శాస్త్రీయ దృక్పథంతోనే సామాజిక అభివృద్ధి

IMG
IMG

శాస్త్రీయ దృక్పథంతోనే సామాజిక అభివృద్ధి

మన దేశంలో తరతరాలుగా వస్తున్న మతవిశ్వాసాలు సమాజంలోని అన్ని వర్గాలలో వేళ్లూనికునిపోయాయి. వీటిని కూకటివేళ్లతో పెకి లించాలంటే ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం ఒక్కటే దారి.ఏ విషయాన్ని అయినా హేతుబద్ధంగా ఆలోచించలేనప్పుడు జీవితమంతా గందరగోళగా తయారవ్ఞతుంది. ఈ గందరగోళం నుండి బయటపడాలంటే ఎవరికి వారు ఈ దైనందిన జీవితాన్ని నియమబద్ధగా శాస్త్రీయ బద్ధంగా సాగించడం అలవాటు చేసు కోవాలి. ముఖ్యంగా యువతకు ఏ విషయం గుర్తించి, విచారించి, పరీక్షించిన తరువాతే దానిని స్వీకరించడం నేర్పాలి. ప్రతిదానిలో దాగున్న నిజాల్ని వెలికి తీసి, సరికొత్త జ్ఞానానికి నాంది పలకాలి.

గత వాదాల్ని తోసిపుచ్చి, కొత్త సాక్ష్యాలతో, వాస్తవాలతో పునర్ని ర్వచించ గలశక్తి సామర్థ్యాలను యువతకు కల్పించాలి. దే శ ప్రజలంతా శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవా లని చెప్పటమే కాక రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51-ఎ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల ప్రాథమిక విధిగా పేర్కొన్నది. స్వాతంత్య్రానికి పూర్వమే మనదేశ ప్రధమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా (1946)లో శాస్త్రీయ దృక్పథం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏ విషయాన్నిఅయినా తర్కబద్ధంగా, హేతుబద్ధంగా ఆలోచించ టమే శాస్త్రీయ దృక్పథం అని పేర్కొనవచ్చు. కాని మన దేశంలో లింగ, మత, జాతి, భేదాలు లేకుండా నిరక్షర్యాసుల నుండి అక్షరాస్యుల వరకు అటెండరు నుండి అధికారుల వరకూ ఎవ్వరూ హేతుబద్ధంగా ఆలోచించట్లేదనేది వాస్తవం.

కేవలం గ్రామీణ ప్రాంతాల వారే కాకుండా పట్టణ ప్రాంత ప్రజలు కూడా మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు, మూఢనమ్మకాలతో ప్రవర్తించ డం శోచనీయం. మనదేశ ప్రజలు ఎక్కువ శాతం మాయలు, మర్మాలు, తాంత్రిక విద్యలవైపు మొగ్గుచూపడానికి కారణంవారిలో శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహన కలిగించేలేకపోవడమే. మన దేశంలో తరతరాలుగా వస్తున్న మతవిశ్వాసాలు సమాజంలోని అన్ని వర్గాలలో వేళ్లూనికునిపోయాయి. వీటిని కూకటివేళ్లతో పెకి లించాలంటే ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం ఒక్కటే దారి.ఏ విషయాన్ని అయినా హేతుబద్ధంగా ఆలోచించలేనప్పుడు జీవితమంతా గందరగోళగా తయారవ్ఞతుంది. ఈ గందరగోళం నుండి బయటపడాలంటే ఎవరికి వారు ఈ దైనందిన జీవితాన్ని నియమబద్ధగా శాస్త్రీయ బద్ధంగా సాగించడం అలవాటు చేసు కోవాలి.

ముఖ్యంగా యువతకు ఏ విషయం గుర్తించి, విచారించి, పరీక్షించిన తరువాతే దానిని స్వీకరించడం నేర్పాలి. ప్రతిదానిలో దాగున్న నిజాల్ని వెలికి తీసి, సరికొత్త జ్ఞానానికి నాంది పలకాలి. గత వాదాల్ని తోసిపుచ్చి, కొత్త సాక్ష్యాలతో, వాస్తవాలతో పునర్ని ర్వచించ గలశక్తి సామర్థ్యాలను యువతకు కల్పించాలి. ఎవరో చెప్పి కట్టుకథలు, సిద్ధాంతాలను నమ్మకండా, తన కళ్లతో హేతు బద్ధమైన విధానాలతో ప్రతి అంశాన్ని వీక్షించడం నేర్పాలి.శాస్త్రీయ దృక్పథం కేవలం సమాజంలో శాస్త్ర విజ్ఞానం అవశ్యకతను గుర్తించడానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవన విధానంలో దీన్ని అలవరుచుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది.

సమాజంలోని ఆకలి, దారిద్య్రం నిరక్షరాస్యత, అపరి శుభ్రత, వనరుల దుర్వినియోగం, వంటి అనేక సమస్యలకు శాస్త్రీ య దృక్పథం పరిష్కారాలను సూచించగలదు. నేడుమనకున్న విద్యావిధానంలోని పాఠ్యాంశాలలో శాస్త్రీయ దృక్పథంతో కూడిన అంశాలు తక్కువనే చెప్పాలి. పాఠ్యాంశాలన్నింటినీ పూర్తిగా మార్చి శాస్త్రీయ దృక్పథంతో కూడిన నూతన పాఠ్యప్రణాళికలను రూపొందించాల్సిన అవసరంఉంది. పుక్కిటి పురాణాలు, కట్టు కథలతో కూడిన పాఠాలకు స్వస్తిపలకాలి. విద్యార్థులలో నూతన ఆలోచనలు రేకెత్తించే శాస్త్రీయ విద్యావిధానాన్ని రూప కల్పన చేయాలి. పుట్టిన బిడ్డ శాస్త్రీయ దృక్పథంతో ప్రవర్తించడం గమని స్తుంటే ఆ దేవ్ఞడు కూడా విజ్ఞాన శాస్త్రానికే ఓటేస్తున్నాడని పిస్తోంది.

పురిటిగుడ్డల్లోని బిడ్డ తన స్పర్శద్వారా, అనుభూతుల ద్వారా తనతల్లి ఎవ్వరో కనుగొనగలరు. దీనికి నిదర్శనం తన తల్లి కాకుండా వేరొకరు చేతుల్లోకి తీసుకుంటే, వారి స్పర్శ, ఉష్ణో గ్రత, ప్రవర్తనలు గ్రహించి తన తల్లి కాదని తెలుసుకుని ఏడవటం మొదలెడతారు. ఇది కేవలం భగవంతుడు మనిషికి ప్రసాదించిన శాస్త్రీయ విజ్ఞానం ద్వారానే సాధ్యమని మనందరికీ తెలిసిందే. తెలిసి కూడా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిందిపోయి సంస్కృతి, సాంప్రదా యాలు, మత విశ్వాసాలు సమాజంలోని కట్టుబాట్ల వంటి వాటి ప్రభావం వల్ల తన ఆలోచనలన్నింటినీ నిర్హేతుబద్ధమైన అంశాల చుట్టూ కేంద్రీకృతం చేస్తూ జీవితాన్ని బానిసమయం చేసుకుంటు న్నాడు నేటి మానవ్ఞడు. ఏ సంస్కృతి, సాంప్రదాయమైన శాస్త్రీయ పద్ధతిలోనే ఆచారాలను నియమాలను నిర్వచిస్తుంది. మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతిలో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగున్నాయి.

వాటిని ఆ కాలానుగు ణంగా నిర్వచించడం జరిగింది. ప్రతి సాంస్కృతిక అంశంలోని శాస్త్రీయ అంశాన్ని గ్రహించి ఈ కాలానికి పునర్నిర్వచించుకోవా ల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పూర్వం ఇళ్లలో గోమూత్రం, పేడతో కూడిన మట్టితో నేలను అలుక్కునే వారు. గడపలకు పసుపు పూసేవారు. వాకిళ్లకు మామిడితోరణాలు కట్టేవారు. ఆ కాలంలో నేలపై గచ్చులేకపోవడం వల్ల ఇంట్లోకి పురుగు,పుట్ర రాకుండా కాపాడటానికి యాంటిబయోటిక్‌ గుణాలు కల పసుపు, గోమూత్రం వంటివి వాడేవాళ్లు. నేడు ప్రతి ఇంట్లో మార్పులే. గ్రానైట్లతో గచ్చువేసుకోవడం వల్ల ఈ అవసరం లేదు. ఇదే విధంగా దేవ్ఞడి గుడికెళితే తలపై అక్షింతలు వేస్తారు

. పూర్వం కేశపోషణకు సరైన ఔషధాలు లేకపోవడంతో తలలో పేలు వంటి వి చేరకుండా ఉండటానికి పసుపు యాంటీబయోటిక్‌తో కలిసిన బియ్యం గింజలను తలపై వేసుకునేవారు. నేడు ఎన్నో రకాల కేశాలంకరణ వస్తువ్ఞలు అందుబాటులోకి రావడం వల్ల వీటి అవసరం లేకుండాపోయింది. కాబట్టి సంస్కృతి, సాంప్రదాయా ల్లోని వాస్తవాలను శాస్త్రీయ దృక్పథంతో మాత్రమే అడ్డుకోగలం. ఇప్పటికీ ఉత్సవాల్లో, జాతరల్లో జంతుబలులివ్వడం చూస్తున్నాం. ఇది మనిషిలోని మూర్ఖత్వానికి, మృగత్వానికి పరాకాష్ట. ఏ దేవ్ఞడూ తాను సృష్టించిన తన బిడ్డలనే బలి ఇవ్వమని కోరడు.

అలా కోరేవాడు దేవ్ఞడు కాదు. ఇటువంటి దురాచారాలు ఇంకా మన సమాజంలో కొనసాగడం దురదృష్టకరం. మనిషిలోని అమా యకత్వాన్ని, మూఢత్వాన్ని, అసహనాన్ని, భావావేశాలను మతా చారాలు పెంచి పోషిస్తున్నాయి. వీటిని దూరం చేయగల ఒకే ఒక శక్తి శాస్త్రీయ విజ్ఞానానికి మాత్రమే ఉంది. మన పిల్లల్లో చిన్న తనం నుండి ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం, తెలియనివాటిని తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తించడం,ప్రశ్నిం చడం వంటివి నేర్పాలి. బాల్యంలో పిల్లలకు అన్నీ విచిత్రాలుగానే కనపడతాయి. ఎన్నో సందేహాలు బుర్ర నిండా తిరుగుతుంటాయి. ఆ సందేహాలను సందేహాలుగా మిగలకుండా వాటిని శాస్త్రీయసమా ధానాలతో నివృత్తి చేయగలిగితే వారిలో గొప్పఉత్సాహం రేకెత్తి భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకోగలరు.

కానీ ఎక్కువ శాతం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల సందేహాలను నివృత్తి చేసే ఓపిక, సహనం లేక వారిని అదిరించో, బెదిరించో నోరుమూయి స్తారు.దీనివల్ల వారిలోవ్ఞన్న ఏకాస్తో జిజ్ఞాస కాస్తా అవిరైపోతుంది. శాస్త్రవేత్తలు కేవలం తమ కార్యకలాపాలను పరిశోధనా శాలలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల సమాజంలో శాస్త్రీయదృక్పథం అడుగంటిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యు లకు, అమాయక పామరులకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాల్సిన అవశ్యక్త ఎంతైనా ఉంది. మన దేశం బహుళ సాంస్కృతిక,సమూ హాల వేదిక. వివిధ వర్గాలమనే భావాలు దెబ్బతినకుండా, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలలోని మూఢనమ్మకాలను,

అంధవిశ్వాసా లను నిర్మూలించడానికి వివిధ శాస్త్రీయ మార్గాలను శాస్త్రవేత్తలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతపెద్దలు, గురువులు కూడా కేవలం వ్యాపార ధోరణితో అంధవిశ్వాసాలను పెంచి పోషించకుండా కొంతైనా శాస్త్రీయ దృక్పథంతో వివేకానందుని మార్గం అనుసరిస్తూ హేతుబద్ధమైన ఆలోచనా విధానానికి తమ వంతు కృషి చేయాలి.కార్ల్‌మార్క్స్‌ అన్నట్లు ‘మతం మత్తు మందు లాంటింది. ఆ మత్తులో ఎటువంటి అరాచకాలు చేయడా నికైనా వెనుకాడరు.

దాని నుండి బయటపడాలంటే మనిషి మేధస్సును స్వేచ్ఛాయుతమైన ఆలోచనలవైపు మళ్లించాలి. అది ఒక విజ్ఞాన శాస్త్రంతోనే సాధ్యపడుతుంది. విజ్ఞాన శాస్త్రవైపు యువత మోగ్గుచూపాలంటే ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యాసం చేసే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. ప్రతి మండలంలో శాస్త్రీయ అవగాహనా కేంద్రాలను స్థాపించి ప్రజలకు ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర రహస్యాలను తెలియపరిస్తే కొంతమేరకైనా మనదేశం మూఢనమ్మకాల ముసుగును తొలగించిన వాళ్లమవుతాం

– అలేఖ్య