మారుతున్న ప్రపంచంలో యువత మానసిక ఆరోగ్యం

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

మారుతున్న ప్రపంచంలో యువత మానసిక ఆరోగ్యం

DEPRESSION
DEPRESSION

ఒక మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢ త్వాన్ని ఏర్పరుచుకోవడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలి పించడానికి 1992 అక్టోబరు 10న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ స్థాపించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినో త్సవాన్ని అక్టోబరు 10న జరుపుకుంటాం. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను చూస్తే జగిత్యాల జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు మద్యం సేవించి పెట్రోల్‌ ఒంటిపై పోసు కొని కాల్చుకున్న ఘటన, హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్యలు, కత్తులతో దాడులు, తొమ్మిదవ తరగతిలోనే ప్రేమలు చిగురించడం, హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు, దారు ణాలు, లైంగిక దాడులు, ప్రేమోన్మాదం ఇలా ప్రతిరోజూ ఏదో ఒక సంఘటనను మీడియాలో చూస్తూనే ఉన్నాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో ఐదు కోట్లమంది కిపైగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. విశ్వంలోని జనాభాలో 12 శాతం మంది మానసిక రుగ్మతలతో సతమతమవ్ఞతున్నారు. ప్రస్తుత సమాజంలోని యువత శారీరక దృఢత్వంపై కనబరిచే శ్రద్ధ, మానసిక దృఢత్వంపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. యుక్త వయసు ప్రభావం యుక్తవయసు ప్రారంభంలో చాలా మార్పులు భౌతిక, శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. పాఠశాలల విద్యను ముగించు కొని ఇంటి నుండి దూరంగా వెళ్లి కాలేజీల హాస్టళ్లలో, యూనివ ర్శిటీ విద్యలోకి అడు గుపెడుతూ ఉంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త స్నేహి తులు, కొత్త వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవా ల్సి ఉంటుంది. తదను గుణంగా యువతలో మానసికంగా ఒత్తిడి, భయం అనేవి సర్వసా ధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఆధునిక పోకడలతో టెక్నాలజీ వినియోగం,రోజువారీ కార్యక్రమాలలో భాగంగా పడుకునే రాత్రి వేళల సమయాలలో మార్పు వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.

కౌమార దశలో ఉన్న యువత ప్రకృతి వైపరీత్యాలు, ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న అంటురోగాలను ఎదుర్కోవడంలో మానసిక అనారోగ్యానికి గురవ్ఞతుంటారు. 14వ ఏటనే మానసిక అనారోగ్యం ప్రపంచవ్యాప్తంగా కౌమార దశలోని పిల్లల్లో 14 సంవత్సరాలకే మానసిక అనారోగ్యానికి సంబంధించిన రుగ్మతలో సగభాగం ప్రారంభం అవ్ఞతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మానసిక రుగ్మతలలో చాలా వరకూ గుర్తించలేని చికిత్స అందించలేనివి ఎక్కువగా ఉన్నాయి. కౌమార దశలో ఉన్న వ్యక్తులలో అనారోగ్యానికి కారణాలలో డిప్రెషన్‌ మూడవ ప్రధాన కారణం. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న యువతలో చనిపోవడానికి ఆత్మహత్య రెండవ కారణం.

యుక్తవయసులో మద్యపానం, డ్రగ్స్‌కు బానిసగా మారడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. యుక్తవయ సులో హార్మోన్ల ప్రభావం వల్ల ప్రమాదకరమైన సెక్స్‌లో పాల్గొ నడం తద్వారా అనేక రకాలైన సమస్యలను కొనితెచ్చుకొంటు న్నారు. కొత్త కొత్త బైక్‌లపై డ్రైవింగ్‌ స్పీడ్‌ ఎక్కువగా వెళ్తూ ఉండటం వల్ల ప్రమాదాలకు గురవ్ఞతున్నారు. కౌమార దశ 10-19 సంవత్సరాల నుంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనే నిర్మాణాత్మక సమయం. కౌమార దశలో జరిగే ప్రతి సంఘటన యుక్త వయసులో వారి శరీరక, మానసిక ఆరోగ్యానికి కీలకం. మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైన సామాజిక, భావోద్వేగ అలవాట్లను అభివృద్ధి చేయడానికి యవ్వనం ఒక కీలకమైన కాలం. ఆరోగ్యకరమైన నిద్రను అనుసరించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కోపింగ్‌ అభివృద్ధి, సమస్య పరిష్కార వ్యక్తిగత నైపుణ్యాలు, భావోద్వేగాలు ఏవిధంగా అదుపులో ఉంచుకోవాలో నేర్చుకోవడం యువత సమాజంలో మంచి వ్యక్తిగా రాణించడానికి దోహదం చేస్తాయి.

– డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి