రెక్కలు విప్పిన విమానయానం

FLIGHT
FLIGHT

రెక్కలు విప్పిన విమానయానం

ప్రస్తుతం దేశంలోని 130 కోట్ల జనాభాలో అయిదుశాతం మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారు. మరో 15-20 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లకు పెంచాలన్న లక్ష్యాన్ని విమానయాన మంత్రిత్వశాఖ పెట్టుకుంది. భవిష్యత్తులో కేవలం విమానాలే కాకుండా హెలికాప్టర్లు, సముద్ర విమానాలు,(సీప్లేన్‌) ప్యాసింజర్‌ డ్రోన్లతో సేవలు విస్తరిస్తాయి. ఏటా 100 కోట్ల మంది ప్రయాణించేలా డిమాండ్‌ పెంచుకోవడానికి విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటి నుంచే యోచిస్తోంది.

రానున్న కాలంలో మరో 1300 విమానాలు అవసరం అవ్ఞతాయి. ‘ఉడాన్‌ పథకం కింద దేశంలో 56 విమానాశ్రయాలు, 31 హెలీపాడ్‌లు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 4500 కోట్ల రూపాయలు వెచ్చిం చడానికి సిద్ధమయింది. ఉడాన్‌ మొదటి దశలో ప్రకటించిన ఈ విమానాశ్రయాల అభివృద్ధి, పునరుద్ధరణకు 18 నెలల వ్యవధి నిర్ణ యించారు.

ఉడాన్‌ రెండో దశలో మరో 60 విమానాశ్రయాల అభి వృద్ధికి నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈదశలో విమానాల రాక పోకలు లేని 21చోట్ల ఎటిసి టవర్లు ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల మౌలిక వసతులు అభివృద్ధి చేస్తారు. విమానాలు నడపడానికి అనువుగా లేని మారుమూల ప్రాంతాల్లో హెలీపాడ్‌లు, హెలీపోర్టు లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలకు విమాన సేవలు విస్తరిస్తాయి. అత్యవసర సేవలకు అవకాశం లభిస్తుంది. రక్షణశాఖకు చెందిన విమానాశ్రయాలు హెలి పాడ్‌లను ఇకమీదట పౌర అవసరాలకు వినియోగిస్తారు. ప్రాంతీయ అనుసంధానంకోసం ఉద్దేశించిన ఉడాన్‌పథకం విమా నరంగంలో నూతన ఆధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది.

దాదాపు నగరా లు అన్నిటికీ విమానయానం చాలా సులువ్ఞగా అందుబాటు లోకి వస్తోంది. విమానాలకు ఉడాన్‌ రెక్కలు తొడుగుతుండడంతో చాలా తక్కువ దూరానికే విమాన యానం చేయగల అవకాశం లభిస్తోంది. ఈ పథకం రెండోదశ బిడ్లకు కేంద్ర పౌరవిమానయాన శాఖ తెరతీసింది.గత ఆగస్టు 24 నుంచే బిడ్ల దాఖలుకు అవకాశం కల్పిం చింది.

ఇదివరకు 150 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న విమానా శ్రయాలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ లోపు దూరంఉన్న ఎయిర్‌పోర్టుల అభివృద్ధికికూడా బిడ్డింగ్‌ దాఖలు చేయ డానికి అవకాశం కల్పించారు. ఈ రెండో దశలో హెలికా ప్టర్లనూ ఈ పథకం కిందికి తీసుకొ చ్చారు. మరో 21 విమానాశ్ర యాల నుంచి మొదలవుతాయి.

ఉడాన్‌ 2లో 150 కిలోమీటర్ల పరిమితిని ఎత్తివేసి నందున వరంగల్‌- హైదరా బాద్‌, మైసూర్‌- బెంగళూరు, మధ్య విమానాలు నడవడానికి ఎవ రైనా బిడ్డింగ్‌ దాఖలు చేసే అవకాశం లభించింది.వరంగల్‌, మైసూ ర్‌ల నుంచి వేరేనగరాలకు కూడా విమానాలు నడపవచ్చు. విజయ నగరం జిల్లా భోగాపూరం విమానాశ్రయాన్ని ప్రపంచస్థాయిలో నిర్మించాలని ఎయిర్‌బోర్డు ఆధారిటీ ఆఫ్‌ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం ప్రపంచస్థాయి కన్సల్టెంట్లను నియమిస్తామని ఎఎఐ ఛైర్మన్‌ తెలిపారు.నిర్మాణం ప్రారంభమైతే పూర్తికావడానికి నాలుగేళ్లు పడుతుంది.

తెలుగు దేశం ప్రభుత్వం ఈ బిడ్‌ను ఖరారు చేసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.ప్రాంతీయ అనుసంధాన పథకం కింద కడప విమానాశ్రయం నుంచి రాకపోకలుబాగానే సాగుతున్నాయి. ఈపథ కం వల్ల ప్రాంతీయ విమానాశ్రయాలకు మహర్దశ పట్టనున్నది. విమానాల్లో సామాన్యులు కూడా ప్రయాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరవిమానయాన విధానాన్ని రూపొం దించింది. ఇప్పటి వరకు విమానాలు నడపని విమానాశ్రయాలను అభివృద్ధి చేసి నిత్యం ప్రయాణించడానికి వీలు కల్పించడమే దీని లక్ష్యం.ఈ మేరకు గంటపాటు ప్రయాణించే వారు చాలా తక్కువలో టిక్కెట్ల ధర చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. రూ. 2,500 టిక్కెటు ఛార్జీ కన్నా మించకూడదని ఇంతకంటే తక్కువ ధరకే ఎవ రైనా అవకాశం కల్పిస్తే బాగుంటుందని కేంద్రం సూచిస్తోంది.

దీని వల్ల మధ్యతరగతి ప్రయాణికులకు చాలా సౌకర్యం కలుగుతుంది. ఈ కొత్త సర్వీసులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లకు నిధుల సర్దుబా టు కేంద్రమేచేస్తుంది.విమాన నిర్వహణ,మరమ్మతుల సేవలకు సం బంధించి90శాతం విమానాలను ప్రస్తుతం విదేశాలకు పంపుతున్నా రు. దీనికోసం ఏటా ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తుంది.

అందువల్ల స్వదేశంలోనే విమానాల నిర్వహణ, మరమ్మ తు,సేవలకు వీలుగా భారత్‌ను ప్రపంచస్థాయి కేంద్రంగా మార్చడా నికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు తగిన వనరులు, వసతు లు సమకూరిస్తే వ్యయం బాగాతగ్గుతుంది.కొన్నివేల మందికి ఉద్యో గవకాశాలు లభిస్తాయి. 2025 నాటికి భారత పౌరవిమానయాన రంగంలో3.3లక్షలఅదనపు ఉద్యోగులు అవసరం అవ్ఞతారని కేంద్ర ప్రభుత్వం తాజా గా అంచనా వేసింది. దీనివల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చాలావరకు ప్రయోజనం కలుగుతుంది. ప్రాంతీయ విమానాశ్రయాలతో పాటు అంతర్జాతీయస్థాయి విమానాశ్రయాలు అభివృద్ధి చేయడానికి వీలవుతుంది.

తెలంగాణకు సంబంధించి హైద రాబాద్‌లోనే అంతర్జాతీయ విమానాశ్రయంశంషాబాద్‌లో అందుబా టులోఉంది. నిజాం కాలం నాటి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామ గుండం, వరంగల్‌ విమానాశ్రయాలు ఇప్పుడు ఉపయోగంలో లేవ్ఞ. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాతోపాటు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరోఅంతర్జాతీయ విమానాశ్రయం అవ సరమవుతుంది.

కేంద్రప్రభుత్వ నూతన విధానంవల్ల ఈ ఆరు ప్రాం తాల్లో కొత్తవిమానాశ్రయాలు ఏర్పడగలవన్న ఆశలురెక్కలు తొడుగు తున్నాయి.నల్గొండ, మహబూబ్‌నగర్‌ కూడా ప్రాంతీయ విమానాశ్ర యాలకు అనుకూలమైన ప్రాంతాలుగా భావిసున్నారు. హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్ల ప్రాంతంలో ఏరోస్పేస్‌ సెజ్‌, హెలికాప్టర్ల త యారీ కేంద్రం నడుస్తోంది.విమాన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహ ణ, భోదన శిక్షణకోర్సులు, పరిశోధనలకు తెలంగాణ అనుకూల ప్రాంతంగా పరిగణించబడుతోంది.ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయాన్ని పరి శీలిస్తే ప్రస్తుతం విశాఖ,విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమా నాశ్రయాలు మాత్రమే ఉన్నాయి.భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడుతుంది. కడప విమానాశ్రయంతో పాటు ఒంగోలు, నెల్లూరు, తాడేపల్లిగూడెం,కర్నూలు,బొబ్బిలి ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

-పి.వి.ఆర్‌.మూర్తి