల మిల్లు కార్మికుల 16 గంటల పని విధా నాన్ని 12 గంటలకు తగ్గించే కృషి చేశారు. పరిశ్రమల్లో పని పరి స్థితులు మెరుగుపర్చడానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. కార్మిక వర్గ ఉద్యమాల్లో కులవివక్ష, వర్ణవివక్ష వ్యతిరేకంగా కృషి చేస్తూ, కార్మిక వర్గ, దృక్పథాన్ని స్త్రీ సమానత్వాన్ని మేళవించి తొలి కార్మిక వర్గ ఉద్యమాలను నిర్మించిన మహనీయులు ఫూలే, లోఖాండే సత్యశోధక సమాజ్‌ ఉద్యమం.ఉద్యమ నిర్మాతలైన మహాత్మ జ్యోతి రావ్ఞ ఫూలే, బావేకర్‌, లోఖండే కార్మిక వర్గ ఉద్యమాలతోపాటు రైతాంగ ఉద్యమాలను నడిపారు. ఇంగ్లాండులోని మాంచెస్టర్‌లో బట్టల మిల్లులు విస్తరించి సబ్సిడీపై ఇండియాకు దిగుమతి చేస్తూ, ఇండియాలోని చేనేతవృత్తిని బాగా దెబ్బతీశారు. ఈ విషయాన్ని సైమన్‌ కమిషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో డాIIబి.ఆర్‌ అంబేద్కర్‌ ఎంతోవివరంగా విశ్లేషించారు.బొంబాయిలో బట్టలమిల్లులు ప్రారంభంకావడంతో తెలంగాణాలోని వేలాది మంది చేనేత వృత్తి కార్మి కులు ఉన్న ఊరు, కన్నతల్లిని వదిలి మిల్లు కార్మికులుగా చేరి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.16గంటల ఈ విధానంతో అనారోగ్యం పాలయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికోసం తమ రక్తం, చెమటను ధారపోశారు.బొంబాయి, పూణె, అహ్మద్‌నగర్‌, షోలాపూర్‌ పారిశ్రా మిక అభివృద్ధికి, మహానగరాల అభివృద్ధికి తెలంగాణ నుండి వలస వెళ్లినవారి కృషి ఎంతోఉంది.ఇలా సత్యశోధక్‌ సమాజ్‌కు, జ్యోతిరావు ఫూలేకు బొంబాయికి కార్మిక ఉద్యమాలకు, తెలంగాణ ప్రజలకు మధ్య 170 ఏళ్లుగా పరస్పర సంబంధం కొనసాగుతూ వస్తున్నది.

మహాత్మాఫూలే 1827 ఏప్రిల్‌ 11నమహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. 1827లో పుట్టే నాటికి మహారాష్ట్రలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈస్టిండియా కంపెనీతో యుద్ధాలతో మహారాష్ట్రను పాలిస్తున్న పీష్వారెండవ బాజీరావ్ఞ తన గడీని కోల్పోయాడు.ఎన్నో కుటుంబాలు, నిరాశ్రయమై పోయాయి. అందులో ఫూలే తండ్రి గోవిందు కుటుంబంఒకటి. ఫూలేకు ఏడాది వయస్సు న్నప్పుడే అతని తల్లి చిమ్నాబాయి మరణించింది. తండ్రి గోవిందు రెండో పెళ్లి మాట తలపెట్టలేదు. పసివాడిని చూసుకోవడానికి ఏర్పా టు చేశాడు. జ్యోతిరావును విద్యావంతుని చేయాలని తండ్రి సంకల్పం. ఆ రోజుల్లో బ్రాహ్మణేతరులు విద్య నేర్చుకునే పద్ధతి లేదు. అయినా ఆయనకు ఆ ఆలోచన వచ్చింది. ఈ ఆధునిక కాలంలో వ్యవహారంలో ఉన్న విద్యాప్రణాళిక జ్యోతిరావు పుట్టే నాటికి భారత దేశంలోలేదు. అప్పటి విద్యావిధానం వేరు. అగ్రవర్ణాల వారు ఎక్కు వగా ఉన్న ప్రాంతాలలో కొందరు పండితులు గురుకులం వంటి పాఠశాలలు నడిపేవారు. అందులో సంస్కృతం,వ్యాకరణం, తర్కం, వేదాంతం, న్యాయశాస్త్రం వంటివి బోధించేవారు. అప్పటి ఆచారం ప్రకారం జ్యోతికి పదమూడేళ్ల వయస్సులో 1840లో పెళ్లయింది. అప్పటికి సావిత్రికి ఎనిమిదేళ్లు. ఫూలే 1841లో పూనేలోని స్కాటి ష్‌ మిషన్‌ హైస్కూలులో చేరారు. 1847లో సెకండరీ విద్యపూర్తి చేశాక ప్రభుత్వోద్యోగంలో చేరకూడదని నిర్ణయించుకున్నారు. అప్ప టికి అతినితో స్వాతంత్య్రోద్యమ భావాలు బలపడ్డాయి. అమెరికన్‌ స్వాతంత్య్రోద్యోమ చరిత్ర అతన్ని ఉత్తేజపరిచింది. జ్యోతిరావు మంచి కసరత్తు నేర్చుకున్నాడు. అప్పటి వ్యవస్థ ప్రకారం చదువు పూర్తి కాగానే తనతండ్రి వలెనే పూలఅమ్మకం పని చేయవలసి వుండింది. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రులు పెళ్లికి రమ్మంటే వెళ్లాడు జ్యతి. పవిత్రులైన బ్రామ్మణులతో ఒక కిందివర్గానికి చెందిన మాలి కొడుకు వూరేగింపులో నడవడం ఎంత కండకావరం అని ఒకాయన తిట్లకు లంకించుకున్నాడు. ఊరేగింపునించి వెళ్లగొట్టారు.ఆ విషయం తండ్రి కి చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంకా ఏమీ శిక్షించకుండా ఊరికే పం పేయడం ఔదార్యంగా భావించాడు తండ్రి. ఇలాంటి వారిని ఏను గుల చేత తొక్కించడం తండ్రికి తెలుసు. ఈ సంఘటన జ్యోతిరావు ఫూలే జీవితంలో గొప్ప మార్పుకు కారణమైంది. బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేక సామాజిక ఉద్యమాలకు ఫూలే ఉద్యమించాడు.

సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యమ ని జ్యోతిరావు భావించాడు. మహిళ లేపిల్లలను తీర్చిదిద్ద డానికీ తద్వారా సామాజిక చైతన్యానికి కారకులవుతున్నారు కనుక వారి విజ్ఞానమే దేశ సౌభాగ్యం అని గాఢంగా నమ్మి బాలికల కోసం పూణెలో ఆగస్టు1848లో పాఠశాల ప్రారంభించాడు. అది ముఖ్యంగా నిమ్మజాతుల బాలికలకు ఉద్దేశించిన పాఠశాల.దేశంలో ఇలాంటి పాఠశాల ఇదే మొదటిది. పాఠశాలలో చదువ్ఞ చెప్పడానికి ఫూలే 1848లో భార్య సావిత్రిబాయికి చదువు నేర్పించారు. ఒక స్త్రీ, అం దునా శూద్రస్త్రీ, బయటికి రావడం అదీ పంచములకు శూద్రులకు పాఠాలుచెప్పడం బ్రాహ్మణుల దృష్టిలో ఎంతో అపచారం అయింది. ఆమెను ఎన్నో అనరాని మాటలన్నారు. తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. బడి నడపడం మానేస్తేనే ఇంట్లోఉండమాన్నాడు. తండ్రిని, ఇంటిని వదిలేయడానికి నిర్ణయించుకున్నాడు ఫూలే. సావిత్రీబాయి భర్తను అనుసరించింది. నిధుల కొరతతో పాఠశాల మూత పడింది.

1851లో 8 మంది ఆడపిల్లలతో పాఠశాల పునఃప్రారంభించారు. 1851-52లో మరో రెండు బాలికల పాఠశాలలు ప్రారంభించారు. ఆ కాలంలోనే చదువుకునే ఆడపిల్లల సంఖ్య 275కి పెరిగింది.1852-53లో నిమ్మకులాల, ముఖ్యంగా మహర్‌, మాంగ్‌ల బాల బాలికల కోసం పాఠశాల ప్రారంభించారు. దాదాపు పదేళ్లపాటు పూలే  వీటిలో పనిచేశాడు. 1853లో వితంతు మహిళలకు పుట్టిన అనాధ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించారు. ఇలాంటి సంస్థ భారతదేశంలో ఇదే మొదటిది. ఇది ఎవరి ఊహకు అందని సేవ. 1852మే నెలలో జోతిరావు నిమ్మ జాతులలో విద్యా ప్రచారం లక్ష్యంగా ఒక సంస్థను ఏర్పాటుచేశాడు.దీనికి సదాశివరావు గోవాండే అధ్యక్షుడు. పాఠశాలల్లో బాలికలు బాలురుతో కలిసి కూర్చో వడానికి ఒప్పుకోలేదు. అంచేత వేర్వేరు పాఠశాలలు నడపవలసి వచ్చింది. పాఠశాలలను నడపడం కోసం జ్యోతిరావు ఫూలే కాంట్రాక్టర్లు పట్టి నిజాయితీగా పనిచేస్తే కూడా కాస్త లాభం ఉంటుందని నిరూపించారు. ఆ ఆదాయాన్ని పాఠశాలల కోసం వినియోగించారు. జ్యోతిరావు, సావిత్రి బాయి గారలు నిమ్మజాతుల పాఠశాలల కోసం సుమారు పది సంవత్సరాల పాటు కృషి చేశారు. అవి స్థిరపడ్డాయనుకున్న తర్వాత ఇతరసామాజిక, సేవా కార్యక్రమాలపై దృష్టి మళ్లించారు. ఆకాలంలో సతీసహగమనం వితంతు సమస్య, మూఢాచారాలు ప్రబలంగా ఉండేవి. ఆ పరిస్థితులను చూసి జ్యోతి రావు చలించిపోయాడు. అభాగినులైన వితంతువుల కోసం, వితంతు వులకు భర్తలేకుండా పుట్టిన పిల్లల కోసం జ్యోతిరావు ఒక శరణాలయం స్థాపించాడు. గర్భవతులైన వితంతువులకు సహాయం, పురుడుపోసుకునే సౌకర్యం, పుట్టిన శిశువుల్ని అక్కడే శరణాలయంలో ఉంచే అవకాశం అందించారు. ఈ వార్తతో పూణే బ్రాహ్మణులు కోపంతో ఊగిపోయారు. జోత్యిరావు ఫూలే తండ్రి అంత్యక్రియలను జరపడంలో నూతన ఒరవడి ప్రారంభించారు. బ్రాహ్మణుల శాస్త్రాల ప్రకారం కాకుండా కాకులకు పిండాలు వేసి అవి తమ పూర్వీకులకు చేరతాయని నమ్మకుండా, బీదలకు, వికలాంగులకు అన్నదానం చేశాడు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంచాడు.
మహాత్మారనడే 1871లోపూనేకు వచ్చినపుడు, జ్యోతిరావు సంఘ సంస్కరణ కార్యక్రమం చూసి ఎంతో సంతోషించాడు. పూలేనించి స్ఫూర్తిపొంది 1875లో ఆయన పండరిపూర్‌లో ఒక అనాధ శరణా లయం ప్రారంభించాడు. జ్యోతిరావు కవి,పదకర్త, గ్రంథకర్త, నిమ్మకుల అణిచివేతపై మూఢవిశ్వాసాలపై ఆయన రాసిన గేయాలు, పుస్తకాలు ముద్రితమై ఎంతో ప్రచారం పొందాయి. గులాంగిరి అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల ఫూలే రచనలు మహా రాష్ట్ర ప్రభుత్వం సంపుటాలుగా తేవడం, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడిక క్కడ అనువాదాలు రావడం పెరిగింది. కార్మిక వర్గాలను, కింది జా తులను జాగృతం చేయడం కోసం 1873 సెప్టెంబర్‌ 24న నారాయణ మెఖంజీ లోఖండే భారతదేశ కార్మిక ఉద్యమానికి పితా మహుడు. ఫూలే లోఖండేతో కలిసి సత్యశోధక్‌ సమాజ్‌ ఉద్యమాన్ని నిర్మించారు.పూణే మునిసిపాలిటీ సభ్యుడిగా కిందివర్గాల ఆడలలోని ప్రజల సౌకర్యం కోసం పాటుపడ్డాడు. పూనే మున్సిపాలిటీ మద్యం విక్రయించే దుకాణాల్ని పెంచడానికి 1880లో కొత్తసారా దుకాణాల కు అనుమతి ఇచ్చింది. జ్యోతిరావు మద్యపానవ్యతిరేకి. ఈ విషయ మై ఆందోళన ప్రారంభించాడు. మద్యం వల్ల పేద కుటుంబాలు శిథిలమవుతున్నాయని ఆంగ్లేయులను ఒప్పించి మద్య నిషేధానికి ఒప్పించిన మహానీయుడు ఫూలే. గాంధీజీ మద్యపాన నిషేధం రాజ్యాంగంలో చేర్చాలని కోరడానికి స్ఫూర్తి జ్యోతిరావుఫూలేయే. ఫూలే 1883 రైతు చేతి చెర్నాకోల పుస్తకాన్ని రచించారు.  జ్యోతి రావుకు అరవైసంవత్సరాలు నిండబోతున్న సందర్భంగా బొంబాయిలోని ఆయన అభిమానులు, అనుయాయులు, పెద్దఎత్తున సన్మానం తలపెట్టారు.1988 మే 11న జరిగిన పెద్దసభలో ఆయనకు మహాత్మా బిరుదునిచ్చి సన్మానించారు. ఆ సభలో ఎందరో రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు వచ్చారు. బరోడామహారాజు సాయాజీరావు అందులో ఒకరు. దశావతారాల సిద్ధాంతాన్ని ఆర్యు లు ఈ దేశం మీదికి వచ్చిన దండయాత్రల పరిణామాన్ని తెలుపు తుందని విశ్లేషిస్తూ ఫూలే 1873లో గులాంరి పుస్తకం ప్రచురించారు. 1876లో పూనె పురపాలకసంఘ సభ్యుడిగా నియమించ బడ్డారు. 1877లో మహారాష్ట్ర కరువు బాధిత ప్రాంతాల్లోని అనాథ పిల్లలను సాకేందుకు మే 17వ తేదీన సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో విక్టోరియా అనాథ శరణాలయం ఏర్పాటు చేశారు. 1879 లో సత్యశోధక్‌ సమాజ్‌ తరపున దీనబంధు వారపత్రికను ప్రారం భించారు. లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌కు, మహాత్మా ఫూలేకు మధ్య పత్రికల్లో పరస్పరం ఖండించుకుంటూ వ్యాసాలు రాసు కున్నారు. ఫూలేను, ఫూలే కృషిని వ్యతిరేకిస్తూ శూద్రులకు కూడా సమానత్వమా అని హుంకరించాడు తిలక్‌. ఫూలే పాఠశాలలు నడ పడం యావద్భారతదేశంలోని విద్యారంగనికి ఒక మలుపు. గుజరాతీ, మరాఠీ, బెంగాల్‌ భాషల్లో బాలికలకు పాఠశాలలు ప్రారం భమైనాయి. అంతకు ముందు ఈస్టిండియా కంపెనీ బ్రిటిస్‌ ప్రభు త్వ పాఠశాలలో బ్రాహ్మణులకు అగ్రవర్ణాలకు మాత్రమే ప్రవేశం వుండేది. 1854లో నిమ్మజాతుల వారిని కులం పేరిట పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించకూడదని ఆదేశాలిచ్చారు.

పెళ్లి మొదలైన శుభకార్యాలకు, మరణానంతర కర్మకాండలకు వ్యయం, అట్టహాసం లేకుండా ఉండటం, శ్రామికుల సంస్కృతిని మన్నిస్తూ అందులోంచి మత సంబంధమైన అంశాల్ని వీలైనంత తగ్గించడం పోరాటకారుల్ని వారి చరిత్రను అగ్రవర్ణ భావజాలంలో సంస్కృతీకరించకుండా సామాన్యప్రజల దృక్పథంలోంచి వ్యాఖ్యా నించడం ప్రభుత్వోద్యోగాల్లో అగ్రవర్ణ, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సర్వ త్రా ఎదుర్కోవడం అంతిమంగా శ్రామికులకు సహకరించడం ఫూలే చెప్పిన అంశాల్లో కొన్ని. జబ్బు పడిన జ్యోతిరావు 27.11.1890న మరణించారు. 1897లో పూనేలో ప్లేగు వ్యాధికి గురైన వారికి సేవ చేస్తూ అదే ప్లేగు వ్యాధికి గురై మరణించిన త్యాగశీలి సావిత్రీ బాయి ఫూలే. మొత్తం  సమాజం ఆధునిక సమాజంగా మారడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు అవసరమని పూనుకుని జీవితాన్ని అంకితం చేసినవాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే.

(రచయిత: సామాజిక తత్వవేత్త)