సంపద సృష్టికి ఒక్క ఆలోచన చాలు!

Technology
Technology

సంపద సృష్టికి ఒక్క ఆలోచన చాలు!

ఒ క చిన్న ఆలోచనను వ్యాపారావకాశంగా మలుచుకొని సంపద సృష్టించడం మహా గొప్ప విషయం. ఇది సేవాసంబంధిత వ్యాపారమే కావొచ్చు లేదా మరింత కష్టమైన విషయమే కావొచ్చు. కానీ కేవలం ఆలోచనకే పదునుపెట్టి దానినే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించి అనతికాలంలో అవిరళ కృషి సల్పి అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చేసి, అనంతమైన సంపదను సృష్టించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వారి విజయగాధలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం.

విదేశాల్లోనైతే మైక్రోసాఫ్టు, ప్లిప్‌కార్ట్‌.కామ్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, అమెజాన్‌.కామ్‌ స్నాప్‌డీల్‌, ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నో మరెన్నో ఈ కోవకు చెందినవే. కేవలం తన మెదడులో మెరుపులాంటి ఆలోచనలతో అధిక సంపన్నులుగా మారిన అవకాశాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేం. ఇందులో భాగంగానే చరవాణి (మొబైల్‌) మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి రోజుకోవింత ఆవిష్కరణతో, విభిన్న ఆకర్షణలతో మనుషులను మంత్రముగ్దులకు గురి చేస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక చోట ఉండి మాట్లాడితే మరెక్కడో ఉన్న వ్యక్తికీ వినబడుతుందన్న విషయాన్ని సామాన్య ప్రజానీకాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

దినదినాభివృద్ధి చెందే విధంగా ఎన్నో రకాల చరవాణి తయారీ కంపెనీలు, వివిధ రకాలైన నెట్‌వర్కింగ్‌లు వెలిశాక మామూలు ధరలకే సగటు మానవ్ఞడికి అందుబాటులోకి వస్తున్నాయి. మొదటి ఇంటికొక చరవాణి ఉంటే నేడు మనిషికి ఒక్కటి సరిపోవడం లేదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఒక చరవాణి దాని పరి ణామక్రమంలో, క్రమేణా అభివృద్ధిచెందుతూ, మనిషికి కావాల్సిన కనీసావసరాలలో ఒకటిగా చేరిందనేది నమ్మశక్యం కాని విషయం. గతంలో సమయాన్ని తెలుసుకునేందుకు గడియారాలు, వ్యాపార నిమిత్తిం కాల్యుకులేటర్లు, ఉదయాన్నే నిద్రలేవడానికి అల్లారపు గడియారాలు, ఉత్తర ప్రత్యుత్తరాల నిమిత్తం పోస్ట్‌కార్డులు లాంటివి ఉండేవి. ఒక్క చరవాణి దెబ్బలో అన్నీ కనుమరుగైపోయాయి. 2జి, 3జి, 4జి నెట్‌వర్కింగ్‌లనేవి వెలిశాఖ, స్మార్ట్‌ఫోన్ల వినియో గానికి గిరాకీ పెరిగింది.

అందులో సోషల్‌ నెట్‌వర్కింగ్‌, వెబ్‌సైట్స్‌ అందుబాటులోకి వచ్చిన ఒక మనిషిని రోజులో అత్యధిక విలువైన సమయాన్ని సైతం ఫోన్లతోనే గడపడానికి దారి తీసిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.దేశంలోని జనాభాను మించిన ఫోన్లు దేశంలో ఉంటే అత్యధికంగా నెట్‌ను వినియోగించే వారి సంఖ్యలో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానాన్ని ఆక్రమించిందంటే భారత యువత చరవాణితో అంతర్జాలాన్ని ఏ విధంగా వినియో గిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సామాజిక వెబ్‌సైట్స్‌, వివిధ రకాలైన యాప్‌లు అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని వ్యక్తుల మధ్య సామీప్యాన్ని పెంచింది. నిరంతరం చాటింగ్‌, గ్రూప్‌ చాటింగ్‌, కాల్స్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌, వీడియోకాల్స్‌, చర్చలు లాంటివి చరవాణితో చేయడం అనేది మనుషులకు సాధారణమైపోయాయి. దేశంలో ఒక పల్లెటూరు నిరక్షరాస్యుడు ఒక స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండి ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ కలిగి ఉన్నాడంటే వాటి వినియోగం ఏ రీతిలో ఉందో అవగాహన చేసుకోవచ్చు. గతంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సంఘటనలను ఒకరోజు గడిచిన తర్వాత రేడియో ద్వారా వివిధ దినపత్రికల ద్వారా మరుసటి రోజు తెలుసుకునేవారు.

కానీ నేడు ఏ మూలానా ఏం జరిగిన మారుమూల ప్రాంతంలోని వారికి సైతం క్షణాలలో తెలిసిపోతుంది. అంటే అంతర్జాలం వినియోగంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారైందనడంలో వాస్తవాన్ని గ్రహించాలి. మనదేశంలో జరిగిన ఎలక్షన్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలు సాధారణ మానవ్ఞల దగ్గరికి వెళ్లకలిగి, ప్రచారం చేసుకొని, విజయంలో కీలకపాత్ర వహించాయో అందరికీ తెలిసిందే. గతంలో పెళ్లిళ్లు జరగాలంటే పెళ్లిళ్ల పేరయ్య కలిసేవారు లేదంటే మంచి సంబం ధాలను చూడాలంటే కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సివచ్చేది. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేవ్ఞ. వివిధ రకాలైన పెళ్లిళ్లకు సంబంధించిన వెబ్‌సైట్స్‌లలో మన ప్రొఫైల్‌ అప్లోడ్‌ చేస్తే దానికి తగిన సంబంధాలు దొరుకుతున్నాయి.

వివిధ రకాల పరీక్షలకు అప్లై చేయాలంటే బ్యాంకులలో డ్రాఫ్ట్‌ రూపంలో చలాన్ల రూపంలో డబ్బులు కట్టి వాటితో మ్యానువల్‌గా అప్లై చేయడం జరిగేది. కానీ నేడు బ్యాంకు అకౌంట్‌ కలిగి అందులో డబ్బులుంటే చాలు అంతా ఇంట్లోవ్ఞండి పనులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా ఇంట్లోనే ఉండి తమకు కావాల్సిన అన్ని రకాల పనులు చేసు కుంటున్నారు. ప్రస్తుత దేశ జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న యువత రోజుల్లో అత్యధిక సమయాన్ని ఫోన్లతో గడిపి స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ను నడిపిస్తున్నారు కనుకనే ప్రభుత్వం 2013 సంవత్స రాన్ని స్మార్ట్‌ఫోన్‌ సంవత్సరంగా పేర్కొన్నాయి. గతంలో సెలబ్రిటీ లు కనిపిస్తే చాలు ఆటోగ్రాఫ్‌లంటూ పేపర్‌, పెన్నులు తీసుకొని వెంటబడేవారు. కానీ నేడు సెల్ఫీల గోల మనకి తెలియనిదికాదు.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాల్లో అశ్లీల సాహిత్యం, చిత్రాలు, అనుమతి లేకుండా సమాచారం దొంగలిం చడం, మార్పిడి చేయడం, క్రెడిట్‌కార్డు, బ్యాంకింగ్‌ మోసాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వాడకం, అందులో అంతర్జాల వినియోగం వంటి కార్యకలాపాల నిమిత్తం ఎలాంటి షరతులు లేకపోవడంతో ఎవరైనా వాడుకునే అవకాశం ఉన్నందున ఒక్కరిని చూసి మరొకరు, ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న కుటుంబాలకు చెందిన యువత సైతం మూలిగే నక్కపై తాటికాయపడినట్లుగా తయారైంది. అంతర్జాలానికి రీఛార్జ్‌లా నిమిత్తం డబ్బుతో ముడి పడి ఉంది.

అంతర్జాలం వలన పలు రకాల ఉపయోగాలున్నప్పటికీ వాటిని సరైన మార్గంలో ఉపయోగార్థం వినియోగిస్తే మంచిదే కానీ, దేశంలో అత్యధికశాతం యువత కేవలం నిరుపయోగ వెబ్‌సైట్స్‌, కాలక్షేపం కోసం ఉపయోగిస్తున్నారనడంలో అవాస్తవం లేదు. నిరంతర పరిణామక్రమంలో భాగంగా పలు రంగాలలో అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధిని చూసి సంతోషించాలో లేక వాటి బారిన పడి యువత చెడుమార్గంలో పయనిస్తూ, వారి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుటున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితులు దాపురించాయి. తల్లిదండ్రులు ఎంతోకష్టపడి, చదివించి కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండాలంటే యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమయాన్ని వృధాచేసుకోకుండా ఏది అవసరం. అనవసరం అనేది గుర్తించి అవసరమైన రీతిలో అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొనుటకు ప్రయత్నించాలి. ప్రభుత్వాలు సైతం నిరుద్యోగ యువతకు ఉద్యో గావకాశాలు కల్పించి వారి శక్తి సామర్థ్యాలను తగిన స్థాయిలో ఉపయోగించు కొని వారికి ఖాళీ సమయం దొరకనీయకుండా, అంతర్జాలం ద్వారా కలిగే ముప్పు నుండి కొంతలోకొంత మేరకైనా రక్షించడానికి ప్రయత్నిస్తే పలు విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

– పొలం సైదులు