భూగర్భజల నియంత్రణ చట్టం తప్పనిసరి

water
water

భూగర్భజల నియంత్రణ చట్టం తప్పనిసరి

భూగర్భజలాల వినియోగక్రమబద్ధీకరణ, నియంత్రణ చట్టా న్ని తక్షణం అమలులోకి తేవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల భూగర్భజలాలను ఇష్టానుసారంగా తోడివేయ డం తగ్గుతుంది.అలాగే ఎక్కడపడితే అక్కడ బోర్లు వేయడం కూడా తగ్గుతుంది.ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌, ట్రయినింగ్‌ అండ్‌రీసెర్చి ఇని స్టిట్యూట్‌ (ఇపిటిఆర్‌ఐ) తెలంగాణ పర్యావరణ నివేదికను ఇటీవలనే ప్రభుత్వానికి సమర్పించింది.నేలపై ఉన్న నీటిని, వాన నీటిని పొదు పు చేసే ప్రక్రియలు చేపట్టడం కూడా అవసరమని సూచించింది.

భూగర్భజలవనరులను కాపాడుకోవడంపై ప్రత్యేకచర్యలు తీసుకోవా లనిపేర్కొంది.పర్యావరణ,అటవీ,శీతోష్ణస్థితి మార్పులకు సంబంధిం చి కేంద్రమంత్రిత్వ సహకారంతో ఈ నివే దిక నమూనా తయా రైంది.ప్రస్తుత పర్యావరణపరిస్థితి,కాలుష్య స్థాయిలను తగ్గించడానికి వరుసగా తీసుకునే చర్యలు, వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించే విధానాలు తదితర అంశాలన్నీ ఈ నివేదికలో చేర్చారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ, జిల్లాల్లో చాలాచోట్ల కరీంనగర్‌,వరంగల్‌,ఖమ్మం, ఆదిలాబాద్‌, జిల్లా ల్లో కొన్ని చోట్ల భూగర్భజలాలు20మీటర్ల కన్నా ఎక్కువ అడుగు స్ధాయినీటితో ఉంటు న్నాయని పరిశీలినలోతేలింది.

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో రిజర్వు ఆస్మాసిస్‌ ప్లాంట్లను నాణ్యమైనవి ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొంది. ఈ ప్లాంట్ల ప్రభావం వల్ల నీటిని తిరస్కరించే శాతం 25 శాతం నుంచి 45 శాతంవరకు ఉంటోంది. నీటి నాణ్యత సమస్యలను తక్షణం ఈ ప్లాంట్లు పరిష్కరించగలుగు తున్నా సుదీర్ఘకాలం అవి పనిచేయవని దీనికికారణం. భూగర్భజ లాలపై ఎక్కువ ఒత్తిడి పెంచడమేనని నివేదిక పేర్కొంది. ఈ ప్లాంట్లప్రభావం భూగర్భ జలాలపైన నీటి నిర్వహణపైన వాస్తవంగా ఏవిధంగా ఉందో పరి శీలించాలని నివేదిక సూచించింది.

గనులు తవ్వడానికి అనుమతులు ఇచ్చే ముందు భూగర్భజలవనరులకు భద్రత ఎంతవరకు ఉంటుందో పరిశీలించాలని, విడిచిపెట్టిన గను లు, లేదా క్వారీలు గుంతల్లో నీటిని నిల్వ చేసుకునే బదులు సోలా ర్‌ ప్యానెళ్లను నెలకొల్పవచ్చని నివేదిక సూచించింది. జీవ వనరుల నిర్వహణ, వాటి క్షీణతలకు దారితీసే వివిధ పరి ణామాలను సమీక్షించడానికి జీవవైవిధ్య శాస్త్ర నిపుణులతో తెలంగా ణరాష్ట్ర జీవవైవిధ్య బోర్డును పటిష్టంచేయాలని నివేదిక సూచించిం ది.

వృక్ష, జంతు శాస్త్ర పరంగా సంయుక్త సర్వేలు నిర్వహించి జీవ వైవిధ్య సంపదపై అధికారిక సమాచారం పొందుపర్చాలని దానిపై సరయిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.తెలంగాణ రాష్ట్రం లో 17 రకాల ఉభయచరాలు, 65 రకాల సరీసృపాలు, 103 రకాల క్షీరదాలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయుసిఎస్‌) స్పీసీస్‌ స్పెషలిస్టు గ్రూపు సమీక్షించింది. ఇటువంటి జీవవైవిధ్య ప్రాణుల్లో 30 శాతం ఐయుసిఎస్‌ ప్రమాద జాబితాలో ఉన్నాయి. మిగతా శాతం ప్రాణులపై సమీక్ష లేదు. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు.

తెలంగాణ రాష్ట్రంలో పక్షిజాతులు 275 నుంచి 300 వరకు ఉన్నాయి. వెన్నెముక లేని జంతువ్ఞల సమాచారం కొన్ని సముదాయాల వరకే పరిమితమైంది. అంతరించిపోయే ప్రాణుల్లో 50 శాతం అయినా కనీసం ఒకటి లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చవలసి ఉంది. 1051 తెగలకు సంబంధించిన 185 కుటుం బాల 2800 వన్యప్రాణులు తెలంగాణలో ఉన్నాయని పరిశోధనలో బయటపడిందని నివేదిక పేర్కొంది. వాననీటి సంరక్షణకై పార్కు భారతదేశంలో రెండవ వాననీటి సంరక్షణ (ఆర్‌డబ్ల్యుహెచ్‌) పార్కు హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. మొట్టమొదటి వాననీటి సంరక్షణ పార్కు బెంగళూరులో ఏర్పాటయింది

తెలంగాణ ప్రభు త్వం జలం- జీవం కార్యక్రమంలో భాగంగా ధీమ్‌ పార్కును ఏర్పా టు చేసింది. ఈ పార్కులో వాననీటి సంరక్షణ గుంతలను తవ్ఞ్వ తారు.వాననీటిని పొదుపు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పిం చడానికి అలా పొదుపు చేసిన నీటిని తాగునీటికి బదులుగా అనేక ప్రయోజనాల కోసం వినియోగించడానికి వీటన్నిటిపై ప్రజలకు అవ గాహనపెంపొందించడానికి ప్రభుత్వం సన్నాహాలుచేస్తోంది. మున్సి పల్‌ కొళాయిల నీరు లేకుండా వర్షం నీటితోనే పార్కును అభివృద్ధి చేస్తారు.

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయి,సివరేజి బోర్డు సంయుక్తంగా పార్కును అభివృద్ధి చేస్తారు.ఈమేరకు మార్గదర్శకా లు స్వీకరించడానికి కర్ణాటక రాష్ట్ర కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌సైన్స్‌ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీ సర్‌ఎ.ఆర్‌.శివకుమార్‌ను ఆహ్వానించారు. బెంగళూరులోని వాననీటి సంరక్షణపార్కును డిజైన్‌చేసింది ఆయనే.ఆయనవచ్చి వాననీటి సం రక్షణ పార్కువివరాలు తెలియచేశారు.ఈపార్కుకోసం రెండు స్థలా లనుపరిశీలించారు.వాటిలో కమలాపురి కాలనీలో1.5ఎకరాల్లో విస్త రించిన పార్కును ఎంపికచేశారు.ఈ ధీమ్‌ పార్కులో సెంట్రల్‌ గ్యాల రీ, వాటర్‌ గ్యాలరీ స్యూయోజ్‌ గాలరీ, ఆడిటోరియం నిర్మిస్తారు.

– కె.అమర్‌