మన రహదార్లు అతివేగానికి అనుకూలమా?

road
జాతీయరహదార్లపై వాహనాల వేగాన్ని నియంత్రించ కపోవడంతో రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రావడంలేదు.ఇంతే వేగంతో ప్రయాణించలన్న హోర్డిం గులు కాని హెచ్చరిక బోర్డులు కాని కనిపించవు.  అడుగడుగునా మద్యం దుకాణాలు, బెల్టుషాపులుండడంతో ప్రమాదాలకు అంతు లేకుండాపోతోంది. మితిమీరిన వేగంతో వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వేలాదిమంది క్షతగాత్రులవుతున్నారు.  రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారణాలను పక్కనబెట్టి చిన్నచిన్న సమస్యలపై రవాణాశాఖ, పోలీసు యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. జాతీయరహదార్లు ఎక్స్‌ప్రెస్‌ హైవేలు కావన్న విషయం గుర్తించాలి. ప్రస్తుతం జాతీయరహదార్లు గంటకు 60కిలోమీటర్లకు మించి వేగంగా ప్రయాణించడానికి ఏమాత్రం అనుకూలం కాదు.

జాతీయరహదారిపై ఏ వాహనం ఎంత వేగంతో వెళ్లాలన్న నిబంధనలుఉన్నాయి.ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లో ద్విచక్రవాహనా లు గంటకు 60 కిలోమీటర్లు, కార్లు గంటకు 65 కిలోమీటర్లు, మీడియం గూడ్స్‌ వెహికిల్స్‌గంటకు 65కిలోమీటర్లు, బస్సులు ఇతర వాహనాలు గంటకు 60కిలోమీటర్లకు లోబడి మాత్రమే ప్ర యాణించవలసి ఉంది. ఈ నిబంధనలు రవాణా, పోలీసుశాఖలకు గుర్తుకువచ్చినపుడు మాత్రమే కేసులు నమోదుచేయడం షరా మా మూలే.జాతీయరహదారిపై 100కిలోమీటర్లకు పైబడి ప్రయాణించడం సాధ్యమా అన్న విషయాన్ని గుర్తెరగాలి. అటువంటిది ద్విచక్ర వాహనాలు గంటకు 100కిలోమీటర్లకు పైబడి వేగంతో ప్రయాణి స్తుండగా కార్లు, బస్సులు గంటకు 120 నుంచి 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా దూరప్రాంతాలకు రాకపో కలు సాగించే నాన్‌స్టాప్‌,ఎసి లగ్జరీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వేగానికి అడ్డు అడుపు ఉండడంలేదు. ట్రాపిక్‌ నిబంధనలప్రకారం అన్ని కేసులు నమోదుచేస్తున్న రవాణా, పోలీసు శాఖలు మాత్రం మితిమీరుతున్న వేగంపై కేసులు పెద్దగా నమోదుచేయడంలేదు. ఇందుకు కారణం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడిని ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గంటకు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తే తట్టుకునే సత్తా మన జాతీయరహదార్లకు లేదన్న విష యాన్ని గమనించాలి. మన రహదార్లు సింగపూర్‌ రోడ్లు కాదన్న విషయాన్నిగుర్తెరగాలి.జాతీయరహదారి నిర్మాణంలోనేఅనేక సాంకే తిక సమస్యలు తలెత్తాయి.సమస్యల నివారణకు జాతీయరహదారి విస్తరణ సంస్థలు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా జాతీయరహదారిని ఆనుకుని వేలాదిగ్రామాలు, జనస మర్ధ ప్రదేశాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముఖ్యమైన జంక్షన్‌లలో రాత్రిళ్లు విద్యుత్‌సౌకర్యం లేకపోవడంతో జాతీయరహ దారిపై ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని జాతీయరహ దారి వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జాతీయరహదారిపై కొన్ని జంక్షన్‌లలోనే విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేసి జాతీయరహదారి విస్తరణసంస్థ చేతులు దులుపేసు కుంది. విద్యుత్‌ దీపాలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమైన కూడ ళ్లలో సోలార్‌ దీపాలు ఏర్పాటుచేసినట్టయితే కొంతవరకు ప్రమా దాలను నివారించవచ్చు.జాతీయరహదార్లు కూడా నిత్యం జనస మ్మర్ధంగా ఉండడంతో అతివేగంగా ప్రయాణించే వాహనాలతో అన ర్థాలు జరుగుతున్నాయి.అతివేగంగా నడిపే వాహనాలను అనుకోని సంఘటన ఎదురైనపుడు వాహనాన్ని నిలువరించలేకపోతున్నారు. అతివేగంగా ప్రయాణించే వాహనాలకు బ్రేకులు వేయగానే  నియం త్రించే సత్తా మన జాతీయరహదార్లకు లేదు. వాహనాల వెనుక భాగంతోపాటు జాతీయరహదారిపై ప్రమాదకర ప్రదేశాలు, ముఖ్య మైన కూడళ్లలో రేడియం స్టిక్కర్లు, బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రవాణాశాఖతో పాటు జాతీయరహదారి విస్తరణసంస్థ తీవ్రంగా పరిగణించాలి.

జాతీయరహదారిపై మద్యం దుకాణాలు, బెల్టు షాపులు లెక్కలే నన్ని ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలకు మద్యం ముఖ్య కారణంగా పరిగణించవలసి ఉంది. జాతీయరహదారిపై మద్యం దుకాణాలతో పాటు టీ దుకాణాలు, కిళ్లీ షాపులు, హోటళ్లలో నిత్యం మద్యం అందుబాటులో ఉంటోంది. దీంతో జాతీయరహదారిపై మద్యం సేవించి వాహనాలనునడుపుతున్నారు. జాతీయరహదారిపై మద్యం దుకాణాలవల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా, పోలీసుల శాఖలు కూడా ఆందోళన చెందుతున్నాయి. రోడ్డు ప్రమా దాల నియంత్రణపై అందరి వేదన అరణ్యరోదనగా మిగులుతోంది. గంటకు 140కిలోమీటర్ల వేగంగా వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా మన జాతీయరహదార్లను సిద్దంచేసేవరకు నిబం ధనమేరకు వాహనాలవేగాన్ని నియంత్రించవలసి ఉంది.ఈ మేరకు వాహనాల వేగాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం కఠిన నిబంధన లు అమలుచేయాలి. ఇందుకు తరతమభేదం లేకుండా వ్యవహ రించాలి.జాతీయరహదారిపై మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిం చవలసి ఉంది. మద్యం అమ్మకాలను నియంత్రించడానికి పోలీసు, ఎక్సైజ్‌శాఖలను ఉపయోగించుకోవాలి.