ప్రబలుతున్న ప్రాణాంతక పచ్చజ్వరం

PATIENT
PATIENT

ప్రబలుతున్న ప్రాణాంతక పచ్చజ్వరం

దోమ చిన్నదే కానీ అది మోసుకొస్తున్న వ్యాధులు ఒకటి కాదు, రెండు కాదు చాలా ఉన్నాయి. మలే రియా మహమ్మారితో గడగడ వణికించే దోమ డెంగీ వంటి ప్రాణాంతక విషజ్వరాలను సంక్రమింప చేస్తోంది. కొంతకాలం మన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న డెంగీ ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న ‘జికాల మాదిరే ఇటీవల బాగా విస్తరిస్తున్న ఎల్లోఫీవర్‌ కూడా ‘ఈడిస్‌ ఈజిప్టై దోమల ద్వారా వ్యాపిస్తుంది.

ఈ జ్వరం సోకితే మొదట్లో తలనొప్పి, వాం తులు, ఒళ్లు నొప్పు ల వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. కానీ కొద్ది మందిలో ఇది తీవ్రమై కాలేయం, కిడ్నీల వైఫల్యానికి దారి తీస్తుంది. దీంతో కామెర్లు మొదలై ఒళ్లంతా పసుపు పచ్చగా మారి పోతుంది. కళ్లు పచ్చబడతాయి. దీన్ని ఎల్లోఫీవర్‌గా పిలవడానికి ఇదే కారణం. ఇది ప్రమాదకరమైన దశ. కొందరిలో ముక్కుచెవ్ఞల నుంచి రక్తస్రావం జరగవచ్చు.దీనికి ప్రత్యేకించి చికిత్సకూడా లేదు.

ఈ ఎల్లోఫీవర్‌ బారినపడిన వారిలో దాదాపు 50 శాతం ప్రాణాల ను కోల్పోయారు. అందుకే దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు సాగిస్తున్నారు. ఎంతో కాలంగా విస్తృతంగా కసరత్తులు సాగుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల క్రితం మలేరియా దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. సరైన వైద్యం దీనినివారణకు ఏమిటో తెలిసేది కాదు. కానీ సర్‌రొనాల్డ్‌ రాస్‌ పరిశోధనల కారణంగా మలేరియా జ్వరానికి కారణమైన దోమ పరాన్నజీవిని కనుగొనగలిగారు. ఆనాటి పరిశో ధనలన్నీ హైదరాబాద్‌లోనే రాస్‌ నిర్వహించి సాధించారని చరిత్ర చెబుతోంది.

అంటే ఆనాడు హైదరాబాద్‌ నగరంలో మలేరియా ఎంత ఉధృతంగా ఉండేదో చరిత్ర చెబుతుంది. అలాగే ఇంతవరకూ ఎన్నడూ మనదేశంలో ఎల్లోఫీవర్‌ లేదన్న ధీమా పడడం శ్రేయస్క రం కాదు. ఇది ఎప్పటికైనా ముప్పు తెస్తుందని మన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకటి కన్నా ఇప్పుడు విదేశీ ప్రయాణాలు పెరిగిపోయాయి.

అలాగే ఈ జ్వరం వ్యాప్తికి దోహ దం చేసే ఈడిస్‌ ఈజిప్టై దోమలు మనదేశంలో ఇప్పటికే డెంగీ, మెదడువాపు తదితర వ్యాధులను విస్తరింప చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. మెదడువాపు వల్ల ఎన్ని లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారో తెలిస్తే ఆవేదన కలుగుతుంది. వాటికి ఎల్లోఫీవర్‌ కూడా తోడైతే ఇకఎందరు ప్రాణాలు కోల్పోవలసి వస్తుం దో అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి మనదేశంలో అసలు రెక్కలు కట్టుకుని వాలకుండా చూసేందుకు నిబంధనలు బలంగానే ఉన్నాయి. మనదేశం నుంచి ఎల్లోఫీవర్‌ ఎక్కువగా ఉండే అంగోలా, అర్జెంటీనా, బ్రెజిల్‌ వెనిజులా తదితర దేశాలకు ఎవరు వెళుతున్నా కూడా కచ్చితంగా టీకా తీసుకునే వెళ్లాలి. అలాగే ఆయా దేశాల నుంచి మనదేశంలోకి వస్తున్న వారంతా కూడా టీకా వేయించుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంది. ముందుజాగ్రత్త కోసం ఆ దేశాల నుంచి వచ్చే విమానాలను కూడా దోమల మందులు చల్లి, పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత తెరుస్తారు. తగినంత టీకా మందు కూడా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనలన్నింటిని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఎల్లోఫీవర్‌ గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా వేగంగా విస్తరిస్తుండడం, మరోవైపు టీకా మందుల నిల్వ తగినంత గా లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. ఇప్పుడు దాదాపు 1.4 కోట్ల మందికి వ్యాధి ప్రబలక ముందే టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఓ పది రోజుల్లోపే ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. దీంతో ఆగమేఘాల మీద అంగోలా, కాంగో ఉగాండా తదితర దేశాల్లో స్కూళ్లు, చర్చిలతో సహ రకరకా ల ప్రదేశాల్లో ఎనిమిదివేల టీకా కేంద్రాలు తెరిచారు. ప్రజలు కూడా ప్రాణభయంతో పెద్దఎత్తున వీటి ముందు క్యూలు కడుతు న్నారు.

అయితే టీకాల నిల్వ70 లక్షల మోతాదులే ఉండటంతో ఎటూ పాలుపోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధారణ టీకా మోతా దులో ఐదోవంతు మాత్రమే ఇస్తూ ఉన్నదాన్నే అందరికీ సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తోంది. సాధారణంగా టీకా తీసుకుంటే పది ఏళ్లపాటు రక్షణ ఉంటుంది. కానీ మోతాదు తగ్గించి ఇవ్వడం వల్ల రక్షణ స్వల్పకాలమే ఉంటుం ది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానా ల్లేవ్ఞ. ప్రస్తుతం ఎల్లోఫీవర్‌ దక్షిణాఫ్రికాలోని అంగోలా, కాంగోలలో విపరీతంగా ప్రబలుతోంది. ఒక్క అంగోలాలోనే దాదాపు ఐదువేల మంది దీని బారినపడ్డారు. వీరిలో 450 మంది మరణించారు.

కాంగోలోనూ 2200 కేసులు నమోదయ్యాయి. కెన్యా, బ్రెజిల్‌, పెరూ తదితర 12 దేశాల్లోనూ కేసులు నమోదవ్ఞతూనే ఉన్నాయి. వాస్తవానికి ఆఫ్రికా ఖండంలో ఎల్లోఫీవర్‌ కేసులు గత కొద్ది నెలలుగా వీటి సంఖ్యవేల రెట్లు పెరిగిపోవడం, ఇది వాయువేగంతో ప్రబలిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోలన మొదలైంది. ఇన్నేళ్లుగా ఆసియా దేశాల్లో ఈ జ్వరం కేసులు లేనేలేవ్ఞ. కానీ తాజాగా అంగోలా నుంచి చైనాకు తిరిగొచ్చిన 11 మంది కార్మికుల్లో ఈ వ్యాధి బయటపడటంతో ఇది ఆసియాలోనూ విస్తరిస్తుందేమో నని వైద్యరంగం ఆందోళన చెందుతోంది. ఈ ఎల్లోఫీవర్‌ చరిత్ర ఈనాటిది కాదు.

కొన్ని వందల ఏళ్ల క్రిత మే దీని ఉనికి బయటపడింది. ఆఫ్రికా ఖండం నుంచి ఓడల ద్వారా దిగుమతి చేసుకున్న లక్షలాది బానిసలతోపాటే ఈ వైరస్‌ కూడా అమెరికా,ఐరోపా దేశాలకు వ్యాపించింది. 1648లోనే మెక్సి కోలో ఎల్లోపీవర్‌ విజృంభించి వేలాది ప్రాణాలు హరించివేసింది. 18,19 శతాబ్దాల్లో దక్షిణ అమెరికా, కరేబియన్‌ దేశాల్లో ఇది ఎన్నో సార్లు ప్రబలి, భయానక వాతావరణం సృష్టించింది. 1793లో అమెరికాలోని ఫిలడెల్ఫియాను దాదాపుగా తుడిచిపెట్టేసింది. కేవ లం ఈ ఎల్లోఫీవర్‌ కారణంగానే పనామా కాలువతవ్వకం దశాబ్దాల తరబడి నిలిచిపోయింది.

తవ్వకానికి దింపిన కార్మికుల్లో వేలాది మంది ఎల్లోఫీవర్‌తో మరణిస్తుండటంతో ఫ్రెంచ్‌ ప్రభుత్వం 11ఏళ్ల పాటు తంటాలుపడి కూడా చేతులెత్తేసింది. తర్వాత మేం తవ్ఞ్వతా మని రంగంలోదిగిన అమెరికాకూడా ఇదే చేదు అనుభవాన్ని మూట గట్టుకుంది.స్పానిష్‌ యుద్ధంలో కూడా 1898ఎల్లోఫీవర్‌ కారణంగా వేలాది సైనికులను కోల్పోయింది.

అమెరికాకు అప్పటికింకా ఎల్లోఫీ వర్‌ ఎందుకొస్తుందో తెలియదు. 1882లో కార్లోస్‌ఫిన్‌లే అనే క్యూబా వైద్యుడు ఇది దోమల పుణ్యమేమోనని అనుమానం వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. 1900లోఅమెరికా వైద్యుడు వాల్ట ర్‌ రీడ్‌ దోమల చరిత్రను అధ్యయనం చేసిన తరువాత దీనిని నిర్ధా రించాడు. దీంతో అమెరికా ప్రభుత్వం 1904లో మళ్లీ పనామా పనులు మొదలుపెట్టి దోమల నిర్మూలన కోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం ద్వారా పదేళ్లలో కాలువ నిర్మాణం పూర్తి చేయగలిగింది. 1930లో ఎల్లోఫీవర్‌కు సమర్థమైన టీకా అందుబాటులోకి రావ టంతో పరిస్థితి చాలా మెరుగైంది. కానీ టీకా కార్యక్రమాలు ఆఫ్రికా ఖండంలోని మారుమూల ప్రాంతాలను చేరకపోవడంతో సమస్య ఇప్పటికీ అక్కడ తరచూ ప్రబలుతూనే ఉంది.

– డాక్టర్‌ బి.రామకృష్ణ