పాత పెన్షన్‌ స్కీమ్‌లో ప్రయోజనాలు ఎక్కువ

                    పాత పెన్షన్‌ స్కీమ్‌లో ప్రయోజనాలు ఎక్కువ

PENSION SCHEME
PENSION SCHEME

ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్‌లో ఒక ప్రజాసేవకుడిగా 30 లేక 33 సంవత్సరాలు సేవ చేసి పదవీ విరమణ చేసిన తరువాత అతడి లేక ఆమె జీవనానికి క్రమం తప్పకుండా ప్రభుత్వం ప్రతినెల చెల్లించే డబ్బునే పెన్షన్‌ అంటారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి జీవితం గడపడానికి ఎలాంటి ఆదా యం ఉండదు గనుక సామాజికభద్రతా చర్యగా (సోషల్‌ సెక్యూరిటీ మెజర్‌గా) పెన్షన్‌ను ప్రతినెల ఇవ్వడం నాగరిక ప్రభుత్వాల బాధ్య తగా గుర్తించి అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్ట డం జరిగింది. అయితే బ్రిటిష్‌ తెల్లదొరల నుండి భారతదేశం నల్ల దొరలకు అధికారమార్పిడి జరిగినతరువాత భారత పాలకులు కూడా పెన్షన్‌ విధానాన్ని కొనసాగించారు. కాని భారత బూర్జువా వర్గం తన దళారీస్వభావాన్ని దాచుకోలేకపోయింది. తల్లి చాటు బిడ్డలాగా, ఆకు కింద పిందెలాగా సామ్రాజ్యవాదుల మద్దతుతో, వాళ్లతోపాటు ప్రజల శ్రమశక్తిని దోచుకుంటూ ఎదగాలని భారత బూర్జువా వర్గం సామ్రాజ్యవాదులకు దళారీగా మారిపోయింది. అటువంటి బూర్జువా వర్గానికి భారత పాలకులు దళారులు. ఫలితంగా పాలకులు 1991 జూలై 24న సామ్రాజ్యవాదులకు అత్యంత అను కూలమైన ఆర్థిక, పారిశ్రామిక నూతన విధానాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, విదేశీ పరోక్ష పెట్టుబడులకు (షేర్‌ మార్కెట్‌ లో పెట్టుబడులకు), విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులకు తెరలేపారు.అందుకు అనుగుణంగా చట్టాలనుమార్చారు.

వీటన్నిం టికీ ముందుగా ‘సరళీకరణలు, సంస్కరణలు అని పేరు పెట్టారు. వీటికి అనుగుణంగానే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలను పాలకులుచాలా శీఘ్రంగా అమలుపరచుతున్నారు. అందులో భాగం గానే పెన్షన్‌లో సంస్కరణలను తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి ఒకటిన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి దాని స్థానంలో కాంట్రి బ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రజలను ఉద్యోగులను మోసం చేయాలనే తలంపుతో ప్రావిడెంట్‌ స్థానంలో పెన్షన్‌ అనే పదాన్ని చేర్చి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎమ్‌) అని ప్రచారంలో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేసిన తరువాత ప్రవేశపెట్టిన సిపిఎస్‌ను దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని అనుసరించాయి.మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పెన్షన్‌ స్కీమ్‌ను కొనసాగిస్తామని సి పిఎస్‌ను ప్రవేశపెట్టబోమని తీర్మానించుకున్నాయి. ఈ విషయంలో కేంద్రాన్ని కూడా సంప్రదించలేదు. సంప్రదించాల్సిన అవసరం కూడాలేదు. ఎందుకంటే ఎవరి ఉద్యోగులకు, వారే యజమానులు. ఆయా యజమానులు తమతమ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతభత్యా లను తమతమ ఖజానాల నుండే చెల్లించుకుంటున్నారు. రాష్ట్రాల ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. అలాగే కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వాలతో సం బంధంలేదు.

ఎందుకంటే యజమానులు వేరు. సర్వీస్‌ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర,రాష్ట్రాల హక్కులు, పనివిభజనలు భారత రాజ్యాంగచట్టంలో స్పష్టంగా పొందుపరచబడినవి. ఆంధ్రప్ర దేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి, దానిస్థానంలో సిపిఎస్‌ను 2004 సెప్టెంబర్‌ ఒకటిన ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం విడిపో యి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత కూడా అవి సిపిఎస్‌ను కొనసాగిస్తున్నాయి. పకడ్బందీగా అమలు పరచుతున్నా యి. ఈ సిపిఎస్‌ స్కీమ్‌ అమలులోకి వచ్చిన గత 14 సంవత్సరాల లో తెలంగాణలో సుమారు 1.25 లక్షల మంది, ఆంధ్రాలో సుమా రు 90వేల మంది ఉద్యోగాలలో చేరడం జరిగింది. ఈ సిపిఎస్‌ స్కీమ్‌ను ఇలాగే కొనసాగిస్తే ప్రతి ఏటా ఉద్యోగుల సంఖ్య పెరు గుతూ ఉంటుంది. వీరు ప్రత్యేకంగా ఉద్యోగుల సంఘాలుగా ఏర్పడి పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలని ఆందోళనలు, పోరాటాలు చేయడం, ప్రజల మద్దతును పొందడం జరుగుతున్నది. అయితే వీరి డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, కనుక కేంద్రాన్ని సంప్రదించాలని మాట్లాడుతున్నారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ను, కొత్త సిపిఎస్‌లను గురించి వివరిస్తే ఉద్యోగులకు, ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది.

పాత పెన్షన్‌ స్కీమ్‌ ప్రకారం ఉద్యోగి రిటైర్‌ అయ్యే నెలలో మూల వేతనం (బేసిక్‌ పే) ఎంత ఉందో అందులో సగం వేతనాన్ని పెన్షన్‌ మూలవేతనంగా పరిగణించబడుతున్నది.దీనిపై ప్రతి ఆరు నెలల కొకసారి ఉద్యోగులతోపాటు డి.ఏ కూడా చెల్లించబడుతున్నది. ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని నియమిస్తున్నది కాబట్టి ఉద్యోగుల పే రివిజన్‌తో పాటు పెన్షనర్ల పెన్షన్‌ మూలవేతనం కూడా పెరుగుతున్నది. ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ కూడా లభిస్తున్నది. అంతేకాదు, అంతవరకు వచ్చిన డి.ఏ మొత్తం కూడా పెన్షన్‌ మూలవేతనంతో కలిపి కొత్త పెన్షన్‌ మూలవేతనం నిర్ణయింపబడుతుంది. దీనిపై మరల ఆరు నెలలకొకసారి డి.ఏ వస్తుందిసుమా. ఉద్యోగి రిటైర్‌ అయ్యేటప్పుడు ఉండిన మూలవేత నంపై 40 రెట్లు కమ్యూటేషన్‌ పెన్షన్‌ డబ్బు లభిస్తుంది సుమా! కమ్యూట్‌ చేయబడిన డబ్బు 15 సంవత్సరాల వరకు ప్రతి నెల పెన్షన్‌ నుండి కొంత డబ్బును డిడక్ట్‌ చేస్తారు. 15 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత కమ్యూట్‌చేయబడిన మొత్తం తిరిగి పెన్షన్‌ లో కలుస్తుంది. అంతేకాదు గ్రాట్యూటీ ఫార్ములా ప్రకారం రిటైర్‌ అయ్యే ప్రతి ఉద్యోగికి సరాసరిన రూ.10 లక్షల గ్రాట్యూటీ లభిస్తుంది సుమా! ఇక్కడ ఉద్యోగులకు ఇంకొక సూక్ష్మం చెప్పాలి. కమ్యూట్‌ చేయబడిన మొత్తంపై కూడి డి.ఏ లభిస్తుంది. అంటే కమ్యూట్‌ చేయకముందు ఉన్న మొత్తం పెన్షన్‌పై డి.ఏ వస్తుందని గ్రహించాలి.

పాత పెన్షన్‌ స్కీమ్‌అమలులో అది వర్తించే ఉద్యోగులకు జనరల్‌ ప్రావిడెంట్‌ఫండ్‌ (జిపిఎఫ్‌) తప్పనిసరి చేశారు. ఈ ఫండ్‌ను అకౌంటెంట్‌ జనరల్‌ ( ఏజీ) కాగ్‌ సబార్డినేట్‌ అధారిటీ పకడ్బందీగా అకౌంట్స్‌ను మెయిన్‌టెనెన్స్‌ చేస్తున్నారు. బేసిక్‌ పేలో పది శాతం ప్రతి నెల జీతంలో మినహాయించి డ్రాయింగ్‌ ఆఫీసర్‌ పే బిల్స్‌తోపాటు స్టేట్‌మెంట్స్‌ను పంపుతాడు. దీనిపై వడ్డీ లభిస్తుంది. పెన్షనర్లకు వర్తించే ఎపిరివైజ్‌ పెన్షన్‌ రూల్స్‌ 1980 ప్రకారం పెన్షనర్‌ చనిపోతే ఆయన భార్యకు (ఒకవేళ భార్య ఉద్యోగి అయితే తన భర్తకు) కుటుంబ పెన్షన్‌ (ఫ్యామిటీ పెన్షన్‌) లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్‌పై కూడా డి.ఏ లభిస్తుంది సుమా! ఇక గత 14 సంవత్సరాల నుంచి అమలవ్ఞతున్న సిపిఎస్‌ను గురించి క్లుప్తంగా వివరణ. పై పేరాలో వివరించబడిన పాత పెన్సన్‌ స్కీమ్‌ బెనిఫి ట్స్‌ అంటే సోషల్‌ సెక్యూరిటీ మెజర్స్‌ అన్నీ రూల్స్‌తో సహా రద్ద యినాయని అర్థం చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి జీతం నుండి మూల వేతనం + డి.ఏ మొత్తంపై పది శాతం డబ్బు డిడక్ట్‌ చేసి ఉద్యోగి వాటాగా నిర్ణయింపబడుతున్నది. అలాగే పది శాతం డబ్బు ఉద్యోగి డబ్బుకు సమానంగా ప్రభుత్వం తన వాటా డబ్బును కలపాలి. అంటే మొత్తం 20 శాతం డబ్బును ఉద్యోగి అకౌంట్‌పేరుతో ఏజె న్సీ ద్వారా షేర్‌ మార్కెట్‌లో ఇన్‌వెస్ట్‌ చేస్తారు. అంటే ప్రభుత్వం వాటానే వడ్డీగా పరిగణించాలి. ఇలా ఇన్‌వెస్ట్‌ చేయబడిన ఉద్యోగుల డబ్బు షేర్‌ మార్కెట్‌ శక్తుల చేతులలో పడి ఒడిదుడుకులకు లోనుకా వచ్చు. దీనికి దిక్కెవరు?

ఒకవేళ ప్రభుత్వం తన వాటా డబ్బును చెల్లించకపోతే (క్రెడిట్‌ చేయకపోతే) అడగడానికి దిక్కెవరు? ఉద్యో గికి రిటైర్‌ అయిన తరువాత 20శాతం డబ్బును సమకూరే డివిడెం డ్‌ను కలిపి చెల్లిస్తారు. సిపిఎస్‌ సారాంశం ఇది. ఈ స్కీమ్‌లో పెన్షన్‌కు అవకాశం ఎక్కడుంది? కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ అని పేరు ఎందుకు పెట్టారు? ఈ డబ్బును ఏజెన్సీ ద్వారా షేర్‌ మార్కె ట్‌లో ఇన్‌వెస్ట్‌ చేయలేదని, చేస్తామని పాలకులు చెబుతున్నారని తెలిసింది. మరి ఈ డబ్బు అంతా ఎక్కడ ఉన్నట్టు? రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బును సస్పెన్స్‌ అకౌంట్‌లో ఉంచినట్లుగా కాగ్‌ రిపోర్ట్‌ను బట్టి అనుమానంగా ఉంది. 2016-17 సంవత్సరం తెలం గాణ ప్రభుత్వం అకౌంట్స్‌లో సోర్సెస్‌ అండ్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కింద రూ. 93,946 కోట్లలో కొంత భాగం సిపిఎస్‌ డబ్బు ఉండవ చ్చు.అలాగే 2016-17 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అకౌం ట్స్‌లో సోర్సెస్‌ అండ్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కింద రూ. 62,433 కోట్లలో కొంత భాగం సిపిఎస్‌ డబ్బు ఉండవచ్చు. ఎందుకంటే ఆ రెండు మొత్తాలు సస్పెన్స్‌ అకౌంట్స్‌లో చూపించారు. 2011-12 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద దాదాపు రూ. 800 కోట్లను క్రెడిట్‌ చేయలేదని కాగ్‌ పేర్కొన్నది.పదవ వేతన సంఘం సిఫారసులు 2013జూలై ఒకటి నుండి అమలులోకి వచ్చా యి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్‌ 2న కాబట్టి ఆ ప్రభుత్వం ఉద్యోగుల, వేతన బకాయిలను ఈ తేదీ నుండి లెక్క కట్టి రెండు విడతలుగా 2015 ఫిబ్రవరి వరకు సమ కూరిన మొ త్తాన్ని చెల్లించింది.

రెండవ విడత ఈ సంవత్సరం చెల్లించనుంది. రెండు ప్రభుత్వాలు మానిటరీ బెనిఫిట్‌ను 2015 మార్చినెల జీతం తో పిఆర్‌సి సిఫారసులను అమలుపరచాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి పిఆర్‌సి బకాయిలను ఆంధ్ర ఉద్యోగుల పెన్షనర్లకు 2013 జూలై ఒకటి నుండి 2015 ఫిబ్రవరి వరకు లెక్క కట్టి చెల్లించాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. కాబట్టి బకాయిలను 2018 మే జీతంతో కలిపి చెల్లించాలి. అలాగే రెండు డి.ఏ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ రెండు ప్రభుత్వాలు బకాయిపడ్డాయి. అందువలన రెండు ఇన్‌స్టాల్‌ మెంట్స్‌ డిఎ బకాయిలను 2018 మే జీతంతో కలిపి ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాలి. కనుక తక్షణం ఉత్తర్వు లను జారీ చేయాలి. అలాగే పదవవేతన సవరణ సంఘం సిఫార సుల అమలు గడువ్ఞ 2018 జూన్‌ 30తో ముగుస్తున్నది. కొత్త 11వ వేతన సవరణ సం ఘం సిఫారసులు 2018 జూలై ఒకటి నుండి అమలుకావాలి.కాని ఇంతవరకు రెండు ప్రభుత్వాలు 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించలేదు. కనుక 11వ పిఆర్‌సీ లను రెండు ప్రభుత్వాలు తక్షణం నియమించి వాటి నివేదికలను 2018 డిసెంబర్‌ 31లోపు ప్రభుత్వాలకు అందచేయాలని ఉత్తర్వుల్లో గడువ్ఞ విధించాలి.
వి.జయరాముడు (రచయిత: ప్రభుత్వ ఉపకార్యదర్శి)(రిటైర్డ్‌)