మహిళల ప్రాతినిధ్యపు చట్టానికి మోక్షం లేదా?

    మహిళల ప్రాతినిధ్యపు చట్టానికి మోక్షం లేదా?

Women empowerment
Women empowerment

ఏ దేశంలో అయితే మహిళలు పూజలందుకుంటారో ఆ దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని మన వేదా లు చెబుతున్నాయి. కాని నేటికి మన దేశంలో సమాన అవకాశాలు కల్పించకపోవడం శోచనీయం. ఎంతో మంది మహిళలు రాజకీయాలలో దేదీప్యమానంగా పని చేస్తూ దేశ ప్రతిష్టను కాపాడుతున్నారనటంలో సందేహం లేదు. మనదేశ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన విదేశాంగశాఖను, రక్షణ మంత్రిత్వ శాఖలను శ్రీమతి సుష్మాస్వరాజ్‌, శ్రీమతి సీతా రామన్‌లు చాకచక్యంగా పురుషులతోపాటు తమ ప్రతిభను సామర్థ్యాన్ని దేశానికి అందిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వాన మహిళలు పార్లమెంటే రియన్స్‌కు సమున్నత స్థానాన్ని ఎన్నడు లేని విధంగా కల్పిం చారనేది నిర్వివాదాంశం.

మహిళలు ప్రభుత్వంలోను, రాజకీ యాలలో అవకాశాలు కల్పిస్తే తమ సామర్థ్యాన్ని చూపుతారనేది వాస్తవంగా నెరవేరిందని చెప్పాలి. ఆ విధంగా నేడు కేంద్రం లోఉన్న బిజెపి ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో పురుషులతో సమానమైన స్థానం కల్పించింది. నేడు లోక్‌సభ స్వీకరుగా పని చేస్తున్న సమిత్రామహాజన్‌, కేబినేట్‌ మంత్రి శ్రీమతి మేనకాగాంధీ మరో రాజ్యమంత్రి శ్రీమతి కౌర్‌ పర్యటన శాఖలలో పని చేస్తూ తమ ప్రతిభను కనపరుస్తున్నా రు. ముఖ్యంగా మహిళా శిశుసంక్షేమ శాఖలో మేనకాగాంధీ మహిళా శిశురక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. మహిళా ఉద్యోగులు ఐఎఎస్‌, ఐపిఎస్‌లుగా కేంద్ర పబ్లిక్‌ సర్వీసు కమి షన్‌ ద్వారా ఎంపికైన సెంట్రల్‌ సివిల్‌ సర్వీసు ఉద్యోగుల కు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించింది. ముఖ్యంగా మహిళా అధికారులు వలన పక్షపాతం, అవినీతికి తావ్ఞండదు.

అంతే గాక సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ద చూపుతారనే భావ నతో గత శతాబ్ధంగా సివిల్‌ సర్వీసుల వారికి మహిళా ఉద్యో గులకు సెలవ్ఞ, మెటర్నిటీలీవ్‌లు, పిల్లలను పోషించుటకు, పెంచుటకు తగిన విధంగా 90 రోజుల సెలవ్ఞలు కల్పించటమే కాక తమ పిల్లల చదువ్ఞల కాలంలో పరీక్షల సమయంలోప్రత్యే క లీవ్ఞలను కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా మహిళాధి పతులు ఆధిపత్యంలో ఉన్నశాఖలు కరప్షన్‌కు దూరంగా ఉండు టే కాక సమస్యలు పరిష్కారం చేయటంలో శ్రద్ధాసక్తులు కనపరచుతున్నారని ప్రభుత్వ వాచ్‌డాగ్‌లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా మహిళలు ముఖ్యమంత్రులుగా రాజస్థాన్‌లో శ్రీమతి సింథియా ప్రభుత్వాన్ని నడుపుటలో సామర్థ్యా న్ని చూపుతున్నారు. బిజెపి యేతర రాష్ట్రం పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులను ఎదు ర్కొంటూ తన చాకచాక్యాన్ని పరిపాలన రంగంలోను రాజకీయ రంగాలోను దశాబ్ధకాలం నుండి కనపరుస్తుంది.

అదేరీతిలో దివంగత జయలలిత తాను ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు తమిళ రాజకీయాలలో ఆటుపోట్లులను ఎదుర్కొని తన సినిమా కెరిస్మాతో పాలించింది. అంతేగాక తమిళనాడు రాష్ట్ర సంక్షేమం దశ దీశను నిర్ధేశించి ప్రజాధర ణను పొందింది. అదేరీతిలో ప్రముఖ మీడియారంగ ప్రసార మంత్రి శాఖ అధిపతి క్యాబినేట్‌ మంత్రిగా పని చేసిన స్మృతి ఇరానీ తన మార్కు పాలన తీరును ప్రదర్శించింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో టెక్స్‌టైల్‌ కేబినెట్‌ మంత్రిగా ఆమె తన ప్రతిభను కనబరుస్తుంది. నేడుదేశం ఉత్తర సరిహద్దులను పరిరక్షించుట రక్షణమంత్రి సీతారామన్‌ చూపుతున్న చొరవ ప్రశంసనీయం. చైనా సరి హద్దులలో స్పష్టించుతున్న డోక్లామ్‌ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాటుకు దీటుగా సైన్యాన్ని మోహరించి ధీటుగా సమాధానం ఇండియా 1962 నాటిది కాదు ఎలాంటి చర్యలకు పాల్పడిన దీటైన సమాధానం చెబు తామని చైనాను హెచ్చ రించింది.

పాక్‌ చొరబాటు దారులు, ఉత్తరవాయ్య సరిహద్దు ప్రాంతంలో చేస్తున్న ఉగ్రవాదులు చర్యలకు మన సైన్యం త్రిప్పికొడుతుంది. ప్రపంచానికి శాంతికాముక దేశంగా నిరూపించుకొంటుంది. అదే రితీలో సుష్మాస్వరాజ్‌ అమెరికా- చైనా దేశాలను సమాన దూరం కొనసాగిస్తూ భారత దౌత్య ప్రతిభను చాటుతూ, మన న్యూక్లియర్‌ ఆయుధాలు కలిగి వ్ఞన్న ముందస్తుగా మేము ఉపయోగించం ఎవరైన మాపై ప్రయోగిస్తే మేము తగిన బుద్ధి చెబుతామని సంభాషణలలో వ్యక్తం చేస్తు మన విదేశాంగ నీతిని చాటుతుంది. ప్రధానితో సుష్మాస్వరాజ్‌ విదేశాలు తిరగకపోయిన విదేశాంగ శాఖ అవసరాల కోసం మన దేశ తరపున హజరై విజయవంతంగా చర్చలు సమావేశం ధీటైన ప్రతిభను చాటుతుంది.

అదే రీతిలో లోక్‌సభ స్వీకరు సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ సమావేశాలు పకడబ్బందిగా నిర్వహించుతూ తన పరిధిలో నున్న అధికారాలను క్రమానుగీతంగా ఉపయోగిస్తూ సభను నడిపి స్తున్నారు. గతంలో లోక్‌సభ సమావేశాలు వేరు గత శబ్ధకా లంగా రాజకీయాలు భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలను నడిపించుటలో ప్రతిభను కనపరుస్తున్నారు. దేశంలో రాష్ట్ర స్వీకర్ల సమావేశంను నిర్వహించడం వారికి తగిన సూచనలు సలహాను ఇవ్వడంప్రపంచ దేశాలనుండి వచ్చె పార్లమెంటరీ డెలినెట్స్‌ను ఆహ్వానించి తన ప్రసంగాలతో ఆకట్టుకుంటుంది. అదే రీతిలో లోక్‌సభలో నున్న మహిళా సభ్యులు 61మందికి తగిన అవకాశాలను చర్చలో కల్పించడం దేశంలో నున్న మహిళలు ఎన్నికైనప్రతినిధుల సమావేశంను నిర్వహించి వారి పాత్రను గూర్చి చర్చించి తగు సూచనలు జారీ చేయుటలో తన పాలనా ప్రతిభను కనపరుస్తున్నారు.

నేడు దేశంలో మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్నలైంగిక వేధింపులను, హత్యలను, సెల్‌పోన్ల ద్వారా కలిగే అరిష్టాలకు అంతులేదు. మన నాగరికతలో వచ్చిన వైబ్రేషన్స్‌ ఒడుదుడుకులను ఎదుర్కొ నుటలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం జరుగుతుంది. ఈ రంగం లో పని చేస్తున్న మహిళా పోలీసు అధికారులు, మహిళా జడ్జి లను సుప్రీమ్‌కోర్టుకు హైకోర్టులలో నియమించడం ద్వారా మహిళా హత్య నిరోధక చట్టంను పఠిష్టంగా తయారు చేయు టకు, వాటిని అమలు చేయుటకు దేశవ్యాప్తంగా ”షీటీమ్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలపై, బాలకలపై జరుగు తున్న లైంగికదాడులను అదుపు చేయుటలో శ్రద్ధ చూపుతుంది.

మహిళ ఎంటర్‌ ప్రి న్యూర్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు కుమార్తె ట్రంప్‌ ఇండియాకు రావడం ద్వారా మహిళల మేధోమాధనం ప్రాముఖ్యత వెల్లడైంది.మహిళా ఇండ్రస్ట్రి యలీస్టుగా, బ్యాంకర్సుగా చూపుతున్న ప్రతిభను చాటుకొ న్నారు. అదే విధంగా మన దేశంలో భక్తిభావంను పెంపొందిం చుటకు అయ్యప్పస్వామి పూజలలో మహిళలు పాల్గొనవచ్చనని తీర్పు, సైన్యంలోను మహిళలు అధికంగా చేరడం, మహిళలు యుద్ధ విమానాలు నడుపుటకు అనుమతి నిచ్చుట తదితర రంగాలో మహిళా ప్రాతినిధ్యంకు కేంద్ర ప్రభుత్వం ద్వారాలను తెరించింది.

అదేరీతిలో అసంఘటితరంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం, నిర్మాణరంగంలో కూడా కనీస వేతనంను అమలు చేయుట ప్రభుత్వ ఆసుపత్రులలో మెటర్నీ వార్డుల సౌకర్యాల కల్పన, ఆయుష్‌ ద్వారా శిశు- తల్లులకు పౌష్టికాహారం మందుల వసతులు గర్భీణిస్త్రీలకు, శిశువ్ఞలకు తగిన ఆహారవసతులు కల్పించుటలో అనేక చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా ముద్రా ఋణాలను మహిళలకు కల్పించడంలోను ప్రభుత్వ పథకాలు పనిచేయుచున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యం మీద వాటి అమలు ఆధా రపడి ఉంటుంది. ఇటీవల చత్తీస్‌ఘర్‌ ఆకలిచావ్ఞలకు మహిళ లపై శ్రద్ద చూపకపోవడం వలన జరిగిందంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ ఆమోదించి పెండింగ్‌లో నున్న మహిళలకు రిజర్వేషన్ల చట్టం గత అర్థదశాబ్ధంగా పడిఉంది.

– డాక్టర్‌ ఆసయ్య, ఐఐఎస్‌