పారిశ్రామిక నైపుణ్యం పెంపునకు యత్నం

TRAINING
TRAINING

పారిశ్రామిక నైపుణ్యం పెంపునకు యత్నం

భారత్‌లో తయారీ కార్యక్రమం విజయవంతం కావా లంటే నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ అప్రెంటీస్‌ ప్రోత్సాహక పథకాన్ని ఇటీవలనే ప్రారంభించింది. ఇందులో అప్రంటి స్‌లకు యాజమాన్యాలు ఇచ్చే స్టైఫండ్‌లో 25శాతం ప్రభుత్వమే భరిస్తుం ది.దేశంలోని పరిశ్రమల్లో అప్రంటిస్‌ల సంఖ్య ఇప్పుడు దాదాపు మూడు లక్షలవరకు ఉంటుందని అంచనా. జర్మనీ, చైనా దేశాల్లో కోటిమంది అప్రంటిస్‌లుండగా జపాన్‌లో 30లక్షల మంది వరకు ఉన్నారు. శిక్షణలో నైపుణ్యం బాగా లభిస్తుంది కాబట్టి వీరికే ఎక్కడయినా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం దేశంలో ఎంతోకొంత పారిశ్రామిక నైపుణ్యం కలిగిన వారు 3.5 శాతానికి మించరు. చైనాలో 47 శాతం, జర్మనీలో 74 శాతం, జపాన్‌లో 80 శాతం, దక్షిణ కొరియాలో 96 శాతం శ్రామికులకు ఆధునిక శిక్షణా నైపుణ్యాలున్నాయి. భారత్‌ కన్నా బంగ్లాదేశ్‌, శ్రీలంకదేశాలు ఈవిషయంలోముందంజలో ఉన్నాయి. 2022 నాటికి 40 కోట్ల మందికి వివిధ పథకాలకు సంబంధించి తగిన నైపుణ్యం లభించేలా పకడ్బందీగా శిక్షణ ఇప్పించాలన్నది అప్రంటీస్‌ ప్రోత్సాహకపథకం సంకల్పం.దేశంలో పదివేలకుపైగా ఐటిఐలున్నా వాటిలో చాలాకొద్ది ఐటిఐలకే సరైన శిక్షణ వసతులు ఉన్నాయి. ఐటిఐలకు 75వేల మంది శిక్షకులు అవసరమున్నా 4328 మందితోనే కాలం గడుపుతున్నాయి.ఇదివరకటి ఐటిఐల్లో శిక్షణ పొందిన వారికి ఇప్పుడు తగిన గిరాకీ ఉండడం లేదు. ఈ ఐటిఐల ను అన్నిటినీ ఆధునిక సాంకేతిక శిక్షణా కేంద్రాలుగా మార్చడం సాధ్యంకాదు.

ఈ సంధికాలంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అప్రంటిస్‌ ప్రోత్సాహాన్‌ పథకం చాలా వరకు లోటు తీరుస్తుంది. దీనికి పరిశ్రమల తోడ్పాటు అవసరం.అనేక దేశాల్లో కంపెనీలు, పరిశ్రమలే అప్రంటిస్‌ శిక్షణ నిర్వహిస్తున్నాయి. ప్రస్తు తం భారతదేశంలోని పరిశ్రమల్లో 4.90లక్షల మందికి అప్రంటిస్‌ శిక్షణ పొందే అవకాశం ఉన్నప్పటికీ 2.80లక్షల మందికే శిక్షణ లభిస్తోంది. శిక్షణ పొందిన వారిని పనిలోకి తీసుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందన్న స్వలాభపేక్షతో పరిశ్రమలు శిక్షణ లేకున్నా ఫరవాలేదన్న అభిప్రాయంతో కొంతమందికే అవకాశం కల్పించి నెట్టుకొస్తున్నాయి.తక్కువ జీతాలు పొందుతూ పనినేర్చు కు న్న వారికే అవకాశం కల్పి స్తున్నాయి.

అందుకే జాతీయ అప్రంటిస్‌ ప్రోత్సాహన్‌ పథకంలో యాజమానులు చెల్లించే స్టయి ఫండ్‌లో 25 శాతం ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడుతోంది. ఈ పథకం కింద ఆరు నెలల నుంచి మూడు ఏళ్లవరకు శిక్షణ పొందవచ్చు.అయితే అప్రంటిస్‌లను తక్కువ వేతనాలకు పనిచేసే కూలీలుగా పరిగణించరాదు. ప్రావిడెంట్‌ ఫండ్‌,ఈఎస్‌ఐ, వైద్య సేవలు వంటివి వర్తించకపోయినా స్టయిఫండ్‌ మాత్రం కచ్చితంగా లభిస్తుంది. శిక్షణార్థులకు తగిన వసతి సౌకర్యా లు కల్పించాలని పథకం నిర్దేశిస్తోంది. ఈ పథకం ప్రకారం పరిశ్ర మలు తమ మొత్తం సిబ్బంది సంఖ్యలో సరిసమాన అప్రంటిస్‌లను తీసుకో వచ్చు. లాభాలతో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు 10 శాతం మంది అప్రంటిస్‌లను తీసుకోవాలనిపథకంలో సూచించడమయింది. భారతీయ పరిశ్రమలు ఈ మేరకు తమ సామర్థ్యాన్ని పెంచుకోవా లన్నదే భారత్‌లో తయారీ ఆశయం.ఈ పథకంకింద రూ.10వేల కోట్లు వెచ్చించి 2020 నాటికి 50 లక్షల మందికి వివిధ పరిశ్రమ ల్లో అప్రంటిస్‌లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా తెలంగాణరాష్ట్రంలో20ఎంప్లా§్‌ుమెంట్‌ ఎక్స్‌ఛేం జిలున్నాయి.

ఈ ఎక్స్‌ఛేంజిలకు మోడల్‌ కేరీర్‌ సెంటర్లు అన్న పేర్లు మార్పు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ ప్రాజెక్టు కింద (ఎన్‌సిసిడి) మూడు మోడల్‌ కెరీర్‌ సెంటర్లను రాష్ట్రానికి మంజూరు చేసింది.దీనికోసం 96.89లక్షలు మంజూరు కాగా, 58.13లక్షలు విడుదల చేశారు. ఈ సెంటర్లు కేవ లం ఎంప్లా§్‌ుమెంట్‌ ఎక్ఛేంజిల మాదిరిగా కాకుండా అనుసంధాన సాంకేతిక వ్యవస్థాపరంగా ఉంటాయి.

– పి.వి.ఆర్‌.మూర్తి