ప్రాణాంతక వ్యాధిపై తీరని అలక్ష్యం

PATIENT
PATIENT

ప్రాణాంతక వ్యాధిపై తీరని అలక్ష్యం

హైదరాబాద్‌నగర ప్రజలు ఎవరైనా తమకు క్యాన్సర్‌ వ్యాధి సోకినప్పుడు వ్యాధి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకో లేకపోతున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. దీనికి కారణం ఆర్థిక బలహీనతే. హైదరాబాద్‌ క్యాన్సర్‌ చికిత్సకు సాధార ణంగా సరాసరి ఖర్చు 4.7 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంతేకాదు ఇంకా రూ.20లక్షల వరకు ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది ఇంత ఖర్చవ్ఞతుందని కూడా అంచనా వేయలేకపోతున్నారు.

సాధారణంగా నాలుగు లక్షల కన్నా ఎక్కువ కాదని చాలా మంది భావిస్తున్నా ఆంకాలజిస్టులు మాత్రం 4.7 లక్షల వరకు సరాసరి ఖర్చు పెరిగిందని వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలో అంచనాకు, వాస్తవానికి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. అదనపు భారాన్ని భరించడం కష్టమన్న అభిప్రాయం కనిపిస్తోంది. 11 నగరాల్లో దాదాపు 1400 మందిని శాంపిల్‌సర్వే చేయగా హైదరాబాద్‌ ప్రజల్లో 88 శాతం మంది ఈ ప్రాణాంతక వ్యాధి నివారణ చికిత్స కోసం ఆర్థికంగా సిద్ధంగా లేన ట్టు వెల్లడయింది. అసలు ఎంత ఖర్చవ్ఞతుందన్న విషయాన్నే చాలా మంది విస్మరిస్తున్నట్టు తెలుస్తోంది.రోగులు కానీ, వారి కుటుంబీ కులు కానీ ఆదాయం నష్టపోవడాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. కొంద రికి సంపాదన తక్కువై, చికిత్స ఖర్చు ఎక్కువై కుటుంబాలు చితికిపోతున్నాయి. వైద్యానికి అయ్యే ఖర్చు విషయంలో రోగులు చాలా మంది డాక్టర్ల సలహాపైనే ఆధారపడుతున్నారు. అధికశాతం మంది తాము వ్యక్తిగతంగా పొదుపుచేసుకున్న సొమ్ము లేదా వ్యక్తి గతంగా రుణంచేసిన సొమ్మును వైద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. వ్యాధిని గుర్తించడం, వ్యాధిరకాలు, స్థాయి, వైద్యఖర్చు విషయాల్లో అవగాహన లోపం బాగా కనిపిస్తోంది. సగం కన్నా ఎక్కువ మంది క్యాన్సర్‌ గురించి తెలుసుకోలేకపోతున్నారు. రోగి కుటుంబంలోని వారికి, స్నేహితులకు కూడా ఈ విషయం తెలియకుండాపోతోంది. ఇది చాలా ఆవేదన కలిగించే విషయం. 2020 నాటికి ప్రతి 10 మంది భారతీయుల్లో ముగ్గురు ఈ క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తులవ్ఞతారని ఆంకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో 65.7శాతం మందిక్యాన్సర్‌ రోగులు ఆలస్యంగా రోగాన్ని గుర్తించిన వారుగా ఆంకాలజిస్టులు 50 మంది జరిపిన సర్వేలో బయటపడింది. క్యాన్సర్‌ బాగా ముదిరాక మూడు లేదా నాలుగో దశలో వీరిలో బయటపడింది. మొత్తం మీద 88 శాతం మంది క్యాన్సర్‌వ్యాధిని నయం చేసుకోడానికి తమవద్ద ఆర్థికస్తోమత లేదని చెప్పగా, వారిలో 27శాతం మంచి తాము రుణం తీసుకొని ఖర్చుపె ట్టక తప్పదని చెప్పారు. మిగతా 19 శాతం మంది తమ కుటుంబీ కుల నుంచి స్నేహితుల నుంచి ఆర్థికసాయం తీసుకుంటామని చెప్పారు. 42 శాతం మంది వ్యాధి చికిత్స కోసం ఆర్థికపరంగా ఏం చేయాలన్న విషయమై చర్చించడం లేదు. నైట్‌డ్యూటీ మహిళల్లో క్యాన్సర్‌ నైట్‌షిప్టు ఉద్యోగాలు ఎక్కువగా చేస్తే మహిళలకు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో బయటపడింది. సుదీర్ఘకాలం పాటు రాత్రిపూట ఉద్యోగాలు చేస్తుండే మహిళల్లో 19 శాతం వరకు క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. వివిధ ఉద్యోగాలు చేసే మహిళలందరికన్నా రాత్రిపూట డ్యూటీ చేసే నర్సు ల్లో అత్యధిక శాతం మందికి రొమ్ముక్యాన్సర్‌ విస్తరించే ప్రమాదం కనిపిస్తుందని వెల్లడయింది. మహిళల్లో సాధారణ క్యాన్సర్‌ రోగుల కు నైట్‌డ్యూటీ ప్రాణాంకతమవ్ఞతుందని అధ్యయన నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

ఉత్తరఅమెరికా,యూరప్‌, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలకు చెందిన 39,09,152 మందిని ఈ అధ్యయనంలో తీసు కున్నారు. దీంతోపాటు 1,14,628 క్యాన్సర్‌ కేసులతో కూడిన 61 వ్యాసాల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేశారు. నైట్‌ షిప్టు డ్యూటీ ఉద్యోగులకు వచ్చే రోగులపై ముఖ్యంగా 11 రకాల క్యాన్సర్‌పై అధ్యయనం కేంద్రీకృతమయింది. ఇందులో ప్రత్యేకించి ఎలాంటి క్యాన్సర్లు వస్తాయో విశ్లేషించగలిగారు.41శాతం చర్మ క్యాన్సర్‌, 32శాతం రొమ్ముక్యాన్సర్‌,18 శాతం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ క్యాన్సర్‌, నైట్‌డ్యూటీ మహిళల్లో వస్తుందని నిర్ధారించారు. ఎక్కువ కాలం నైట్‌ డ్యూటీ చేసే మహిళల్లో అందులో నర్సుల్లో ఏయే రకాల క్యాన్సర్‌ వ్యాధులు సంక్రమిస్తాయో అధ్యయనం చేశారు. అటువంటి నర్సుల్లో 58 శాతం రొమ్ముక్యాన్సర్‌, 35 శాతం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ క్యాన్సర్‌, 28 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుందని కనుగొన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నైట్‌డ్యూటీ సుదీర్ఘ కాలం చేసే నర్సులు వంటి ఉద్యోగులు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయించు కోవలసి ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. భారతదేశంలో మహిళల జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఆర్థి కంగాఒకవైపు స్వయంశక్తితో ఎదుగుతున్నా ఆరోగ్య పరంగా చాప కిందనీరులా అవలక్షణాలు కమ్ముకొస్తున్నాయి. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.

దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉండడం లేదు. ఆఫీ సుల్లో కానీ మరే కార్యాలయాల్లో కానీ కదలిక లేని ఉద్యోగాల వల్ల కొంత,ఆలస్యంగా వైవాహిక జీవితం ప్రారంభం కావడం,ఆలస్యంగా సంతాన వంతులు అవడం, సంతానం సంప్రా ప్తించినా పొత్తిళ్ల పురిటికందుకు స్తన్యపోషణ సరిగ్గా సమకూర్చక పోవడం ఇవన్నీ వారిని ఊబకాయానికి తరువాత మధుమేహం, క్యాన్సర్‌ వంటి రోగాలకు బలి చేస్తున్నాయి.కాల్‌ ఫర్‌ యాక్షన్‌ఎక్స్‌ పాండింగ్‌ కేన్స ర్‌ కేర్‌ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా 2017 నివేదిక భారతదేశంలోని మహిళా కేన్సర్‌ రోగులసంఖ్య రానురాను విపరీతంగా పెరుగుతోం దని,దానివెంటే మృత్యువ్ఞ చేరువవ్ఞతోందని హెచ్చరించింది. ప్రపం చంమొత్తం మీద చైనా, అమెరికా దేశాల తరువాత భారత్‌ మూడవ దేశంగా స్థానం వహించడం రాగల ప్రమాదాన్ని సూచిస్తోంది. భార తీయ మహిళల్లో కేన్సర్‌ రోగులసంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధికి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య ఎక్కువగానేఉంది. వ్యాధి లక్షణా లపై అవగాహన లోపించడం,ఆలస్యంగా వ్యాధి ఉనికి ని గుర్తించ డంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచంలో చైనా, అమెరికా దేశాల తర్వాత భారత్‌లోనే ఈకేసులు విశేష సంఖ్యలో ఉన్నాయి.

– డాక్టర్‌ బి.రామకృష్ణ