రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ‘విజ్ఞత

TRS CANDIDATES
TRS MPS

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ‘విజ్ఞత’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉంచి రాజ్య సభకు అభ్యర్థుల నియామకం పాలకవర్గాల ఎత్తుగడ లతో సందడిగా ముగిసింది. ఈ సం దర్భంగా పాలకవర్గాల విధేయులకే అవకాశం లభించేలా యధా ప్రకారం వివిధ విభిన్న అంశాలు సమీకరణ లు చోటు చేసుకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమానత, విధేయతలకే పాలకవర్గం ప్రాధాన్యం కల్పించి బేరీజు వేయగా, ప్రతిపక్షం షెడ్యూల్డు తెగ అభ్యర్థికే ప్రాధాన్యం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అభ్యర్థుల ఎంపి కలో సామాజిక ఆధిపత్యం, ఆర్థిక అంశాలు చోటు చేసుకున్నాయి. ఇది రాజ్యసభ అంటే ఎగువ సభ, ప్రత్యక్షంగా దీనికి ఎన్నికలు జర గవని, పరోక్షంగానే విజ్ఞులైన,వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన, రాజ కీయాలకు అతీతులైన మేథోసంపన్న ప్రముఖులనే ఎంపిక చేసుకుని నియమించవలసి ఉంటుందన్న విషయాలు సిద్ధాంతకర్తలకు తెలి యనిదికాదు.కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న దేమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు.ఇంగ్లాండులోని రాజ్యసభ సభ్యుల నియామ కం ఎంత ఆదర్శంగా జరుగుతుందో పరిశీలిస్తే మన విధానం ఎలా ఉందో తెలుస్తుంది.అక్కడ మేధావులకు,విజ్ఞులకే రాజ్యసభలో చోటు కల్పిస్తారన్న వాస్తవాన్ని గుర్తించవచ్చు.ఈ సభ్యుల ఎన్నిక ప్రత్యక్షం గా జరగక పోయినప్పటికీ ఆయా సభ్యుల అనుభవం, మేధోపరి పక్వత, సేవలు దేశాన్ని ప్రగతి పధంవైపు నడిపించడానికి దిక్సూచి లా పనిచేస్తాయి.

అందుకే రాజ్యసభ అంటే చట్టసభల చరిత్రలో ప్ర త్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌ వంటి దేశం సరైన విధా నంలో విలువలకు పట్టం కట్టేలా ఎగువ సభలను రూపొందించగలి గితే ప్రత్యక్షంగా ఎన్నికయ్యే విధానానికి దూరంగా ఉన్న అల్పసం ఖ్యాక వర్గాలకు ఈ సభలు తగినప్రాతినిధ్యం కల్పించే వేదికలు అవ్ఞతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అంశాన్ని ఈ వ్యాసం ద్వారా చర్చిండం అవసరం అని నా అభిప్రాయం. ఆర్థిక అసమానతలతో, సామాజిక అంతరాలతో అల్లుకుపోతున్న మనవంటి దేశంలో ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గాన్ని పరిశీలిం చినా ఒక వర్గం ఆధిపత్యమే చెలామణి అవ్ఞతోంది. పార్టీ ఏదైనా ఎన్నికల్లో ఆ వర్గమే గుత్తగోలుగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక నియోజక వర్గం మొత్తం జనాభాలో కేవలం పది నుంచి 15 శాతం మాత్రమే వీరి సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఆధిపత్యం వహించేది ఈ వర్గమే.తమ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోగలుగుతోంది. వాస్త వానికి ఇతర కులాలు సంఖ్యాపరంగా ఉన్నా చివరకు ఆధిపత్య వర్గానికే పార్టీల్లో తగిన స్థానం లభించే అవకాశం కనిపిస్తోం ది. ఇతర కులాలు ఏకమైనా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక శక్తిగా రూ పొందినా వారి వ్యక్తిగత పరిమితులే వారికి అడ్డుగోడలవుతున్నాయి.

ఎన్నికల్లో వీరిని అధికార కేంద్రాలుగా మారడానికి తగిన అవకాశం కల్పించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బలహీన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి పరోక్ష ఎన్నికలే సువర్ణావ కాశం. ఈ అవకాశం ద్వారానే వీరి ఆకాంక్షలు నెరవేరడానికి ఆ మేర కు రాజకీయ కోణంలో సరిగ్గా ప్రాతినిధ్యం వహించడానికి వీలవ్ఞ తుంది.

కానీ రాజకీయ పార్టీలు ఈ సామాజికవర్గాలను తమ కు అనుకూలంగా మలచుకుని పరోక్ష ఎన్నిక మార్గాన్ని ఉపయో గించు కుని అదే ఆధిపత్య సామాజికవర్గం ఆకాంక్షలకు, ఆర్థిక అంశాలకు వీలుగా ప్రాతినిధ్య పట్టాన్ని కట్టబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను విశ్లేషిస్తే అధికార పాలకవర్గం, ప్రతిపక్షం కూడా ఒకే ట్రెండ్‌ను కొనసాగిం చాయి. ఆర్థికంగా పటిష్టమైన అభ్యర్థికోసం ప్రతిపక్షం ఎంతగా అన్వే షించిందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సమస్య పాలక వర్గానికి ఎదురుకాదు. అందువల్ల సరైన ప్రాతినిధ్యం లేని సామా జికవర్గాలకు ఎగువసభలో నియమించే అవకాశాన్ని చక్కగా విని యోగించుకోవచ్చు.

కానీ అభ్యర్థుల ఎంపికలో, సామాజిక సమా నతలో అనేక లోపాలు చోటు చేసుకోవడంతో చివరకు ‘ఆధిపత్య వర్గ అభ్యర్థులనే ఎంచుకోవలసి వచ్చింది.గత కొన్నేళ్లుగా ఎలాంటి ప్రాతినిధ్యానికి నోచుకోని సామాజికవర్గాల సంగతి పరిశీలిస్తే నాయీబ్రాహ్మణులు, రజకులు, చేనేత పనివారు, శాలివాహనులు, బ్రాహ్మణులు, వైశ్యులు, తదితర కులాల గురించి మాట్లాడక తప్ప దు.రాజకీయ రంగుల చిత్రంలో ఈ కులాల రంగులకు ఎలాంటి చోటులేదు.ప్రాతినిధ్యంలేదనే వాస్తవాన్ని చెప్పకతప్పదు. రాజ్యాంగ పరంగా దళితులు తగిన విధంగా ప్రాతినిధ్యం వహించడాన్ని ఎవ రూ కాదనరు. కానీ ఇతర కులాల, అల్పసంఖ్యాక సామాజికవర్గాల ప్రాతినిధ్యం మాటేమిటి? ఎలాంటి గుర్తింపులేని వీరికి కూడా రాజ్య సభలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

ఈ వర్గాలకు ప్రత్యక్షఎన్నికల విధానంద్వారా పూర్తిగాగుర్తించని రాజకీయ వ్యవ స్థపై ఇప్పటికీ వ్యాఖ్యానించవలసి రావడం దురదృష్టకరం. ఇటు వంటి సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి వీలయ్యే పరో క్ష ఎన్నికల విధానాన్ని కూడా రాజకీయ పార్టీలు తెలివిగా ఆధి పత్యసామాజిక వర్గమేలు కోసం ఉపయోగించుకోవడం గమనార్హం.

రాజకీయాలు ఎలా సాగినా ఆధిపత్య వర్గాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ మేరకు ప్రయోజనాలు ఆశించే సామాజికవర్గాలన్నీ ఏడు రంగుల ఇంద్రధనస్సులా ఏకమై సంకీర్ణమై ప్రత్యక్ష ఎన్నిక లకు బలీయమైన శక్తిగా రూపొందగలవ్ఞ. ఆ విధంగానే అధికారం లోకి వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ ప్రాతినిధ్యం వహి స్తాయి. కానీ ఇవన్నీ నెరవేరాలంటే రాజకీయపార్టీ ఆసరా కావలసి వస్తుంది. ఈ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో ఆ నాయకుడే తనకు అనుకూలంగా అవకాశాన్ని సరిగ్గా వినియోగించు కోగలుగుతాడు. ఇటువంటి అవకాశం కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో లభించే వాతావరణం ఉంది.

వైఎస్సార్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కావచ్చు. బిజెపి లేదా పవన్‌ కళ్యాణ్‌ కావచ్చు. వీరిలో ఎవరైనా గుర్తింపు లేని సామాజికవర్గాలను కూడదీసుకుని, వారిని ఉత్తేజ పరిచి, ప్రోత్సహించి తమ భవిష్య ఆలోచనలకు అనుగుణంగా సం కీర్ణ కూటమిని ఏర్పాటు చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. వాస్త వానికి ఆంధ్రప్రదేశ్‌ భవిష్య రాజకీయాన్ని నిర్ణయించే దిశగా ఈ ప్రయత్నం ముందుకు సాగేవీలుంది. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఆ నాడు సంకీర్ణకూటమి సహాయం వల్లనే ఒబామా అఖండ విజ యం సాధించారన్న సంగతి తెలిసిందే.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ అవనికపై సరికొత్త పరిణామం నెలకొనే అవకాశం కన్పిస్తోంది

– ఐ.వై.ఆర్‌ కృష్ణారావు
మాజీ చీఫ్‌ సెక్రటరీ (ఎపి)=