ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

TS CM KCR
TS CM KCR

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

దమెయిన్‌ మీన్స్‌ ఆఫ్‌ అట్టె యినింగ్‌ పవర్‌ ఈస్‌ ఎల క్ట్రోరల్‌ ఓట్‌ గెట్టింగ్‌ అం టారు మాక్స్‌ వెబర్‌ అనే జర్మన్‌ సామాజిక శాస్త్రవేత్త, ఫిలాసవర్‌. ఆయన మాటల ప్రకారం ఒక రాజ కీయపార్టీఅధికారంలోకి రావాలంటే ఎలక్షన్లలో పాల్గొనాల్సిందే. ప్రజల నుంచి ఓట్లరూపంలో మద్దతు పొం దాల్సిందే. మాక్స్‌వెబర్‌ ఇంకా ఏమంటారంటే జనాన్ని సంక్షే మం, అభివృద్ధి పథంలోకి నడుపగలనని ఏ నాయకుడయినా భావించినప్పుడు దానికి ఒక రాజకీయపార్టీ అనే సంస్థాగత నిర్మా ణం ఇవ్వాలి.

ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ముఖ్య లక్షణం అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అధికారం లోకి రావాలనే పట్టుదల ఒక రాజకీయ పార్టీకి లేకుంటే తప్పు కానీ వ్ఞంటే తప్పుకాదు అని వెబర్‌ భావన. అధికారానికి వచ్చే క్రమంలో తాము ఏమి చేయదలుచుకున్నామో మేనిఫెస్టో ద్వారా ప్రకటించి ప్రజల మెప్పుపొందడం, తద్వారా ఎన్నికల్లో పాల్గొని వాళ్ల ఆశీస్సులను ఓట్లరూపంలో పొందడం ఇదీ రాజకీయ పార్టీకి ఉండాల్సిన ముఖ్య లక్షణం అంటారు మాక్స్‌ వెబర్‌. తన పొలి టికల్‌ పార్టీ డెమొక్రసీ అండ్‌ రిప్రజెంటేషన్‌ అనే చాప్టర్‌లో ఈ కోణంలోమనంఒకసారి ఈదేశ రాజకీయాలు రాజకీయ నాయకు లతో పాటు గతించిన ఉమ్మడి పాలకుల తీరును పరిశీలిద్దాం. అబ్బే మాకు రాజకీయాలు అధికారం ముఖ్యం కాదండి.

ప్రజ లకు సేవచేయడమే మా ప్రధాన ఉద్దేశ్యం.అనే మాటలను మనం నిత్యం వింటుంటాం. ఈ మాటలను ఏదో సామాన్య కార్యకర్త అంటే ఏమో అనుకోవచ్చు. కానీ స్వయంగా పార్టీలను స్థాపించిన అధినాయకులు గతంలో అధికారాన్ని అనుభవించిన బడా రాజకీ యవేత్తలే అంటుండడం గమనించాల్సినఅంశం.ముఖ్యంగా ఉమ్మ డి రాష్ట్రంలోని వలస పాలకుల విధానాన్ని పరిశీలిస్తే రాజకీయా ల విషయంలో అధికారం విషయంలోవారు ఎంత హిపోక్రసీతో పనిచేస్తారోననే అంశాన్ని మనం గమనించవచ్చు.వారి స్వార్థ రాజ కీయాలే వర్తమాన రాజకీయాలు అనే భ్రమలో అధికారం అనేది వారి సొంత ఆర్థిక సామాజిక ప్రయోజనాలను నెరవేర్చుకునే వేది కగా భావించారు. ఇంకా భావిస్తున్నారు. కాబట్టే వాళ్లు అలా ఏదో దొంగతనం చేసినట్టు కనబడుతుంటారు. మాట్లాడుతుంటారు.

ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశానికి స్వాతంత్య్రం వచ్చి న ఏడు దశాబ్దాల కాలంలో ఏ రాజకీయ నాయకుడన్నా తాము చేస్తున్న రాజకీయాల పట్ల నెరుపుతున్న అధికారాల పట్ల గౌరవంగా మాట్లాడారా? అంటే లేదనే చెప్పాలి. తాము ప్రజలకు సేవ చేస్తున్నాం తప్పరాజకీయాలు చేయడం లేదు. మాకు అధికా ర కాంక్ష లేదని అబద్ధాలు మాట్లాడడమే మనం విన్నం, వింటు న్నాం. అవును మేము రాజకీయం చేస్తాం,అధికారంలోకి వస్తాం, ప్రజల ఆకాంక్షలకు కార్యరూపమిస్తాం, అని ధైర్యంగా అనగా ఎక్కడా వినలేదు ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నుంచి తప్ప.

ఇవాళ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టినట్టు అవ్ఞను మేము ప్రజలను ఆకర్షిస్తాం, బరాబర్‌ వాళ్ల ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలుం టాయి. తద్వారా వాళ్ల ఆశీస్సులను ఓట్ల ద్వారా పొందుతాం అని విస్ప ష్టంగా ప్రకటించారు. తన మాటలను ఆశ్చర్యంతో అసెంబ్లీ లాబీ ల్లో జర్నలిస్టులు బుద్ధిజీవ్ఞలు చర్చించుకుంటూ ఇంత స్పష్టంగా కుండబద్ధలు కొట్టడం ఒక్క కెసిఆర్‌కే సాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేటి అసెంబ్లీలో మాట్లాడిన మాటలతో పాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం చేసిన విమర్శకు కెసిఆర్‌ ఇచ్చిన సమా ధానాన్ని గుర్తు చేసుకున్నారు.

గవర్నర్‌ ప్రసంగం టిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో మాదిరిగా ఉన్నదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. దానికి ముఖ్యమంత్రి ఘాటుగా సమాధానమిస్తూ ఎస్‌ బరాబర్‌ అలాగే ఉంటది. గవర్నర్‌ ప్రసంగం టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనే అని బల్లగుద్దిచెప్పిన, పోయిన అసెంబ్లీలోని మాటలనూ మనం పరిశీలించినప్పుడు కెసిఆర్‌ మాటలకు మాక్స్‌ వెబర్‌ చెప్పిన సూత్రానికిదగ్గరి పోలిక ఉన్నదనేది స్పష్టమైనది. ఒక రాజ కీయ పార్టీ ఉన్నదే అధికారంలోకి రావడానికి, అందులో భాగంగా తాము ఏమి చేస్తాం అనే అంశాలను వివిధ రంగాల వారీగా ఎన్ని కల మేనిఫెస్టోలో ప్రకటించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది.

వాటిని పరిశీలించిన ప్రజలు ఎవరికి ఓటు వేయాల్నో నిర్ణయించు కుంటారు. ఒక పార్టీ అదికారంలోకి వచ్చింది అంటే ఆ పార్టీ ఎన్ని కల మేనిఫెస్టోను ప్రజలు ఆమోదించినట్టు లెక్క. మరి ప్రజలు ఆమోదించిన ఎన్నికల మేనిఫెస్టోను అనుసరించే ప్రభుత్వం విధా నపర నిర్ణయాలను ప్రకటించాల్సి ఉంటుంది.ఆ ప్రక్రియ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పెద్దగా గవర్నర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రభు త్వంవాయిస్‌ను ప్రకటిస్తారు.సరిగ్గా అదే జరిగింది

. ముఖ్యమంత్రి కూడా అదేపద్ధతిలో ప్రతిపక్షాలకు వాస్తవాన్ని వివరిస్తూ సమాధానమిచ్చారు. ఇన్నాళ్ల ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన ఆంధ్ర పాలకుల్లో ఒక్కరూ ఇలా మాట్లాడే అసలు సిసలైన ప్రజారాజకీయ నాయకుడు ఎందు కు కాలేపోయారు? అనే ప్రశ్నను మనం మరోసారి ప్రశ్నించు కుంటే మనకు అర్థమయ్యేదేందంటే గత పాలకులు చేసినవి ప్రజా రాజకీయాలు కాదు. ఆ ముసుగులో స్వార్థ ప్రయోజనాలను నెర వేర్చుకునే ప్రక్రియలోభాగమయ్యారు తప్ప తాము ప్రజల అభ్యు న్నతికోసం పార్టీలు పెట్టామని కానీ, అధికారంలోకి వచ్చామని కానీ వాళ్లు విశ్వసించలేదు.రాజకీయాలను అధికారాన్ని వాళ్లు తమ హిపోక్రసీ కోణం నుంచి గిల్టీనెస్‌ నుంచే చూశారు తప్ప నేటి ముఖ్యమంత్రికెసిర్‌ లాగా చిత్తశుద్ధితో కూడిన అంకిత భావం తో రాజకీయాలను చూడలేకపోయారు.

అందుకే ఉమ్మడి రాష్ట్రం లో ఆ మాటకొస్తే దేశ రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు అధికా రం గురించి ఫిలాసవర్‌ సామాజిక శాస్త్రవేత్తమాదిరి స్పష్టంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా నిజాయితీగా మాట్లాడిన వర్త మాన రాజకీయనాయకుడు కెసిఆర్‌. ఆయనను మించి మరొకరు లేరు. ఇవాళ్ల మన రాష్ట్రానికే కాదు, ఇటువంటి నిజాయితీపరు డైన రాజకీయ దార్శనికుని అవసరం ఈ దేశానికి ఉన్నది. ఇంకా చెప్పాలంటే అత్యంత పవిత్రమైనరాజ్యాంగ నియమావళిని అందు లో ముఖ్యభాగమైన చట్టాలను శాసనాలను వాటిని రూపొందించే శాసన వ్యవస్థ పట్ల రోజురోజుకూ ప్రజలకు గౌరవం తగ్గుతుం దంటే కారణం కెసిఆర్‌ వంటి చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేసే రాజనీతిజ్ఞుడు లేకపోవడమే.

రాజకీయాలు అధికారం అంటే చీచీ అనుకుంటూ అవి మాకు సంబంధించినవి కావ్ఞ అనే ఈ హిపోక్రసీ రాజకీయాల్లో ఉన్న వాళ్లకే కాదు మేధావి వర్గంగా కీర్తించబడుతున్న వాళ్లకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బుద్ధిజీవ్ఞలకూ అంటుకుంది.రాబోయేకాలంలో ఇటువంటి జాడ్యం దేశ రాజకీయ వ్యవస్థను మరింత కుంగదీస్తుంది. అనర్హులను అందలం ఎక్కించేలాచేస్తున్న ఇటువంటి అనైతిక రాజకీయ అవగా హనలను మార్చాల్సిఉన్నది.రాజకీయాల పట్ల ఉదాసీనతను భ గ్నంచేసి దేశ యువతను బుద్ధిజీవ్ఞలను గుణాత్మక రాజకీయాల వైపు మళ్లించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావ్ఞ ఆలోచనా విధానం ఉన్నది.

రాజకీయాలు వేరు ఆ ముసుగున చేసే స్వార్థ రాజకీయాలు వేరు. వీటిని వేరు చేసి పాలునీళ్లలా విడదీసే రాజకీయహంసలే నేటి అవసరం. ఈ విధా నాన్ని మనం ముఖ్యమంత్రి రాజనీతిజ్ఞత నుంచి అందిపుచ్చు కో వచ్చు.రాజకీయ నాయకులను అందరినీ ఒకటే గాటన కట్టి మనం విరక్తిని పెంచుకోవడం ఆ కోణంలోనే టివీ ఛానళ్లలో చర్చలు చేయడం,పత్రికల్లోవ్యాసాలు రాయడం,కాకుండా బిట్వీన్‌ ద లైన్స్‌ చూడాలి ఉంటుంది. రాజకీయాల్లోకి స్వార్థ పరులు ప్రవేశించి వారు చేస్తున్న రాజకీయాలను వారే ఈసడించుకుంటూ పరస్ప రం ఆ కోణంలోనే విమర్శలు గుప్పించుకుంటున్న వర్తమాన రాజ కీయాలను మనం రోజు చూస్తూనే ఉన్నాం.

అటువంటి పరిస్థితి నుంచి మనలను బయటపడేసే ఓ అద్భుతమైన ప్రక్రియ కెసిఆర్‌ ఆలోచనా విధానంలో ఉన్నదనే రుజువ్ఞవ్ఞతున్నది. రాజకీయాలు అధికారం వ్యక్తుల స్వార్థం కోసం కాదు. రాజకీయాధికారం అంటే ప్రజా సంక్షేమాన్ని కోరే ఒక పవిత్ర యజ్ఞమని ఈరోజు తెలం గాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీ నుంచి జాతికి ఇచ్చిన పిలుపుగా మనం భావించాల్సి ఉంటుంది.

– రమేశ్‌ హజారి
(రచయిత: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి)