విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు చిక్కుల షాక్‌

Production
Production

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు చిక్కుల షాక్‌

ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు లేదా నీటి ఆధారంగానే పనిచేస్తాయి. అయితే ఈ కేంద్రాలకు కావలసిన నీరు సరఫరా కావడం పెద్ద సమస్యగా తయారైంది. నదు లు, భూగర్భజలాలు ఇంకిపోయే గడ్డురోజులు దాపురించే పరిస్థి తుల్లో ధర్మల్‌ కేంద్రాల నీటి అవసరాలకు ప్రత్యామ్నాయి మార్గా లను వెతుక్కోవలసిన అవసరం ఏర్పడుతోంది. అంతేకాదు ఈ విద్యుత్‌ కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కూడా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ,పర్యావరణ శాఖల సమన్వయంతో హరిత ప్రణాళిక రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక రాబోయే భవిష్య త్తులో ఈ హరిత ప్రణాళిక బాటలోనే విద్యుత్‌ కేంద్రాలు మనుగడ సాగించవలసి వస్తుంది. ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సాధారణంగా ఏటా 950 బిలియన్‌ యూనిట్ల వరకు ఉత్పత్తి చేస్తుంటాయి.

రోజూవారీ 2800 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు అంటే 7700 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి మూడు లీటర్ల నీరు కావాలి. దీని ప్రాతిపదికగా 2026-27 సంవ త్సరానికి 12000 మిలియన్‌ లీటర్ల వరకు ప్రతిరోజు నీటిసరఫరా అవసరం.రోజురోజుకీ నీటి వనరులు కనుమరుగై నీటి చుక్క లభిం చడమే గగనం అవ్ఞతున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున విద్యుత్‌ ఉత్ప త్తికి నీటిని వెచ్చించడం కష్టతరమే. మరోవైపు బొగ్గు ఆధారిత ధర్మ ల్‌ విద్యుత్‌ ప్లాంట్లు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ విద్యుత్‌ ప్లాంట్లు అవసరాలకు సరిపడే నీటిని అందించడం సాహ సమే కాకుండా సాధ్యం కాదు. మరోవైపు విద్యుత్‌ నుంచి వెలువడే ఫ్లైయాష్‌ బూడిద కుప్పలుగా పేరుకుపోయి పర్యావరణానికి ప్రమా దం తెచ్చేవిగా ఉంటున్నాయి. ఈ ప్లైయాష్‌ వల్ల అనారోగ్యం సమస్యలు పీడిస్తుంటాయి. ము ఖ్యంగా శ్వాసకోస వ్యాధులు ఎక్కువగా దాపురిస్తాయి.

ఎప్పటికప్పు డు ఈ ప్లైయాష్‌ బూడిదతో సిమెంటు ఇటుకలు తయారు చేసి ఇళ్ళ నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి ఉపయోగించవచ్చు. కాని ప్లైయా ష్‌ను నూటికి నూరుశాతం విద్యుత్‌ కేంద్రాలు కాని మరే సంస్థలు కాని వినియోగించుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఈరెండు ప్రధాన సమస్యలు మున్ముందు విద్యుత్‌ కేంద్రాల ఉనికిని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ నేపధ్యంలో ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నగరాల్లో పట్టణాల్లోని మురికినీటి (సీవేజ్‌ వాటర్‌) ని శుద్ధిచేసి వాడు కుంటేనే నీటి సమస్య విద్యుత్‌కేంద్రాలకు కొంతయినా తీరు తుందని, లేకుంటే విద్యుత్‌ కేంద్రాల్ని మూసివేయాల్సిన పరిస్థితి తప్పదని కేంద్ర విద్యుత్‌,పర్యావరణ శాఖలు రాష్ట్రాలను హెచ్చ రించాయి. కేంద్రకాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ 6200 మిలియన్‌ లీటర్ల సీవెజ్‌ నీరు వెలు వడుతోంది. నగరీకరణ విస్తరించడం పథకాలు అమలు చేయడం వల్ల సీవెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు సామర్ధ్యం కూడా త్వరలో బాగా పెరిగే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇప్పటి వరకు విడుదల అవ్ఞ తున్న 6200 మిలియన్‌ లీటర్ల సీవెజ్‌ నీటిలో 23,277 మిలియన్‌ లీటర్లే రోజూ ట్రీట్‌మెంట్‌ అంటే శుద్ధి అవ్ఞతోంది. నగరీకరణ విస్త రణతో పాటు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు విస్తరిస్తే నీటిని శుద్ధిచేసే సామ ర్ధ్యం మరికొన్ని రెట్లు పెరుగుతుంది. నగరపాలక సంస్థల పరిధిలేని 50 కిలో మీటర్ల పరిధిలో విద్యుత్‌ ఉత్పత్తి కేద్రాలు ఉంటే అవి సీవెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నుంచి నీటిని తిరిగి వాడుకునే అవకాశం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

నేషనల్‌ ధర్మల్‌ పవర్‌ కార్పోరేషన్‌ (ఎన.టి.పి.సి)బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు అయిదింటిని గుర్తించింది. అవి-షోలాపూర్‌, మేధా, మేజా, దాది, పాత్రాటు పవర్‌ స్టేషన్లు, ఇవన్నీ సీవెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నీటినే వినియోగిస్తాయి. షోలాపూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి సంబం ధించి సీవెజ్‌ నీటి సరఫరాకు ఒప్పందం కూడా కుదిరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచెర్ల వద్ద నెలకొల్ప డానికి ప్రతిపాదించిన యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి కృష్ణా జలాలనుంచి 6.5 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసు కుంది. వీటన్నిటికీ సీవెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నీటినే తిరిగి వాడు కోవాలని కేంద్రవిద్యుత్‌ శాఖ సూచించింది.

ఇదే తరహాలో మిగతా రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చింది. ఇదే తప్పనిసరి అయితే విద్యుత్‌ కేంద్రాలన్నీ తమ పరిధిలోని మున్సిపాలిటీల నుంచి సీవెజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్ల నీటినే వాడుకోవల్సి వస్తుంది. లేదా స్వయంగా సీవె జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోక తప్పదు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం విద్యుత్‌ టారిఫ్‌ జాబితాలో చేర్చాలని కేంద్ర విద్యు త్‌శాఖ సూచించింది. పబ్లిక్‌ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి) పద్ధ్దతిలో కానీ లేదా ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఇపిసి) విధానంలోకానీ సీవెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. లేదా విద్యుత్‌ ప్లాంట్‌, మున్సిపాలిటి ఈరెండు సంస్థలూ పరస్పర సహకారంతో పెట్టుబడి నిర్వహించే ప్రక్రియ అవలంబిం చవలసి వస్తుంది.

ఇదిలా ఉండగా ఫైయాష్‌ సమస్య. విద్యుత్‌ కేం ద్రాల మనుగడనే ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. పర్యావరణ పరి రక్షణచట్టంప్రకారం నూటికి నూరుశాతం ఫైయాష్‌ను వినియోగించు కో వాల్సి వస్తుంది. అలా చేయాలంటే ఆయా విద్యుత్‌ కేంద్రాలను మూసివేయకతప్పదని కేంద్రవిద్యుత్‌ మంత్రిత్వశాఖను ‘నీతిఆయోగ్‌ హెచ్చరించింది. దీంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ను రూపొందించాయి. ఫ్లై యాష్‌ను పూర్తిగా వినియోగంలోకి తేవల్సిందేనని హెచ్చరించారు.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఫ్లైయాష్‌ నిర్వహణ ప్రణాళికను రూపొందించుకోవాలని హెచ్చరించాయి. కాలుష్యకారకం అయిన ఫ్లైయాష్‌ను వినియోగించకుండా విడిచిపెడి తే పర్యావణానికే ముప్పు తప్పదు. ఫ్లైయాష్‌తో ఇటుకల తయారీ, రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రోత్సహించాలి. దేశంలో ఉత్పత్తి అవ్ఞతున్న విద్యుత్‌లో 80 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల వల్లనే జరుగుతోంది. ఏటా 176మిలియన్‌ టన్నుల ఫైయాష్‌ ఉత్ప త్తి అవ్ఞతున్నా అందులో బహుస్వల్పమే వినియోగంలోకి వస్తోంది.

ఫ్లైయాష్‌ను వ్యర్థంగా విడిచిపెడుతున్నారు. ఇలా జరగకుండా ప్రజ ల్లో ఫ్లైయాష్‌ ఎన్ని విధాలా ఉపయోగపడుతుందో తెలిసేలా అవ గాహన శిబిరాలను నిర్వహించడం తప్పనిసరి. దేశంలో జాతీయ సగటు వినియోగంకన్నా అతి తక్కువస్థాయిలోనే ఫ్లైయాష్‌ను తెలం గాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. వెయ్యి మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదల అయ్యే ఫ్లైయాష్‌ కోసం 250 ఎకరాల స్థలం అవసరమని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ అంచనాగా చెబుతోంది.ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విడుదల అయ్యే ఫ్లైయాష్‌లో 40 శాతం వరకు వినియోగమవ్ఞతున్నట్టు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఫైయాష్‌ను వినియోగించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వినియోగించుకోలేకుంటే ఆయా విద్యుత్‌ కేంద్రాలు మూసివేయాల్సిందే అని కేంద్ర పర్యావరణ, కేంద్ర విద్యుత్‌, అటవీ మంత్రిత్వశాఖలు ఉమ్మడిగా హెచ్చరిస్తున్నా ఆ హెచ్చరికలను పాటించే స్థితిలో రాష్ట్రాలు లేవ్ఞ. దీనికి కారణం పీడిస్తున్న విద్యుత్‌ కొరత. విద్యుత్‌ కేంద్రాలను మూసివేస్తే ఎంత దారుణ పరిణామాలు ఏర్పడతాయో ఊహించాల్సిందే.

– పి.వి.ఆర్‌.మూర్తి