రానురాను తరిగిపోతున్న భూగర్భజలరాశి

WaterLevel

రానురాను తరిగిపోతున్న భూగర్భజలరాశి

ఆకాశంలోని చిన్ననీటి పారుదల పథకాలు అన్నిటికీ భూగర్భజలాల్లో 94.5శాతం వినియోగమవ్ఞతోంది. దీనివల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే భూగర్భజలాలపై రైతులు ఆధారపడే పరిస్థితిని చాలా వరకు తగ్గించడమే పరిష్కారమార్గమని జలవన రులు,నదుల అభివృద్ధి, గంగానదీ పునరుజ్జీవన మంత్రిత్వశాఖ నివే దిక వెల్లడించింది. భూ ఉపరితలంపై నీటిని వినియోగించే నీటి పారుదల పథకాల సామర్థ్యం తగ్గిపోవడంతో భూగర్భజలాల విని యోగంపై ఆధారపడే పథకాల సామర్థ్యం పెరిగిందని నివేదిక పే ర్కొంది. భూగర్భజలాలు దేశం మొత్తం తగ్గడం కొనసాగుతోంది. నీటిపారుదల రంగానికి 89శాతం భూగర్భజలాలను పిండుకోవడ మవ్ఞతోంది. దీనివల్ల దేశంలో అత్యధిక నీటి వినియోగరంగంగా మారింది. రైతుల నీటిపారుదల పథకాల్లో60శాతం చిన్ననీటి పారు దల పథకాలే ఉన్నాయి. అంటే నేలపై నుండే నీటి వనరుల విని యోగంపై రైతులు ఆధారపడడం బాగాతగ్గింది.ఫలితంగా భూగర్భ జల పథకాలపై ఆధారపడడం పెరిగింది.

భూగర్భజలాలపై రైతు లు ఆధారపడడాన్ని ఇతరవిధాలా భూగర్భజలాల వాడకాన్ని బాగా తగ్గించడానికి నేలపై నీటి వనరులను తిరిగి పునరుజ్జీవింపవలసిన అవసరం ఏర్పడింది. వాటి ద్వారానే వ్యవసాయ ప్రయోజనాలు నెరవేరేలా చూడడం తప్పనిసరి. భూగర్భజలాల చిన్ననీటిపారుదల పథకాలు ప్రయివేట్‌ యాజమాన్యల ఆధీనంలో కొనసాగుతున్నా యి. దేశంలో అనేక చిన్ననీటి పారుదల వ్యవస్థలు రైతుల అజ మాయిషీలో ఉన్నాయి. అందువల్ల వ్యవసాయ సాగునీటికి ఎక్కు వగా వినియోగమవ్ఞతున్నాయి.ఇందులో రెండుహెక్టార్ల కన్నా తక్కు వ భూమిగలిగిన చిన్న, సామాన్య రైతుల నీటిపారుదల పథకాల్లో ఇంకా ఎక్కువ భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదల ప్రయోజనాల కోసం దేశం మొత్తం మీద నీటిపారుదల నిర్మాణాల వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆ పథకాలకు సంబంధించి రైతుల జీవన ప్రమా ణాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించక తప్పదని నివేదిక అభి ప్రాయపడింది.

చిన్ననీటిపారుదల పథకాల ఏర్పాటులో రైతులు కీలకపాత్ర వహించి స్వయంగా తమ డబ్బును వెచ్చిస్తున్నారు. అందువల్ల వారికి ఆర్థికంగా సహకరించడానికి ప్రభుత్వపరంగా ప్రోత్సహించాలని నివేదిక సూచించింది. నదీతీర ప్రాంతాల్లో నాగరికత వెల్లివిరిసింది. పట్టణాలు, నగ రాలు వెలిశాయి. రానురాను జనాభా అత్యధికంగా పెరిగి దానికి తగ్గట్టుఅభివృద్ధి విస్తరించింది. చివరకు నదీ జలాలను, భూగర్భ జలాలను అవసరానికిమించి వినియోగించడం పరిపాటి అయింది. కానీ ఈ మేరకు ప్రణాళికలు అమలుకాలేదు.

ఇష్టానుసారంగా వ్యవ హరించే నిర్లక్ష్యం పెరిగింది. నదులకు,ప్రకృతికి ప్రజలకుమధ్య గల సహజ సంబంధాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగిం చడానికి ప్రజలు అంగీకరించడం లేదు. దేశం ప్రస్తుతం తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీన్నిసరిదిద్దే మార్గాలు ఆచరించడం లో ఇంకా జాప్యం పనికిరాదు. వ్యవసాయానికి 80 శాతం నీరు అవసరం. ఇదికాక తాగునీటి అవసరాలు తప్పనిసరి. పరిశ్రమలకు, విద్యుత్‌ ఉత్పత్తికి కూడా కావలసినంత నీరు సమకూర్చుకోవాలి. ఇవన్నీ నెరవేరడానికి పంటసాగు విధానాల మార్పిడి, నీటి వృధా ను అరికట్టడం, తిరిగి జల ఉత్పత్తిని సాధించడం తదితర చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. సాలుసరి తలసరి నీటి లభ్యత ఎలా ఉందో పరిశీలించుకుంటే చాలా దీనస్థితి కనిపిస్తుంది. 1951లో 5177 క్యూబిక్‌ మీటర్లుకాగా, 2011 నాటికి అది 1545 క్యూబిక్‌ మీటర్లకు క్షీణించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1700 క్యూబిక్‌ మీటర్లు ఉండాలి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సూచిక ప్రకారం దేశంలో తలసరి నీటి లభ్యత 2010 లో కేవలం 938 క్యూబిక్‌మీటర్లు కాగా, 2025 నాటికి ఇది 814 క్యూబిక్‌ మీటర్లకు దిగజారుతుందని అంచనా. నదుల పునరుజ్జీవా నికి ప్రతిపాదించిన మార్గాల్లో నదులవిలీనం.

ఒక నదిలో అత్యధికం గా ఉన్ననీరు నీటి కరువుతో అల్లాడుతున్న నదులకు సరఫరా కావ డానికి ఈ విలీనం ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీని వెనుకనున్న శాస్త్రీయ పరిజ్ఞానం సందేహాస్పదంగా కనిపిస్తోంది. అయితే ప్రభు త్వం నదుల అనుసంధానానికే ప్రాధాన్యం ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ఎన్ని కోట్ల రూపాయలు అయినా ఖర్చుపెట్ట డానికి సిద్ధమవ్ఞతోంది. ఈ సందర్భంగా కెన్‌-బెట్వా నదుల అను సంధానం ప్రాజెక్టును ప్రస్తావించవలసి ఉంటుంది. 18000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల పన్నాపులుల రిజర్వు ఫారెస్టులోని 10,000 హెక్టార్ల అటవీ ప్రాంతం అడ్రసు లేకుండా పోతుంది. వర్షాధార నదులకు అటవీ ప్రాంతాలే ఆధారంగా, పరీ వాహక ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది

. కాబట్టి ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టకపోవడమే మంచిది. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా కాపాడుకోక తప్పదు. నదీ తీరానికి ఆనుకుని కిలోమీటరు వెడల్పులో చెట్ల పెంపకానికి వీలుగా ఆ ప్రదేశాన్ని రిజర్వుచేయాలి.కోల్పోయిన అడవ్ఞలను మళ్లీ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా కాంపెన్సేెటరీ ఎఫారెస్టేషన్‌ ఫండ్‌ పేరున 6000కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి. ఇదేకాకుండా గత కొన్నేళ్లుగా ఖర్చుపెట్టకుండా ఉంటున్న కార్పస్‌ ఫండ్‌ 42000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నిధులతో నదీ తీరం వెంబడి పచ్చని అడవ్ఞల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టవ చ్చు.దానివల్ల పర్యావరణం, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు సమ కూరుతాయి. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాలు, మున్సిపల్‌ వ్యర్థాలు, ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం ‘నమామిగంగే బృహత్‌ కార్యక్రమా న్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలుకూడా తమ పరిధిలోని నదులను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం.

ఒకానొకప్పుడు గంగోత్రి హిమనీ నదానికి గోముఖి ముఖ ద్వారంగా ఉండేది. అదే గంగానదికి జన్మ స్థలం.రానురాను గంగోత్రి నగరం18.కి.విూ పొడవ్ఞనా విస్తరించిం ది. ఏదెలాగున్నా అడవ్ఞలను నరికివేయడం, విచ్చలవిడిగా నిర్మా ణాలు చేపట్టడం, పర్యాటకుల రద్దీ, వారి వాహనాల నుంచి వెలు వడే కాలుష్యం, ఇవన్నీ 30కి.విూ పొడవ్ఞ 0.5నుంచి 2.5 కి.విూ వెడల్పు కలిగిన హిమనీ నదానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. రానురాను ఇది క్షీణించడమే కాదు. అనేక సమస్యలకు కారణమవ్ఞ తోంది. 1935 నుంచి గంగోత్రి హిమనీనదం క్షీణిస్తూ వస్తోంది. 1935 నుంచి 1996 వరకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ హిమనీ నదాన్ని పరిశీలిస్తోంది.

1935నుండి ఏడాదికి 19 మీట ర్ల వంతున తగ్గుతూ 1996నాటికి 1147 మీటర్ల వరకు తగ్గిందని గమనించింది. ఈ కాలవ్యవధిలో నదీపరివాహక ప్రాంతం మొత్తం 5,78,100 మీటర్ల మేరకు కోల్పోయిందని శాస్త్రవేత్త డిపి దొభా యి చెప్పారు. 2000 నుంచి 2016 లోగా కేవలం 16 ఏళ్లలో 150 మీటర్ల వరకు పరీవాహక ప్రాంతాన్ని కోల్పోయినట్టు ఉత్త రాఖండ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (యుఎన్‌ఎసి) అధ్యయనంలో వెల్లడయింది. 2000 సంవత్సరంలో ఏటా 14 మీటర్ల వంతున కోల్పోగా 2012లో ఏటా12మీటర్ల వంతున కోల్పోయింది. 2015 లో 10 మీటర్ల వంతున 2016లో 20 మీటర్ల వంతున కోల్పో యిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

చాలా వరకు శీతోష్ణస్థితి మార్పుల వల్ల జరగ్గా, మానవ ప్రమేయం వల్ల మరికొంత జరిగింది. హిమనీ నదం ముఖ ద్వారం వద్ద చిన్న చిన్న తునకలుగా విడిపోవడం, దీనికితోడు నిరంతరం కరిగిపోతుండడంతో గంగోత్రి వెడల్పు ఎక్కువయింది. హిమనీనదం కుదురు పలచనైంది. గంగోత్రి చాలా భారీ హిమనీనదం.దాని పరిమాణంపెద్దది. తునకలుగా విడిపో యింది.వాతావరణం మార్పులే హిమనీ నదం క్షీణతకు దారితీస్తోం ది. దీనికి ఎగువన చిన్న ఉపనదులు వంటివి ఉన్నా ఉష్ణోగ్రత పెరగడంతో అవి కరిగి వేగంగా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. హిమనీ నదం మొదలు నుంచి కరిగి ప్రవహిస్తున్న నీటి వల్ల ప్రవా హం పెరగదు.ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ నీ రంతా ఆవిరైపోతుంది.
గంగోత్రి హిమనీనదం కుడిపక్కన ఉన్న ఉపనదులు కుడి అడుగుభాగాన్ని తాకుతుంటాయి. అందువల్ల దీని కుడిపక్కనమూల బాగా తగ్గింది. చివరకు చిన్నాభిన్నమై నీరు నిల్వ ఉండడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గంగకు నీటి సంక్షోభం ఎదురవ్ఞతుంది. గంగోత్రి హిమనదం క్షీణించడం గత 250 ఏళ్ల నుంచి జరుగుతోంది.ఇదేవిధంగా కొనసాగితే నీటికితీవ్రకొరత తప్ప దు. అందువల్ల పర్యావరణ సమతుల్యతను పాటించవలసి ఉంది. నదీ కాలుష్యాన్ని నివారించడానికి కేంద్రప్రభుత్వం నడుం కట్టిం ది.

ఉపరితల జలాలు కలుషితమవ్ఞతున్నాయి.భూగర్భజలాలు అడు గంటిపోవడం అంటేపాతాళానికి చేరుతున్నాయి. ఇంగ్లాండు, అమె రికా దేశాలను ఈ విషయంలో పరిగణ నలోకి తీసుకుంటే జలవ నరుల నిర్వహణలో ఆయాదేశాలు ఎంతో దీక్షవహించి సత్ఫలితాలు సాధించ గలిగాయి.ఇంగ్లండులోని ధేµమ్స్‌నది గంగానది కన్నా దుర్గంధ భరితమై కాలుష్యపూరితమై ఉండేది.కానీ ఎడతెగని ప్రయ త్నాలవల్ల స్వచ్ఛమైన నీటిని తిరిగి పొందగలిగింది. గంగానది ప్రక్షాళనకు 20వేల కోట్ల రూపాయల అంచనావ్యయంతో 2014లో నమామి గంగ ప్రాజెక్టుకు మోడీ ప్రభుత్వం శ్రీకారం చు ట్టింది.అంతకుముందు28ఏళ్లుగా గంగాప్రక్షాళనకు గతప్రభుత్వాలు తమ అజెండాలో కీలకాంశంగా పేర్కొన్నా ఒరిగింది శూన్యం.

-కనుకుల యాదగిరి రెడ్డి