ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

                 ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

POLLUTION
POLLUTION

రియల్‌ ఎస్టేట్‌ కాంట్రాక్టర్లు, సిటీ ప్లానర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, నిర్మాణరంగ అనుమతులు జారీచేసే అధి కారుల ప్రయోజనాలను కాపాడటానికే కాలుష్య నియంత్రణ (పర్యావరణ విధ్వంస) మండలి ఉనికిలోకి వచ్చింది. అంటే మానవజాతి, సకల జీవజాతులు అంతరించినా పరవాలేదు. కానీ, పర్యావరణ విధ్యంసం చేసే ఆకాశ హార్మోణులు మాత్రం నిర్మించాలి. కొత్తగా నిర్మించే భవనాలను అనుమతించటం వలన అదనంగా పర్యావరణ విధ్వంసం పెరుగుతోంది. భవ నాలను నిర్మించాలంటే ఇనుము కోసం తవ్వకాలు జరపాలి. కంకర కోసం కొండల్ని నేలమట్టం చేయాలి. సిమెంట్‌ తయారు చేయటానికి జిప్సమ్‌ కావాలి. జిప్సమ్‌ కోసం గనుల తవ్వకాలు జరపాలి. ఇసుకను తరలిస్తే భూమిలోకి ఇంకవలసిన జలాలు ఇంకక సముద్రం పాలౌతాయి.

తద్వారా భూగర్భ జలాలు అడుగంటుతాయి. రానున్న రెండేళ్లలో మన దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని నీతి (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా – ఎన్‌.ఐ.టి.ఐ) ఆయోగ్‌ సంస్థ అధ్యయనాల్లో తేలింది. 60 కోట్ల మంది ప్రజలకు సరైన తాగునీరు దొరకక కలుషితమైన నీరు తాగటం వలన దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల మంది మరణించినట్టు నిప్ఞణులు అంచనా వేశారు. గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా, వాయు కాలుష్యం వలన 70 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేసి తెలిపింది. పర్యావరణ కాలుష్యం చేసేవాటిలో ఇంధన రంగం 35%, రసాయన వ్యవసాయం 24%, పారిశ్రామిక రంగం 21%, రవాణా రంగం 14%, భవన నిర్మాణ రంగం 6% శాతాలుగా ఉన్నాయి.

ఒక్క రసాయన వ్యవసాయం మిన హాయించి ఇంధన, పారిశ్రామిక, రవాణారంగాలు లేనిదే భవన నిర్మాణం జరగదు. అంటే భవన నిర్మాణం వలన 76% పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంటపోలాల్ని నాశనం చేసి అక్కడున్న జీవవైవిధ్యాన్ని విచ్చిన్నం చేయడం వలన ఆ పంట పొలాలపై ఆధారపడి బతికే జీవ్ఞలు అంతరించాయి. దానినే రాజధానిగా మార్చి, అక్కడ హరిత భవనాలను నిర్మిస్తామంటున్నారు. పర్యావరణ విధ్వంస ప్ఞనాదులపై హరిత భవనాలను నిర్మించ బోతున్నారు. హరిత భవనాలనేవి బూటకం, తాటాకు ఇళ్ళ వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది.

భవన నిర్మాణాల వలన పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. భూతాపోన్నతి పెరుగుతోంది. ఈ పర్యావరణ విధ్వంసం ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని దశాబ్దాల్లో మానవజాతితో సహా సకల జీవ జాతులు అంతరిస్తాయి. దానిలో కాలుష్య నియంత్రణా (పర్యావరణ విధ్వంస) మండలి నేరం కూడా ఉంది. మానవ జాతి, సకల జీవజాతుల భవిష్యత్తరాలను కాపాడాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల పరిశ్రమలను రద్దుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ్ఞలు నూటికి నూరు శాతం మంది ప్రకృతి వ్యవసాయం చేయాలి. దీనికి మించిన పరిష్కారం లేదు, ప్రత్యామ్నాయం ఏదీ లేదు. ఇలాంటి ప్రత్యామ్నాయం చూపించడంలో రష్యా, చైనా, క్యూబా, వియత్నాంలు విఫలమయ్యాయి.
– అల్‌ఫతా