మహిళలకు రక్షణ ఇవ్వలేని వ్యవస్థలెందుకు?

law
law

దేశవ్యాపంగా ఎన్నో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకాలు సన్నగిల్లి అటవీ న్యాయంపై మొగ్గుచూపుతున్నారు. అందుకే నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఎక్కడికక్కడ చట్టాన్ని ఎవరికి వారు చేతుల్లోకి తీసుకుంటే అరాచకం ప్రబలి ప్రజాస్వామ్యాన్నే పరిహసిస్తుంది.అన్నింటి కంటె ముఖ్యంగా వీటన్నింటికి మూలమైన మద్యాన్ని తరిమి కొట్టాల్సిన తరుణమిది.

‘పటేల్‌ పట్వారీ నా పక్కనుంటే ఎట్లా తిడతావో తిట్టరా… మొగడా అని వెనుకటికి ఒక భార్యామణి భర్తనే బెదిరిం చిందట. అధికారం అండగా ఉంటే భర్త కూడా భార్యను ఏమి అనలేడని ఈ సామెత చెప్పకనే చెబుతున్నది. లక్ష్మీప్రసన్నంతో పాటు రాజకీయ అండదండలుంటే తమను ఎవరూ ఏమీ చేయ లేరనే ధీమా కొందరి నేరస్తుల్లో రోజురోజుకు పెరుగుతున్నది. మరొకపక్క మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని, దిక్కుతోచని స్థితిలో రాక్షసత్వానికి మించిన ఉన్మాదం తో అత్యాచారాలకు,హత్యలకు పాల్పడే దురదృష్టపు రోజులు దాపురించాయి. చట్టాలు ఎన్ని చేసినా, అధికారులను ఎంత మందిని నియమించినా ఆ చట్టాలను త్రికరణశుద్ధిగా అమలు చేసి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి, తిరుగులేని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాల ముందు రుజువ్ఞ చేయడంలో పోలీసు అధికారులు విఫలం కావడం కూడా ఈ నేరాలు పెరగడానికి కారణమవ్ఞతున్నాయి. ఇక న్యాయస్థానాల్లో జరుగుతున్న ఏళ్లతరబడి జాప్యంకూడా ఇందుకు ఇంకో కారణంగా చెప్పొచ్చు. ఇతర శాఖలు ఏమోకానీ శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు శాఖలో ఈ పరిస్థితి విస్తరించడం విపరీత పరిణామాలకు దారితీస్తున్నది. ఈ సంస్కృతి ఇప్పటికిప్పుడు ప్రారంభంకాక పోయినా ఎప్పటి నుంచో ఉన్నా గత రెండు దశాబ్దాలుగా ఊపందుకొని ప్రస్తుతం అదుపుతప్పిపోతున్నదేమోననిపిస్తున్నది. రాజకీయ నాయకులను మెప్పించడంలో చూపించే సమర్థత, శ్రద్ధాభక్తులు కేసుల దర్యాప్తుల్లో చూపలేకపోవడం అధికశాతం కేసులు నీరుగారిపోతున్నాయి.ఒకటి రెండు కాదు వేల కేసులు వీగిపోతుండడం నేరస్తులు చట్టం, శిక్షల నుంచి తప్పించుకొని యధేచ్చగా సమాజంలోకి రావడం మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో అలాంటి నేరాలకు పాల్పడటం పరిపాటిగా జరుగుతున్నది. జాతీయ నేరాల నమోదు సంస్థ 2017లో వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో న్యాయవిచారణ ఒకలక్షానలభై ఆరువేల రెండు వందల ఒకటి కేసులు చేపట్టగా అందులో శిక్షపడినవి ఐదువేల ఎనిమిదివందల ఇరవైరెండు మాత్రమే. మన రాష్ట్రానికి సంబంధిం చి పదిహేడువేల ఐదువందల ఇరవైఒకటి కేసులు నమోదు కాగా శిక్షపడింది కేవలం నాలుగువందల ఇరవై ఆరుమాత్రమే. మిగిలిన కేసులు ఎప్పుడు కొలిక్కివస్తాయో నిందితులకు ఎప్పుడు శిక్షపడు తుందో అర్థంకాదు. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార కేసుల్లో శిక్షలు పడింది కేవలం నాలుగుశాతమనే గణాంకాలు ఆవేదన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 6.2శాతం కేసుల్లో మాత్రమే శిక్షలుపడుతున్నాయి. ఇక కోర్టుతీర్పులు వెలువడటానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకించి చర్చించాల్సిన అవసరం లేదు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి ఈ జాప్యాన్ని నివారిం చేందుకు పాలకులు చర్యలు తీసుకున్నారు. అవికూడా సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. దేశంలో సంచలనం కలిగించిన నిర్భయ కేసు 2012 డిసెం బరులో జరిగితే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సెప్టెంబరులో తీర్పు వెల్లడి అయింది. దానిపై నిందితులు హై కోర్టుకు వెళ్లారు. 2014లో హైకోర్టులో కిందికోర్టు వేసిన మరణ దండన సరైందేనని చెప్పింది. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017లో సుప్రీంకోర్టు వారికి ఉరిశిక్ష విధించాల్సిం దేనని తీర్పుచెప్పింది. కానీ నేటికీ వారికి ఉరిశిక్ష అమలుకాలేదు. రాష్ట్రపతివద్ద క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఇలా దర్యా ప్తు అధికారులు విఫలంకావడం, మరొక పక్క కోర్టుల్లో జరుగు తున్న జాప్యంతో బాధితులకు వ్యవస్థ లపైనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. అందుకే కొందరు బాధితులు కన్నుకుకన్ను, కాలుకు కాలు, ప్రాణానికి ప్రాణం అనే ఆటవిక న్యాయంవైపు మొగ్గు చూపు తున్నారు. చివరకు దిశ కేసులో నిందితులను బహిరం గంగా ఉరితీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని వారూ వీరూ కాదు దేశవ్యాప్తంగా నిరస నలు వెల్లుబుకాయి. శుక్రవారం తెల్లవారు జామున దిశ కేసులో నిందితులు నలుగురు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణిం చారు. దిశను ఎక్కడైతే అత్యాచారం అనంతరం కాల్చిచంపారో అదే స్పాట్‌లో నలుగురు ప్రాణాలు వది లారు. అత్యాచారం చేసి, హత్య చేసినప్పుడు నలుగురు పూర్తిగా మద్యం మైకంలోఉన్నారు. ఆ విషయం వారే పోలీసుల విచారణ లో వెల్లడించినట్లు సమా చారం. మద్యం, మాదకద్రవ్యాల విని యోగం అదుపులేకుండా పెరిగిపోతున్నది.ఇప్పుడు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఇతర కిరాతక నేరాల్లో కానీ నిందితులు కానీ శిక్షపడిన నేరస్తుల్లో, ప్రమాదాలకు కారకులైన వాహనచోదకుల్లో తొంభైశాతం పైగా ఈ మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నవారే. పోలీసుల ప్రవర్తన కూడా ఈ కేసులో తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీసులని ప్రజలకు సేవలు అందించడంలో వారి ప్రవర్తన,మాట తీరులోనూ కన్పించాలని పదేపదే పాలకులు,పోలీసు పెద్దలు చెప్తూనే ఉం టారు. ఆ దిశలో సంస్కరణలు కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి? అందరూ అలా వ్యవ హరిస్తున్నారని చెప్పడం లేదు కానీ, అధికశాతం పోలీసులు కింది స్థాయిలో ఇదేతరహాలో ఉన్నారనేందుకు ఈ దిశకేసులో వ్యవ హరించిన తీరు అద్దం పడుతున్నది. ఆ రాక్షసుల మధ్యలో చిక్కు కొని చెల్లిని ప్రాధేయపడుతూ తనకు భయం వేస్తున్నదని, చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, దిశ చేసిన రోదనతో ఆం దోళన చెందిన ఆమె కుటుంబసభ్యులు ఆగమేఘాలపై పోలీ సుస్టేషన్‌కు వెళ్లితే ఏం మాట్లాడారు? ఎలావ్యవహరించారు? తమ పరిధికాదని,ఎవరి తోనో వెళ్లిపోయి వ్ఞంటుందేమోనని ఎంత నిర్ల క్ష్యంగా, హేళనగా మాట్లాడి ఆ సమయంలో వారి మనసులను ఎంత గాయపరిచారో ఆలోచిస్తే ఎంతటి బండరాతిగుండె అయినా వేడితాకిన మైనంలా గా కరగకతప్పదు. పోలీసులు వెంటనే స్పందించి హైవే పెట్రో లింగ్‌ పోలీసులను అలర్ట్‌చేసి అంతో ఇంతో హడావ్ఞడి చేసివ్ఞంటే ఈ సంఘటన జరిగి ఉండేదికాదనే వాదనను కొట్టిపారేయలేం. ఈ సంఘటన కూడా ఆ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇక తమ పరిధిలో లేదని ఎలా చెప్పగలిగారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ తర్వాత సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీచేసే విధానం ఏనాటి నుంచో కొనసాగు తున్నది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్భయ కేసుజరిగిన తర్వాత ఆ సంఘటనపై సమగ్ర విచారణకు నియమించిన జస్టిస్‌ వర్మకమిటీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిం చింది.కేసుదర్యాప్తు పరిధిలేనట్లయితే నేరం ఎక్కడజరిగినా సమీప పోలీసుస్టేషన్‌కు బాధితులు వస్తే నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి ఆ తర్వాత బదిలీ చేయాలని, అలా చేయకపోతే నేరంగా పరిగణించవచ్చుకూడా. ఇప్పుడు అలా వ్యవహరించిన పోలీసుస్టేషన్‌ అధికారులను సస్పెండ్‌తో సరిపెట్టకూడదు. చట్ట ప్రకారం కేసు నమోదుచేయాలి.అన్ని పోలీసుస్టేషన్లకు ఈ మేసేజ్‌ అందాలి. భవిష్యత్తులో ఏ పోలీసుస్టేషన్‌ కూడా అలా ఫిర్యాదును నిరాకరించకుండా చర్యలు చేపట్టాలి. రానురాను చట్టం, దర్యాప్తు లపై ప్రజల్లో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.గురువారం ఉత్తరప్రదేశ్‌లో మరోఘోరం చోటుచేసుకున్నది. అత్యాచార బాధితురాలు కేసు విచారణలో భాగంగా న్యాయస్థానానికి వెళ్లుతున్న సమయంలో పాత నిందితులే ఆమెను అటకాయించి గురువారం నిప్పు అంటించారు. ఒక పక్క మానసిక క్షోభ, మరొకపక్క శారీరక యాతనతో కాపాడండి అంటూ ఆమె అరుచుకుంటూ కిలోమీటరు దూరంవరకు మంటలతో పరుగెత్తింది.90శాతం శరీరం కాలిపోగా ఇప్పుడుమృత్యువ్ఞతో ఆస్పత్రిలో పోరాడుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో నివసించే ఆ బాధిత యువతి గత డిసెంబరులో అత్యా చారానికి గురైంది. పెళ్లిపేరుతో నమ్మించి అత్యాచారం చేసిన నింది తుడు అప్పట్లో అరెస్టు అయి మొన్న నవంబరు 25నబెయిల్‌పై విడుదల అయ్యాడు. మరికొందరితో కలిసి ఆమెను మట్టుబెట్టే ప్రణాళికప్రకారం గురువారం ఉదయం ఆమెను రా§్‌ుబరేలిలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళుతుండగా పాత నిందితుడితో సహాఐదుగురు కిరాతకులు ఆమెపై దాడి చేసి కిరోసిన్‌పోసి నిప్పు అంటించారు. తనపై దాడిచేసిన వారిపేర్లు బాధితురాలు సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. ఈ చర్యను రాజ్యసభ ముక్తకంఠంతో ఖండించింది. దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవ్ఞతున్నాయి. ఇప్పటివరకు ఆమె గురించి పట్టించుకోని యూపి ప్రభుత్వం ఆగమేఘాలపై హెలికాప్టర్‌లో కొనఊపిరితో ఉన్న ఆ బాధితురాలిని మెరుగైన వైద్యంకోసం ఢిల్లీకి తరలించారు. ఒకపక్క అత్యాచారం కేసులో నిందితుడిగా విచా రణ ఎదుర్కొంటూనే ఆమెను అంతం చేయడానికి తెగబడ్డాడంటే చట్టాలు, పోలీసులు అంటే ఈ మృగాలకు ఎంతటి భయ భక్తులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఎన్నోఇలాంటి సంఘట నలు జరుగుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకాలుసన్నగిల్లి అటవీ న్యాయంపై మొగ్గు చూపుతున్నారు. అందుకే నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్లు పెరుగుతున్నా యి. దిశ కేసులో పోలీసు చర్యనుకొంత మేరకు సమర్ధించినా ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఎక్కడిక క్కడ చట్టాన్ని ఎవరికి వారు చేతుల్లోకి తీసుకుంటే అరాచకం ప్రబలి ప్రజాస్వామ్యాన్నే పరిహసిస్తుంది.ముఖ్యంగా వీటన్నింటికి మూలమైన మద్యాన్ని తరిమి కొట్టాల్సిన తరుణమిది. -దామెర్ల సాయిబాబ


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/