వివిధ రకాల వ్యర్థాలతో ఎన్నో అనర్ధాలు

dump
dump

వివిధ రకాల వ్యర్థాలతో ఎన్నో అనర్ధాలు

నగరపాలక, పురపాలక సంస్థల నుంచి కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ వ్యర్థాల గుట్టలను ఎక్కడ ఖాళీ ప్రదేశాలుంటే అక్కడ గుమ్మరిస్తునారే తప్ప వాటిని తిరిగి ఉపయోగించడం కానీ లేదా వాటిని పూర్తిగా నిర్మూలించడం కానీ చాలావరకు జరగడం లేదు. ఇవి నేలపొరల్లో కలియవ్ఞ. పైగా కలుషితం చేస్తాయి. ఫలితంగా ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.ఈ విపత్తును ఊహించే కేంద్రప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో ప్రక్షాళన కార్య క్రమాలకు సన్నద్ధమవ్ఞతోంది. నగరపాలక పురపాలక సంస్థలు తమ పరిధు ల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ, నిర్వహణల కోసం ఏయే ప్రణాళికలు రూ పొందించాయో, ప్రస్తుతం ఏయే చర్యలు తీసుకొంటున్నాయో నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ అధ్యయన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభు త్వాన్ని కోరింది. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, కేంద్రానికి నివేదికలు సమర్పించాలి.ఘనవ్యర్థాల నిర్వ హణ నగర పాలక సంస్థలు ఎలా నిర్వహిస్తున్నాయో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది.

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో ప్రతి నగర పాలక సంస్థ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఏ మేరకు ఉత్పత్తి అవ్ఞతున్నాయో వాటిలో నాణ్యత,ఇతర లక్షణాలు ఏమేరకు ఉన్నాయో రాష్ట్ర ప్రభు త్వం విశ్లేషించాలని కేంద్రం కోరింది. దీనిపై ప్రతి స్థానిక పాలక వర్గం వార్షిక నివేదికను రూపొందించి సంబంధిత కార్యదర్శికి, పొల్యూషన్‌ కంట్రోలుబోర్డు (కాలుష్య నియంత్రణ మండలి)కు ఏటా సమర్పించాల్సి ఉంది. దీని ప్రకారం రాష్ట్ర పురపాలక నిర్వహణ విభాగం అన్ని నగరపాలక సంస్థలకు సర్క్యులర్లు జారీ చేసింది.

గడువులోగా ఈ నివేదికలు కేంద్రానికి చేరవలసి ఉంది. నగరపాల క సంస్థలకు మరో సర్క్యులర్‌ తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తూ వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, వ్యవస్థ ఏర్పాటు కోసం కాలుష్య నియంత్రణ మండలి అధికారిక అనుమతి పొందవలసి ఉంటుందని సూచించింది. దేశంలోని 60 నగరాలు, పట్టణాల నుంచే ప్రతిరోజూ సుమారు 15,342 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అందులో అత్యధిక శాతం హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల నుంచే వెలువడుతున్నట్లు స్పష్టమయింది. గతంలో నిర్వహించిన అధ్యయనంలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి ఎనిమిది కిలోల ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ పరిమాణం 2020నాటికి 20కిలోలకు చేరుకునే ప్రమాదం ఉంద ని అంచనా.

ప్లాస్టిక్‌ మనుషులనే కాదు మూగజీవాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నగరాల్లోని ఒక్కో ఆవ్ఞ, గేదె కడుపులో సగటున 30 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటాయని ఎన్నో అధ్యయనాల్లో తేలడం గమనార్హం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చినప్పుడు డయాక్సిన్లు, కార్బన్‌ మోనాక్సైడ్‌, పాలీసైక్లిక్‌ ఆరోమేటిక్‌ హైడ్రో కార్బన్లు (పీఏహెచ్‌ఎస్‌), అతి సూక్ష్మధూళికణాలు (పీఎం25),సూక్ష్మ ధూళి కణాలు (పీఎం10), వోలటైల్‌ ఆర్గానిక్‌ కంపౌండ్స్‌ (వీవోసీ) బెంజిన్‌ తదితర ప్రమాదకర రసాయ నాలు గాల్లోకి విడుదలవ్ఞతాయి.

ఆ గాలిని పీల్చడం వల్ల క్యాన్సర్‌తోపాటు శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. నగరంలోని చెత్త కుండీల్లో ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే గుట్టలుగా పడి ఉంటున్నాయి. నాలాలు, మురుగు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని అడ్డు కుంటున్నాయి. మ్యాన్‌హోళ్ల దగ్గర మురుగు పొంగడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్‌వ్యర్థాలే.డంపింగ్‌ యార్డుకు చేరకుండానే ప్రతిరోజూ 500 టన్నుల వరకు మున్సిపల్‌ వ్యర్థాలు మంటల్లో కాలిపోతు న్నాయి.కొన్నిచోట్ల కొందరు కార్మికులే ఇలా చేస్తుంటే మరికొన్ని చోట్ల స్థానికులు అవగాహన లేక నిప్పు పెడుతున్నారు. ఇలా కాలి పోతున్న చెత్తలో ఆకులు, కాగితం చెత్తతోపాటు పదుల టన్నుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటున్నాయి.

డంపింగ్‌ యార్డులోనూ తిరిగి ఉపయోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ వ్యర్థాలను భూమిలో పాతిపెడు తున్నారు.లేదాకాల్చేస్తున్నారు. ఇది లాఉండగా ఇ-వ్యర్థాలసమస్య కూడా తీవ్ర సమస్యగా తయారైంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం ఇ-వ్యర్థాలను చట్టవిరుద్ధంగా పారవేయడం, వ్యాపారం చేయడం పరిపాటైంది.

ఈ పరిస్థితులు ముఖ్యంగా అభి వృద్ధిచెందుతున్న దేశాల్లోనే అధికం.ప్రపంచంలో ఉత్పత్తి అవ్ఞతున్న ఇ-వ్యర్థాల్లో 13 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రీ సైక్లింగ్‌ చేస్తున్నారు. ప్రధానంగా 50నుంచి 80శాతం వరకు ఇ-వ్యర్థాలను చైనా, భారత్‌,పాకిస్థాన్‌,వియత్నాం,ఫిలిప్పీన్స్‌లలో అనధికారికంగా రీసైక్లింగ్‌ చేస్తున్నారు. అమెరికాలో 70శాతం ఇ-వ్యర్థాలను మట్టికు ప్పల్లో పారవేస్తారు. ఈవ్యర్థాలను కాలిస్తే అత్యంత ప్రమాదకర మైన విష వాయువ్ఞలువ్యవస్థల మీద దుష్ప్రభావం చూపుతాయి. భూ గర్భజలాలు పూర్తిగా కలుషితమవ్ఞతాయి.వీటి ప్రభావం వృక్షా లపై, జంతువ్ఞలపై పడుతుంది. ఒక విధంగా మొత్తం పర్యావర ణానికే తీరని నష్టం కలుగుతుంది. ఉదాహరణకు చైనాలోని గైయు ని ప్రపంచంలో అతిపెద్ద ఇ-వ్యర్థాల రీసైక్లింగ్‌ కేంద్రంగా పిలు స్తారు. అక్కడ ప్రజలు పలురకాల అనారోగ్య సమస్యలతో సతమ తమవ్ఞ తున్నారు.

అక్కడి గాలిలోని నిర్దేశించిన ప్రమాణాలకన్నా దుమ్ములో సీసం 3711 రెట్లు, కాపర్‌ 115 రెట్లు అధికంగా ఉంది. మట్టిలో సీసం, క్రోమియం తదితర లోహ మూలకాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్‌ రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 80శాతం పిల్లలు సీసం విషప్రభావం వల్ల నరకయాతన పడుతున్నారు. ఐక్యరాజ్య పర్యావరణ సమితి వెల్లడించిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2007నుంచి2020 మధ్య కాలంలో ముఖ్యంగా టెలివిజన్‌ ఇ- వ్యర్థాలు 18 రెట్లు పెరుగుతాయని ఓ అంచనా.ఏటా ప్రపంచంలో నాలుగు కోట్ల టన్నులకు పైగా ఇ-వ్యర్థాలు ఉత్పత్తి అవ్ఞతు న్నాయి. ఇవి 2010లో 3.3 కోట్ల టన్నులు. మరో ఏడాదిలో ఇవి దాదాపు అయిదు కోట్లటన్నులకు చేర వచ్చు. ఇ-వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా (1.17 కోట్ల టన్నులు)యే ముందు వరుసలో ఉంది.

ఆసియాలో అత్యధికంగాచైనా 60 లక్షల టన్నులు జపాన్‌ 20 లక్షల టన్నులు, భారత్‌ 17లక్షల టన్నుల మేర ఇ-వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆర్థిక వనరులు రానురా ను పెరుగుతున్న పరిస్థితు ల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచిభారీగా ఎలక్ట్రానిక్‌వస్తువ్ఞల్ని దిగు మతి చేసుకొంటున్నాయి. భారత్‌లో 70 శాతం పైగా ఎలక్ట్రానిక్‌ వస్తువ్ఞలు ఇతర దేశాల నుంచి ముంచుకు వస్తున్నాయి. భారత్‌లోనూ కొన్నినగరాల్లో ఇ-వ్యర్థాల వల్ల భూ ఉపరితలానికి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టి కాలకూటంలా తయారైంది. ఉదాహరణకు చెన్నైలో అధికంగా కాలుష్యం పేరుకుపోయినట్టు తేలింది.చెన్నై తరువాత బెంగళూరులోని మట్టిలోనూ రసాయనాల కాలుష్యాలు పేరుకు పోయాయి.

దీనికి ప్రధానకారణాలు ఇ-వ్యర్థా లను ఇష్టమొచ్చినట్లు పునర్వినియోగానికి మార్చటం,వాటిని కాల్చి వేయడమే. ఫలితంగా విషపూరితమైన పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్‌ వెలువడుతోంది. ముంబాయిలోని మట్టిలో విషకాలుష్యం తక్కు వగా కనిపించినా గాలిలో దీని తీవ్రతఎక్కువే.మట్టిలోని కాలుష్యం ప్రపం చపు సగటు కంటే భారత్‌లో రెట్టింపు స్థాయిలో ఉంది. అంతేకా కుండా పాలీ క్లోరినేటెడ్‌ బైఫినిల్‌ వ్యర్థాల స్థాయి ప్రపంచ సగటు గ్రాముకు ఆరునానో గ్రాములు. భారత్‌లో అది రెట్టింపు. అంటే గ్రాముకు 12 నానోగ్రాములుగా ఉంటుంది. ఇవి వాయు, జలకాలుష్యాలకు మూలకారణమవ్ఞతున్నాయి.దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఇ-వ్యర్థాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. వీటిని సరైన పద్ధతుల్లో నాశనం చేయడం లేదు. ఎవరికి ఇష్టమొ చ్చినట్లు వారు పునర్వినియోగిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణచట్టం లోని ఇ-వ్యర్థాల నిబంధనల (2016)ను పలువ్ఞరు పాటించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పాటు ఇ-వ్యర్థాలతో కొన్నికోట్ల ప్రాణాలు హరించుకుపోతాయి.

– కనుకుల యాదగిరి రెడ్డి